కవి వత్సలుడు అనే బిరుదు గల శాతవాహన రాజుఎవరు?
- ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశం- శాతవాహన
- శాతవాహన వంశస్థాపకుడు-శ్రీముఖుడు
- పి.వి పరబ్రహ్మశాస్త్రి అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారం శాతవాహనుల జన్మస్థలం- ఉత్తర తెలంగాణ
- శాతవాహనుల తొలి రాజధానిగాభావించబడుతున్న తెలంగాణాలోన ప్రాంతం – కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల
- శాతవాహనుల మలి రాజధాని – పైఠాన్(లేదా) ప్రతిష్ఠానపురం
- శాతవాహనులు ఉపయోగించిన తొలిభాష – ప్రాకృతం
- శాతవాహనుల ఆంధ్రభృత్యులని మొదట చెప్పినది- ఆర్.జి.భండార్కర్
- ధాన్యకటకం శాతవాహనుల తొలి రాజధాని అని చెప్పింది ఆర్.జి.భండార్కర్
- శాతవాహనుల పాలనాకాలాన్ని క్రీ.పూ 225 నుంచి క్రీ.శ 225గా నిర్ణయించింది – ఖండవల్లి లక్ష్మీనిరంజనం
- శ్రీముఖుడు ఆంధ్రుడని తెలియజేసే పురాణం – మత్య్సపురాణం
- హైదారాబాద్ సమీపంలోని మస్కి, గాజులబండ, వరంగల్ సమీపాన లభించిన ప్రాచీన నాణేలపై ఉన్న అక్షరాలు – సాదవాహన
- లీలావతి అనే ప్రాకృత కావ్యం రచించినది? – కుతూహలుడు
- ఆంధ్రులు, శాతవాహనులు ఒక్కరు కాదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వారిలో ముఖ్యులు – కె.పి.జయస్వాల్,ఆచార్య చౌదరి
- శాతవాహనుల జన్మభూమి కర్ణాటకమనే వాదన లేవదీసినది – డా..సుక్తాంకర్
- శాతవాహనుల జన్మభూమి విదర్భ అని పేర్కొన్నది – మిరాసీ పండితుడు
- కథాసరిత్సాగరం ప్రకారం శాతవాహనుడు అనే పదానికి అర్థం- సాత(యక్షుడు)ను వాహనంగా గలవారు
- శ్రీముఖుడు నాణేలు ఎక్కడ లభించాయి? – కరీంనగర్ జిల్లా కోటి లింగాలలో
- సీముకుని నాణేలపై ముద్రించిన పేరు – చీముకుడు
- కథాసరిత్సాగరంలోని ఏ కథ ఆధారంగా సాతావాహనుడు అను ఒక రాజు ఉన్నట్లు పేర్కొంటున్నారు? – దీపకర్ణి కథ
- నాసిక్‌లోని గౌతమీ బాలశ్రీ శాసనంలోని ఏక బ్రాహ్మణ అనే పదానికి అసామాన్య బ్రాహ్మణ అనే అర్థాన్ని చెప్పినది – సెనార్ట్
- బృహత్కథను రచించినది? – గుణాడ్యుడు
- బృహత్కథ ఏ భాషలో ప్రచురితమైంది? -ప్రాకృత పైశాచిక భాష
- బృహత్కథ క్రీ.శ 6వ శతాబ్దంలోనిదని పేర్కొన్న జర్మన్ విద్వంసుడు – నీబరు
- బృహత్కథ క్రీ.శ 1లేదా 2 శాతాబ్దం కాలం నాటిదని పేర్కొన్నది- బుహ్లారు
- బృహత్కథా మంజరి పేరుతో బృహత్కథను సంగ్రహపరిచినది- కశ్మీర్ దేశంలోని
- అనంతపాలుని ఆస్థానకవి క్షేమేంద్రుడు
- కాతంత్ర వ్యాకరణం రంచినది ఎవరు?- శర్వవర్మ
- జైనమత వాజ్మయం ప్రకారం శ్రీముఖుడు – జైనమత పోషకుడు
- శ్రీముఖుని సోదరుడు – కృష్ణుడు
- కృష్ణుడిని ఇలా కూడా పిలిచేవారు – కన్హుడు
- దక్షిణాధిపతి,అప్రతిహతః చక్ర అనే బిరుదులు గల శాతవాహన రాజు- మొదటి శాతకర్ణి
- శ్రీముఖుని కుమారుడు- మొదటి శాతకర్ణి
- మొదటి శాతకర్ణి ప్రసక్తి ఉన్న శాసనం – నానాఘాట్ శాసనం
- నానాఘాట్ శాసనం వేయించినది – మొదటి శాతకర్ణి భార్య నాగానిక
- నాగానిక ఎవరి కుమార్తె – మహారథి అంగీయ రాజైన
- త్రాణకైరో కుమార్తెమొదటి శాతకర్ణి కాలంలో పశ్చిమ మాళ్వాను ఏమని పిలిచేవారు?- అవంతి, దీని రాజధాని ఉజ్జయిని
- తూర్పు మాళ్వాను ఏమని పిలిచేవారు?- అకర,దీని రాజధాని విదిశ
- రెండు అశ్వమేధములు,ఒక రాజసూయము చేసిన శాతవాహనరాజు – మొదటి శాతకర్ణి
- మొదటి శాతకర్ణి సమకాలీనుడైన కళింగ రాజు – ఖారవేలుడు
- మౌర్య బృహద్రధుని ఓడించినది – పుష్యమిత్ర శుంగుడు
- డెమిట్రియస్ను ఓడించినది – ఖారవేలుడు
- ఖారవేలుని బిరుదు – మహామేఘవాహన
- ఖారవేలుని విజయయాత్ర గురించి తెలియజేసే శాసనం – హాథిగుంఫా శాసనం
- మొదటి శాతకర్ణి ఏ మతాభిమాని – వైదిక
- మత్య్సపురాణం ప్రకారం రెండవ శాతకర్ణి పాలనాకాలం – 56 సంవత్సరాలు
- మగధ రాజధానియైన పాటలీపుత్రాన్ని ఆక్రమించిన శాతవాహనరాజు- రెండవ శాతకర్ణి
- సాంచి ప్రాకార ద్వారాలు ఏర్పరచినది – రెండవ శాతకర్ణి
- ఎవరి పాలనానంతరం శాతవాహన సామ్రాజ్యం తొలిసారిగా ఛిన్నాభిన్నం అయ్యింది? – రెండవ శాతకర్ణి
- ‘గర్ధబిల్ల’సమకాలీనుడైన శాతవాహనరాజు – సంఘం లేదా మేఘస్వాతి
- ‘గర్ధబిల్ల’ కుమారుడెవరు?- విక్రమాదిత్యుడు
- విక్రమాదిత్యుని సమకాలీనుడైన శాతవాహనరాజు – మూడవ శాతకర్ణి
- మగధరాజైన సుశర్మను వధించిన శాతవాహన రాజు – మొదటి పులోమావి
- విక్రమాదిత్య బిరుదు పొందిన శాతవాహన రాజు – కుంతల శాతకర్ణి
- ప్రాకృత భాష స్థానంలో అధికార భాషగా సంసృ్కతం ఎవరి కాలంలో వచ్చింది?- కుంతల శాతకర్ణి
- కుంతల శాతకర్ణి ఆస్థాన మంత్రులు – గుణాఢ్యుడు, శర్వవర్మ
- శర్వవర్మ ‘కాతంత్ర వ్యాకరణం’ఏ భాషలో రచించాడు? – సంస్కృతం
- రాజద శాతకర్ణి, చకోర శాతమూలుడు అనే పేర్లు గల శాంతవాహన రాజు- చకోర శాతకర్ణి
- భరుకచ్చా(బ్రోచ్)న్ని పాలించే సాహపాణుని ఓడించిన శాతవాహన రాజు- కుంతల శాతకర్ణి
- కుంతల శాతకర్ణి భార్య – మలయవతి
- పూర్వ శాతవాహనులలో చివరి రాజు – 3వ పులోమావి
- సహపాణుని వంశం ఏది?- క్షహరాట వంశం
- ఛస్తనుని వంశం- కార్ధమక వంశం
- ప్రజల ఛీత్కారాన్నెదుర్కొన్న శాతావాహన రాజు- గౌర కృష్ణుడు
- గౌర కృష్ణుణ్ణి ప్రజలు ఏమని పిలిచేవారు?- రిక్తవర్ణుడు, వికృష్ణుడు,
- అరిష్ట కృష్ణుడు, అనిష్టకర్ముడు
- కవి వత్సలుడు అను బిరుదు గల శాతవాహన రాజు- హాలుడు
- హాలుని సమకాలీనులైన క్షాత్రవులు- భూమకుడు,సహపాణుడు
- గాథాసప్తశతి గ్రంథకర్త- హాలుడు
- గాథాసప్తశతిని పోలిన గ్రంథం-వజ్జలగ్గ
- వజ్జలగ్గను రచించినది- శ్వేతాంబర జైనుడైన
- జయవల్లభుడుసేతుబంధం గ్రంథకర్త- ప్రరవసేనుడు
- గౌడవథ గ్రంథకర్త- యశోవర్మ
- ఆస్థానకవి వాక్పతిరాజుహాలుని సర్వసేనాధిపతి – విజయానందనుడు
- పత్తలక, మంతలక అనుపేర్లు గలశాతవాహన రాజు – విజయానందనుడు
- ఏ రాజు దగ్గరి నుంచి తల్లిపేరు పెట్టుకోవడం కనిపిస్తుంది? – గౌతమీ పుత్ర శాతకర్ణి
- బాణం, అంబు చిహ్నం గల నాణేలు ఎవరికి చెందినవి? – వాసిష్ట్టీ పుత్ర శాతకర్ణి,
- మాఠరి పుత్ర శకసేనుడు, గౌతమీపుత్ర శాతకర్ణి
- గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి – గౌతమీ బాలశ్రీ
- గౌతమీ పుత్ర శాకర్ణికి సంబంధించిన శాసనాలు – నాసిక్, కార్లీ శాసనాలు
- నాసిక్ శాసనం వేయించినదెవరు? – గౌతమీపుత్ర బాలశ్రీ
- సాంచీస్థూపం దక్షిణ తోరణం నిర్మించినది – గౌతమీపుత్ర శాతకర్ణి
- జోగల్ తంబి నాణేలు ముద్రించినది- గౌతమీపుత్ర శాతకర్ణి
- గౌతమీపుత్ర శాతకర్ణి బిరుదులు- త్రి సముద్రాధీశా, ద్విజకుల వర్ధన,ఏక బ్రాహ్మణ
- శాతవాహనుల రాజధాని ధరణికోట ఎవరి కాలం నుంచి వర్ధిల్లింది?- గౌతమీపుత్ర శాతకర్ణి
- ‘బెణకటక స్వామి’ అని ఎవరిని పిలిచేవారు?- గౌతమీపుత్ర శాతకర్ణి
- గౌతమీపుత్ర, యజ్ఞశ్రీ శాతకర్ణుల నాణేలు ఎక్కడ లభించాయి.?- సోపర,గుజరాత్ ప్రాంతాల్లో
- గౌతమీపుత్రుని శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? – ప్రాకృత భాషలోనూ,బ్రాహ్మి లిపిలోనూ
- రాజర్షి వధువుగా వర్ణించబడినశాతవాహన స్త్రీ? – గౌతమీ బాలశ్రీ
- రెండవ పులోమావికి సమకాలీనుడైన గ్రీకు ఖగోళ శాస్త్రజ్ఞుడు – టాలమీ
- శాతవాహన సామ్రాజ్యాన్ని పాలించిన చివరి పాలకుల్లో ముఖ్యుడు?
- యజ్జశ్రీ శాతకర్ణి
- ఆంధ్రప్రదేశ్‌లో కనిపించిన శాతవాహన శాసనాలలో మొదటిది?- వాసిష్టి పుత్ర పులోమావిది
- ఆచార్య నాగార్జునుడిని పోషించిన శాతవాహన చక్రవర్తి ?- యజ్ఞశ్రీ శాతకర్ణి
- నాగార్జున కొండ స్థూపాన్ని విహారాన్ని నిర్మించినవారు?- యజ్ఞశ్రీ శాతకర్ణి
- యజ్ఞశ్రీ శాతకర్ణిని ‘త్రిసముద్రాధీశుడ’ని కీర్తించినది?- బాణుడు
- శాతవాహనుల కాలంలో ప్రసిద్ధికెక్కిన సంస్కృత గ్రంథం- నాగార్జునాచార్యుని సుహృల్లేఖ
- శాతవాహనుల చివరివాడు?- మూడో పులోమావి
- శకరాజైన రుద్రదాముని కుమార్తెను వివాహమాడిన శాతవాహన రాజు- శివవర్మ శాతకర్ణ రాజు
- రుద్రదాముని విజయాల గురించి తెలిపే శాసనం ?- జునాగఢ్ శాసనం
- శాతవాహన సామ్రాజ్యంలోని రాష్ర్టాలను ఏమని పిలిచేవారు?- ఆహారాలు
- ఆహారములో రాజప్రతినిధి – అమాత్యుడు
- శాతవాహన కాలంలో రాజును ఏమని పిలిచేవారు.?- రాజాధిరాజు రాజరనో
- శాతవాహనుల కాలంలో పట్ణణ పరిపాలనను నిర్వహించే సభ- నిగమ సభ
- నిగమ సభలోని సభ్యులను ఏమని పిలిచేవారు?- గహాపతులు
- గ్రామాధికారిని ఏమని పిలిచేవారు?- గ్రామణి
- శాతవాహన కాలంలో ‘స్కంధవార’అని దేనిని పిలిచేవారు?- సైనికుల సభను
- శాతవాహనుల కాలంలో రాజుతోనే ఉంటూ వారికి సలహాలిచ్చే అధికారి?- రాజామాత్యులు
- ప్రత్యేక కార్యనిర్వహణార్థం నియమింపబడిన మంత్రులను ఏమని పిలిచేవారు?- మహామాత్యులు
- వస్తు సంచయం చూసే అధికారిని ఏమని పిలిచేవారు? – భాండారికుడు
- ఆంధ్రాలో శాతవాహనుల టంకశాల ఎక్కడ ఉంది?- కొండాపురం
- ‘కథాసరిత్సాగరము’రచించనది?-సోమదేవుడు
- ‘తిలకమంజరి’ గ్రంథకర్త -ధనపాలుడు
- ‘మహాయాన’ మతాన్ని ప్రారంభించినది- ఆచార్య నాగార్జునుడు
- నాగార్జునుడు ఏ శాతవాహన రాజుకు సమకాలీనుడు – యజ్ఞశ్రీ శాతకర్ణి
- శూన్యవాదాన్ని లేదా మాధ్యమిక వాదాన్ని ప్రతిపాదించినది? – ఆచార్య నాగార్జునుడు
- నాగార్జునాచార్యుని కోసం యజ్ఞశ్రీ శాతకర్ణి నాగార్జున కొండలో కట్టించిన పారావత విహారాన్ని ఫాహియాన్ ఏమని వర్ణించాడు?
ఈ భవనంలో ఐదంత్తులున్నాయి. కింది అంతస్తులో 500 గదులు, ఆపైన వరుసగా 400,300,200,100 గదులున్నాయి. కింది నుంచి పైకి ఏనుగు, సింహం, గుర్రం, ఎద్దు, పావురం ఆకారాల్లో ఈ అంతస్తులు నిర్మించారు.
- నాగార్జునాచార్యుని గ్రంథాలు- సుహృల్లేఖ, ప్రజ్ఞాపారమిత, రసరత్నాకరము, మూలమాధ్యమిక శాస్త్రం, యోగ శాస్త్రం
- శాతవాహనుల కాలంలో రాజులకు కట్టే శిస్తులు- రాజభాగ, దేవమేయ
- గైడ్ టు జాగ్రఫీ రచించినది?- టాలమీ
- ప్రాకృత గద్యంలో ఉన్న శాసనం- నాసిక్ శాసనం (రెండోపులోమావి)
- నాగార్జున కొండకు ఉన్న మరొక పేరు శ్రీపర్వతం
- హ్యుయాన్‌త్సాంగ్ తన“సి-య-కి”గ్రంథంలో గోదావరి, కృష్ణా నదుల మధ్యగల తీరాంధ్ర దేశాన్ని ఏ పేరుతో వర్ణించారు?- అంతుబోలి
- పశ్చిమ ప్రాంతంలోని చైత్య గృహాలు ఏవి?- కార్లె, నాసిక్, కన్హేరి,బెడ్సా గుహాలయాలు
- ఇటుకలతో నిర్మించిన చైత్య గృహాలు ఏవి? – చేజర్ల,గుంటుపల్లి
- అమరావతి శిల్పాలను ప్రస్తుతం ఎక్కడ భద్రపరిచారు? – మద్రాసు, లండన్ మ్యూజియాల్లో
- అమరావతి కళలో గాంధార శిల్పకళ ఛాయలున్నాయని పేర్కొన్నవారు?- విన్సెంట్ స్మిత్, ఫెర్గూసన్
- దక్షిణ భారతదేశంలో సముద్రగుప్తుని ఒకే ఒక బంగారు నాణెం దొరికిన ప్రాంతం- విశాఖపట్నం
- జిల్లాలోని సంకారంతూర్పు తీరంలో శాతవాహనులునిర్మించినబౌద్ధస్థూపాలు-
- అమరావతి,నాగార్జునకొండ,భట్టిప్రోలు,జగ్గయ్యపేట
- తూర్పు తీరంలో శాతవాహనులు నిర్మించిన రేవు పట్టణాలు?- ఘంటసాల, కోడూరు
- శాలివాహన శకం ఏ సంవత్సరం నుంచి ప్రాంభమైంది?- క్రీ.శ 78వ సంవత్సరం నుంచి
- నాగార్జునకొండ వద్ద లభ్యమైన విదేశీ నాణేలు- రోమన్
- శాతవాహన కుల యశః ప్రతిష్ఠాకర బిరుదు ఎవరిది? – గౌతమీపుత్ర శాతకర్ణి
- కొత్తరాతి యుగానికి చెందిన ఒక అరుదైన నివేశన స్థలాన్ని ఎక్కడ కనిపెట్టారు?- మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూర్
- శాతవాహనుల కాలంలో బంగారు గనులు ఎక్కడెక్కడున్నాయి?- కొల్లార్, హత్తి, వొందవల్లి,
- మాస్కీలలో
- ప్రతీయ సముత్పాదం ఏ మతానికి చెందినది?- బౌద్ధమతం
- ఆంధ్రుల గురించి ప్రస్తావన ఉన్న గ్రంథాలు ఏవి?-ఐతరేయ బ్రాహ్మణం, అశోకుడి ఇండికా 13వ శిలాశాసనం
- ఆంధ్ర రాజ్య స్థాపన చేసింది.- శ్రీముఖుడు
- శాతవాహన రాజులు ఏమతాన్ని ఆదరించారు.- బౌద్ధమతం
ఎం.ఎస్.ఆర్ పబ్లికేషన్స్
9849209445
Previous article
1857 తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు
Next article
బ్యాంకుల జాతీయీకరణ – లక్ష్యాలు- పురోగతి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు