నీలిట్‌లో ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్)లో ఎంటెక్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రోగ్రామ్: ఎంటెక్
సైషలైజేషన్స్: ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ (ఈడీ&టీ), వీఎల్ఎస్ఐ డిజైన్
సీట్ల సంఖ్య: ఒక్కో స్పెషలైజేషన్‌లో 18 సీట్లు ఉన్నాయి. వీటిలో జనరల్ అభ్యర్థులకు 10, స్పాన్సర్డ్ అభ్యర్థులకు 5, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 3 సీట్లు ప్రత్యేకించారు. గేట్ వ్యాలిడ్ స్కోరు ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు.
కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు). ప్రాక్టికల్ డిజైన్ ప్రధానాంశంగా ఈ ప్రోగ్రామ్ని రూపొందించారు. ఎంబెడెడ్ సిస్టమ్, ఐఓటీ, డీఎస్పీ, వీఎల్ఎస్ఐ డిజెన్లతోపాటు ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ డిజైన్, హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ అంశాలపై శిక్షణ ఇస్తారు.
అర్హతలు: ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రానిక్స్/ ఈసీఈ లేదా ఈఐ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయనున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోట్: స్పాన్సర్డ్ అభ్యర్థులకు దరఖాస్తు నాటికి కనీసం రెండేండ్ల సర్వీసు ఉండాలి. వీరికి గేట్ స్కోరు తప్పనిసరి కాదు.
ఎంపిక: గేట్ స్కోరు ఆధారంగా ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్పాన్సర్డ్ అభ్యర్థులకు అకడమిక్ ప్రతిభ, సెలెక్షన్ కమిటీ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. పై రెండు పద్ధతుల్లో ఎంపిక చేసిన తర్వాత కూడా సీట్లు మిగిలితే నాన్ గేట్ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 5
దరఖాస్తు ఫీజు: రూ.1000 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500)
గేట్/ స్పాన్సర్డ్ అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సిలింగ్: ఆగస్టు 12
నాన్ గేట్ అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సిలింగ్:
ఆగస్టు 26
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: www.calicut.nielit.in/
నల్సార్‌లో
హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో 202123 విద్యా సంవత్సరానికి ఎంబీఏలో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది.
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫలితాల కోసం చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: క్యాట్/గ్జాట్/జీఆర్ఈ/జీమ్యాట్ లేదా సీమ్యాట్ స్కోర్ల ఆధారంగా చేస్తారు. ఈ స్కోర్స్ లేని అభ్యర్థులు నల్సార్ మేనేజ్మెంట్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్మెట్) ద్వారా ప్రవేశం పొందవచ్చు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు అదే రోజు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూలై 12
పరీక్షతేదీ: జూలై 18
వెబ్సైట్: http://apply.nalsar.ac.in
భారత్ డైనమిక్స్‌లో
హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 46
పోస్టులు: జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)-1, డిప్యూటీ జనరల్ మేనేజర్-3, మెడికల్ ఆఫీసర్-2, అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ)-3.
మేనేజ్మెంట్ ట్రెయినీలు: ఎలక్ట్రానిక్స్-12, మెకానికల్-9, ఎలక్ట్రికల్-3, సివిల్-3, కంప్యూటర్ సైన్స్-2, ఆప్టిక్స్-1, బిజినెస్ డెవలప్మెంట్-1, ఫైనాన్స్-3, హెచ్ఆర్-3 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకు కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఆప్టిక్స్ పోస్టులకు ఎమ్మెస్సీ, బిజినెస్ డెవలప్మెంట్ పోస్టులకు బీఈ/బీటెక్‌తోపాటు ఎంబీఏ, ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. హెచ్ఆర్ పోస్టులకు ఎంబీఏ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఎంపిక విధానం:జీఎం,డీజీఎం, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
మేనేజ్మెంట్ ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష (కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్), ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు.
సీబీటీలో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. సంబంధిత సబ్జెక్టు నుంచి 100 ప్రశ్నలు. జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు.
సీబీటీకి 85 శాతం వెయిటేజీ ఇస్తారు. ఇంటర్వ్యూకు 15 మార్కులు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూలై 19
వెబ్సైట్: https://bdl-india.in
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు