ద్రవ్య ప్రసారవేగం..ధరల ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం-రకాలు
సాధారణంగా ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.
ద్రవ్యోల్బణాన్ని వివిధ అంశాలు,కారణాలు, ధరల నియంత్రణలను బట్టి వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు. అంతేకాకుండా ఆర్థిక వేత్తలు ద్రవ్యోల్బణాన్ని వివిధ రకాలుగా వర్గీకరించారు.
ద్రవ్యం ద్రవ్య ప్రసార వేగాన్ని బట్టి ద్రవ్యోల్బణాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
ద్రవ్య ద్రవ్యోల్బణం (Money Inflation)
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే దానిని ‘ద్రవ్య ద్రవ్యోల్బణం’ అంటారు.
ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికి భవిష్యత్లో ధరలు మరింత పెరుగుతాయనే భ్రమలో ప్రజలు అదనపు కొనుగోళ్లకు పాల్పడటం వల్ల ధరలు మరింత పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ధరల ద్రవ్యోల్బణం అంటారు.
ద్రవ్య ప్రసార వేగం వల్ల ధరలు మరింత పెరిగితే దానిని ధరల ద్రవ్యోల్బణం అంటారు.
జేఎం కీన్స్ ద్రవ్యోల్బణాన్ని మూడు రకాలుగా వర్గీకరించాడు.
పాక్షిక ద్రవ్యోల్బణం(Partial Inflation)
ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరడానికి ముందు ఉత్పత్తి కారకాల కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగితే దానిని పాక్షిక ద్రవ్యోల్బణం లేదా సెమీ ఇన్ఫ్లేషన్ అంటారు.
వాస్తవిక ద్రవ్యోల్బణం (True Inflation)
ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరిన తరువాత ఉత్పత్తిని పెంచడం సాధ్యం కాదు. అప్పుడు డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే దానిని వాస్తవిక/ నిజ ద్రవ్యోల్బణం అంటారు.
సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరిన తరువాత కూడా ధరలు పెరిగితే దానిని నిజ/ వాస్తవిక ద్రవ్యోల్బణం అంటారు.
హైపర్ ఇన్ఫ్లేషన్ (Hyper Inflation)
సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరిన తరువాత సమష్టి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగును. ఫలితంగా ద్రవ ప్రసార వేగం పెరుగుతుంది. దీంతో ధరలు మరింత పెరుగుతాయి. అంటే ద్రవ్య ప్రసార వేగం పెరుగుట వల్ల పెరిగే ధరలను హైపర్ ఇన్ఫ్లేషన్ అంటారు.
రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం(Sectoral Inflation)
ఉత్పత్తి రంగంలో ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం అంటారు.దీన్ని ‘చార్లెస్ షుల్జ్ వివరించాడు.
ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం (Pricing Power Inflation)
పారిశ్రామిక, వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి ధరలు పెంచడాన్ని ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం అంటారు.
Oligopolistic Inflation
ధరను నిర్ణయించే అధికారం గల పరిమిత స్వామ్యం సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వస్తువు ధరను పెంచవచ్చు. ఈ విధమైన ద్రవ్యోల్బణాన్ని Oligopolistic Inflation అంటారు.
కోశ సంబంధ ద్రవ్యోల్బణం (Fiscal Inflation)
ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని కోశ సంబంధ ద్రవ్యోల్బణం అంటారు.
ప్రభుత్వ బడ్జెట్ లోటు వల్ల కలిగే ధరల పెరుగుదల కోశసంబంధ ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు.
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు సంభవించే నిర్మాణాత్మక మార్పుల వల్ల (ఉదా: భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల నిర్మాణం) ఉపాధి ఆదాయాల్లో వచ్చిన పెరుగుదల ఉత్పత్తిలో రాక ద్రవ్యోల్బణం ఏర్పడితే దాన్ని నిర్మాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.
వ్యవస్థ సంబంధ ద్రవ్యోల్బణం (Institutional Inflation)
ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి ఒక క్రమంలో లేదా మార్కెట్ లోపాలు, ఉద్యమ దారుల కొరత, మూలధనం కొరత, అవస్థాపన సౌకర్యాల కొరత మొదలైన వ్యవస్థాపరమైన లోపాల కారణంగా కొన్ని వెనుకబడిన రంగాల్లో మాత్రమే ద్రవ్యోల్బణ లక్షణాలు ఉండటాన్ని వ్యవస్థా సంబంధ ద్రవ్యోల్బణం అంటారు.
విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం:
విదేశీ వ్యాపారంలో ఎగుమతులు ఎక్కువై స్వదేశంలో సప్లయ్ తగ్గి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడితే దానిని విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం అంటారు.
దీన్ని కీన్స్ ‘హౌ టు పే ఫర్ ద వార్’ అనే గ్రంథంలో వివరించాడు.
ఒక ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉన్నప్పుడు సమష్టి డిమాండ్ సమష్టి సప్లయ్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల స్వల్ప కాలంలో వస్తుసేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడితే దానిని ద్రవ్యోల్బణ విరామం అంటారు.
సంపూర్ణ ఉద్యోగితా స్థాయి వద్ద ప్రజల ఆదాయాలు పెరిగినపుడు సమష్టి సప్లయ్ కంటే సమష్టి డిమాండ్ తక్కువగా ఉండటం వల్ల స్వల్పకాలంలో వస్తుసేవల ధరలు తగ్గితే దాన్ని ప్రతి ద్రవ్యోల్బణ విరామం అంటారు.
గుణాత్మక ద్రవ్యోల్బణం
అమ్మకం దారుడు వస్తువుల అమ్మకం ద్వారా సేకరించిన కరెన్సీని భావి కాలంలో మార్పు చేసుకోవాలనే అంచనాపై ఆధారపడిన ధరల పెరుగుదలను గుణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.
పరిమాణాత్మక ద్రవ్యోల్బణం
ద్రవ్య సప్లయ్, ద్రవ్య చలామణి, ద్రవ్య మారకంపై ఆధారపడిన ధరల పెరుగుదలను పరిమాణాత్మక ద్రవ్యోల్బణం అంటారు.
వస్తు ద్రవ్యోల్బణం (Commodity Inflation)
ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కన్నా ధరల పెరుగుదల చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని వస్తు ద్రవ్యోల్బణం అంటారు.
మూలధన ద్రవ్యోల్బణం (Capital Inflation)
నూతన మూలధన వస్తువుల ఉత్పత్తి వ్యయాల పెరుగుదల కన్నా వాటి ధరల చాలా అధికంగా పెరిగితే దానిని మూలధన ద్రవ్యోల్బణం అంటారు.
కరెన్సీ ద్రవ్యోల్బణం (Currency Inflation)
కరెన్సీ అధికంగా జారీ చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని కరెన్సీ ద్రవ్యోల్బణం అంటారు.
పరపతి ద్రవ్యోల్బణం (Credit Inflation)
బ్యాంకు పరపతి అధికం కావడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని పరపతి ద్రవ్యోల్బణం అంటారు.
ఆర్థిక వ్యవస్థలో వస్తు సప్లయ్, ద్రవ్య సప్లయ్ ఎల్లప్పుడు సమతౌల్యంతో ఉండాలి. లేదంటే ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యం ఏర్పడి అనేక ఆర్థిక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో వస్తురాశి, ద్రవ్యరాశి సమానంగా లేకపోతే ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది.
ద్రవ్యోల్బణాన్ని ఎల్లప్పుడు శాతాలతో సూచిస్తారు.
ధరల పెరుగుదల రేటును ద్రవ్యోల్బణం అంటారు.
ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడంలో ముఖ్యపాత్ర పోషించేది కాలం అంటే ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడానికి తగినంత కాలాన్ని నిర్ణయించాలి.
ఆయా పరిస్థితులను బట్టి ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించడానికి 3 నుంచి 12 నెలల వరకు పరిగణనలోకి తీసుకోవాలి.
1973లో అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరగడం వల్ల భారతదేశంలో ద్రవ్యోల్బణ రేటు రెండంకెలకు చేరింది. నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రజల వ్యయార్హ ఆదాయంపై ఆంక్షలు పెట్టడం వల్ల 1975 రాటి ద్రవ్యోల్బణం తగ్గింది. అప్పటి నుంచి ప్రభుత్వం కోశపరమైన చర్యలు, ఆర్బీఐ ద్రవ్యపరమైన చర్యలు తీసుకుంటూ ద్రవ్యోల్బణాన్ని సమతౌల్య స్థితిలోకి తీసుకువస్తున్నాయి.
భారతదేశంలో ద్రవ్యోల్బణ లక్ష్యాలకు సంబంధించి వివిధ ఆర్థిక వేత్తలు వివిధ కమిటీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి.
4 శాతం ద్రవ్యోల్బణం ఆర్థిక వ్యవస్థకు ఆమోదయోగ్యమైనదని చక్రవర్తి కమిటీ (1985) సూచించింది.
4-6 శాతం మధ్య ద్రవ్యోల్బణం
ఆమోదయోగ్యమైనది- భారతప్రభుత్వం
6-7 శాతం ప్రారంభంలో, 5-6 శాతం తరువాత ఉండాలి సి. రంగరాజన్
3-5 శాతం మధ్య ద్రవ్యోల్బణం
ఆమోదమైనది- ఎ. తారాపూర్ కమిటీ
ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం అయితే 2 ఉండవచ్చని ఉర్జిత్ పటేల్ సూచించారు.
ఎకానమీ
మార్కెట్ శక్తులు కల్పించే ద్రవ్యోల్బణం ఒకటైతే విదేశీ వ్యాపార ప్రేరిత ద్రవ్యోల్బణం మరొకటి. కొన్నిసార్లు పాక్షిక ద్రవ్యోల్బణం. కొన్నిసార్లు ధరల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ప్రస్తుతం ప్రభుత్వాలకు వచ్చే రాబడి కంటే వ్యయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటిని కోశ సంబంధ ద్రవ్యోల్బణం అనవచ్చు. ద్రవ్యోల్బణం అనేక రకాలు వాటిని తెలుసుకుందాం.
ప్రాక్టీస్ బిట్స్
1. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లయ్ పెరగడం వల్ల డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్య ద్రవ్యోల్బణం
బి) ధరల ద్రవ్యోల్బణం
సి) ధర శక్తి ద్రవ్యోల్బణం డి) ఎ, బి
2. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉన్నప్పటికీ భవిష్యత్లో మరింత ధరలు పెరుగుతాయనే భ్రమలో ప్రజలు మరింత కొనుగోళ్ల వల్ల ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్యోల్బణం
బి) ధరల ద్రవ్యోల్బణం
సి) ద్రవ్య ద్రవ్యోల్బణం
డి) వాస్తవిక ద్రవ్యోల్బణం
3. జె.ఎం. కీన్స్ ద్రవ్యోల్బణాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించాడు?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
4. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగితా స్థాయికి చేరడానికి ముందు ఉత్పత్తి కారకాల కొరత వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) వాస్తవిక ద్రవ్యోల్బణం
బి) హైపర్ ఇన్ఫ్లేషన్
సి) పాక్షిక ద్రవ్యోల్బణం డి) పైవన్నీ
5. ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరిన తర్వాత వస్తుసేవల డిమాండ్ పెరిగి ధరలు పెరిగితే ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) వాస్తవిక ద్రవ్యోల్బణం
బి) పాక్షిక ద్రవ్యోల్బణం
సి) ద్రవ్య ద్రవ్యోల్బణం
డి) ధరల ద్రవ్యోల్బణం
6. ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వద్ద ద్రవ్య ప్రసార వేగం పెరిగితే ఆ ధరలను ఏమంటారు?
ఎ) సెమి ఇన్ఫ్లేషన్
బి) ధరల ద్రవ్యోల్బణం
సి) పాక్షిక ద్రవ్యోల్బణం
డి) హైపర్ ఇన్ఫ్లేషన్
7. ఉత్పత్తిరంగంలో ఒక తరహా పరిశ్రమలో తయారైన వస్తుసేవల ధరలు పెరగడాన్ని ఏమంటారు?
ఎ) నిజ ద్రవ్యోల్బణం
బి) రంగాల సంబంధిత ద్రవ్యోల్బణం
సి) ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం
డి) పైవన్నీ
8. పారిశ్రామిక వ్యాపార సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి వాటి ఉత్పత్తి ధరలు పెంచడాన్ని ఏమంటారు.
ఎ) ధరశక్తి నిర్ణాయక ద్రవ్యోల్బణం
బి) వాస్తవిక ద్రవ్యోల్బణం
సి) Ologopolistic Inflation
డి) హైపర్ ఇన్ఫ్లేషన్
9. ప్రభుత్వం సేకరించిన రాబడి కంటే ఎక్కువ వ్యయం చేయడం వల్ల ఏర్పడే ద్రవ్యోల్బణాన్ని ఏమంటారు?
ఎ) రంగాల సంబంధ ద్రవ్యోల్బణం
బి) కోశ సంబంధ ద్రవ్యోల్బణం
సి) వాస్తవిక ద్రవ్యోల్బణం
డి) ద్రవ్య ద్రవ్యోల్బణం
10. ‘హౌ టు పే ఫర్ ద వార్’ గ్రంథ రచయిత?
ఎ) ఏసీ పిగూ బి) జేబీసే మిల్
సి) జేఎం కీన్స్ డి) ఆల్ఫ్రెడ్ మార్షల్
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత ,వైష్ణవి పబ్లికేషన్స్ గోదావరిఖని, 9949562008
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు