పాలఘాట్ కనుమ ఏయే రాష్ర్టాలను కలుపుతుంది?
- భూపరివేష్టిత రాష్ట్రం?
1) గుజరాత్ 2) ఒడిశా
3) జార్ఖండ్ 4) పశ్చిమబెంగాల్ - కింది వాటిలో కర్కటరేఖకు అతి దగ్గరగా ఉన్న పట్టణం?
1) ఢిల్లీ 2) కోల్‌కతా
3) జోధ్‌పూర్ 4) నాగపూర్ - బంగ్లాదేశ్- ఇండియా సరిహద్దు తీరరేఖ పొడవు?
1) 4096 కి.మీ 2) 5032 కి.మీ
3) 3346 కి.మీ 4) 2894 కి.మీ - అత్యంత పొడవైన తీరప్రాంతం గల రాష్ట్రం?
1) గుజరాత్ 2) తమిళనాడు
3) ఆంధ్రప్రదేశ్ 4) కేరళ - హిందూ మహాసముద్రంలో భారత్-శ్రీలంకను వేరుచేస్తున్న భూస్వరూపాల వరుస క్రమాన్ని ఉత్తరం నుంచి దక్షిణానికి గుర్తించండి?
1) పాక్జలసంధి, పాక్ అఖాతం,
ఆడమ్స్బ్రిడ్జ్, మన్నార్ సింధుశాఖ
2) పాక్జలసంధి, పాక్ అఖాతం,
మన్నార్ సింధుశాఖ, ఆడమ్స్బ్రిడ్జ్
3) పాక్ అఖాతం, పాక్జలసంధి,
ఆడమ్స్బ్రిడ్జ్, మన్నార్ సింధుశాఖ
4) పాక్ అఖాతం, పాక్జలసంధి,
మన్నార్ సింధుశాఖ, ఆడమ్స్బ్రిడ్జ్ - బంగ్లాదేశ్‌తో అతి తక్కువ సరిహద్దు గల రాష్ట్రం?
1) మేఘాలయ 2) మిజోరం
3) అసోం 4) త్రిపుర - కింది వాటిలో సరికాని జత?
1) డ్యురాండ్రేఖ: పాక్- ఆఫ్ఘనిస్థాన్
2) డ్యురాండ్ రేఖ: భారత్-పాకిస్థాన్
3) రాడ్ క్లిఫ్ రేఖ: పాక్-ఇండియా
4) మెక్‌మోహన్ రేఖ: ఇండియా-బంగ్లాదేశ్ - 10oల ఛానల్ ఏయే దీవుల నుంచి పోతుంది?
1) లిటిల్ అండమాన్- కార్నికోబార్ దీవులు
2) కార్నికోబార్- ఉత్తర అండమాన్ దీవులు
3) గ్రేట్‌నికోబార్- ఉత్తర అండమాన్ దీవులు
4) నికోబార్- కార్నికోబార్ దీవులు - భారత ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా ఏ శిలలతో ఏర్పడి ఉంది?
1) ట్రియాసిక్ రాక్స్
2) జురాసిక్ రాక్స్
3) కేంబ్రియాన్ రాక్స్
4) ప్రి- కాండ్రియాన్ రాక్స్ - నందాదేవి శిఖరం ఏ పర్వతాల్లో భాగం?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమయూన్ హిమాలయాలు
3) అసోం హిమాలయాలు
4) నేపాల్ హిమాలయాలు - పామీర్ పీఠభూమి ఎక్కడ ఉంది?
1) హిమాద్రి 2) ట్రాన్స్ హిమాలయాలు
3) శివాలిక్ 4) హిమాచల్ - భారత నైసర్గిక విభాగాల్లో అతి తక్కువ వయసు గల నైసర్గిక భాగం?
1) ద్వీపకల్ప పీఠభూమి 2) హిమాలయాలు
3) బృహత్ మైదానం 4) తీర మైదానాలు - కింది వాటిలో సరికానిది?
1) టెరాయ్- బృహత్ మైదానంలో
చిత్తడి నేలలు
2) బంగర్- కొత్త ఒండ్రు మట్టి నేలలు
3) బాబర్- శివాలిక్ శ్రేణుల పాదాల వెంట ఉన్న గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర ప్రాంతం
4) ఖాదర్- కొత్త ఒండ్రు మట్టి నేలలు - పాలఘాట్ కనుమ ఏయే రాష్ర్టాలను కలుపుతుంది?
1) తమిళనాడు- కేరళ
2) తమిళనాడు- కర్ణాటక
3) కర్ణాటక-గోవా
4) గోవా- మహారాష్ట్ర - ‘దోబ్’ అంటే ఎమిటి?
1) రెండు పర్వతాల మధ్య ఉన్న లోయ ప్రాంతం
2) రెండు పీఠభూముల మధ్య ఉన్న లోయ ప్రాంతం
3) రెండు నదుల మధ్య ఉన్న ప్రాంతం
4) పైవన్నీ - ‘ డాప్ల కొండలు’ ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
1) హిమాచల్‌ప్రదేశ్ 2) సిక్కిం
3) మేఘాలయ 4) అరుణాచల్‌ప్రదేశ్ - కాయల్స్ అంటే ఏమిటి?
1) తీర ప్రాంత మంచి నీటి జలాశయాలు
2) కేరళలోని ప్రధాన జల మార్గాలు
3) తీర ప్రాంత నిశ్చల జలాలు
4) ఏదీకాదు - దేశంలో ‘అక్టోబర్ హీట్’ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంది?
1) బీహార్ మైదానం
2) పంజాబ్ మైదానం
3) రాజస్థాన్ మైదానం
4) బెంగాల్ మైదానం - అక్టోబర్ హీట్‌కు కారణం?
1) బెంగాల్ మైదాన ప్రాంతాల్లో
వాతావరణంలో అధిక ఆర్ధ్రత ఉండటం
2) పొడి, వేడి వాతావరణం ఉండటం
3) పవనాల వేగం తక్కువగా ఉండటం
4) గంగా-సింధూ మైదానాల్లోని అల్పపీడన వ్యవస్థలు - నైరుతి రుతుపవన కాలంలో తమిళనాడులో పొడిగా ఉండటానికి కారణం?
1) పశ్చిమ కనుమల పర్వత పరాన్ముఖ దిశలో ఉండటం
2) రుతుపవన గాలులు తమిళనాడు భూభాగం చేరేసరికి అవి పొడిగా మారడం
3) బంగాళాఖాత రుతుపవన గాలులు తమిళనాడు తీరానికి సమాంతరంగా కదలడం
4) పైవన్నీ - భారత్‌లో సంభవించే వర్షపాతం ఎక్కువగా ఏ రకానికి చెందినది?
1) చక్రవాత 2) సంవహన
3) పర్వతీయ 4) ఏదీకాదు - ఈశాన్య రుతుపవనాలను అడ్డగించి తమిళనాడుకు వర్షపాతాన్ని కలుగజేయడంలో ప్రధానపాత్ర వహించే భౌగోళిక అంశం?
1) షెవరాయ్ కొండలు 2) జింజి కొండలు
3) రంగన్ బిలై కొండలు
4) నీలగిరి కొండలు - కాలబైశాఖీల వల్ల ఏ ప్రాంతంలో వర్షం కురుస్తుంది?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) అషక్షం 4) పశ్చిమ బెంగాల్ - నైరుతి, ఈశాన్య రుతుపవనాల రెండింటి నుంచి వర్షపాతం పొందే ప్రాంతం?
1) కశ్మీర్‌లోయ 2) కావేరి నదీలోయ
3) నర్మదాలోయ 4) కోరమండల్ తీరం - దేశంలో ఏ రకానికి చెందిన అడవులు ఎక్కువ విస్తీర్ణాన్ని అక్రమించాయి?
1) తేమతో కూడిన సమశీతోష్ణమం డల పర్వత ప్రాంత అరణ్యాలు
2) ఉప ఉష్ణమండల అనార్థ్ర సతత హరితాలు
3) ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు
4) ఉష్ణమండల ఆర్థ్రతతో కూడిన
సతతహరితాలు - ‘జిమ్‌కార్బెట్ జాతీయ పార్క్’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) ఉత్తరప్రదేశ్ 2) ఉత్తరాంచల్
3) అస్సాం 4) అరుణాచల్‌ప్రదేశ్ - సుగంధద్రవ్యాల్లో వాడే ఆల్పైన్ జాతి ‘బ్రహ్మకమలం’ ఏ ప్రాంతంలో
పెరుగుతుంది?
1) పశ్చిమ హిమాలయాలు
2) కేరళ కొండలు
3) తూర్పు హిమాలయాలు
4) గంగా మైదానం - దేశంలో మొదటి బయోస్పియర్ రిజర్వ్?
1) సుందర్బన్ 2) గల్ఫ్ ఆఫ్ మన్నార్
3) కాంచన జంగా 4) నీలగిరి - కింది నదుల్లో హిమాలయాల కంటే ప్రాచీనమైన నది?
1) బ్రహ్మపుత్ర 2) గంగ
3) యమున 4) గోదావరి - ఆరావళిలోజన్మించి కాంబె గల్ఫ్‌లోకి ప్రవహించే నది?
1) నేత్రావతి 2) లూని
3) సబర్మతి 4) సాహిబి
- Tags
Previous article
కరెంట్ అఫైర్స్
Next article
‘పరిమాణాత్మక మార్పులు’ అంటే?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు