బ్యాంకుల జాతీయీకరణ – లక్ష్యాలు- పురోగతి
- బ్యాంకుల జాతీయీకరణ
భారతదేశ బ్యాంకింగ్ రంగంలో బ్యాంకుల జాతీయీకరణ ప్రధాన ఘట్టంగా చెప్పవచ్చు. - భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1955లో జాతీయం చేసిన ఎస్బీఐ, 1959లో ఏర్పాటు చేసిన 8 ఎస్బీఐ అనుబంధ బ్యాంకులు మినహాయించి మిగిలిన వాణిజ్య బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి.
- ఈ ప్రైవేట్ బ్యాంకులు అన్ని లాభాపేక్షతో పనిచేస్తూ ఆర్థిక శక్తి కేంద్రీకరణ జరిగిందే కాని సాంఘిక సామాజిక సంక్షేమ లక్ష్యాలను విస్మరించాయి. దీని వల్ల వ్యవసాయ పారిశ్రామిక రంగాలకు తగిన నిధులు సమకూరక అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాయి.
- 1967లో హజారి కమిషన్ పరిశ్రమలకు, బ్యాంకులకు మధ్య అను సంధానం లేకపోతే పరపతి ప్రణాళికను తీసుకురావడం కష్టమని ‘ఇండస్ట్రియల్ ప్లానింగ్ అండ్ లైసెన్సింగ్ పాలసీపై నివేదికలో పేర్కొని ప్రభుత్వానికి సమర్పించింది.
- ఫలితంగా ప్రభుత్వం మొదట సామాజిక నియంత్రణను ప్రవేశపెట్టింది. కానీ అనుకున్న ఫలితాలు రాలేదు.
- త్వరితగతిన సామాజిక, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్థను పురికొల్పడానికి జాతీయీకరణ తక్షణ అవసరంగా భారత ప్రభుత్వం భావించింది.
- అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దృఢ సంకల్పంతో తొలిసారిగా 1969 జూలై 19న రూ. 50 కోట్లకు మించి డిపాజిట్లు కలిగిన 14 షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. అవి
1) సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
2) బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) అలహాబాద్ బ్యాంక్
4) దేనా బ్యాంక్
5) సిండికేట్ బ్యాంక్
6) కెనరా బ్యాంక్
7) పంజాబ్ నేషనల్ బ్యాంక్
8) యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్
9) యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
10) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
11) ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్
12) బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
13) బ్యాంక్ ఆఫ్ బరోడా
14) ఇండియన్ బ్యాంక్ - ఒక దశాబ్దం తర్వాత రెండోసారి 1980 ఏప్రిల్ 15న రూ.200 కోట్లకు మించి డిపాజిట్లు కలిగిన 6 బ్యాంకులను జాతీయం చేశారు.
1) ఆంధ్రాబ్యాంక్
2) పంజాబ్ & సింథ్ బ్యాంక్
3) న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా
4) విజయాబ్యాంక్
5) కార్పొరేషన్ బ్యాంక్
6) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - 1993 సెప్టెంబర్ 4న న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యింది. దీంతో జాతీయం చేసిన బ్యాంకులు 19 అయ్యాయి.
- స్టేట్ బ్యాంక్, అనుబంధ బ్యాంకులు, 19 జాతీయం చేసిన బ్యాంక్‌లతో కలిపి ప్రభుత్వ రంగంలో 27 వాణిజ్య బ్యాంక్‌లు ఉంటూ వచ్చాయి.
- 2002 నవంబర్ 14న కేరళకు చెందిన నెడుంగడి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనమయ్యింది.
- 2004 జూలై 26న గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో విలీనం అయింది.
- 2005 జూన్ 20న బ్యాంక్ ఆఫ్ పంజాబ్ సెంచూరియన్ బ్యాంక్‌లు విలీనమై సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్‌గా ఏర్పడ్డాయి.
- 2006 జనవరి 19న మహారాష్ట్రకు చెందిన గణేష్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్‌లో విలీనమయ్యింది.
- 2010 మే 18న బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో విలీనమయ్యింది.
- పరిశ్రమలకు కావలసిన పరపతిని అందించాలనే లక్ష్యంతో 1964లో పార్లమెంట్ చట్టం ద్వారా భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) ను ఏర్పాటు చేశారు.
- ఈ ఐడీబీఐ బ్యాంకు 2013 ఫిబ్రవరి 13 నుంచి దీనికి ఇతర జాతీయం చేసిన వాణిజ్య బ్యాంకులతోపాటు సమాన హోదా ఇవ్వబడింది.
- ఈ నాటి ప్రభుత్వ వాణిజ్య బ్యాంకుల సంఖ్య 21, ఎస్బీఐ-1, జాతీయం చేసిన బ్యాంకులు -19, ఐడీబీఐ బ్యాంకులు 1, ప్రైవేట్ బ్యాంకులు 21, విదేశీ బ్యాంకులు 49 ఉన్నాయి.
బ్యాంకుల జాతీయీకరణ- లక్ష్యాలు :
- బ్యాంకు నిర్వహణను ఆధునీకరించడం
- నూతన వ్యవస్థాపకులను ప్రొత్సహించడం
- బ్యాంకు ఉద్యోగులకు సరైన శిక్షణ ఇవ్వడం, వారి ఉద్యోగ నిబంధనలను మెరుగు పరచడం.
- బ్యాంకులపై కొద్దిమంది ఆధిపత్యాన్ని తొలగించడం.
- వ్యవసాయానికి పారిశ్రామిక రంగానికి ముఖ్యంగా చిన్న పరిశ్రమలకు ఆర్థిక సహాయాన్ని సమకూర్చడం.
- ఎగుమతులకు పరపతి సహాయాన్ని అందించి, నూతన వ్యవస్థాపక వర్గాన్ని రూపొందించి, సాంఘిక నియంత్రణ లక్ష్యాన్ని సాధించడం.
- బ్యాంకులు లేని గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకులు విస్తరించుట ద్వారా డిపాజిట్లను సేకరించడం.
- ప్రాధాన్యత రంగానికి సరిపడినంత ఆర్థిక సహాయాన్ని అందించటం.
బ్యాంకుల జాతీయీకరణ -విస్తరణ పురోగతి
- బ్యాంకుల జాతీయీకరణ తర్వాత బ్యాంకు బ్రాంచీలు విస్తరించినవి. బ్యాంకులు లేని వివిధ గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలకు లీడ్ బ్యాంక్ పథకం బ్యాంకులు వ్యాపించాయి. దీనికి వివిధ కార్యక్రమాలు పథకాలు తోడ్పడినాయి.
- గాడ్గిల్ కమిటీ : అభివృద్ధి చెందిన రాష్ర్టాల కంటే వెనుకబడిన రాష్ర్టాల్లో, బ్యాంకింగ్ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో, జిల్లాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయాలని 1969లో ఎఫ్.కె.ఎస్.
- బ్రాంచ్‌ల పెరుగుదలనారిమన్ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ, లీడ్ బ్యాంక్ పథకం ద్వారా సూచించింది.
- ఆర్బీఐ ఈ కమిటీ సిఫారసులను ఆమోదించింది.
- ఆర్బీఐ నారిమన్ కమిటీ, లీడ్‌బ్యాంక్ పథకాన్ని ఆమోదించడంతో ముంబై, కోల్‌కతా, చెన్నై, కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, చండీఘర్, గోవా మినహాయించి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చింది.
- బ్యాంకుల జాతీయీకరణ తర్వాత బ్యాంకు డిపాజిట్ల సేకరణ
- బ్రాంచ్‌లు పెరగడంతోపాటు గ్రామీణ వెనుక బడిన ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు విస్తరించి గుణాత్మక మార్పులు వచ్చాయి.
- 1969 నాటికి గ్రామాల్లో బ్యాంకుల శాతం 22 కాగా 2020 మార్చినాటికి 35 శాతానికి పెరిగాయి
- డిపాజిట్ల సేకరణ విషయంలో బ్యాంకుల జాతీయీకరణ ముందు కంటే జాతీయీ కరణ తర్వాత ఎక్కువగా ఉంది.
- 1969లో బ్యాంకుల వద్ద గల మొత్తం డిపాజిట్లు 43 బిలియన్లు 2020 మార్చి నాటికి రూ. 14,726,753 కోట్లకు పెరిగాయి.
బ్యాంకు రుణాలు :
- బ్యాంకుల జాతీయీకరణకు ముందు బ్యాంకు రుణాలు పరిశ్రమలకు వ్యాపారానికి చర మూలధనం లభించేది. వ్యవసాయ రంగానికి అంతగా ఉండేది కాదు.
- 1969 తర్వాతే వ్యవసాయ రంగానికి రుణాలు ఇస్తూ వచ్చారు.
- 1969లో బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 34 బిలియన్లు
రంగాల వారీగా పరపతి అభివృద్ధి
- 2020 సంవత్సరం నాటికి బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 1,03,708 బిలియన్లు
- 1969కి ముందు వాణిజ్యం, పరిశ్రమలకు పరపతి వాటా 60 శాతం రుణాలు అందించగా వ్యవసాయ రంగానికి కేవలం 2.2 శాతం మాత్రమే లభించాయి.
- బ్యాంకుల జాతీయీకరణ తర్వాత 2020 ప్రాధాన్యత రంగ రుణాలు మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకులు వ్యవసాయ రంగానికి ఇచ్చే పరపతి 17.2 శాతానికి చేరింది.
- బ్యాంకుల జాతీయీకరణ తరువాత ప్రాధాన్యత రంగ రుణాలు అనే భావన 1969 నుంచి ప్రారంభమైంది.
- 1969 బ్యాంకుల జాతీయీకరణ తర్వాత ఆర్బీఐ ఆదేశానుసారం వాణిజ్య బ్యాంకులు ప్రాధాన్యత రంగాలకు రుణాలు ఇవ్వడం ప్రారంభించాయి.
- చిన్న, సన్నకారు రైతులు, ఉపాంత రైతులు, చిన్న పరిశ్రమల ఉద్యమదారులు, స్వయం ఉపాధి చేపట్టే నిరుద్యోగ విద్యావంతులు మొదలగు వారికి రుణాలు ఇవ్వడం ప్రాధాన్యత రంగాల కిందకు వస్తాయి.
- 1980 ఆర్బీఐ ప్రాధాన్యత రంగాలకు 40 శాతం రుణాలు ఇవ్వాలని సూచించెను.
- 2020 మార్చి నాటికి ప్రాధాన్యత రంగానికి సామాజిక బ్యాంకింగ్-పేదరిక నిర్మూలనా పథకాలు ప్రభుత్వరంగ బ్యాంకులు 41.05 శాతం ప్రైవేట్ బ్యాంకులు 40.32 శాతం రుణాలు ఇచ్చాయి.
- దేశంలో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం విచక్షణాత్మక వడ్డీరేటు విధానం
(Diffential Rate of Interest) - ప్రణాళికల ద్వారా అమలు చేసిన పథకాలకు అవసరమైన నిధులు వాణిజ్య బ్యాంకులు సబ్సిడీ రుణాల ద్వారా సమకూర్చాయి.
- ఈ విధానాన్ని 1972 మార్చి 25న ప్రవేశ పెట్టారు.
- ఈ విధానంలో బ్యాంకుల వద్ద రుణాలు తీసుకునే వ్యక్తులు, సంస్థల ఆర్థిక స్థోమతను బట్టి వేర్వేరు వడ్డీరేట్లు విధిస్తారు.
బ్యాంకింగ్ వైవిధ్యీకరణ
- ఈ విధానం ద్వారా మంజూరు చేసే రుణాల్లో కనీసం 1 శాతం రుణాలను 4 శాతం గరిష్ఠ వడ్డీకి ప్రాధాన్యతా రంగాల వారికి ఇవ్వాలి.
- బ్యాంకుల జాతీయీకరణ తర్వాత బ్యాంకుల వ్యవహార సరళిలో దృక్పథంలో మార్పు వచ్చింది. అంటే సంప్రదాయ బద్ధమైన బ్యాంకింగ్ విధానం స్థానంలో ఆధునిక విధానాలను అనుసరించడం జరుగుతుంది.
బ్యాంకుల జాతీయీకరణ – సమీక్ష (review of banking Nationalisation)
ఉదా: మొబైల్ బ్యాంకింగ్, వాచ్ బ్యాకింగ్, ఏటీఎం, ఈ వాలెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.
- బ్యాంకుల జాతీయీకరణ తరువాత బ్యాంకింగ్ వ్యవస్థలో గణనీయమై మార్పును, ప్రగతిని సాధించాయని చెప్పవచ్చు. 1969లో జీడీపీలో బ్యాంకుల మొత్తం డిపాజిట్లు 11 శాతం ఉంటే 2019 మార్చినాటికి 66 శాతం పెరిగాయి. ఆదే విధంగా బ్యాంకుల బ్రాంచ్‌ల సంఖ్య ఇదే కాలంలో 8262 నుంచి 1,45,553కు పెరిగింది. గ్రామాల్లో బ్రాంచ్‌లు 22.5 శాతం నుంచి 35 శాతానికి పెరిగాయి. ప్రాధాన్యతా రంగాలకు ఇచ్చే రుణాల శాతం కూడా పెరిగింది. వెనుకబడిన ప్రాంతాల్లో బ్యాంకులు వృద్ధి చెందడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థలో అసమానతలు తగ్గాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ ఏ ప్రధానమంత్రి కాలంలో జరిగింది?
ఎ) జవహర్లాల్ నెహ్రూ
బి) ఇందిరాగాంధీ
సి) రాజీవ్‌గాంధీ
డి) పి.వి. నరసింహారావు
2. మొదటిసారి ఎన్ని బ్యాకులను జాతీయం చేశారు?
ఎ) 6 బి) 12 సి) 14 డి) 20
3. రెండోసారి బ్యాంకుల జాతీయీకరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1969 జూలై 19
బి) 1980 మార్చి 15
సి) 1980 ఏప్రిల్ 15
డి) 1982 ఏప్రిల్ 15
4. రెండోసారి బ్యాంకుల జాతీయీకరణ ఎన్ని కోట్లకు మించి డిపాజిట్లు కలిగిన బ్యాంకులను జాతీయీకరణ చేశారు?
ఎ) 100 కోట్లు బి) 200 కోట్లు
సి) 300 కోట్లు డి) 400 కోట్లు
5. మొదటిసారి బ్యాంకుల జాతీయీకరణ ఎప్పడు జరిగింది?
ఎ) 1955 డిసెంబర్ 15
బి) 1969 జూన్ 19
సి) 1969 జూలై 19
డి) 1980 మార్చి 15
6. ప్రస్తుతం జాతీయం చేసిన బ్యాంకుల సంఖ్య ఎంత?
ఎ) 8 బి) 18 సి) 9 డి) 19
7. భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకును ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1948 బి) 1955
సి) 1964 డి) 1965
8. బ్యాంకుల జాతీయీకరణ ప్రధాన లక్ష్యం?
ఎ) బ్యాంకుల ఆధునీకరణ
బి) బ్యాంకుల వికేంద్రీకరణ
సి) అన్ని రంగాలకు పరపతి విస్తరణ
డి) పైవన్నీ
9. వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు, గ్రామాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఏది?
ఎ) హజారి కమిటీ
బి) గాడ్గిల్ కమిటీ
సి) నర్సింహం కమిటీ డి) పైవన్నీ
10. గాడ్గిల్ కమిటీ ఎవరి అధ్యక్షతన ఏర్పడింది?
ఎ) నారిమన్ బి) నర్సింహన్
సి) రంగరాజన్ డి) పై అందరూ
11. బ్యాంకు బ్రాంచ్‌ల ఏర్పాటు, డిపాజిట్ల సేకరణ రుణాల మంజూరులో బ్యాంకుల జాతీయీకరణ ముందు కంటే బ్యాంకుల జాతీయీకరణ తర్వాత ఎలా ఉంది?
ఎ) తక్కువగా ఉంది
బి) ఎక్కువగా ఉంది
సి) స్థిరంగా ఉంది డి) పైవేవీకావు
12. 1969 సంవత్సరానికి ముందు వ్యవసాయ రుణ పరపతి వాటా ఎంత?
ఎ) 2.2 శాతం బి) 3.5 శాతం
సి) 5 శాతం డి) 8.6 శాతం
సమాధానాలు
1-బి 2-సి 3-సి 4-బి
5-సి 6-డి 7-సి 8-డి
9-బి 10-ఎ 11-బి 12-ఎ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు