‘పరిమాణాత్మక మార్పులు’ అంటే?
- ఎవరి దృక్పథాల్లో వారే సక్రమం అనే వాక్యం కింది వాటిలో దేనిని సూచిస్తుంది?
1) పెరుగుదల 2) వికాసం
3) పరిపక్వత 4) అభ్యసనం - కింది వాటిలో ‘పరిమాణాత్మక మార్పులు’ అంటే?
1) వ్యక్తి మానసిక అంశాల్లో వచ్చే మార్పు
2) వ్యక్తి సాంఘిక అంశాల్లో వచ్చే మార్పు
3) వ్యక్తి ఉద్వేగ అంశాల్లో వచ్చే మార్పు
4) వ్యక్తి శారీరక అవయవాల్లో వచ్చే మార్పు - వికాసం అనేది కింది వాటిలో దేనిని సూచిస్తుంది?
1) శారీరక, మానసిక మార్పులను మాత్రమే
2) మానసిక, ఉద్వేగ మార్పులను మాత్రమే
3) ఉద్వేగ, సాంఘిక మార్పులను మాత్రమే
4) శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులన్నింటినీ - సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా శిశువు పరిపూర్ణ వికాసానికి కింది వాటిలో ఏవి అవసరం?
1) పెరుగుదల, పరిపక్వత
2) పరిపక్వత, అభ్యసనం
3) అభ్యసనం, ప్రేరణ
4) ప్రేరణ, ఉత్సుకత - కింది వాటిలో గణాత్మక మార్పులను మాత్రమే సూచించేది?
ఎ. పెరుగుదల బి. వికాసం
సి. పరిపక్వత డి. అభ్యసనం
1) ఎ 2) ఎ, బి 3) బి, సి 4) ఎ, బి, డి - కింది వాటిలో పెరుగుదల లక్షణం కాని దానిని గుర్తించండి?
1) ఇది సంకుచిత భావన
2) ఇది పరిమాణాత్మకమైనది
3) ఇది బహిర్గతంగా గుర్తించదగినది
4) వికాసంలో పెరుగుదల ఒక భాగం మాత్రమే - కింది వాటిలో వికాసం లక్షణం కాని దానిని గుర్తించండి?
1) వికాసం గుణాత్మకమైనది
2) పెరుగుదల వికాసంలో ఒక భాగం
3) వికాసాన్ని కచ్చితంగా కొలవలేం కానీ అంచనా వేయవచ్చు
4) పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది - కింది వాటిలో పరిపక్వత/పరిణతి లక్షణం కానిదాన్ని గుర్తించండి?
1) ఇది జీవి పెరుగుదల, వికాసాలకు ప్రాథమిక కారణం
2) ఇది స్వీయ ప్రక్రియే కానీ
ఆర్జిత ప్రక్రియ కాదు
3) ఇది అనువంశికత, పరిసరాలతో ప్రభావితమవుతుంది
4) ఇది అభ్యసనం ప్రమేయం లేకుండా జరిగే ప్రక్రియ - పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయుతంగా పనిచేస్తుందని అన్నవారు?
1) గస్సెల్ 2) ఎలిజబెత్ హర్లాక్
3) గాల్టన్ 4) క్రైగ్ - కింది వాటిలో వికాసాన్ని గురించి సరైన ప్రవచనం కానిది?
1) ఇది ఒక సంచిత ప్రక్రియ
2) దీనిలో వైయక్తిక భేదాలుంటాయి
3) అన్ని దశల్లో ఒకేవిధంగా ఉంటుంది
4) క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది - కింది వాటిలో శిశువు జన్మించిన తర్వాత ఆ శిశువులో క్రమంగా విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవడం అనే అంశాలను సూచించేది?
1) పెరుగుదల 2) వికాసం
3) పరిపక్వత 4) సాంశీకరణం - కింది వాటిలో పరిపక్వతను సూచించిన ప్రవచనాన్ని గుర్తించండి?
1) శిశువుకు 3 నెలల వయస్సులో దృష్టి, వినికిడి, జ్ఞానం అభివృద్ధి చెందడం
2) ఒక సంవత్సరం వయస్సులో శిశువు నడవగలగడం
3) 2 సంవత్సరాల వయస్సులో తప్పు, ఒప్పుల భావన తెలుసుకోవడం
4) శిశువులో హార్మోన్ల ఫలితంగా కలిగే మార్పులు - సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా వికాసానికి సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి?
1) 5 అడుగుల ఎత్తు కలిగి ఉండటం
2) 6 నెలకు మొదటి దంతం ఏర్పడటం
3) 15 నెలలకు శిశువుకు స్వయంగా నడవగలడం
4) హిందీలో అద్భుతంగా మాట్లాడటం - కింది వాటిలో పెరుగుదలకు సంబంధించి సరైనది?
1) నిరంతరం 2) గుణాత్మకం
3) విస్తృతం 4) బహిర్గతం - వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత, పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందనే ప్రవచనాన్ని తెలిపేది?
1) పెరుగుదల 2) పరిపక్వత
3) వికాసం 4) అభ్యసనం - వికాసం అనేది వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత, పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుందని అని అన్నవారు?
1) అండర్సన్ 2) క్రైగ్
3) గెస్సెల్ 4) ఎలిజబెత్ హర్లాక్ - కింది వాటిలో పెరుగుదల, వికాసానికి సంబంధించి సరికాని ప్రవచనం?
1) వికాసం గుణాత్మకం, పెరుగుదల గణాత్మకం
2) వికాసం సమగ్రం, పెరుగుదల సంకుచితం
3) పెరుగుదల నిరంతరం, వికాసం కౌమార దశ వరకు కొనసాగి తర్వాత ఆగిపోతుంది
4) వికాసం అంతర్గతం, పెరుగుదల బహిర్గతం - కింది వాటిలో క్రమబద్ధమైన, పొందికైన, పురోగమన మార్పులుగా నిర్వచించబడినది?
1) పెరుగుదల 2) పరిపక్వత
3) అభ్యసనం 4) వికాసం - ఒక వ్యక్తిలో ప్రజ్ఞ, సామర్థ్యాలు, సృజనాత్మకత, మూర్తిమత్వం, శీలనిర్మాణం, విధుల్లో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాలు వంటి అంశాలు కింది వాటిలో దేనిని సూచిస్తాయి?
1) గణాత్మక మార్పు 2) గుణాత్మక మార్పు
3) పరిమాణాత్మక మార్పు
4) ప్రవర్తనలో మార్పు - ఒక వ్యక్తిలో మెదడు పెరగడం వల్ల వ్యక్తి నేర్చుకునే సామర్థ్యాన్ని, వివేచనా సామర్థ్యాన్ని పొందుతాడు అనే వాక్యం కింది వాటిలో దేనిని సూచిస్తుంది?
1) పెరుగుదల 2) పరిపక్వత
3) వికాసం 4) అభ్యసనం
ANS
1-3, 2-4, 3-4, 4-2, 5-1, 6-4, 7-2, 8-3, 9-1, 10-3, 11-2, 12-3, 13-4, 14-4, 15-3, 16-2, 17-3, 18-4, 19-2, 20-3
శివపల్లి
టీఎస్& ఏపీ సైకాలజీ ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీ సర్కిల్
- Tags
Previous article
పాలఘాట్ కనుమ ఏయే రాష్ర్టాలను కలుపుతుంది?
Next article
ప్రథమ భాషగా తెలుగు బోధనోద్దేశాలు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు