నైయాకరణ, వైయాకరణుల వాదాలు
భాషోత్పత్తి వాదాలు
1861లో ‘సహజధ్వనుల ఆధారవాదాలు’ పేర్కొన్నది- ప్రముఖ భాషావేత్త మాక్స్‌ముల్లర్
1866లో ‘భాషోత్పత్తి’ అంశంపై చర్చను నిషేధించింది- పారిస్ భాషాశాస్త్ర సంఘం
ఏకమూల భాషావాదం: ప్రపంచ ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం.
సమాలోచన వాదం: మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని, అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పర్చుకొనడమే భాషకు ప్రారంభ స్థితి అని సమాలోచనవాదుల భావన.
స్ఫోటవాదులు: ‘ఓం’ కారమే భాషకు మూలం అని తెలిపేవాదం.
బ్రహ్మాండం విస్ఫోటనం చెంది ప్రకృతి, దానితోపాటు ‘ఓం’ అనే శబ్దం ఏర్పడినదని ఆ ‘ఓం’ కారమే భాషకు మూలరూపమని ‘స్ఫోటవాదుల’ వాదం.
దైవదత్త వాదం
భగవంతుడే భాషను ప్రసాదించాడని తెలిపేవాదం. దీనిని ట్రాంబెట్టి అనే ఇటలీ భాషావేత్త బలపరిచాడు.
దైవదత్త వాదానికి ఉన్న ఇతర పేర్లు- భగవద్దత్తవాదం, భగవత్ప్రసాద వాదం, అలౌకికవాదం, సాంప్రదాయవాదం
ఒక స్వీడన్ భాషావేత్త దేవుడు ఏర్పర్చిన ఈడెన్ తోటలో ఆడమ్ స్వీడిష్ భాషను, సాటన్ (సర్పం) డేనిష్ భాషను, ఈవ్ ఫ్రెంచ్ భాషను మాట్లాడారని విశ్వసించారు.
హిందువులకు సంస్కృతం, మహ్మదీయులకు అరబిక్, క్రైస్తవులకు హిబ్రూ భాషలు దైవభాషలు అని తెలిపేవాదం.
పాణిని వ్యాకరణ సూత్రాలను ‘మాహేశ్వర సూత్రాలు’ అంటారు.
నటరాజు (శివుడు) ఢమరుక శబ్దం నుంచి ‘14 మాహేశ్వర సూత్రాల’ రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయి.
సరస్వతి దేవి వీణ అయిన ‘కచ్ఛపి’ నుంచి అక్షర శక్తులు ఏర్పడ్డాయని అవే భాషా విస్తృతికి మూలరూపాలు అని కొందరి అభిప్రాయం.
స్వభావ వాదం
ప్రతిపాదించినది- గ్రీకుతాత్వికులు పైథాగరస్, ప్లేటో
భాష ఆవశ్యకతను బట్టి స్వాభావికంగా ఉత్పన్నమైనదని భావించే వాదం
తనకు అవసరమైన దానిని సృష్టించుకోవడం, కల్పించుకోవడం, అన్వేషించడం మానవుడి సహజ సిద్ధ స్వభావం
మానవులు నాగరికతవైపునకు పయనిస్తున్నకొద్దీ అవసరాన్ని బట్టి సహజంగా, అనాయాసంగా భాషను తమకు తాముగా ఏర్పర్చుకొన్నారని తెలిపేవాదం
భావ వినిమయానికి అవసరమైన సాధనాన్ని అన్వేషించే ప్రక్రియలో భాగంగా మానవుడు భాషను ఉత్పన్నం చేసుకున్నాడు.
సంకేతవాదం
ప్రతిపాదించినది- డెమిట్రియస్, అరిస్టాటిల్
భాష సంకేతాల ద్వారా ఏర్పడుతుందని భావించారు
అన్వయవాదం
ప్రతిపాదించినది- డెమోక్రటీస్, అరిస్టాటిల్
అవసరార్థులైన ఆదిమానవులు గుంపులు గుంపులుగా ఒకచోట చేరి ఈ భావానికి ఇలాంటి ధ్వనిరూపమైన సంకేతం ఉండాలని అన్వయాన్ని స్థిరపరచుకున్నారని తెలుపుతుంది.
దీనినే సంప్రదాయవాదం (కన్వెన్షనల్ థియరీ) అని కూడా అంటారు.
భౌభౌ వాదం/ధ్వన్యనుకరణ వాదం
ప్రతిపాదించినది- జర్మన్ తత్వవేత్త జోహన్ గాట్ప్రైడ్
బలపరిచినది- లెబ్నిజ్
భౌభౌ వాదాన్ని అనుకరణవాదం అని దీనిలోని అవ్యాప్తిదోషాలను ఎత్తిచూపినది- మాక్స్‌ముల్లర్
ఆదిమానవుడు తన పరిసరాల్లో ఉన్న సహజధ్వనులను అనుకరించడం ద్వారా భాషను నిర్మించుకున్నాడు అని తెలిపేవాదం
ఆదిమానవుడు జంతువులు, పక్షులు చేసే ధ్వనులను, అరుపులను అనుకరించి తన భాషారూపాన్ని, పదాలను నిర్మించుకున్నాడు. ఉదా: మే మే అనేది మేక. కావ్కావ్ అనేది కాకి
కొన్ని పదాల ఉచ్ఛారణలు సహజధ్వనులకు దగ్గరగా ఉండటం ఈ వాదానికి ఆధారం
వివక్షాప్రేరణ వాదం/ఆశ్చర్యవాదం/పూపూ వాదం/
టట్టట్ వాదం
ప్రతిపాదించినది- కొండికల్
ప్రముఖ భాషావేత్త హెర్పర్ ఈ వాదాన్ని ఖండించాడు.
ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం, భయం, బాధ, విస్మయం మొదలైన ఉద్వేగాలు, మనోభావాలను వ్యక్తం చేయడానికి మానవుడు అప్రయత్నంగా వెలువరించిన ఓహో, ఆహా, ప్చ్…. లాంటి ధ్వనుల నుంచి భాష పుట్టిందని తెలిపేవాదం.
‘ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం’ అని తెలిపేవాదం
ఆహా, ఓహో, ప్చ్… లాంటి ధ్వనులు కొన్ని శారీరక కారణాలవల్ల ఏర్పడతాయని తెలిపినది- చార్లెస్ డార్విన్
లకుముకి పిట్టలు వంటివి ఆహార అన్వేషణలో చెట్లబెరడులను ముక్కుతో పొడిచేటప్పుడు ‘టక్ టక్’ మనే శబ్దం వస్తుంది. ఇటువంటి పక్షులు చేసే శబ్దాలే భాషోత్పత్తికి మూలం అని వాదించేవారు- టట్టట్ వాదులు, పూపూ వాదులు
యో-హీ-హో వాదం
ప్రతిపాదించినది- నోయిర్, నార్వే
బరువైన పనులు చేసేటప్పుడు నాద తంత్రులు బిగిసి ఉచ్ఛాస, నిశ్వాసాలు బరువుగా సాగి నోటి నుంచి, ముక్కు నుంచి కొన్ని ధ్వనులు వెలువడుతాయి. ఈ ధ్వనులే భాషకు మూలం అని తెలిపేవాదం
వ్యక్తులు సమష్టిగా భౌతికశ్రమ చేసేటప్పుడు, శారీరకకృషికి అనుగుణంగా చేసే హా హీ వంటి ధ్వనుల నుంచి భాష పుట్టిందని నోయిర్ అభిప్రాయం
పడవలు నడిపేవాళ్లు చేసే ‘యో హి హో’ ధ్వనిని బట్టి ఈ వాదానికి పేరుపెట్టారు. ఉదా: బట్టలు ఉతికేవారు (స్ స్ స్ శ్శ), పల్లకీ మోసేవారు (ఒహొం, ఒహొం హోం), పడవ నడిపేవారు (హై లెస్సా)
డింగ్‌డాంగ్ వాదం/ప్రకంపనావాదం
ప్రతిపాదించినది జర్మన్ భాషావేత్త మాక్స్‌ముల్లర్
ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుందని తెలిపేవాదం
ఆదిమానవుడు ప్రకృతి నుంచి గ్రహించిన ధ్వనులను కొన్ని అతీంద్రియ సంబంధాల ప్రభావం వల్ల వాగ్రూపంగా మార్చుకున్నాడని, ఆ వాగ్రూపాలే భాషగా ఏర్పడిందని తెలిపేవాదం
ప్రతి శబ్దానికి, అర్థానికి తనదైన ఆంతరంగికమైన సంబంధం ఉంటుందని భావిస్తారు. ప్రతి వస్తువును తాకగానే ఒక ధ్వని ప్రకంపన ఉత్పన్నమై మనిషి మనస్సులో వాగ్రూపంగా స్థిరపడి భాషోత్పత్తి కలిగిందని తెలిపేవాదం. ఉదా: గుసగుస, కటకట, జిగ్‌జాగ్, డింగ్‌డాంగ్ బెల్, గంట గణగణ మని మోగింది, గుండె దడదడ లాడింది.
పాఠశాల గంట కొట్టగానే పాఠశాలను విడిచిపెట్టడం లేదా పాఠశాలలోకి ప్రవేశించడం అని అర్థమవుతుంది.
మౌఖిక-అభినయవాదం/టక్-టక్ వాదం
ప్రతిపాదించినది- సర్ రిచర్డ్ పాజెట్, 1930
శారీరక అభినయానికి-మౌఖిక ధ్వనులకు మధ్య దగ్గర సంబంధం ఉంటుందని తెలిపేవాదం
ఆదిమానవుడు మొదటగా శారీరక హావభావాలు పెంపొందించుకొని వాటికి అనుగుణంగా నాలుక, పెదవులు మొదలైన ముఖ యంత్రంలోని చేతల ద్వారా కదలికలు ఏర్పడి ఎన్నో శబ్దాల ధ్వనులుగా ఏర్పడి భాషగా రూపొందిందని తెలిపేవాదం.
ముఖ కవళికలు, హస్త విక్షేపన విన్యాసాలను అప్రయత్నంగా అనుకరించడానికి యత్నిస్తారని దీని ఫలితంగా భాష ఏర్పడిందని భావించింది- చార్లెస్ డార్విన్
ధాతు వాదం/ధాతుజన్యవాదం
ప్రతిపాదించింది- సంస్కృత భాషావేత్తలు
ధాతువాదాన్ని మొదట ప్రతిపాదించినవారు- యాస్కాచార్యుడు (క్రీ.శ.5వ శతాబ్దం, భారతీయభాషావేత్త)
సమర్థించింది- కాత్యాయనుడు
ధాతువుల నుంచి భాష పుట్టిందని తెలిపేవాదం
క్రియలే భాషకు మూలం అని తెలిపేవాదం
ఉదా: ‘తిను’ అనే ధాతువు నుంచి తినుట, తినుము, తినిపించి, తినిపించెను, తినగలడు, తినడం, తింటాడు, తినలేదు అనే పదాలు వాడుకలోకి వచ్చాయి.
‘చేయు’ అనే క్రియా పదంతో చేయుట, చేయుము, చేసెను, చేయించెను, చేయుచున్నాడు అనే పదాలు పుట్టాయి.
క్రియా పదాల మూల రూపాలను ‘ధాతువు’లని అంటారు. వాటి నుంచి భాష జనించిందనేది ధాతుజన్యవాదం
ప్రతిపదానికి ఒక ధాతువు (క్రియ) ఉంటుందని, మొదట క్రియలు పుట్టి, ఆ తర్వాత మిగిలిన పదాలు ఏర్పడ్డాయని తెలిపేవాదం
ధాతువులు రెండు రకాలు అవి..
1) నామధాతువులు 2) క్రియాధాతువులు
నామధాతువుల వల్ల భాష పుట్టిందన్నవారు- గార్గ్యాదులు
క్రియాధాతువుల వల్ల భాష పుట్టిందన్నవారు- శాకటాయనులు
సెమెటిక్ భాషా కుటుంబంలో మూడక్షరాల ధాతువులు ఉన్నాయి.
ఇండో-యూరోపియన్ భాషా కుటుంబంలో ఏకాక్షర ధాతువులు ఉన్నాయి
ద్రావిడ భాషల్లో మధ్యమ పురుష క్రియలుగా ఉపయోగపడేవి- ధాతువులు
నిరంతరం ధాతువులతోనే వ్యవహారం కొనసాగించేవారు- చైనీయులు
ధాతువులు రసాయనశాస్త్రంలో మూలకాలు వంటివి అన్నది- భాషాశాస్త్రవేత్తలు
నైయాకరణ, వైయాకరణుల వాదాలు
భారతదేశంలో ప్రవర్తకులను నైయాకరణులు, వైయాకరణులుగా గుర్తిస్తారు.
నైయాకరణ (నైయాయిక) పదానికి ఈశ్వర సంకేత రూపమైన శక్తి ఉందని, ఆ శక్తివల్లనే పదానికి అర్థం నిర్ణయిస్తారని భావించారు.
వైయాకరణులు దీనిని అంగీకరించకుండా పదానికి, అర్థానికి గల సంబంధం మానవ సంకేత జనితమే అని భావించారు.
వైయాకరణులు లోకంలోని వ్యవహారాలను బట్టే పదాలకు అర్థాలు ఏర్పడుతాయని భావించారు.
ఈ ఇద్దరి వాదం ప్రకారం ఆది దంపతులైన పార్వతీపరమేశ్వరుల్లా శబ్దాన్ని ఆశ్రయించి అర్థం, అర్థాన్ని ఆశ్రయించి శబ్దం ఉంటాయి. శబ్దార్థాలు శివపార్వతుల ప్రతిరూపాలు.
సహజపరిణామ వాదం/క్రమపరిణామ వికాస వాదం
చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంత ఆధారవాదం.
శాస్త్రీయమైన, హేతుబద్ధమైన వాదం
క్రమపరిణామం, వికాసంవల్ల నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషాభివృద్ధిని సాధించాడు.
మానవుడు జంతుజాలం నుంచి ఆవిర్భవించి సంపూర్ణ మానవుడు ఎలా అయ్యాడో, భాష కూడా ఒక వరుసక్రమంలో సహజ పరిణామం చెంది ఉండవచ్చని తెలిపేవాదం
పరిణామక్రమంలో మానవుడికి మెదడు, స్వరపేటిక, దంతాలు, పెదవులు మొదలైన అవయవాలు ఎంతో పరిణితి చెంది మాటలు వెలువరించడానికి అనువుగా రూపొందాయి. ఈ సహజసిద్ధ క్రమ వికాసమే భాషోత్పత్తికి మూలకారణం.
వివిధ చేష్టలు, సౌంజ్ఞలు, సంకేతాలు, ధ్వనులు భావ ప్రసరణకు ప్రాచీన మానవులు వినియోగించేవారు. ఈ క్రమంలో భాషాధ్వనులు రూపొందినవని చెప్పేవారు సహజ పరిణామవాదులు.
అనుభవ వాదం/సంపాదన వాదం (థియరీ ఆఫ్ అక్విజిషన్)
ప్రతిపాదించింది- బీఎఫ్ స్కిన్నర్
శిశువులు పెద్దలను అనుకరించడం ద్వారా భాషను అభ్యసించడం ఈ వాదానికి ఆధారం.
విజ్ఞానం, భాష అనుభవం ద్వారానే సమకూరుతాయని తెలిపేవాదం.
పుట్టుకతో భాష రాదు. శిశువు పరిసరాల్లో పొందే అనుభవాల నుంచి అనుకరణ ద్వారా భాషను నేర్చుకోవడం (భాషాభివృద్ధి) జరుగుతుందని తెలిపేవాదం.
తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా రూపొందిన వాదం- సంపాదన వాదం లేదా ప్రవృత్తి వాదం
ఈ వాదం ప్రకారం ప్రేరణలు, స్పందనల మూలంగా లభించే ప్రవృత్తులు, అలవాట్లు జ్ఞానంగా మారుతాయని నిరూపించినవాడు- బీఎఫ్ స్కిన్నర్
అనుభవవాద ప్రతిరూపమే మనస్తత్వ శాస్ర్తానికి చెందిన ప్రవృత్తి వాదం (బిహేవియరిజం). ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని సంపాదిస్తామని, ప్రేరణలు, స్పందనల మాలాన ఏర్పడ్డ అలవాట్లే జ్ఞానమని, భాషా సముపార్జనం కూడా ఇటువంటివేనని ఈ వాదం వారి నమ్మకం. ఈ వాదానికి చెందినవారు- బ్లూమ్‌ఫీల్డ్.
స్వతస్సిద్ధ వాదం (ఇన్నేట్ థియరీ)
ఆధునిక వాదం, నవీన సిద్ధాంతం
అనుభవపూర్వక సంపాదనవాదాన్ని ఖండిస్తూ స్వతస్సిద్ధ వాదాన్ని ప్రతిపాదించింది- నోమ్ ఛామ్స్కీ (ఆధునిక భాషావేత్త)
భాషా వికాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు- ఛామ్స్కీ
భాష జన్మతః అలవడుతుందని, అనుభవాలు కేవలం భావ ఉద్దీపనాన్ని కలిగిస్తాయని నోమ్ ఛామ్స్కీ వాదించాడు.
భాష మానవుడి ఒక సహజాతం అని చెప్పేవాదం
ఏ భాషలోనైనా శిశువులు అయిదారేండ్లకే మాట్లాడటం నేర్చుకోవడం ఈ వాదానికి ఆధారం. హేతువాదం ఆధారంగా ప్రతిపాదించిన అత్యంత ఆధునిక వాదం.
భాషోత్పత్తి వాదాల్లో ఈ వాదం గొప్ప విప్లవం.
ఛామ్స్కీ విప్లవాత్మక ప్రతిపాదన- భాషాభ్యసనం ఒక నియమానుసారకృత్యం (లాంగ్వేజ్ ఈజ్ ఏ రూల్ గవర్న్‌డ్ యాక్టివిటీ)
చిన్నపిల్లల మెదడులో సార్వత్రిక భాషా వికాసం ఉంటుందని, శైశవ దశ నుంచే వారు పరిసరాల నుంచి విన్న పదాలు, గ్రహించిన శబ్దాలు ఆ విభాగంలో చేరి, వారికి ఒక వయస్సు వచ్చేటప్పటికి ఎవరు నేర్పకుండా స్వతస్సిద్ధంగానే వారు మాట్లాడుతారని తెలిపే వాదం.
4, 5 సంవత్సరాల్లోపు పిల్లలకు తగిన పరిసరాలు తోడైతే 3, 4 భాషలైనా సులువుగా మాట్లాడతారని ఛామ్స్కీ సాక్ష్యాధారాలతో నిరూపించాడు.
పిల్లలు పెద్దవారైన తరువాత వారి అనుభవాల్లో తేడాల వల్ల స్వతఃసిద్ధంగా అలవడిన భాషా దక్షతల్లో తారతమ్యాలు కలుగుతాయని ఛామ్స్కీ భావించాడు.
మాహేశ్వర సూత్రాలు
అచ్చులు (1-4 సూత్రాలు) హల్లులు (5-14 సూత్రాలు)
1) అ ఇ ఉ 5) హ య వ ర ట్
2) ఋ క్ 6) ల ణ్
3) ఏ ఓ జ్ 7) ఞ మ ఙ ణ న మ్
4) ఐ ఔ చ్ 8) ఝ భ
9) ఘ ఢ ధ ష్
10) జ బ గ డ ద శ్
11) ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్
12) క ప య్
13) శ ష స ర్
14) హ ల్
లోక్‌నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు