నైట్రోజన్‌ను గాలి నుంచి తయారు చేసే పద్ధతి?
- రసాయన మార్పు జరిగినప్పుడు జరిగే మార్పు?
1) భౌతిక ధర్మాల్లో మాత్రమే
2) రసాయన సంఘటనల్లో మాత్రమే
3) స్థితి, రంగులో మాత్రమే
4) భౌతిక ధర్మాలతో పాటు రసాయన సంఘటనలో కూడా - లెడ్ ఆక్సైడ్ రంగు ఏది?
1) పసుపు 2) ఆకుపచ్చ
3) జేగురు రంగు 4) రంగులేని వాయువు - కింది వాటిలో ఉత్పతనం చెందే పదార్థం ఏది?
1) నీరు 2) అయోడిన్
3) లెడ్ నైట్రేట్ 4) పారాఫిన్ మైనం - భౌతిక మార్పునకు ఉదాహరణ కానిది ఏది?
1) ఇనుమును అయస్కాంతీకరించడం
2) అగ్గిపుల్లను వెలిగించడం
3) కొవ్వొత్తిని వెలిగించడం
4) మంచు నీరుగా మారడం - BaCl2 పై వేడిమి చర్య?
1) రసాయన మార్పు
2) భౌతిక మార్పు
3) రసాయన మార్పు, ద్విగత చర్య
4) భౌతిక మార్పు, ద్విగత చర్య - జతపర్చండి
ఎ. pbO 1. పసుపు
బి. CuO 2. నలుపు
సి. ZnO వేడి 3. తెలుపు
డి. ZnO చల్లని 4. పసుపు
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-4, బి-1, సి- 2, డి-3 - కింది వాటిలో అధిక బరువు కలిగి ఉండేది?
1) 1 గ్రాము అణువు ఇనుము
2) 1గ్రాము అణువు హైడ్రోజన్
3) 1 గ్రాము అణువు సిల్వర్
4) 1 గ్రాము అణువు సల్ఫర్ - నైట్రోజన్ డై ఆక్సైడ్ రంగు ఏది
1) ఆకుపచ్చ 2) తెల్లని దట్టమైన పొగలు
3) జేగురు రంగు 4) పసుపు పచ్చ - కనిపించని సిరా….?
1) కోబాల్ట్ క్లోరైడ్ 2) సోడియం క్లోరైడ్
3) మెర్క్యురి క్లోరైడ్ 4) బేరియం క్లోరైడ్ - రసాయన సమీకరణం సూచించేది?
1) చర్యలో పాల్గొన్న క్రియాజనకాలు
2) చర్యలో పాల్గొన్న అణువుల మోల్ సంఖ్య
3) చర్యలో ఏర్పడ్డ వాయువులు ఆక్రమించే ఘనపరిమాణం
4) పైవన్నీ - టిన్, లెడ్, ఆంటిమొని సంకేతాలు వరుసగా..?
1) Sn, Pb, Sb 2) Sb, Pb, Sn
3) Sb, Pb, An 4) W, Pb, Sb - A1 నుంచి A13+ ఎప్పుడు ఏర్పడుతుంది?
1) ఒక ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు
2) రెండు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు
3) మూడు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు
4) నాలుగు ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు - సంయోజకతకు సంబంధించి సరికానిది?
1) ఒక మూలక పరమాణువు, సంయోగం చెందగల క్లోరిన్ పరమాణువుల సంఖ్య
2) ఒక మూలక పరమాణువు, సంయోగం చెందగల హైడ్రోజన్ పరమాణువుల సంఖ్య
3) సరళ అయాన్ల సంయోజకతల నాలుగో గ్రూప్ వరకు గ్రూప్ సంఖ్యకు సమానంగా ఉంటుంది
4) ఏ మూలకం అయినా ఒకటి కంటే ఎక్కువ సంయోజకతలు ప్రదర్శించదు - కింది ఏ చర్యలో కొత్త పదార్థం ఏర్పడదు?
1) రసాయన ద్వంద్వ వియోగం
2) రసాయన స్థానభ్రంశం
3) రసాయన ఉభయ వియోగం
4) ఏదీకాదు - N2O, NO, NO2 ఏర్పడటంలో 28 గ్రాముల N2తో చర్యపొందే ఆక్సిజన్ భారాలు వరుసగా…
1) 32, 32, 32 2) 32, 64, 32
3) 16, 32, 64 4) 64, 32, 32 - సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) హైడ్రోక్లోరిక్ ఆమ్లం (HCL)తో చర్య చెంది సోడియం క్లోరైడ్, నీటిని ఏర్పరిచే చర్య?
1) రసాయన సంయోగం
2) రసాయన వియోగం
3) రసాయన స్థానభ్రంశం
4) రసాయన ద్వంద్వ వియోగం - ఫ్రాష్.. పద్ధతిలో అల్పసాంద్రత గల నురగ ఏ పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది?
1) సల్ఫర్+నీరు
2) వేడిగాలి+నీరు
3) సల్ఫర్ ద్రవం+వేడిగాలి
4) సల్ఫర్ ద్రవం+వేడిగాలి+నీరు - CS2 ద్రావణిలో కరిగేవి?
1) రాంబిక్, మోనోక్లినిక్ సల్ఫర్లు
2) రాంబిక్, ప్లాస్టిక్ సల్ఫర్లు
3) ప్లాస్టిక్, మోనోక్లినిక్ సల్ఫర్లు
4) రాంబిక్, మోనోక్లినిక్, ప్లాస్టిక్ - ఫౌంటెన్ ప్రయోగంలో నీలి లిట్మస్ ద్రావణాన్ని ఫౌంటెన్‌గా ప్రవేశించడానికి కారణం?
1) ఇంక్ పిల్లర్ 2) సల్ఫర్‌డైఆక్సైడ్ వాయువు
3) నీరు 4) నీటిలో సల్ఫర్‌డైఆక్సైడ్ చర్య - జతపర్చండి
ఎ. HCL 1. దగ్గు
బి. NH3 2. కండ్లు, కాలేయం
సి. Cl2 3. తలనొప్పి
డి. P4 4. దవడ ఎముకల నాశనం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-3, సి-2, డి-4
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-2, బి-1, సి- 3, డి-4 - అమ్మోనియా లవణాలను నత్రజనిగా మార్చే బ్యాక్టీరియా?
1) అమ్మోనిఫైయింగ్ బ్యాక్టీరియా
2) అమ్మోనియసో బ్యాక్టీరియా
3) డీ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా
4) ఏదీకాదు - నేలను సారవంతం చేసే బ్యాక్టీరియా?
1) నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా
2) డీ నైట్రీఫెయింగ్ బ్యాక్టీరియా
3) నైట్రసో బ్యాక్టీరియా
4) రైజోబియం బ్యాక్టీరియా - నత్రజని స్థాపన అంటే?
1) నత్రజని వాయువును నైట్రేట్ లవణాలుగా మార్చడం
2) నైట్రేట్ లవణాలను నత్రజని వాయువుగా మార్చడం
3) గాలిలో నైట్రోజన్‌ను స్థిరపర్చడం
4) పైవన్నీ - నైట్రోజన్‌ను గాలి నుంచి తయారుచేసే పద్ధతి?
1) హేబరు 2) అంశిక స్వేదనం
3) ద్రవీభవనం 4) బాష్పీభవనం - అద్దకపు పరిశ్రమలో వాడేది?
1) అమ్మోనియం క్లోరైడ్
2) అమ్మోనియం నైట్రేట్
3) అమ్మోనియం సల్ఫేట్
4) కాల్షియం అమ్మోనియం నైట్రేట్ - ఒక వాయువును పీడనానికి గురిచేసి, వ్యాకోచింప చేసి తిరిగి చల్లబరిచే విధానాన్ని ఏమంటారు?
1) అంశిక స్వేదనం 2) ద్రవీభవనం
3) జౌల్ థామ్సన్ 4) న్యూటన్ శీతలీకరణం - అగ్గిపుల్ల మండటానికి అవసరమయ్యే ఆక్సిజన్‌ను ఇచ్చేది?
1) పొటాషియం క్లోరైడ్
2) పొటాషియం క్లోరేట్
3) పొటాషియం నైట్రేట్
4) ఆంటిమొని సల్ఫైడ్ - పాస్ఫరస్లో మలినాలను ఆక్సీకరణం చెందించేవి?
1) పొటాషియం డైక్రోమేట్,గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం
2) పొటాషియం డైక్రోమేట్,గాఢ సల్ఫ్యూరికామ్లం
3) పాస్ఫారికామ్లం, కార్బన్
4) కార్బన్ గాఢ సల్ఫ్యూరికామ్లం - కృత్రిమ సిల్క్ రసాయన నామం?
1) సెల్యూలోజ్ ఎసిటేట్
2) సెల్యూలోజ్ నైట్రేట్
3) సెల్యూలోజ్ క్లోరైడ్
4) సెల్యులోజ్ బ్రోమైడ్ - ఫాసిజా దేనికి సంబంధించింది?
1) కాళ్లు 2) కాలేయం
3) దవడలు 4) దంతాలు - సోడియం కార్బొనేట్‌ను ఏమంటారు?
1) తినే సోడా 2) ఉతికే సోడా
3) బేకింగ్ సోడా 4) దాహక సోడ - మన శరీరపు భారంలో నీటిశాతం?
1) 60-70% 2) 50-60%
3) 70-80% 4) 80-90% - హైడ్రోజన్‌ను నీటి అధోముఖ స్థానభ్రంశం ద్వారా పొందవచ్చు. ఎందుకంటే?
1) హైడ్రోజన్ గాలికంటే బరువైనది
2) హైడ్రోజన్ గాలికంటే తేలికైనది
3) హైడ్రోజన్ విషవాయువు
4) పైవన్నీ - హైడ్రోజన్‌ను వాయు ఇంధనంగా వాడతారు. ఎందుకు?
1) వాయువు కాబట్టి
2) గాలి కంటే తేలికైనది కాబట్టి
3) అధిక దహనోష్ణం ఉంది కాబట్టి
4) మండుతుంది కాబట్టి - కఠిన జలంలో ఇవి ఉంటాయి?
1) సామాన్య లవణం
2) మెగ్నీషియం, కాల్షియం సల్ఫేట్, క్లోరైడ్
3) కార్బన్‌డైఆక్సైడ్
4) మట్టికణాలు
Answers
1-4, 2-1, 3-2, 4-2, 5-4, 6-3, 7-1, 8-3, 9-1, 10-4, 11-1, 12-3, 13-4, 14-4, 15-3, 16-1, 17-4, 18-3, 19-4, 20-1, 21-3, 22-4, 23-1, 24-2, 25-1, 26-3, 27-2, 28-2, 29-2,30-3, 31-2 32-1 ,33-2, 34-3, 35-2
- Tags
- Education News
Previous article
వికాసం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది?
Next article
విదేశీ విద్య @ GRE
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు