ఆర్మీలో ఇంజినీరింగ్ కొలువులు
- బీఈ, బీటెక్ ఉత్తీర్ణులకు అవకాశం
- మొత్తం ఖాళీలు191
ఇండియన్ ఆర్మీలో టెక్ మెన్, ఉమెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.వివరాలు: ఇండియన్ ఆర్మీకి చెందిన చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడెమీ (ఓటీఏ)… 2021 అక్టోబర్ సంవత్సరానికి గాను 57వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) మెన్, 28వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఉమెన్ కోర్సు.
మొత్తం ఖాళీలు: 191
వీటిలో ఎస్ఎస్సీ (టెక్) మెన్-175, ఎస్ఎస్సీ (టెక్) ఉమెన్-14, విడోస్ డిఫెన్స్ పర్సనల్-2 ఖాళీలు ఉన్నాయి.
విభాగాలు: సివిల్/బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తదితరాలు.
అర్హతలు: ఎస్ఎస్సీ (టెక్) మెన్/ఉమెన్సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్),
(నాన్ యూపీఎస్సీ) పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఎస్సీ (విడో) టెక్నికల్- బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు: ఎస్ఎస్సీ (టెక్) మెన్/ఉమెన్2021, అక్టోబర్ 1 నాటికి 2027 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్ఎస్సీ విడోస్ (నాన్ టెక్నికల్), (నాన్ యూపీఎస్సీ), ఎస్ఎస్సీ (విడో) టెక్నికల్ పోస్టులకు 2021, అక్టోబర్ 1 నాటికి 35 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక: ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా చేస్తారు.
ఎంపికలో మొదట బీఈ/బీటెక్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
ఎంపిక కేంద్రాల్లో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ కేంద్రాలు.. అలహాబాద్, భోపాల్, బెంగళూరు, కపుర్తలా
ఈ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దీనిలో సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
రెండు దశల్లో ఐదురోజులుపాటు వీటిని నిర్వహిస్తారు.
మొదటి రోజు నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించినవారికే తర్వాతి నాలుగురోజుల్లో పరీక్షలకు అనుమతిస్తారు.
ఈ ఇంటర్వ్యూల్లో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. అనంతరం శిక్షణలోకి తీసుకుంటారు.
శిక్షణ
ఇంటర్వ్యూలో విజయవంతమైనవారికి చెన్నైలోని ఆఫీసర్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తారు.
శిక్షణ కాలవ్యవధి 49 వారాలు.
ఈ శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- స్టయిఫండ్‌గా ఇస్తారు.
శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది.
పదోన్నతలు
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు లెఫ్టినెంట హోదాలో ఉద్యోగాన్ని ఇస్తారు. రెండేండ్ల అనుభవం తర్వాత కెప్టన్, తర్వాత మేజర్, లెఫ్టినెంట్ కల్నల్ వరకు పదోన్నతులు పొందవచ్చు.
జీతభత్యాలు:
లెఫ్టినెంట్ హోదాలో చేరిన వారికి ప్రారంభంలో లెవల్ 10 ప్రకారం రూ.56,100/ ఇస్తారు. దీనికి అదనంగా డీఏ ఇతర అలవెన్స్‌లు ఇస్తారు. దీనితో ప్రారంభవేతనం సుమారు లక్ష రూపాయల వరకు వస్తుంది.
ఆర్మీ ‘లా’ ప్రవేశాలు
మొహాలీలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా(ఏఐఎల్) 2021-22 విద్యాసంవత్సరానికిగాను కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
లా ఎంట్రన్స్ టెస్ట్-2021
ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఏ ఎల్ఎల్బీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఇది ఐదేండ్ల కాలవ్యవధి గల కోర్సు.
అర్హతలు: ఇంటర్ ఉత్తీర్ణత
ఎంపిక: ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా
మొత్తం సీట్ల సంఖ్య: 64. 60 సీట్లను ఆర్మీ పర్సనల్ వారికి కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూన్ 24
వెబ్సైట్: https://ail.ac.in
సిరిసిల్ల ఆర్డీసీఎస్లో ప్రవేశాలు
తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీకి చెందిన సిరిసిల్లలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీలో 2021-22 విద్యాసంవత్సరానికి కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
ప్రవేశాలు కల్పించే కోర్సు: డిగ్రీ మొదటి ఏడాది
కోర్సులు: బీఏ (ఆనర్స్) ఫ్యాషన్ డిజైన్, బీఏ (ఆనర్స్) ఇంటీరియర్ డిజైన్, బీఏ (ఫొటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్)
అర్హతలు: ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్నవారు. అంటే 2020-2021 విద్యాసంవత్సరంలో ఇంటర్ పూర్తయ్యే విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: జూన్ 20 వెబ్సైట్: https://ttwrdcs.ac.in
మోడల్ కాలేజీల్లో ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్ స్కూల్స్/ జూనియర్ కాలేజీల్లో 2021-22 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
మొత్తం కాలేజీల సంఖ్య: 194
తెలంగాణ మోడల్ స్కూల్స్/జూనియర్ కాలేజీల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
కాలేజీ ప్రత్యేకతలు ఎటువంటి ఫీజు తీసుకోరు. ఉచితంగా విద్య
ఇంగ్లిష్ మీడియంలో బోధన సౌకర్యవంతమైన ప్రాంగణాల్లో తరగతులు నిర్వహిస్తారు.
ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇస్తారు.
సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ సౌకర్యం ఉంది.
అర్హతలు: పదోతరగతి/తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: విద్యార్థులు సాధించిన అకడమిక్ మెరిట్ ఆధారంగా చేస్తారు. రిజర్వేషన్లు వర్తిస్తాయి.
దరఖాస్తు: ఆన్లైన్లో.. చివరితేదీ: జూలై 5
విద్యార్థుల ఎంపిక: జూలై 10 ధ్రువపత్రాల పరిశీలన తేదీ: జూలై 12
పూర్తి వివరాల కోసం వెబ్సైట్: http://www.tsmodelschools.in.
సవరణ
గతవారం ఇచ్చిన ‘పారామెడికల్.. భవిష్యత్తు సూపర్’ ఇచ్చిన వ్యాసంలో బీవోటీ (బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్) కోర్సును ఫిజియోథెరపీ కోర్సు అని ప్రచురించాం. బీవోటీ కోర్సు ఫిజియోథెరపీ కాదని, ఫిజియోథెరపీ పారామెడికల్ కోర్సు కూడా కాదని దాని గురించి డాక్టర్ పూర్ణచంద్రశేఖర్ వివరణను ఇస్తున్నాం.ఫిజియోథెరపీ పారామెడికల్ కోర్సు కాదు. ఇది ఐల్లెడ్ హెల్త్కౌన్సిల్లో ఇండిపెండెంట్ ప్రాక్టీస్ కిందకు వస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఆక్యుపేషనల్ కోర్సు రెండు వేర్వేరు వైద్య విధానాలు (డిఫరెంట్ కోర్సెస్) ఫిజియోథెరపీ అంటే మోడ్రన్, ట్రీట్మెంట్ ఫిజికల్ రిసోర్స్. అందులో ఎక్సర్సైజ్థెరపీ, ఎలక్ట్రోథెరపీ, మెకానికల్ ఎనర్జీ, మ్యానిపులేషన్ థెరపీ మొదలైనవి.
ఫిజియోథెరపీ 4 1/2 సంవత్సరాల కోర్సు. ఇందులో అనాటమీ, ఫిజియాలజీ బయోకెమిస్ట్రీ, బయోమెకానిక్స్, సైకాలజీ, సోషియాలజీ, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఎలక్ట్రోథెరపీ, ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్, సోషల్ ప్రివింటివ్ మెడిసిన్, ఫిజియోథెరపీ ఇన్ ఆర్థోపెడిక్స్, ఫిజియోథెరపీ ఇన్ న్యూరాలజీ, ఫిజియోథెరపీ ఇన్ కార్డియో పల్మనరీ కండిషన్స్, ఫిజియోథెరపీ ఇన్ సర్జరీ, ఫిజియోథెరపీ ఇన్ కమ్యూనిటీ బేస్డ్ రిహాబిలిటేషన్.
పీజీ కోర్సులు
మాస్టర్స్ ఇన్ ఆర్థోపెడిక్స్, మాస్టర్స్ ఇన్ కార్డియో పల్మనరీ, మాస్టర్స్ ఇన్ న్యూరాలజీ, మాస్టర్స్ ఇన్ గైనకాలజీ, మాస్టర్స్ ఇన్ పిడియూట్రిక్స్, మాస్టర్స్ ఇన్ ఆంకాలజీ, మాస్టర్స్ ఇన్ కమ్యూనిటీ మెడిసిన్, మాస్టర్స్ ఇన్ హ్యాండ్ రిహాబిలిటేషన్ ఉంటాయి.ఇంకా ఇప్పుడు ఫిజియోథెరపీ ముఖ్యమైన రోల్ కొవిడ్-19 ట్రీట్మెంట్లో పల్మనరీ రిహాబిలిటేషన్, (Spirometry బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పోస్త్రల్డ్రైనేజ్, పర్కషన్ మొదలైన టెక్నిక్స్)తో సాచురేషన్ వాల్యూస్ పెరుగుతాయి.ఫిజియోథెరపీతో మెడనొప్పులు, భుజం నొప్పులు, నడుం నొప్పులు, ట్రిగ్గర్ పాయింట్ పెయిన్, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, పక్షవాతం, మూతిపక్షవాతం (bells palsy), సెరిబ్రల్ పాలసీ, ప్రి అండ్ పోస్ట్ ఆపరేటివ్ మేనేజ్మెంట్, సయాటికా అన్ని రకాల కండరాల నొప్పులు, ఛాతీ, ఊపిరితిత్తులకు సంబంధించిన కండిషన్స్ ప్రి అండ్ పోస్ట్ నాటల్ డెలివరీకి అన్ని రకాల మెడికల్ కండిషన్స్‌కు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇస్తారు.
DR. S PURNA CHANDRA SHEKHAR
IAP Telangana State President
TPA Telangana State EC Member
Hyderabad.
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు