నేవీలో ఆఫీసర్ ఐటీ పోస్టుల భర్తీ
ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ ఐటీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: స్పెషల్ నేవల్ ఓరియంటేషన్ కోర్సు కింద ఎగ్జిక్యూటివ్ బ్రాంచీ ఎస్ఎస్సీ -ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పోస్టులు.ఈ కోర్సు జనవరి 2022 నుంచి ప్రారంభమవుతుంది.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లేదా ఐటీ) లేదా ఎమ్మెస్సీ (కంప్యూటర్/ఐటీ), ఎంసీఏ, ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్/ఐటీ). అవివాహిత పురుష అభ్యర్థులు అయి ఉండాలి.
మొత్తం ఖాళీలు: 45
వయస్సు: 1997, జనవరి 2 నుంచి 2002, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: కొవిడ్-19 కారణంగా నేవీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించడం లేదు. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌లు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను ఆగస్టు 21 తర్వాత నిర్వహిస్తారు. ఈ ఇంటర్వ్యూలను బెంగళూరు, భోపాల్, విశాఖపట్నం, కోల్‌కతాల్లో నిర్వహిస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను ప్రకటిస్తారు.
ఉద్యోగ కాలపరిమితి: షార్ట్ సర్వీస్ కమిషన్ కింద ఎంపికైన అభ్యర్థులకు మొదట 10 ఏండ్ల కాలపరిమితికి తీసుకుంటారు. తర్వాత గరిష్ఠంగా నాలుగేండ్లు పొడిగిస్తారు.
శిక్షణ
కేరళ ఎజిమళలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
నాలుగు నెలల ఎస్ఎస్సీ ఐటీ శిక్షణతోపాటు ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను నిబంధనలకు అనుగుణంగా నిర్వహిస్తారు. శిక్షణ కాలంలో సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. ఎస్ఎస్సీ ఐటీ ఆఫీసర్ ప్రొబేషనరీ పీరియడ్ రెండేండ్లు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో, చివరితేదీ: జూలై 16
వెబ్సైట్: www.joinindiannavy.gov.in
జేఎన్ఏఎఫ్యూలో
హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌యూ)లో కింది ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాల కోసం
పకటన విడుదలైంది.
కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, యానిమేషన్, ఫొటోగ్రఫీ)
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్)
కోర్సు కాలవ్యవధి: నాలుగేండ్లు
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక: ఫైన్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్-2021 ద్వారా
పరీక్ష తేదీలు: బీఎఫ్ఏ (ఫొటోగ్రఫీ), బీ డిజైన్ (ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు ఆగస్టు 13, మిగిలిన బీఎఫ్ఏ కోర్సులకు ఆగస్టు 14.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.1800/-
చివరితేదీ: జూలై 24
వెబ్సైట్: https://www.jnafau.ac.in
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు