వాయుసేనలో కొలువుల మేళా!


కేవలం పదోతరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులై ఉంటే చాలు. దేశసేవ చేసే భాగ్యం, భరోసానిచ్చే కొలువు. భద్రమైన జీవితంతోపాటు ఆకర్షణీయమైన జీతభత్యాలు, పదోన్నతులకు అవకాశం. వీటన్నింటి సమాహారమే వాయుసేన విడుదల చేసిన గ్రూప్ సీ సివిలియన్ పోస్టులు. పదిహేను వందల పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు…
మొత్తం ఖాళీలు 1515
పోస్టు: గ్రూప్ సీ (సివిలియన్ పోస్టులు) – గ్రేడ్-2 స్టెనో, సూపరింటెండెంట్ (స్టోర్), కుక్, హౌజ్‌కీపింగ్, మెస్‌స్టాఫ్, హిందీస్టాఫ్, ఎల్డీసీ, లాండ్రీమ్యాన్, సీఎస్&ఎస్ఎండబ్ల్యూ, ఎల్డీసీ, సీఎంటీడీ, కార్పెంటర్, మల్టీటాస్కింగ్ స్టాఫ్, ఆయా/వార్డ్ సహాయక్, హిందీ టైపిస్ట్, పెయింటర్, వల్కనైజర్, హెచ్‌కేఎస్, ఫైర్‌మ్యాన్, ఎఫ్ఎంటీ, టర్నర్ (ఎస్కే), లెదర్ వర్కర్ (ఎస్కే), టైలర్, సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్.
ఎవరు అర్హులు?
పోస్టును బట్టి పదోతరగతి, ఇంటర్ ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, డ్రైవింగ్ లైసెన్స్, హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయస్సు: 18-25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత రాతపరీక్ష నిర్వహిస్తారు.
రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష
దీనిలో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్నెస్ ప్రశ్నలు పదోతరగతి, ఇంటర్, ఐటీఐ స్థాయిలో ఇస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా
స్కిల్‌టెస్ట్/ఫిజికల్ ప్రాక్టికల్ టెస్ట్
నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
నోట్: అభ్యర్థులు నోటిఫికేషన్లో ప్రకటించిన విధంగా సంబంధిత ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ:ప్రకటన విడుదలైన 30 రోజుల్లో పంపాలి.
వెబ్సైట్: https://indianairforce.nic.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
Latest Updates
జాతీయం-అంతర్జాతీయం
Scholarships for students
డిగ్రీ.. ‘దోస్త్’ రెడీ
బ్యాంకుల్లో 6035 క్లర్క్ పోస్టులు
Ace questions on environment
అల్ప జాతీయాదాయం నమోదవుతున్న దేశం ఏది? (Groups Special)
మానవ శరీరం బరువులో మెదడు బరువు శాతం ఎంత?
పదార్థం పంచ స్థితి రూపం
ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్
విద్యార్థులకు 362.88 కోట్ల స్కాలర్షిప్లు