‘లా’తో లాభాలెన్నో
సాధారణంగా న్యాయవాది అంటే మనకు గుర్తుకు వచ్చేది నల్లకోటు, కోర్టు మెట్లు, యువరానర్ అనే మాట. కానీ లా అంటే కోర్టుకు వెళ్లి వాదించడమేనా? కాదు ఇది న్యాయవాది వృత్తిలో ఒక కోణం మాత్రమే. లా కెరీర్ చేయాలనుకునేవారికి వివిధ రకాల అవకాశాలు ఉన్నాయి. లా ని కెరీర్‌గా ఎంచుకునేవారి కోసం ఈ వ్యాసం..
లాని ముఖ్యంగా కింది విభాగాలుగా విభజించుకోవచ్చు.
1) లిటిగేషన్ 2) కార్పొరేట్ లాయర్
3) జ్యుడీషియరీ 4) అకడమిక్
5) ఇతర అవకాశాలు
లిటిగేషన్ అంటే మనుషులు లేదా కొన్ని గ్రూపుల మధ్య ఉన్న విభేదాలకు కోర్టు ముందు పరిష్కారం చూపే ప్రయత్నం. ఆ సమస్యకు పరిష్కారం అనేది కోర్టులో లేదా కోర్టు బయట చర్చలతో కూడా దొరకవచ్చు. విబేధాలనేవి ఒక చట్టబద్ధమైన హక్కుకు సంబంధించి ఉంటే దానిని కోర్టు ముందుకు తీసుకెళ్లవచ్చు. ఇటువంటి సమస్యలు సాధారణ మనుషుల మధ్య, పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారంగా లేదా పేటెంట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇలా దేనికైనా సంబంధించి ఉండవచ్చు.
కార్పొరేట్ లాయర్
వీరు ఎన్నో బిజినెస్ డీల్స్‌లో ప్రముఖ పాత్ర వహిస్తారు. కంపెనీ పెట్టాలనుకున్నా, ఇంకో కంపెనీని కొనాలన్నా, రెండు కంపెనీలను కలపాలనుకున్నా ఆ చర్చల నుంచి అగ్రిమెంట్లు పూర్తయ్యేవరకు వీరి పాత్ర ఎక్కువ. భవిష్యత్తులో తన క్లయింట్‌కి ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడం వీరి బాధ్యత. కంపెనీలకు వారి చట్టబద్ధమైన హక్కుల గురించి తెలియజేయడం, వారు చేసే బిజినెస్ డీల్స్ చట్టపరంగా ఉండేలా చూసుకోవాల్సింది వీరే.
జ్యుడీషియల్ లేదా ఇతర సర్వీసెస్
దేశంలో ఉత్తమమైన లీగల్ బ్రెయిన్స్ జ్యుడీషియరీలో ఉండాలని ఆశిస్తూ ప్రస్తుత ప్రభుత్వం, ఆల్ ఇండియా జ్యుడీషియల్ సర్వీస్‌ని యూపీఎస్సీ వలె రూపుదిద్దడానికి ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్ష లేదా ప్రొవిన్షియల్ సివిల్ సర్వీస్ జ్యుడీషియల్ పరీక్ష నిర్వహిస్తున్నాయి. సర్వీస్ లెవల్ని బట్టి లా డిగ్రీ, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మేజిస్ట్రేట్, జడ్జి వంటి పదవిని సాధించడానికి ఇది అవసరం. సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవచ్చు.
అకడమిక్
లా పట్టా పొందిన తర్వాత విద్యాబోధన పట్ల మక్కువ ఉన్నవారు లీగల్ ఫ్యాకల్టీగా లా కాలేజీల్లో చేరవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ, ఎల్‌ఎల్‌ఎంకి ప్రిపేర్ కావచ్చు. లా డిగ్రీ పొందిన తరువాత కొందరు ఎంబీఏకి కూడా ప్రిపేరవుతారు.
ఇతర ఆప్షన్స్
పత్రికా రంగం పట్ల ఆసక్తి ఉన్న వారు లీగల్ కరస్పాండెంట్ అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. ఎన్జీఓలతో లీగల్ ప్రాసెస్ ఔట్ సోర్సింగ్‌లో పనిచేయవచ్చు.
లా ఎంట్రన్స్ ఎగ్జామ్స్
పదో తరగతి పూర్తిచేసుకుని 12వ తరగతి/ ఇంటర్ పరీక్షల తర్వాత ఈ పరీక్షలు రాయడానికి అర్హులు.
కామన్ లా ఎంట్రన్స్ టెస్ట్ (క్లాట్)
దేశంలోని 22 నేషనల్ లా యూనివర్సిటీలకి ఇది ప్రవేశ పరీక్ష . ఈ పరీక్ష 150 మార్కులకు 2 గంటల సమయంలో నిర్వహిస్తారు. 1/4 నెగెటివ్ మార్కింగ్ ఉంది.
ఇందులో 5 సెక్షన్లు ఉన్నాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ (28-32 ప్రశ్నలు ), కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ (35-39 ప్రశ్నలు), లీగల్ రీజనింగ్ (35-39 ప్రశ్నలు), లాజికల్ రీజనింగ్ (28-32 ప్రశ్నలు), క్వాంటిటేటివ్ టెక్నిక్స్ (13-17 ప్రశ్నలు)ల నుంచి ప్రశ్నలు వస్తాయి. 2020లో పరీక్ష ప్యాట్రన్ మారింది, 2021 లో అదే ప్యాట్రన్ ఉంది. అన్ని సెక్షన్లు ప్యాసేజ్ రూపంలో ఉంటాయి. 300 నుంచి 450 పదాల వరకు ఈ ప్యాసేజ్లో ఉంటాయి.
ఎన్ఎల్యూలో సీటు రావాలంటే 150కి సుమారు 115+ మార్కులు తెచ్చుకోగలగాలి. కటాఫ్ అనేది పేపర్ ఎంత కష్టంగా ఉన్నదనేదానిని బట్టి ఆధారపడి ఉంటుంది.
ఏఐఎల్ఈటీ: ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్, ఎన్ఎల్యూ ఢిల్లీలో సీటు రావాలంటే ఈ పరీక్ష రాయాలి. ఈ పరీక్షను 150 మార్కులకు గంటన్నర సమయంలో నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, లీగల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సెక్షన్లు ఉంటాయి. క్లాట్ లాగా అన్నీ ప్యాసేజ్‌లు కాకుండా స్టేట్మెంట్ బేస్డ్ లేదా పేరాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2020 ప్రకారం దేశంలో టాప్ 20 లా కాలేజీలు ఎన్ఎల్యూలు కాకుండా ఇతర ప్రఖ్యాత యూనివర్సిటీ లు.. సింబయాసిస్ యూనివర్సిటీ, పుణే (8), జామియా మిలియా యూనివర్సిటీ, ఢిల్లీ (9), కళింగ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, భువనేశ్వర్ (12), అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, యూపీ (13), పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ (15), ఇండోర్ లా ఇన్స్టిట్యూట్ (18), బెనారస్ హిందూ యూనివర్సిటీ (19), క్రైస్ట్ యూనివర్సిటీ, బెంగుళూరు (20) ఇవే కాకుండా జిందాల్ లా స్కూల్, ఎన్ఎంఐఎంఎస్ కిరీట్ మెహతా లా స్కూల్ లాంటి ప్రఖ్యాత కళాశాలలు ఉన్నాయి.ఇంటర్లో ఏ స్ట్రీమ్‌లో చదివినవారికి కావాల్సిన ఉత్తీర్ణత శాతం ఉంటే ఈ పరీక్ష రాయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలిజిబిలిటీ చూసుకోవలసిన అవసరం రావచ్చు. కొన్ని బీబీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ కోర్సుల్లో అకౌంటింగ్, ఆడిటింగ్ లేదా బిజినెస్ స్టాటిస్టిక్స్ వంటివి ఉండటంవల్ల ఇంటర్లో ఎకనామిక్స్, కామర్స్ అలాగే , మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ఉంటే చాలా మంచిది.
క్లాట్‌కు ప్రిపేరవడం ఎలా?
క్లాట్ పరీక్ష (https://consortiumofnlus. ac. in/)లో రీడింగ్ అండ్ రీజనింగ్ స్కిల్స్, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్ ఎబిలిటీ ని పరీక్షిస్తారు.
1) పుస్తక పఠనం: క్లాట్‌లో ఉన్న అన్ని సెక్షన్లపై రీడింగ్ స్కిల్ ప్రభావం ఎక్కువగా ఉంది. సుమారు 450 పదాల ఒక వ్యాసం చదవాలంటే కనీసం 2-5 నిమిషాల సమయం పట్టవచ్చు. ఆ తరువాత ఆ వ్యాసానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించాలి. కాబట్టి ఎంత త్వరగా చదివి అర్థం చేసుకోగలమో అన్ని ఎక్కువ ప్రశ్నలు చేయగలం. ఇంగ్లిష్ పుస్తకాలు, న్యూస్ మ్యాగజీన్స్ లాంటివి చదివి, అవి రాసిన విధానంపై ఉపయోగించే పదజాలంపై పట్టు సాధించాలి. వినడం, చదవడం, మాట్లాడటం, రాయడం అన్నీ అవసరం. మీరు నేర్చుకున్న పదాలు, సెంటెన్స్ స్ట్రక్చర్‌ని అవకాశం ఉన్నప్పుడు ఉపయోగించండి.
2) పత్రికా పఠనం: జీకేలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే రోజు వార్తలు చదవాలి. జాతీయ, అంతర్జాతీయ వార్తలపై అవగాహన కలిగి ఉండాలి. కరెంట్ అఫైర్స్, అలాగే ఆ విషయాలకు సంబంధించిన ఇతర విషయాలు చదవాలి. ప్యాసేజ్ బేస్డ్ జీకే సెక్షన్లో ఒక విషయానికి సంబంధించిన వివిధ రకాల అంశాల నుంచి ప్రశ్నించవచ్చు. ముఖ్యమైన విషయాలపై ఎక్కువ సమాచారం సేకరించాలి.
3) కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టీస్: రీడింగ్ వల్ల ప్యాసేజ్ చదవగలరు. కానీ గ్రామర్, ఆంగ్ల పదాలు నేర్చుకోవాలి. గ్రామర్ రూల్స్‌ని బట్టి ఎర్రర్ కరెక్షన్స్ వంటి ప్రశ్నలు చేయగలగాలి. లీగల్ సెక్షన్‌కి రాజ్యాంగం, లీగల్ జీకేకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవాలి. టార్ట్స్, కాంట్రాక్ట్స్ వంటి వాటికి సంబంధించిన ప్రిన్సిపుల్స్‌పై ప్రశ్నలు వస్తే అర్థం చేసుకోగలగాలి. అనలిటికల్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు ఎలా పరిష్కరించాలో నేర్చుకోవాలి. క్రిటికల్ థింకింగ్ అలవర్చుకోవడానికి పజిల్ సాల్వింగ్, ఏదైనా విషయాన్ని గురించి చదివినప్పుడు ఆ విషయం వెనుక ఉన్న అంతరార్థం గురించి ఆలోచించాలి. ప్రశ్నలు అడిగే విధానం, ప్యాసేజ్లో ఉండే లాజికల్ లింక్స్‌ని అర్థం చేసుకోగలగాలి. సరైన స్ట్రాటజీతో ప్రశ్నలు పరిష్కరించాలి.
4) మాక్ ఎగ్జామ్స్: ఫైనల్ పరీక్ష కన్నా ముందు మీరు మాక్ ఎగ్జామ్స్ రాసి, మీ మార్కులు అనాలసిస్ చేసుకోవాలి. తప్పు ఎందుకు పోయిందని ఆలోచించాలి, ఆ తప్పు చేయకుండా చూసుకోవాలి. మాక్ ఎగ్జామ్స్‌లో మీకు వచ్చిన మార్కులను బట్టి మీరు తగిన కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నించవచ్చు.
శిరీషా రెడ్డి
డైరెక్టర్, అకడమిక్స్
జ్ఞాన్విల్లే అకాడమీ , 76759 62248
ఐఐటీజేఈఈ/క్లాట్/ఐఐఎం-ఐపీఎం
www.gyanville.in
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు