ప్రథమ భాషగా తెలుగు బోధనోద్దేశాలు?
తెలుగు భాషా బోధన, ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు-స్పష్టీకరణలు
మాతృభాషా బోధన లక్షణాలు/లక్ష్యాలు
ఎలిమెంటరీ స్థాయి భాషా బోధనోద్దేశాలు
బోధనా లక్ష్యాలను కూలంకషంగా విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త బెంజమిన్ బ్లూమ్స్ ‘టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్స్’ అనే గ్రంథంలో బోధనా లక్ష్యాలను పొందుపర్చారు.
గమ్యాలు: విద్యావ్యవస్థ సాధించాల్సిన అంతిమ ధ్యేయాలు- గమ్యాలు
ఆశయాలు విశదీకరణలే గమ్యాలు
విద్యాప్రణాళికల (కరిక్యులం) రూపకల్పనకు ఉపయోగపడతాయి.
సుదీర్ఘకాలంలో మొత్తం విద్యాప్రణాళిక ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు- గమ్యాలు
గమ్యాలు కేవలం పాఠశాల ద్వారా సాధ్యం కావు. వ్యవస్థకు సంబంధం ఉన్న అందరూ కలిసి సాధించాల్సినవి.
సాధించడానికి దుర్లభమైనవి. ఉదా: ప్రజాస్వామ్య వ్యవస్థాపన, అంతర్జాతీయ సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యత మొదలైన ఆధునిక భారతీయ విద్యా గమ్యాలు
ఉద్దేశాలు: విద్యాధ్యేయాల నుంచి ప్రభవించినవి- విద్యోద్దేశాలు
పాఠశాల కార్యక్రమాల ద్వారా సాధించగలిగేవి ఉద్దేశాలు
విషయ ప్రణాళికల (సిలబస్) రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు దోహదపడి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు కనబర్చవల్సిన/సాధించాల్సిన స్థూలమైన ప్రవర్తనా మార్పును తెలిపేవి ఉద్దేశాలు.
సంవత్సరం చివర విషయ ప్రణాళికల ద్వారా సాధించాల్సిన ప్రవర్తనా మార్పుల మొత్తాలు
బోధనా విషయాలకు సంబంధించిన స్థూల ప్రయోజనాలు- సామాన్య ఉద్దేశాలు
సామాన్య ఉద్దేశాలు విషయ ప్రణాళికలోని అన్ని విషయాలకు వర్తిస్తాయి.
ఒక్కో బోధనాంశం ద్వారా సాధించాల్సిన పరిమిత ప్రయోజనాలు ప్రత్యేక ఉద్దేశాలు (ఇవి కేవలం ఒకే ఒక విషయానికి పరిమితం)
లక్ష్యాలు: గమ్యాల నుంచి ఉద్దేశాలు, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు ఆవిర్భవిస్తాయి.
పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగించాల్సిన ప్రయోజనాలు లేదా ఆశిస్తున్న ప్రవర్తనా మార్పును తెలిపేవి లక్ష్యాలు. వీటినే బోధనా లక్ష్యాలు అంటారు.
సంవృత సమాధానం కోరేవి/ ఏ విధంగానూ వ్యాఖ్యానానికి లోబడనివి. ఉదా: రామాలయం విడదీయండి- రామ+ఆలయం
వివృత లక్ష్యాలు (ఓపెన్ ఆబ్జెక్టివ్స్): అనేక వ్యాఖ్యలు సమాధానం కోరేవి. ఉదా: సవర్ణదీర్ఘ సంధి నిర్మాణం తెలియజేయండి.
లక్ష్యాలు-లక్షణాలు
విద్యావిషయకంగా ప్రాముఖ్యం కలిగి విద్యార్థులు సాధించగలిగేవిగా ఉంటాయి.
పరిశీలించదగినవిగా, కొలవదగినవిగా ఉంటాయి.
నిర్ణయించిన కాలపరిమితిలో సాధించడానికి వీలుగా ఉంటాయి.
విద్యార్థి ప్రవర్తన ద్వారా వివరించగలిగేవిగా ఉంటాయి. మూల్యాంకనం చేయడానికి వీలుగా ఉంటాయి.
స్పష్టీకరణలు: అభ్యసనానికి సాక్ష్యాలు
బోధనా లక్ష్యాల సూక్ష్మరూపాలు స్పష్టీకరణలు
విద్యార్థుల్లో వెంటనే ఆశించే ప్రవర్తనా మార్పులు
పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతాలవుతాయి.
ఆశించే అభ్యసన ఫలితాలు అని కూడా అంటారు.
ఒక పాఠ్యాంశం పిల్లలకు బోధిస్తే దాని ద్వారా పిల్లల నుంచి ఏమి కోరుకుంటామో వాటినే స్పష్టీకరణలు అంటారు.
స్పష్టీకరణలనే సామర్థ్యాలని కూడా పిలుస్తారు.
రెండు లక్ష్యాల మధ్య భేదాలు చెప్పడానికి ఉపకరిస్తాయి.
జీకే సూద్: గమ్యాలు దీర్ఘకాలికమైనవి. ఒక రకంగా అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడినవి. ఉద్దేశాలు నియమితమైనవి. లక్ష్యాలు ఉద్దేశాలకంటే మరీ నిర్దిష్టమైనవి. ఉద్దేశాలు విద్యకు మార్గదర్శకాలు కానీ చేరుకోగల అంతిమ దృక్పథం లక్ష్యమే లక్ష్యసాధన ఉద్దేశాల సాధనకు చేరుస్తుంది.
1) జ్ఞానం-స్పష్టీకరణలు
ఎ) గుర్తించడం బి) జ్ఞప్తికి తెచ్చుకోవడం
విషయజ్ఞానం: పాఠ్యాంశాలు, కవి జీవితాలు, రచయిత పరిచయం, పూర్వ/పర కథలు, నేపథ్యం/సందర్భం, విశేషాంశాలు, ఇతివృత్తాలు
భాషాజ్ఞానం: వాక్యభేదాలు, జాతీయాలు/నుడికారాలు, పదభేదాలు, పర్యాయపదాలు/ నానార్థాలు, వ్యుత్పత్యర్థాలు, సంధులు/సమాసాలు, ఉచ్ఛారణ, వర్ణక్రమం, విరామస్థానాలు
సాహిత్యజ్ఞానం: శైలి, అలంకారాలు, ఛందస్సు, ఔచిత్యం, రసం, పాకం, ధ్వని, చమత్కారం, కవితాశిల్పం, పద్య, గద్య, నాటకాది భేదాలు, నాయికానాయక భేదాలు.
2) అవగాహన-స్పష్టీకరణలు
పదాలకు, వాక్యాలకు అర్థాలు చెప్పగలుగుతారు.
విషయాన్ని సొంత మాటల్లో వివరిస్తారు/వర్ణిస్తారు
నానార్థాలు, వ్యతిరేకార్థాలు చెప్పగలుగుతారు.
ముఖ్యమైన పదాలు, సమాసాలను గుర్తిస్తారు.
కొత్త పదాలు, జాతీయాలను భాషాభాగాలను సొంత వాక్యాల్లో ఉపయోగిస్తారు.
సారాంశాన్ని గ్రహిస్తారు.
శీర్షిక సూచిస్తారు
పోలికలు, భేదాలు చెప్పడం
సందర్భసహిత వ్యాఖ్యలు చెప్పగలుగుతారు.
కవి, రచయిత అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు.
దోషాలను గుర్తించి సరిచేస్తారు
సొంతంగా ఉదాహరణలు ఇస్తారు (భాషాభాగాలు, భాషలోని శైలిక వైవిధ్యాలు, భావాలు, సంఘటనలు)
.0పదాలు, వాక్యాలను ఇతర రూపాల్లోకి (వ్యతిరేకార్థం, కాలం మొదలైనవి) మార్చగలుగుతారు.
3) వాగ్రూప వ్యక్తీకరణ – స్పష్టీకరణలు
విద్యార్థులు భావాలు, వాక్యాలను స్పష్టంగా ప్రకటిస్తారు.
ఉచ్ఛారణ దోషరహితంగా మాట్లాడుతారు
భావానుగుణమైన స్వరభేదంతో మాట్లాడతారు.
సందర్భానుసారంగా సరైన వేగంతో మాట్లాడతారు
సభాకంపం లేకుండా ఆకర్షణీయంగా మాట్లాడతారు.
4) లిఖిత రూప వ్యక్తీకరణ – స్పష్టీకరణలు
వర్ణక్రమ దోషాలు లేకుండా రాస్తారు.
తగిన శైలిలో రాయగలుగుతారు.
సరైన వాక్య నిర్మాణం చేస్తారు.
వ్యాకరణ దోషాలు లేకుండా రాస్తారు.
క్లుప్తంగా ఇచ్చిన విషయాన్ని అర్థవంతంగా విశదీకరిస్తారు.
విషయాన్ని సంక్షీప్తికరిస్తారు.
పరిచ్ఛేదాలు (పేరాలు)గా విభజిస్తారు.
స్పష్టమైన చేతిరాతతో చక్కగా రాస్తారు.
5) భాషాభిరుచి-స్పష్టీకరణలు
విస్తార గ్రంథ పఠనం చేస్తారు
వక్తృత్వ, రచనల పోటీల్లో పాల్గొంటారు.
విమర్శనాత్మక దృష్టితో చదువుతారు.
సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటారు.
మూల గ్రంథాలను చదవడం
కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు.
సాహిత్య రచనలు చేస్తారు.
సందర్భోచితంగా గ్రంథకర్తలు రచనలను ప్రమాణంగా ఉదహరిస్తారు.
విద్యార్థి సాహిత్య రచనల్లో విమర్శనాత్మక దృక్పథం కలిగి ఉంటారు.
6) రసానుభూతి – స్పష్టీకరణలు
రచనల్లోని రసభేదాలను గ్రహిస్తారు.
అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు.
పాత్రోచితను తెలుసుకుంటారు.
ధ్వన్యర్థాలను గ్రహిస్తారు.
శైలీ భేదాలను పరికరిస్తారు.
కావ్యాల్లోని రసవద్ఘట్టాలను చదివి ఆనందిస్తారు.
7) సంస్కృతి, సంప్రదాయాలు – స్పష్టీకరణలు
ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు.
ప్రాచీన సాహిత్యంలోని విశేషాలు తెలుపుతారు.
భారతీయ సంస్కృతి పట్ల ఆదరాభిమానాలు పెంపొందించుకుంటారు.
రచనల్లోని కాలభేద ప్రభావాన్ని తెలుపుతారు.
రచనల్లోని నీతిని గ్రహిస్తారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
8) సృజనాత్మకత – స్పష్టీకరణలు
స్వతంత్ర రచనలు చేస్తారు.
శైలిలో ప్రత్యేకతను కనబరుస్తారు.
తమ రచనల్లో లోకోక్తులు, జాతీయాలు ఉపయోగిస్తారు.
సాహిత్యంలోని ఒక ప్రక్రియను, వేరొక ప్రక్రియలోకి మారుస్తారు.
నుడికారపు సొంపును ప్రదర్శిస్తారు.
9) భాషాంతీకరణ – స్పష్టీకరణలు
ఉభయ భాషల్లోని వాక్యనిర్మాణ పద్ధతులు తెలుసుకుంటారు.
ఉభయ భాషల్లోని సమానార్థక పదాలు, జాతీయాలను ఎన్నుకుంటారు.
ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం
10) సముచిత మనోవైఖరులు – స్పష్టీకరణలు
సాహితీవేత్తల పట్ల గౌరవ భావంతో ఉంటారు.
ఇతర భాషలపట్ల సమానాదరణ చూపిస్తారు.
సాహిత్య కృషిని ప్రోత్సహిస్తారు.
మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవిస్తారు.
విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారు.
విమర్శనాత్మక దృష్టితో ఉంటారు.
వ్యక్తుల అలవాట్లు, ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, విలువలు, ఉద్వేగాలు, అనుభూతులు, ప్రశంసలు ఏ రంగానికి చెందినవి
– భావావేశ రంగం
మానవ ప్రవృత్తి, ప్రవర్తన, ప్రతిస్పందనలకు చెందిన రంగం- భావావేశ రంగం
యాంత్రిక, అనువర్తిత, సృజనాత్మక నైపుణ్యాలకు సంబంధించిన రంగం- మానసిక చలనాత్మక రంగం
చేతిరాత, బొమ్మలు గీయడం, భాషణం, వ్యాయామం, ప్రయోగశాల, కృత్యాలు, సాంకేతిక విద్య మొదలైనవి ఏ రంగం- మానసిక చలనాత్మక రంగం
పిల్లల్లోని సృజనాత్మక రచన, లేఖనా నైపుణ్యాలు ఏ రంగం- మానసిక చలనాత్మక రంగం
ప్రథమ భాషగా తెలుగు బోధనోద్దేశాలు
శ్రవణ, భాషణ సామర్థ్యాలను పటిష్టం చేయడంతోపాటు పఠన, లేఖనా సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించి, వారికి భాషపై పట్టు కలిగేటట్లు చూడటం తెలుగును ప్రథమ భాషగా బోధించడంలోని ప్రధాన ఉద్దేశం
1) అర్థగ్రహణం- భాషను విని అర్థం చేసుకోవడం, చదివి అర్థం చేసుకోవడం, అర్థం చేసుకోవడంలో సమయోచిత ప్రజ్ఞ ప్రధానాలు.
2) అభివ్యక్తి- అంటే వ్యక్తీకరణ, చక్కని వ్యక్తీకరణ నైపుణ్యం పెంపొందించడం మరొక ఉద్దేశం
3) గుణవివేచన- సాహిత్యం పరిచయంవల్ల అందులోని రసం, శైలి, భావుకత, అలంకారం మొదలైన అంశాల గుణవివేచన మరో ఉద్దేశం.
క్రమబద్ధమైన ఆలోచనలను పెంపొందించడం
స్వతంత్రంగా ఆలోచించడాన్ని ప్రోత్సహించడం
ప్రాచీన గ్రంథాల్లోని విషయాలను పరిచయం చేయడం
ఆనందానుభూతిని, మానవతా విలువను పెంపొందించడం
భాష, కవులు, రచయితల పట్ల సద్వైఖరిని కలిగించడం
మాతృభాష – బోధన విలువలు
మాతృభాష బోధన విలువలు 2 రకాలు
1) సామాన్య విలువలు 2) ప్రత్యేక విలువలు
సామాన్య విలువలు: 1) వైయక్తిక విలువలు
2) సామాజిక విలువలు
ప్రత్యేక విలువలు: 1) సౌందర్య విలువలు
2) నైతిక విలువలు
3) ఆధ్యాత్మిక విలువలు
4) సృజనాత్మక విలువలు
5) వృత్తి విలువలు
6) సాంస్కృతిక విలువలు
సామాన్య విలువలు: వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు. వీటినే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అంటారు.
వైయక్తిక విలువలు: మాతృభాష బోధనవల్ల వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న దుష్టలక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయని చెప్పేవి.
వ్యక్తిలోని అంతర్గత శక్తులను వెలికి తీసుకురాగలిగిన వైయక్తిక విలువల్లో రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలైనవి చేరుతాయి.
వైయక్తిక విలువలవల్ల వ్యక్తి తనంత తాను ఎదిగి ఇతరులకు ఆదర్శప్రాయడవుతాడు.
సామాజిక విలువలు: వీటినే సమష్టి విలువలు అంటారు.
సామాజిక విలువలు దేని నుంచి కలుగుతాయి- వైయక్తిక విలువలు
మానవత్వ వైఖరి, సమష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశసమైక్యత పట్ల నిబద్ధత మొదలైనవి సామాజిక విలువల్లోని ప్రధానాంశాలు
ప్రత్యేక విలువలు: మానవ చరిత్ర, దేశచరిత్రల పరిశీలన ద్వారా కలిగే విలువలు
సమాజ పరిస్థితిని బట్టి, కవులు, రచయితలు, సంఘసంస్కర్తలు, మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి, పాఠ్యబోధన ద్వారా సాధించే విలువలు- ప్రత్యేక విలువలు
సౌందర్యానుభవ విలువలు: ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం సౌందర్య విలువలు
సత్యం, శివం, సుందరం అనే సూక్తిననుసరించి ప్రకృతి సౌందర్యంలో నిండి ఉండునని చెప్పే విలువలు- సౌందర్యానుభవ విలువలు
నైతిక విలువలు: ఈర్ష్యాద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలైనవి.
శతకాలు, పంచతంత్రాలు, రామాయణ, భారతాలు లాంటి ఉత్తమ సాహిత్య పఠనంవల్ల కలిగే విలువలు
ఆధ్యాత్మిక విలువలు: రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే విలువలు
సృజనాత్మక విలువలు: గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం లాంటి లలితకళలవల్ల మనిషికి కలిగే విలువలు మాతృభాష ఉత్తమ కళాకారులను తయారుచేయగలుగుతుంది.
సాంస్కృతిక విలువలు: పురాణేతిహాసాలు సాంస్కృతిక విధులు మాతృభాషల్లోని ఉత్తమ సాహిత్య పఠనంవల్ల సాంస్కృతిక విలువలు పెంపొందుతాయి.
వృత్తి విలువలు: విజ్ఞాన, సాంకేతిక, విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాష అవసరం.
లోక్నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు