నీట్ పీజీ యథాతథం.. నేడు అడ్మిట్ కార్డుల విడుదల
హైదరాబాద్: నీట్ పీజీ పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) ప్రకటించింది. ఈ పరీక్షను ఏప్రిల్ 18 యథాతథంగా కొనసాగిస్తామని, పరీక్ష తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 1.75 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల వరకు పరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేడు విడుదల చేయనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ nbe.edu.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్బీఈ వెల్లడించింది. పరీక్ష ఫలితాలను మే 31న ప్రకటిస్తుంది.
అయితే, దేశంలో కరోనా కేసులు అధికమవుతుండటంతో నిబంధనలను మరింత కఠినం చేసింది. దీనికి సంబంధించిన నియమాలిని విడుదల చేసింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పరీక్ష కేంద్రాలను పెంచింది. దీంతోపాటు విద్యార్థుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈపాస్లు జారీ చేయనున్నట్లు తెలిపింది. పరీక్షా కేంద్రాల్లో ప్రవేశానికి వేరు వేరు సమయాలను కేటాయిస్తున్నట్లు పేర్కొంది. ఈ వివరాలన్నీ ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తారు. మాస్క్, హాండ్ శానటైజర్ తప్పనిసరని పేర్కొంది. పరీక్ష కేంద్రంలోనికి ప్రవేశించే ముందు టెంపరేచర్ పరీక్షించి, అధికంగా ఉంటే వారికి ప్రత్యేక గదిలో పరీక్ష నిర్వహిస్తారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,187 కరోనా కేసులు
కన్యత్వ పరీక్షలో విఫలం.. అక్కాచెల్లెళ్లను గెంటేశారు
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్గా మారిన ఫొటోలు
ఐఫోన్ పాస్కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
టీకా కొరత కేంద్రం తప్పే
లింగ పక్షపాతం చూపుతున్న ఫేస్బుక్ యాడ్స్
టీకా.. రాజు-పేద!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు