మార్కులు ముఖ్యమా? కాదా?
మార్కులే అంతా కాదు. చదువుతో వచ్చే జ్ఞానం ముఖ్యం అన్న వారి మాటల్లో తప్పులేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం రాయడం వల్ల వచ్చిన మార్కులకు అంత ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని అనే వారున్నారు. ఆ మార్కుల వల్ల ఇంజినీరింగ్ మెడికల్ కాలేజీ సీట్ వస్తుందా? వాటికి రాయాల్సిన పరీక్షల్లో మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది కదా అన్నది ఇంకో వాదన.
కాల చక్రం వెనక్కి తిరిగి రానట్టే, పరీక్షలో వచ్చిన మార్కులు భవిష్యత్తులో పెరగాలి అనుకున్నా పెరగవు. కాబట్టి అవకాశమున్నప్పుడే సాధించాలి. 99% శాతం మార్కులు తెచ్చుకోగలిగిన వారు 75% దగ్గర ఆగడం తప్పు. అలాగే 75% శాతం తెచ్చుకోగలిగిన వారిని, వారు చేసే ప్రయత్నాలను ప్రోత్సహించకుండా వారిని అభినందించకుండా 99% శాతం తెచ్చుకోమని ఒత్తిడి చేసి, బట్టీ విధానంలో మార్కులు తెప్పించే ప్రయత్నం సరికాదు. కొంతమంది విద్యార్థులు డిస్క్రిప్టివ్ పరీక్షల్లో రాణించగలరు. అలాగే కొందరు ఆబ్జెక్టివ్‌లో మాత్రమే రాణించగలరు. కానీ విద్యార్థి జీవితంలో రెండు రకాల పరీక్షలు తప్పక రాయాలి.
మార్కులు ఎలా ఉపయోగపడతాయి?
భవిష్యత్తులో వీటి అవసరం ఉంటుందా? అని ప్రశ్నిస్తే కచ్చితంగా ఉండదని మాత్రం చెప్పలేం. మీరు గ్రహించాల్సింది ఏంటంటే మార్కులు కేవలం మీ తెలివిని అంచనా వేయడానికి ఉపయోగపడతాయని అనుకోవద్దు. ఎందుకంటే మార్కులను బట్టి మెరుగుదల, స్థిరత్వాన్ని అంచనా వేయవచ్చు.
ఉద్యోగావకాశాలు
‘గ్రాడ్యుయేషన్ తర్వాత మీ మొదటి ఉద్యోగానికి జరిగే ఇంటర్వ్యూలో మీ గురించి తెలియజేయడానికి మార్కులు మీకో అస్త్రంలా పనిచేస్తాయి. అలాగే మీరు చేసిన ఇంటర్న్షిప్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ దానికి ఉపయోగపడతాయి. ఇంత శాతం ఉత్తీర్ణత గల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అని కంపెనీలు ఒక ప్రమాణం పెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో రిక్రూటర్లు ఈ విషయాన్ని బహిర్గతం చేయకపోయినా అంతర్గత ఫిల్టరింగ్ ప్రమాణాలు పెట్టుకోవచ్చు.
విద్యావకాశాలు
‘ఐఐఎం ప్రవేశాల కోసం, క్యాట్ రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూలో అకడమిక్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. అది ఎంతవరకు అన్నది కాలేజీలమీద ఆధారపడి ఉంటుంది.
‘ఐఐఎం రోహతక్ (ఐపీఎం)లో ప్రవేశానికి 40 % గడిచిన అకడమిక్ స్కోర్‌ని బట్టి ఉంటుందని 2021 నోటిఫికేషన్లో ఇచ్చారు. ఐఐఎం రాంచీ, బోధ్‌గయ, జమ్ము కూడా అకడమిక్ మార్కులు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు.
అర్హత: ప్రవేశ పరీక్షలు రాయడానికి కూడా ఇంటర్లో కనీస ఉత్తీర్ణత కలిగి ఉండాలని కూడా రూల్స్ ఉంటాయి. అది కొన్నిట్లో 45% ఉండవచ్చు. మరికొన్నిట్లో 80% కూడా ఉండవచ్చు. జేఈఈ పరీక్ష రాసి కౌన్సెలింగ్‌లో సీట్లు పొందడానికి, ఇంటర్లో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలని కండిషన్ పెట్టారు. ఈ సంవత్సరం కరోనా వల్ల దీనికి సడలింపు ఇచ్చారు. కానీ భవిష్యత్తులో మళ్లీ ఆ రూల్ పెట్టవచ్చు.
‘గత సంవత్సరం తెలంగాణ స్టేట్ ఎంసెట్ పరీక్షలో 25 % వెయిటేజీ ఇంటర్ మార్కులకు ఇచ్చారు. 2021లో బహుశా ప్రస్తుత పరిస్థితుల వల్ల దీనికి మినహాయింపు ఇచ్చారు.
స్కాలర్షిప్
‘స్కాలర్షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (SHE)’ పథకం స్కాలర్షిప్, మెంటార్షిప్లను అందించడం ద్వారా సైన్స్ ప్రోగ్రామ్‌లలో ఉన్నత విద్యను చేపట్టడానికి ప్రతిభావంతులైన యువతని ప్రోత్సహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం 17 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతిభావంతులైన యువతకు సహజ శాస్ర్తాల్లో బ్యాచిలర్, మాస్టర్స్ విద్యను చేపట్టడానికి సంవత్సరానికి 10,000 స్కాలర్షిప్లను అందిస్తుంది. దీనికి అర్హత పొందడానికి గల అవకాశాల్లో ఒకటి 12వ తరగతి (స్టేట్ లేదా సెంట్రల్ బోర్డు)లో, మొదటి 1% మార్కులు సాధించి నేచురల్, బేసిక్ సైన్స్ చదివే విద్యార్థులకు ఉంది.
‘https://scholarships.gov.in/, https://www.buddy4study.com/scholarships వెబ్సైట్లో స్కాలర్‌షిప్‌ల గురించి సమాచారం ఉంది.
‘ఇంటర్ మార్కులను బట్టి కొన్ని కాలేజీలు ఫీజును కూడా తగ్గిస్తున్నాయి. ఉదాహరణకి శివ్ నాడార్ యూనివర్సిటీ నోయిడా.
ఇంటర్లో వచ్చిన మార్కులను బట్టి అడ్మిషన్ దొరికే కొన్ని కళాశాల గురించి చూద్దాం.
కాలేజీలు
ఇంటర్ మార్కుల ద్వారా ప్రధానంగా సీట్ పొందే కోర్సులు. 3 సంవత్సరాల బాచిలర్స్ ప్రోగ్రాము ల్లో ఎక్కువగా ఉన్నాయి. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేంవర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) 2020 వివిధ విభాగాల్లో ఉత్తమ కళాశాలలను గుర్తించింది. https://www.nirfindia.org/2020/CollegeRanking.html. ఈ ర్యాంకింగ్ ప్రకారం 2020 లో టాప్ కాలేజీలు చూద్దాం.
‘మిరండా హౌస్ ఢిల్లీ యూనివర్సిటీ (ర్యాంక్-1): బీఏ, బీఏ ఆనర్స్, బీస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బోటనీ అండ్ జువాలజీ, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, లైఫ్ సైన్స్ వంటి వివిధ కోర్సులు ఉన్నాయి.
https://www.mirandahouse.ac.in/
‘లేడీ శ్రీరామ్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ (ర్యాంక్-2): వాణిజ్యం, ఎకనామిక్స్, ఇంగ్లిష్, హిందీ, చరిత్ర, జర్నలిజం, గణితం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, సైకాలజీ, సంస్కృతం, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌లో ఆనర్స్ కోర్సుల కోసం విద్యార్థులు ఆసక్తి చూపుతారు. ఇతర బీఏ కోర్సులు కూడా ఉన్నాయి. ttps://lsr.edu.in/admissions/courses-offered/
‘హిందూ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ (ర్యాంక్-3) http://www.hinducollege.ac.in/acd-departments.aspx#
బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, బీకాం ఆనర్స్ కోర్సులు ఉన్నాయి.
‘సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీ (ర్యాంక్-4) https://www.ststephens.edu/లో బీఏ ఆనర్స్, బీఎస్సీ ఆనర్స్, బీఏ కోర్సులు ఉన్నాయి. మెరిట్‌తో పాటు అడిషనల్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది.
‘ఢిల్లీ యూనివర్సిటీ లో హన్స్‌రాజ్, శ్రీరామ్, ఆత్మారాం సనాతన ధర్మ, కిరోరి మాల్, శ్రీ వెంకటేశ్వర, దీన్ దయాళ్ ఇతర ప్రఖ్యాత కళాశాలలు. యూనివర్సిటీ అడ్మిషన్ ప్రక్రియతో వీటిలో అడ్మిషన్లు ఉంటాయి. ఢిల్లీ యూనివర్సిటీలో కొన్ని అడ్మిషన్లు ఇంటర్మీడియట్ మెరిట్ బేస్డ్ కొన్ని ప్రవేశ పరీక్ష ద్వారా జరుగుతాయి.
టాప్ కాలేజీల్లో విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపించే ఎకనామిక్స్, కామర్స్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్ వంటి కోర్సుల్లో మొదటి కటాఫ్ 100% నుంచి 98% వరకు ఉంటుంది. ఫస్ట్ కటాఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ http://oldweb.du.ac.in/uploads/COVID-19/pdf/adm2020/10-10-2020-1st%20Cut-Off%20-%20Arts%20&%20Commerc
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు