వికాసం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది?
గత టెట్, సీ-టెట్లలో వచ్చిన ప్రశ్నలు
సీ-టెట్
- పెరుగుదల-వికాసంపై అవగాహన ఉపాధ్యాయుడికి ఏ విధమైన శక్తినిస్తుంది?
1) బోధించేటప్పుడు విద్యార్థుల భావోద్వేగాలపై నియంత్రణ ఇస్తుంది
2) భిన్న విద్యార్థులకు బోధించే విధానాన్ని స్పష్టపరుస్తుంది
3) విద్యార్థులు వారి జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో తెలియజేయవచ్చు
4) నిష్పక్షపాతంగా బోధనావృత్తిని నిర్వహించడానికి తోడ్పడుతుంది - పెరుగుదలకు సంబంధించి సరికానిది?
1) వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది
2) పెరుగుదల అంటే ఎత్తు, బరువు, ఆకారంలోని మార్పులు
3) పెరుగుదల పరిమాణాత్మకమైనది
4) పెరుగుదల నిరంతర ప్రక్రియ - కింది వాటిలో చాలక వికాసానికి (Motor Development) ఉదాహరణ కానిది?
1) ఆటసామగ్రిని ఉపాయంగా వినియోగించడం
2) వస్తువులను విసరడం
3) ఒక పాదం మీద స్కిప్పింగ్ చేయడం
4) ఎత్తు పెరగడం - ఒక విద్యార్థి చతురస్రం గీయడంలో ఇబ్బందిని ఉపాధ్యాయుడు గమనించాడు. డైమండ్ గీయడంలో కూడా విద్యార్థి ఇబ్బంది ఎదుర్కొంటాడని ఉపాధ్యాయుడు ఊహిస్తున్నాడు. ఉపాధ్యాయుని ఈ ఊహకు మూలాధారమైన వికాస నియమం?
1) వికాసం క్రమానుగతమైనది
2) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు
3) వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ
4) వికాసంలో వ్యక్తిగత భేదాలుంటాయి - మానవ వికాసం కొన్ని నియమాలను అనుసరిస్తుంది. ఆ వికాస నియమంలో భాగం కానిది?
1) నిరంతరం 2) వరుసక్రమం
3) సాధారణం నుంచి ప్రత్యేకానికి
4) పరివర్తనీయమైనది - కింది వాటిలో వికాస సూత్రం?
1) అందరిలోనూ సమానగతిని అనుసరించదు
2) ఎల్లవేళలా రేఖీయక్రమంలో జరుగుతుంది
3) నిరంతర ప్రక్రియ కాదు
4) వికాస ప్రక్రియల మధ్య అంతర సంబంధం ఉండదు - సీమ ఏ పాఠ్యాంశాన్నయినా త్వరగా అభ్యసిస్తుంది. లీనా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది?
1) వికాసం అవిచ్ఛిన్నమైనది
2) వికాసం సామాన్య అంశాల నుంచి ప్రత్యేక అంశాలకు జరుగుతుంది
3) వైయక్తిక భేదాలు
4) అంతర సంబంధాలు - శిశువు అభివృద్ధిలో ‘సెఫలోకుడ’లో నియమానికి సంబంధించిన సత్యమైన ప్రవచనం?
1) వికాసం తల నుంచి మొదలై శరీర భాగాలకు విస్తరిస్తుంది
2) వికాసం కాళ్ల నుంచి మొదలై పైన శరీర భాగాలకు విస్తరిస్తుంది
3) వికాసం దేహ మధ్యస్థ భాగం నుంచి మొదలై దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది
4) ఏదీకాదు - శిశువు వికాసం నిర్దేశ పోకడలు?
1) తల నుంచి శరీర భాగాలకు, దూర భాగాల నుంచి దేహ మధ్యస్థ భాగానికి
2) తల నుంచి శరీర భాగాలకు, దేహ మధ్యస్థ భాగం నుంచి శరీర దూర భాగాలకు
3) శరీర భాగాల నుంచి తలకు, దూర భాగాల నుంచి దేహ మధ్యస్థ భాగానికి
4) శరీర భాగాల నుంచి తలకు, దేహ మధ్యస్థ భాగం నుంచి శరీర దూర భాగాలకు - ఉపాధ్యాయుడు పిల్లవాడి వికాసాన్ని పెంపొందించడానికి చేయాల్సింది?
1) ఎక్కువ సమాచారాన్ని అందించడం
2) ఎక్కువ పరీక్షలు నిర్వహించడం
3) పిల్లవాడిని తనను అనుసరించమని గట్టిగా చెప్పడం
4) పిల్లవాడి జిజ్ఞాసను తృప్తిపరచడం - కింది వాటిలో అనువంశికతకు సంబంధించిన కారకం?
1) సమవయస్కుల సమూహంపై గల వైఖరి
2) ఆలోచనాతీరు 3) కండ్ల రంగు
4) సమాజ కార్యక్రమాల్లో పాల్గొనడం - కింది వాటిలో సరిగా జతపర్చబడింది?
1) శారీరక వికాసం- పరిసరం
2) సంజ్ఞానాత్మక వికాసం- పరిణతి
3) సాంఘిక వికాసం- పరిసరం
4) ఉద్వేగ వికాసం- పరిణతి - కింది ఏ దశలో పిల్లలు వారి సమవయస్కుల సమూహంలో క్రియాశీలక సభ్యులవుతారు?
1) శైశవదశ 2) బాల్యదశ
3) కౌమారదశ 4) వయోజనదశ - భావనల అభివృద్ధి ప్రాథమికంగా దేనిలో భాగం?
1) ఉద్వేగ వికాసం
2) సంజ్ఞానాత్మక వికాసం
3) శారీరక వికాసం 4) సాంఘిక వికాసం - మానవ వికాసాన్ని ఏ విధంగా విభజించి అధ్యయనం చేయవచ్చు?
1) శారీరక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, సాంఘిక
2) ఉద్వేగ, సంజ్ఞానాత్మక, ఆధ్యాత్మిక,
సామాజిక మనోవైజ్ఞానిక
3) మనోవైజ్ఞానిక, సంజ్ఞానాత్మక, ఉద్వేగ, శారీరక
4) శారీరక, ఆధ్యాత్మిక, సంజ్ఞానాత్మక, సామాజిక - వికాసం ఏ దశ నుంచి ప్రారంభమవుతుంది?
1) శైశవ దశ 2) పూర్వ బాల్యదశ
3) ఉత్తర బాల్యదశ 4) ప్రసవపూర్వ దశ - కౌమార దశకు సరిగా సరిపోయే ప్రవచనం?
1) భావోద్వేగాల్లో తీవ్రమైన ఒడిదొడుకులు ఏర్పడుతాయి
2) చదువుపట్ల నిర్లక్ష్యం వహించడం
3) మూర్త విషయాలపై ఆలోచన పెరుగుతుంది
4) ప్రజ్ఞాలబ్ధిలో అమితంగా పెరుగుదల కనిపిస్తుంది - ఒక 13 సంవత్సరాల పిల్లవాడు తరచుగా తన కంటే పెద్దవారితో వాదిస్తుంటాడు. తాను భావించినది, చేసినది సరైనదని నిరూపించాలనుకుంటాడు. అతడు వికాస పరిణామంలో ఏ దశలో ఉన్నాడు?
1) పూర్వ బాల్యదశ 2) కౌమార దశ
3) వయోజన దశ 4) బాల్యదశ
టెట్ - శిశువు వికాస దశ? (జూలై 2011)
1) అడ్డంగా ఉంటుంది
2) నిలువుగా ఉంటుంది
3) ప్రాగుక్తీకరించలేము
4) శిరఃపాదాభిముఖంగా, సమీప
దూరస్థంగా ఉంటుంది - రెండు చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు? (జనవరి, 2012, పేపర్-1)
1) పరస్పర చర్య
2) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
3) వైయక్తిక భేదాలు
4) వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపు కొనసాగుతుంది - కింది వాటిలో అభివృద్ధి సూత్రం కానిది? (జనవరి, 2012, పేపర్-2)
1) విపర్యయ ప్రక్రియ
2) ప్రాగుక్తీకరించగలిగే ప్రక్రియ
3) గతిశీల ప్రక్రియ 4) నిరంతర ప్రక్రియ - నవజాత శిశువు ‘సాధారణ ఉత్తేజం, ఆర్తి, ఆహ్లాదం’ ప్రతిస్పందనలుగా విడిపోవడం ఏ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చు? (మే, 2012, పేపర్-2)
1) వికాసం ఏకీకృతమైనది
2) వికాసం సాధారణ దిశ నుంచి నిర్దిష్ట దిశగా సాగుతుంది
3) వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది
4) వికాసం కచ్చితమైన దిశగా సాగుతుంది - కింది వాటిలో వికాస సూత్రం కానిది? (మార్చి 2014 పేపర్-2)
1) వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది
2) వికాసం నిరంతర ప్రక్రియ
3) వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు
4) వికాసం సంచితమైనది - వికాసం? (మార్చి 2014, పేపర్-2)
1) శిరఃపాదాభిముఖ దిశను అనుసరిస్తుంది
2) శిరఃసమీప దిశను అనుసరిస్తుంది
3) సమీప పాదాభిముఖ దిశను అనుసరిస్తుంది
4) శిరః దూరస్థ దిశను అనుసరిస్తుంది - చాలావరకు మానవ లక్షణాలు అనేక జన్యువులు కలిసి పనిచేయడం ద్వారా ఏర్పడుతాయి. దీన్ని ఏమంటారు? (జనవరి, 2012, పేపర్-1)
1) క్రోమోజోములు 2) బహుజన్యత్వం
3) అప్రభావక 4) ప్రభావక - పోషకాహార లోపం వల్ల మూడు సంవత్సరాల వయస్సున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం? (మే, 2012, పేపర్-2)
1) పరిసరాలు 2) అనువంశికత
3) జన్యుపరమైనవి
4) అనువంశికత, పరిసరాలు - యవ్వనారంభ దశ? (జూలై 2011, పేపర్-2)
1) లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ
2) బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తుగా పెరుగుదల సంభవించే 1 నుంచి 2 ఏండ్ల కాలం
3) కౌమార దశ మాదిరిది
4) బాలికల్లో కంటే ముందు బాలురలో కలుగుతుంది - పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానం? (జూలై 2011, పేపర్-1)
1) వాసన 2) స్పర్శ
3) వినికిడి 4) చూపు - తులనాత్మకంగా ఉద్వేగాలు ఏ దశలో సులభంగా మార్పు చెందుతాయి? (జనవరి 2012, పేపర్-1)
1) బాల్యదశ 2) శైశవ దశ
3) కౌమారదశ 4) యవ్వనారంభ దశ - ఒక శిశువు ఏడుస్తున్న వేరొక శిశువుకు తన బొమ్మను ఇవ్వడం ద్వారా ఓదార్చింది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దేనిని తెలుపుతుంది?
(జనవరి 2012, పేపర్-1)
1) సాంఘిక వికాసం
2) సాంఘిక, ఉద్వేగ వికాసం
3) ఉద్వేగ వికాసం
4) జ్ఞానాత్మక వికాసం - పిల్లవాని వలే ఉండవలెనా లేదా వయోజనుల వలే ఉండవలెనా అనే సందిగ్ధ స్థితిలో ఉండే శిశు వికాస దశ (జూలై 2011, పేపర్-2)
1) వయోజన దశ 2) ఉత్తర బాల్యదశ
3) కౌమార దశ 4) పూర్వ బాల్యదశ - కింది వాటిలో సూక్ష్మ చలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ? (జనవరి 2012, పేపర్-2)
1) అరచేతితో పట్టుకోవడం
2) కూర్చోవడం
3) పాకడం 4) నడవటం - ఏ అభివృద్ధి దశలో పెరుగుదల, వికాసం వేగంగా ఉండటాన్ని గమనిస్తాం? (జనవరి 2012, పేపర్-2)
1) ఉత్తర బాల్యదశ
2) వయోజన దశ ప్రారంభం
3) శైశవ దశ 4) పూర్వ బాల్యదశ - కౌమారుల సాంఘిక వికాసానికి చెందిన ముఖ్య లక్షణం? (జనవరి 2012, పేపర్-2)
1) అపరాధం 2) అమూర్త ఆలోచన
3) యవ్వనారంభ దశ 4) గుర్తింపు - కౌమారులకు వర్తించదు? (మార్చి 2014)
1) విమర్శకు స్పందిస్తారు
2) స్నేహితుల ద్వారా ప్రభావితులవుతారు
3) వ్యక్తి ఆరాధన భావం
4) స్థిరంగా ఉంటారు - ఉద్వేగ ఒత్తిడి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలు ఏమంటారు? (మార్చి 2014)
1) ఎమోషనల్ కంటాజియన్
2) ఎమోషనల్ కెథార్సిస్
2) ఎమోషనల్ డిస్ప్లే
4) ఎమోషనల్ మాస్క్స్ - శిశువు దేనిలో పరిపక్వతను పొందినప్పుడు కౌమారుడుగా మారినట్లు చెప్పవచ్చు? (2012, పేపర్-2)
1) భౌతిక 2) లైంగిక
3) సాంఘిక 4) మానసిక - ఆంగ్లేతర భాషను మాట్లాడే కుటుంబాల నుంచి వచ్చే పిల్లలకు బోధించేటప్పుడు ఎలా భావించడం సరైనది? (2012, పేపర్-2)
1) బాహుభాష పిల్లలు విద్యాపరంగా వెనుకబడి ఉంటారు
2) కొత్తదానిని అలవాటు చేసుకోడానికిగాను పిల్లలు పూర్వభాషను/సంస్కృతిని వదిలివేస్తారు
3) ఒక భాషలోని నైపుణ్యత రెండో భాషను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లల్లో ద్విభాషను ప్రోత్సహించడం వల్ల భాషానైపుణ్యాలు మెరుగవుతాయి
4) బడిలో పిల్లల భాషకు సంస్కృతికి పునర్బలనం అందించకపోయినా నష్టం లేదు. ఎందుకంటే అవి ఇంటివద్ద పోషించబడతాయి - పిల్లల ఉద్వేగ వికాసాన్ని పెంపొందించడానికి ఏది సరైన పరిసరం? (2012, పేపర్-2)
1) ఉదాసీనమైన 2) ప్రబలమైన
3) అనుకూలమైన 4) అనుమతించే - నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన? (2012, పేపర్-2)
1) స్పర్శ 2) రుచి
3) దృష్టి 4) వాసన
Answers
1-2,2-4, 3-4,4-1, 5-4, 6-1, 7-3,8-1, 9-2,10-4, 11-3,12-3,13-3,14-2,15-1, 16-4,17-1, 18-2,19-4,20-4, 21-1,22-2, 23-1,24-1,25-2, 26-1,27-1, 28-2,29-2,30-2, 31-3,32-1,33-3,34-4, 35-4, 36-2,37-2, 38-3,39-4,40-3,
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
- Education News
Previous article
ఎన్విజన్ను ప్రారంభించనున్న అంతరిక్ష సంస్థ?
Next article
నైట్రోజన్ను గాలి నుంచి తయారు చేసే పద్ధతి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు