మైక్రోఫోన్లో శక్తి పరివర్తన ఎలా జరుగుతుంది?
(సెప్టెంబర్ 23 తరువాయి)
64. గరిష్ఠోన్నతి దగ్గర ప్రక్షేపకం స్థితికి సంబంధించి కింది వాటిలో సరైన ప్రవచనం?
ఎ) వేగం సున్నా
బి) త్వరణం సున్నా
సి) త్వరణం సున్నా కాదు
డి) చేరే గరిష్ఠ ఎత్తును బట్టి ఉంటుంది
65. నీటిని చిమ్మే హోస్ పైపును ఏవిధంగా పట్టుకుంటే నీరు ఎక్కువ దూరంలో పడుతుంది?
ఎ) భూమి తలానికి సమాంతరంగా
బి) భూమి తలానికి 300 కోణంలో
సి) భూమి తలానికి 450 కోణంలో
డి) భూమి తలానికి 600 కోణంలో
66. షాట్‌పుట్ గుండును ఎక్కువదూరం విసరాలంటే భూమి తలానికి ఎంత కోణంలోవిసరాలి?
ఎ) 00 బి) 300
సి) 450 డి) 600
67. కాంతి వేగానికి దగ్గరి వేగంతో ప్రయాణించే వస్తువుల విషయంలో కింది వాటిలో సరైన వివరణ ఏది?
1. వస్తువు పొడవు తగ్గుతుంది
2. వస్తువు ద్రవ్యరాశి, పొడవు పెరుగుతుంది
3. వస్తువు పొడవు మారదు
4. వస్తువు ద్రవ్యరాశి మారదు
ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
68. గంటకు 72 కి.మీ. వేగంలో ప్రయాణించే బస్సు ఒక సెకనులో ఎంత దూరం ప్రయాణిస్తుంది?
ఎ) 10 మీ. బి) 15 మీ.
సి) 20 మీ. డి) 25 మీ.
69. గంటకు 72 కి.మీ. వేగంతో ప్రయాణించే బస్సు ఒక నిమిషంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది?
ఎ) 720 మీ. బి) 1200 మీ.
సి) 1440 మీ. డి) 360 మీ.
70. ఒక వ్యక్తి తూర్పుదిశగా 3 కి.మీ. ప్రయాణించి, ఉత్తరం వైపు తిరిగి మరో 4 కి.మీ ప్రయాణిస్తే తొలిస్థానం నుంచి, అతను ఎంత దూరంలో ఉన్నాడు?
ఎ) 1 కి.మీ. బి) 7 కి.మీ.
సి) 3/4 కి.మీ. డి) 5 కి.మీ.
71. 3 మీ. ఎత్తు, 4 మీ. వెడల్పు, 5 మీ. పొడవు ఉన్న ఒక గదిలో ఉంచగల తిన్నని కర్ర గరిష్ఠ పొడవు ఎంత?
ఎ) 12 మీ. బి) 24 మీ.
సి) 7 మీ. డి) 9 మీ.
72. ఒక రైలు సెకనులో 10 మీ. దూరం ప్రయాణిస్తే దాని వేగం కి.మీ/గంటల్లో.. ?
ఎ) 18 బి) 36 సి) 48 డి) 64
73. రోడ్డుపై ఒక కారు గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కారు పక్కన ఒక బస్సు అదే దిశలో 80 కి.మీ./గంట వేగంతో ప్రయాణిస్తుంది. కారులో ప్రయాణించే వ్యక్తి పరంగా బస్సు వేగం?
ఎ) 80 కి.మీ./గంట
బి) 60 కి.మీ./గంట
సి) 20 కి.మీ./గంట
డి) 140 కి.మీ./గంట
74. రోడ్డుపై ఒక కారు గంటకు 60 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. కారు పక్కన ఒక బస్సు ఎదురు దిశలో 80 కి.మీ./గంట వేగంతో ప్రయాణిస్తుంది. కారులో ప్రయాణించే వ్యక్తి పరంగా బస్సు వేగం?
ఎ) 80 కి.మీ./గంట
బి) 60 కి.మీ./గంట
సి) 20 కి.మీ./గంట
డి) 140 కి.మీ./గంట
75. ధ్వని వేగం 340 మీ/సె అయితే గంటకు ఎంత దూరం ప్రయాణిస్తుంది?
ఎ) 1224 కి.మీ బి) 1124 కి.మీ
సి) 1244 కి.మీ డి) 1234 కి.మీ
76. 400 మీ. పొడవుగల రైలు 36 కి.మీ/గంట వేగంతో ప్రయాణిస్తుంది. మార్గం పక్కన ఉన్న ఒక స్తంభాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది?
ఎ) 36 సెకన్లు బి) 18 సెకన్లు
సి) 48 సెకన్లు డి) 40 సెకన్లు
77. ఒక కారు మొదటి 3 కి.మీ. దూరాన్ని 2 నిమిషాల్లో, తర్వాతి 2 కి.మీ. దూరాన్ని 3 నిమిషాల్లో ప్రయాణిస్తే, దాని సగటు వేగం కి.మీ/గంటల్లో ఎంత?
ఎ) 60 బి) 75 సి) 90 డి) 60
78. స్వేచ్ఛగా కిందికి పడే వస్తువు త్వరణం ఎంత? (మీ/సె2లలో)
ఎ) 4.9 బి) 9.8 సి) 19.6 డి) 0
79. పైకి విసిరిన వస్తువుకు గరిష్ఠ ఎత్తు వద్ద త్వరణం?
ఎ) 0 బి) g
సి) విసిరిన తొలివేగంపై ఆధారపడి ఉంటుంది
డి) గరిష్ఠ ఎత్తుపై ఆధారపడి ఉంటుంది
80. బంతిని ఎక్కువ దూరం విసరాలంటే క్షితిజ సమాంతరానికి ఎంత కోణంలో విసరాలి?
ఎ) 300 బి) 450
సి) 600 డి) 750
81. బలం, స్థానభ్రంశాల లబ్దం ఏ భౌతికరాశిని సూచిస్తుంది?
ఎ) సామర్థ్యం బి) ద్రవ్యవేగం
సి) ప్రచోదనం డి) పని
82. తడిగా ఉన్న టవల్‌ను దులిపినప్పుడు దాంట్లో నీటి బిందువులు బయటకు రావడానికి కారణం?
ఎ) జడత్వం బి) ప్రచోదనం
సి) టార్క్ డి) ఏవీకావు
83. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంతసేపు తిరగడానికి కారణం?
ఎ) స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా కొంత విద్యుత్ ప్రవాహం ఉంటుంది
బి) భ్రమణ జడత్వం వల్ల మరికొంతసేపు తిరుగుతుంది
సి) ఫ్యాన్ తీగచుట్టలో ఉండే అయస్కాంత శక్తి
డి) గదిలోని గాలి
84. సైకిల్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి ముందుకు, వెనుకకు ఊగడం చేస్తే సైకిల్ వేగం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు
డి) సైకిల్ కంటే వ్యక్తి బరువు ఎక్కువగా ఉంటే పెరుగుతుంది
85. ఓవర్‌హెడ్ ట్యాంకులో ఉన్న నీటికి ఉండే శక్తి?
ఎ) స్థితిజశక్తి బి) గతిజశక్తి
సి) కంపన శక్తి డి) భ్రమణ శక్తి
86. ప్రవహించే నీటికి ఉండే శక్తి?
ఎ) స్థితిజశక్తి బి) గతిజశక్తి
సి) కంపన శక్తి డి) భ్రమణ శక్తి
87. గాలిలో ఎగిరే పక్షికి ఉండే శక్తి?
ఎ) స్థితిజ శక్తి బి) గతిజ శక్తి
సి) భ్రమణ శక్తి డి) ఎ, బి
88. మైక్రోఫోన్లో శక్తి పరివర్తన ఎలా జరుగుతుంది?
ఎ) ధ్వనిశక్తి విద్యుత్ శక్తిగా
బి) విద్యుత్ శక్తి ధ్వని శక్తిగా
సి) ధ్వని శక్తి అయస్కాంత శక్తిగా
డి) అయస్కాంత శక్తి ధ్వని శక్తిగా
89. బ్యాటరీలో శక్తి ఏ రూపంలో ఉంటుంది?
ఎ) ఉష్ణ శక్తి బి) విద్యుత్ శక్తి
సి) రసాయన శక్తి డి) పైవన్నీ
90. భూమికి ప్రధాన శక్తి వనరు?
ఎ) సూర్యుడు బి) నేలబొగ్గు
సి) క్రూడ్ ఆయిల్ డి) బి, సి
91. ఒక న్యూటన్ బలం సీజీఎస్ ప్రమాణాల్లో ఎన్ని డైనులకు సమానం?
ఎ) 104 బి) 105
సి) 106 డి) 107
92. చెట్ల ఆకులు కిరణజన్య సంయోగక్రియలో శక్తిని ఏ విధంగా మారుస్తాయి?
ఎ) ఉష్ణశక్తిని స్థితిజ శక్తిగా
బి) కాంతి శక్తిని స్థితిజశక్తిగా
సి) ఉష్ణశక్తిని రసాయనశక్తిగా
డి) కాంతిశక్తిని రసాయన శక్తిగా
93. వస్తువు ద్రవ్యవేగం రెట్టింపు అయితే దాని గతిజశక్తి?
ఎ) సగం అవుతుంది
బి) రెట్టింపు అవుతుంది
సి) మూడు రెట్లు అవుతుంది
డి) నాలుగు రెట్లు అవుతుంది
94. భవనంపై నుంచి ‘ఎ’ అనే బంతి క్షితిజ సమాంతరంగా విసిరారు. అదే సమయంలో అక్కడి నుంచి మరో బంతి ‘బి’ కిందికి వదిలారు. ఈ రెండింటిలో ఏది ముందు నేలను తాకుతుంది.
ఎ) ఎ బి) బి సి) ఎ, బి
డి) సమాచారం సరిపోదు
95. సైకిల్ బ్రేక్ వేసినప్పుడు, దాని గతిజశక్తి ఏమవుతుంది?
ఎ) ఉష్ణశక్తిగా మారుతుంది
బి) స్థితిజశక్తిగా మారుతుంది
సి) అదృశ్యమవుతుంది
డి) విద్యుత్ శక్తిగా మారుతుంది
96. నిత్యత్వం కాని బలాన్ని గుర్తించండి.
ఎ) గురుత్వాకర్షణ
బి) అయస్కాంత బలం
సి) కూలూంబ్ డి) ఘర్షణ
97. బలాన్ని SI ప్రమాణాల్లో న్యూటన్లుగా, CGS ప్రమాణాల్లో డైనులుగా కొలుస్తారు. అయితే కింది వాటిలో సరైన సంబంధం?
ఎ) 1 డైను = 105 న్యూటన్లు
బి) 1 న్యూటన్ = 105 డైను
సి) 1 డైను = 100 న్యూటన్లు
డి) 1 న్యూటన్ = 100 డైను
98. ‘బాహ్యబల ప్రమేయం లేనంతవరకు వస్తువు స్థితిలో మార్పు ఉండదు’ అని చెప్పేది?
ఎ) న్యూటన్ 1వ గమన నియమం
బి) న్యూటన్ 2వ గమన నియమం
సి) న్యూటన్ 3వ గమన నిమయం
డి) న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం
99. కదులుతున్న బస్సుకు అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు అందులో ప్రయాణించే వ్యక్తి ముందుకు తూలుతాడు. దీనికి కారణం?
ఎ) ప్రచోదనం బి) ప్రత్యవస్థానం
సి) స్థితిస్థాపకత డి) జడత్వం
100. రేఖీయ చలనంలో ఒక వస్తువుకు సంబంధించిన ఏ భౌతికరాశిని జడత్వానికి కొలతగా తీసుకోవచ్చు?
ఎ) ఘనపరిమాణం బి) ఆకారం
సి) ద్రవ్యరాశి డి) పైవన్నీ
101. కింది వాటిలో ప్రాథమిక బలం?
ఎ) గురుత్వాకర్షణ బలం
బి) ఘర్షణ బలం
సి) స్నిగ్ధత బలం డి) సంసంజన బలం
102. చర్య-ప్రతిచర్య సమానం, వ్యతిరేకం అని చెప్పేది?
ఎ) న్యూటన్ 1వ గమన నియమం
బి) న్యూటన్ 2వ గమన నియమం
సి) న్యూటన్ 3వ గమన నియమం
డి) న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ నియమం
103. ఒక వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణ బలాన్ని ఏమంటారు?
ఎ) ద్రవ్యరాశి బి) భారం
సి) ప్రతిబలం డి) ద్రవ్యవేగం
104. చలనంలో ఉన్న బస్సు నుంచి దిగేటప్పుడు ఏవిధంగా దిగాలి?
ఎ) ముందుకు పరిగెడుతూ
బి) వెనుకకు పరిగెడుతూ
సి) దిగిన చోట కదలకుండా నిలబడాలి
డి) ఎ, బి
105. ‘లాంగ్ జంప్’ చేసే వ్యక్తి దూకడానికి ముందు కొంతదూరం నుంచి పరిగెత్తుతూ వస్తాడు. ఎందుకు?
ఎ) గమన జడత్వాన్ని పొందడానికి
బి) బలాన్ని పెంచుకోడానికి
సి) శక్తిని పెంచుకోడానికి
డి) కండరాలను అనుకూలంగా మలుచుకోడానికి
106. న్యూటన్ మూడో గమన నియమంలో చెప్పే ‘చర్య’, ‘ప్రతిచర్య’ బలాలకు సంబంధించి సరైన వివరణ?
ఎ) చర్య, ప్రతిచర్య ఒకే వస్తువుపై పనిచేస్తాయి
బి) చర్య, ప్రతిచర్య వేర్వేరు వస్తువులపై పని చేస్తాయి
సి) చర్య, ప్రతిచర్యలు సమానంగా ఉంటాయి
డి) బి, సి
107. తుపాకీని పేల్చినప్పడు బుల్లెట్ ముందుకు పోతుంది. అయితే తుపాకీ కూడా కొంత వెనుకకు రావడంలో ఇమిడి ఉన్న నియమం?
ఎ) న్యూటన్ 1వ గమన నియమం
బి) న్యూటన్ 3వ గమన నియమం
సి) ద్రవ్యవేగ నిత్యత్వం
డి) శక్తి నిత్యత్వం
108. ఒకే వేగంతో ప్రయాణిస్తున్న లారీ, కారులకు ఒకే బలం కలిగిన బ్రేకు వేసినప్పుడు?
ఎ) రెండూ ఒకే దూరంలో ఆగుతాయి
బి) రెండూ ఒకేసారి ఆగుతాయి
సి) కారు, లారీ కంటే తక్కువ దూరంలో త్వరగా ఆగుతుంది
డి) లారీ, కారు కంటే తక్కువ దూరంలో త్వరగా ఆగుతుంది
109. లిఫ్ట్ పైకి త్వరణంతో వెళ్లేటప్పుడు అందులోని వ్యక్తి బరువు ఏవిధంగా ఉంటుంది?
ఎ) బరువు పెరిగినట్లు
బి) బరువు తగ్గినట్లు
సి) బరువులో మార్పు ఉండదు
డి) బి లేదా సి
110. కొంత ఎత్తు నుంచి దూకుతున్నప్పుడు, నేలకు చేరుకోకముందు వ్యక్తి బరువు?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) సున్నా డి) మారదు
111. ఇసుకలోకి దూకినప్పుడు గాయాలు కావు. కానీ కాంక్రీట్ నేలపై దూకినప్పుడు గాయాలు కావడానికి కారణం?
ఎ) కాంక్రీట్ నేల తక్కువ ప్రచోదనాన్ని
కలిగిస్తుంది
బి) కాంక్రీట్ నేల అధిక ప్రచోదనాన్ని
కలిగిస్తుంది
సి) ఇసుక అధిక ప్రచోదనాన్ని కలిగిస్తుంది
డి) రెండూ ఒకే ప్రచోదనాన్ని కలిగిస్తాయి
112. గోడలో మేకును దించడానికి సుత్తితో కొట్టడం వల్ల ఏం జరుగుతుంది?
ఎ) మేకుపై వేడి పుడుతుంది
బి) మేకు చల్లబడుతుంది
సి) మేకుపై ప్రచోదనం ఏర్పడుతుంది
డి) ఎ, సి
113. పగిలిపోయే స్వభావం ఉన్న వస్తువులను రవాణా చేసేటప్పుడు వాటిని రంపపు పొట్టు, గడ్డి వంటి పదార్థాలతో ప్యాకింగ్ చేసి రవాణా చేయడానికి కారణం?
ఎ) ప్రచోదన బలాన్ని తగ్గించడానికి
బి) ప్రచోదన బలాన్ని పెంచడానికి
సి) చర్య- ప్రతిచర్యను పెంచడానికి
డి) చర్య-ప్రతిచర్యను తగ్గించుకోడానికి
114. స్థితిస్థాపక అభిఘాతాలకు సంబంధించి సరైన ప్రవచనం?
ఎ) ద్రవ్యవేగ నిత్యత్వ నియమం పాటించబడుతుంది
బి) గతిజశక్తి నిత్యత్వ నియమం పాటించబడుతుంది
సి) ప్రత్యవస్థాన గుణకం 1కి సమానం
డి) పైవన్నీ సరైనవే
115. మట్టినేలపై జారవిడిచిన బంతి కొంత ఎత్తు ఎగురుతుంది. కానీ గచ్చు నేలపై అదే ఎత్తు నుంచి జారవిడిచిన బంతి ఎక్కువ ఎత్తు
ఎగురుతుంది. దీనికి కారణం?
ఎ) మట్టినేల ప్రత్యవస్థాన గుణకం తక్కువ
బి) మట్టినేల ప్రత్యవస్థాన గుణకం ఎక్కువ
సి) మట్టినేలకు బలం తక్కువ
డి) మట్టినేలకు ఆకర్షణ బలం ఎక్కువ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు