విదేశీ విద్య @ GRE
విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులు ప్రధానంగా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యాపారం లేదా STEM సంబంధిత (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. అండర్‌గ్రాడ్యుయేషన్ తరువాత విదేశాలకు వెళ్లాలనుకున్నప్పుడు విద్యార్థులు కొన్ని పరీక్షలు రాయాలి. అందులో గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామ్ (GRE) జనరల్ టెస్ట్ ఒకటి.ఈ పరీక్షను ప్రధానంగా యూఎస్, మరికొన్ని దేశాల్లో మాస్టర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు రాస్తారు. కొన్ని బిజినెస్ సూల్స్, మెడికల్ సూల్స్, ఫెలోషిప్ అవకాశాలకోసం ప్రయత్నిస్తున్నవారు కూడా ఈ పరీక్ష రాస్తారు. జీఆర్ఈ జనరల్ టెస్ట్‌ని ఈటీఎస్(https://www.ets.org/) నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షలమంది ఈ పరీక్షను ఏటా రాస్తారు.అన్సోర్డ్ సెక్షన్ మొత్తం పరీక్షలో, అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ తరువాత ఎప్పుడైనా రావొచ్చు. కానీ రిసెర్చ్ సెక్షన్ చివరగా వస్తుంది.
అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్: పరీక్ష దీనితోనే ప్రారంభమవుతుంది. ఇకడ ఇష్యూ అండ్ ఆర్గ్యుమెంట్ టాస్‌కి ఎటువంటి చాయిస్ లేదు. ఇచ్చిన టాస్‌కి సమాధానం రాయాలి. అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్ సోర్ 0-6 మధ్యలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జీఆర్ఈ రాసిన విద్యార్థుల యావరేజ్ స్కోర్ సుమారుగా 3.5. కాబట్టి మీరు కనీసం 3.5 స్కోర్ టార్గెట్ చేయాలి.
అనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్లో మారులు ఎలా పెంచుకోవాలి?
టాస్‌కి స్పెసిఫికేషన్ ఉంటుంది. ఆ స్పెసిఫికేషన్ని పూర్తిగా చదివి దానికి తగ్గ జవాబు రాయాలి. ఇష్యూ టాస్‌లో మీ అభిప్రాయం వ్యక్తపరచాలి. ఆర్గ్యుమెంట్ టాస్‌లో ఇచ్చిన ఆర్గ్యుమెంట్‌ని విశ్లేషించి సమాధానం రాయాలి.
ప్రతి టాస్‌కి మీకు గల 30 నిమిషాలను సరిగ్గా కేటాయించుకోవాలి.
స్పెల్లింగ్, గ్రామర్ పొరపాట్లు లేకుండా చూసుకోవాలి, ఉదాహరణలతో జవాబు రాయాలి .
ఈ టాస్‌కి మీ టైపింగ్ స్పీడ్ ఉపయోగపడుతుంది. నోట్ ప్యాడ్‌తో కనీసం ఐదు ఇష్యూస్, ఆర్గ్యుమెంట్ టాస్‌లు ప్రాక్టీస్ చేయాలి.
వెర్బల్ రీజనింగ్: ఇందులో రెండు సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో ఇచ్చిన 20 ప్రశ్నలు, కేటాయించిన 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్ రీజనింగ్ సోర్ 130-170 ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా జీఆర్ఈ రాసిన విద్యార్థులు యావరేజ్ సోర్ సుమారుగా 150 ఉంటుంది. ఈ సెక్షన్లో మారులు పెంచుకోడానికి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందులో ప్రశ్నలు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.
టెక్ట్స్ కంప్లీషన్: ఇందులో ఒకటి నుంచి ఐదు సెంటెన్స్లు, ఒకటి నుంచి మూడు ఖాళీలు ఉండవచ్చు. ఒక ఖాళీ ఉంటే ఐదు ఆప్షన్స్ ఇస్తారు. ఒక జవాబు సెలెక్ట్ చేయాలి. ఎకువ ఖాళీలు ఉంటే ఖాళీకి మూడు ఆప్షన్స్ ఇస్తారు. అన్ని ఖాళీలకు సరైన జవాబు సెలెక్ట్ చేస్తేనే మారు ఇస్తారు.
సెంటెన్స్ ఈక్వివాలెన్స్: ఇందులో ఇచ్చిన వాక్యంలో ఒక ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీకి సరిపడే రెండు పదాలను, అకడ ఇచ్చిన 6 ఆప్షన్స్ నుంచి ఎన్నుకోవాలి. సెలెక్ట్ చేసిన జవాబులో రెండు ఆప్షన్స్ సరైనవి అయితేనే మారులు వస్తాయి.
రీడింగ్ కాంప్రహెన్షన్: ప్యాసేజ్‌కి సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. ఒక ప్రశ్న ఐదు ఆప్షన్స్- ఒక జవాబు లేదా ఒక ప్రశ్న మూడు ఆప్షన్స్- ఒకటి లేదా ఎకువ జవాబులు (అన్ని జవాబులు కరెక్ట్ ఐతేనే మారు ఇస్తారు). ఒక ప్రశ్న- ఆప్షన్స్ ఉండవు, ప్యాసేజ్లో ఆ ప్రశ్నకు గల జవాబు ఉన్న సెంటెన్స్ పై క్లిక్ చేయాలి.
వెర్బల్ సెక్షన్లో మారులు ఎలా పెంచుకోవాలి?
క్రమం తప్పకుండా ప్రతిరోజు జాతీయ, అంతర్జాతీయ ఆంగ్ల దినపత్రికలు, వ్యాసాలు చదవాలి.
కొత్త పదాలు నేర్చుకున్నప్పుడు వాటిని మాటల్లో లేదా రాతల్లో ఉపయోగించడానికి ప్రయత్నించాలి.
సెంటెన్స్ ఈక్వివాలెన్స్, టెక్ట్స్ కంప్లీషన్ ప్రశ్నల్లో వాక్యాలను చాలా జాగ్రత్తగా చదివి, ప్రశ్నల్లో జవాబుకు సంబంధించిన ఏదో ఒక క్లూ ఉంటుంది. దానిని పసిగట్టాలి.
రీడింగ్ కాంప్రహెన్షన్‌కు మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే ఎకువ ఫోకస్, సమయం కేటాయించాలి. రీడింగ్ ప్రాక్టీస్ చేయాలి.
క్వాంటిటేటివ్ రీజనింగ్: ఇందులో రెండు సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సెక్షన్లో 20 ప్రశ్నలు కేటాయించిన 35 నిమిషాల్లో సెక్షన్ పూర్తిచేయాలి. క్వాంటిటేటివ్ రీజనింగ్ సోర్ 130-170 ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా జీఆర్ఈ రాసిన విద్యార్థులు యావరేజ్ సోర్ సుమారుగా 152. కానీ ఇందులో 165+ టార్గెట్ చేయాలి.
ఇందులో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, న్యూమరిక్ ఎంట్రీ ప్రశ్నలు, క్వాంటిటేటివ్ కంపారిజన్ ప్రశ్నలు ఉంటాయి. బహుళ సమాధాన ప్రశ్నలు అంటే కొన్ని ప్రశ్నలకు ఒకటి కంటే ఎకువ జవాబులు ఉండొచ్చు. ఇది ముందే చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది.
అలాగే ఒక ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఇది అవసరం ఉన్నప్పుడే ఉపయోగించండి.
అన్ని కరెక్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తేనే మారులు ఇస్తారు.
మారులు ఎలా పెంచుకోవాలి?
అన్ని కాన్సెప్ట్స్ చదువుకోవాలి
అన్ని రకాల లెకలను ప్రాక్టీస్ చేయాలి.
క్యాలిక్యులేషన్ కరెక్ట్‌గా చేయాలి.
జీఆర్ఈలో కనీసం 300 సోర్ తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. 315 కంటే ఎకువ తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది.
జీఆర్ఈ పరీక్ష తీరుతెన్నులు
ఇందులో గల మార్ అండ్ రివ్యూ ఫీచర్ ఉంది. మరొక సారి చూద్దాం అని అనుకున్న ప్రశ్నలకు ఉపయోగించాలి. ఇవి ఒక సెక్షన్ నిర్ణీత సమయంలోపే ఉపయోగించాలి.
టెస్ట్‌లో నెగెటివ్ మారింగ్ లేదు.
ఒక సెక్షన్లో ఉన్నప్పుడు అందులో జవాబుని మార్చుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు.
జీఆర్ఈ సోర్కు ఐదు సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది.
జీఆర్ఈ (టెస్ట్ సెంటర్ లేదా హోమ్ బేస్డ్)
కొవిడ్ మహమ్మారి వల్ల టెస్ట్ సెంటర్స్ తెరిచి ఉంచడంలో ఆంక్షలున్నా లేదా సెంటర్‌కి వెళ్లి రాయలేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ పరీక్ష ఇప్పుడు ఇంటి నుంచే రాసుకోవచ్చు. మీ ప్రాంతంలో పరీక్ష రాయడానికి ఎటువంటి వీలుందన్నది ఇకడ చూడవచ్చు. https://www.ets.org/gre/revised_general/register/
ఈ పరీక్ష రాయడానికి సుమారు రూ.15,800 ఫీజు ప్రస్తుతం ఉంది. మీ సోర్లు ఒక 15 రోజుల సమయంలో వస్తాయి. పలుమార్లు పరీక్ష రాస్తే ఈ సోర్ యూనివర్సిటీలకు పంపించాలనేది సోర్ సెలెక్ట్ ద్వారా నిర్ణయించుకోవచ్చు.
ఒక 4 యూనివర్సిటీలకు సోర్లు పరీక్ష టెస్ట్ సెంటర్లో పంపించుకోవచ్చు. అడిషనల్ రిపోర్ట్స్ కోసం అదనపు రుసుం చెల్లించాలి.
ఒకవేళ టెస్ట్ రీషెడ్యూల్ లేదా క్యాన్సిల్ చేయాలనుకుంటే కనీసం పరీక్షకి నాలుగు రోజుల ముందు చేయాలి. రీషెడ్యూల్‌కి ఫీ ఉంటుంది. నాలుగు రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 50 శాతం రిఫండ్ ఉంటుంది.
ఎలా చదవాలి?
జీఆర్ఈ పరీక్షలో మంచి మారులు సంపాదించాలంటే ఇంగ్లిష్ పదజాలంపై పట్టు అవసరం. రీడింగ్, రైటింగ్ సిల్స్ కావాలి. అలాగే మ్యాథమెటిక్స్‌ని మరిచిపోవద్దు. సిల్స్ అనేవి ఒక రోజు లేదా వారం రోజుల్లో మనకి అబ్బడం అంత సులువు కాదు. నిరంతర శ్రమ ఎంతో అవసరం. ఇందుకు వెచ్చించే సమయాన్ని బట్టి, శ్రద్ధను బట్టి ఉంటుంది.
కనీసం 3-4 నెలలు శ్రద్ధగా అన్ని రకాల ప్రశ్నలను, మాక్ ఎగ్జామ్స్‌ని ప్రాక్టీస్ చేయాలి.
కనీసం 5-6 కంప్యూటర్ ఆధారిత మాక్ ఎగ్జామ్స్ చేయాలి.
ఏ ప్రశ్నలైతే సరిగ్గా చేయలేకపోతున్నారో వాటిపై ఇంకా ఎకువ శ్రద్ధ వహించాలి.
విద్యార్థులు బ్యాచిలర్స్ డిగ్రీ మూడో సంవత్సరంలో పరీక్ష రాసి నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్, జాబ్ ప్లేస్మెంట్స్పై కూడా ఫోకస్ చేయొచ్చు.
ఏ యూనివర్సిటీలో చదవాలనుకునుటున్నారో, ఆ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియకి రాయాల్సిన పరీక్షలు లేదా ఎంత సోర్ తెచ్చుకొని ఉండాలో ముందే తెలుసుకుని పరీక్షకు సిద్ధమవాలి.
Sirisha Reddy
Director – Academics
Abhyaas Edu Technologies
+91 9100545452
www.abhyaas.in ,GRE | IELTS | CAT
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు