వాయుసేనలోకొలువులు!
వాయుసేన.. దేశ రక్షణ చూసే త్రివిధ దళాల్లో ఒకటి. ఎయిర్‌ఫోర్స్‌లో ఆకాశమంత అవకాశాలు. పదోతరగతి నుంచి పట్టభద్రుడి వరకు పలు ఉద్యోగాలకు వాయుసేన ఏటా పలు నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది. ప్రస్తుతం పలు బ్రాంచీల్లో కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (క్యాట్)- 2/2021/ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ నోటిఫికేషన్‌ను ఎయిర్‌ఫోర్స్ విడుదల చేసిన నేపథ్యంలో వివరాలు సంక్షిప్తంగా …
ఏఎఫ్ క్యాట్: ఎయిర్‌ఫోర్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఏటా ఈ టెస్ట్ ద్వారా కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు-334
బ్రాంచీలవారీగా ఖాళీలు:
ఏఎఫ్‌క్యాట్ ఎంట్రీ
బ్రాంచీ: ఫ్లయింగ్
ఖాళీలు: షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ)-96
బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)
ఖాళీలు: ఏఈ (ఎల్)- పర్మనెంట్ కమిషన్ (పీసీ)-20, ఎస్ఎస్సీ-78
ఏఈ (ఎం)-పీసీ-8, ఎస్ఎస్సీ-31
బ్రాంచీ: గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)
ఖాళీలు: అడ్మిన్- పీసీ-10, ఎస్ఎస్సీ-42
ఎడ్యుకేషన్-పీసీ-04, ఎస్ఎస్సీ-17
మెటీయోరాలజీ-పీసీ-06, ఎస్ఎస్సీ-22
ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ
బ్రాంచీ: ఫ్లయింగ్
ఖాళీలు: సీడీఎస్ఈ ఖాళీల్లో 10 శాతం పీసీ కింద, ఏఎఫ్ క్యాట్‌లో 10 శాతం ఖాళీలను ఎస్ఎస్సీ కింద భర్తీ చేస్తారు.
ఎవరు అర్హులు?
ఫ్లయింగ్ బ్రాంచీ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులు. అయితే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లేదా అనుబంధ బ్రాంచీల్లో ఉత్తీర్ణత. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ పోస్టులకు డిగ్రీలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో విడివిడిగా 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు కనీసం 50 శాతం మార్కులతో సైన్స్ సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత.
ఫ్లయింగ్ బ్రాంచీకి 2022, జూలై 1 నాటికి 20-24 ఏండ్ల మధ్య, గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీకి 20-26 ఏండ్ల మధ్య ఉండాలి.
నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అవివాహిత పురుష/మహిళా అభ్యర్థులు అయి ఉండాలి.
ఎంపిక విధానం
కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్, వైద్యపరీక్షల ఆధారంగా చేస్తారు.
శిక్షణ
2022, జూలై నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. ఎయిర్‌ఫోర్స్ అకాడమీ, దుండిగల్ (హైదరాబాద్)లో శిక్షణ ఇస్తారు. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచీకి 74 వారాలు, నాన్ టెక్నికల్ బ్రాంచీకి 52 వారాల శిక్షణ ఇస్తారు.
పే అలవెన్స్‌లు: ఫ్లయింగ్ ఆఫీసర్- లెవల్ 10 నెలకు కింద రూ.56,100-177500/-
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: https://afcat.cdac.in
-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు