శిశు వికాస అధ్యయన పద్ధతులు

1. అంతఃపరిశీలన పద్ధతిని ప్రవేశపెట్టింది?
1) అరిస్టాటిల్ 2) సోక్రటిస్
3) ప్లేటో 4) అగస్టీన్
2. అంతఃపరిశీలన పద్ధతికి సంబంధించి సరికానిది ఏది?
1) దీనిలో పరిశీలించేవారు, పరిశీలించబడే వారు ఒక్కరే
2) ఇది వ్యక్తి చేతనను పరిశీలిస్తుంది
3) ఇది ఆత్మాశ్రయ పద్ధతి
4) దీనిని భాష రానివారిపైన, జంతువులపైన ఉపయోగించలేము
3. ‘మానవ స్వభావాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనోవిజ్ఞానం’ అని తెలిపినవారు
1) ఎడ్విన్ జి.బోరింగ్ 2) ఉడ్వర్త్
3) విలియం జేమ్స్ 4) స్కిన్నర్
4. కింది వాటిలో ఫ్రోబెల్కు సంబంధించినది?
1) స్వయం వివర్తన (self unfolding)
2) విద్యార్థులకు తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు బోధన కొనసాగాలి
3) స్వయం బోధన (self teaching)
4) స్వయం ప్రకాశం (self expression)
5. శిశు మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు ఎవరు?
1) స్కిన్నర్ 2) ఊంట్
3) స్టాన్లీ హాల్ 4) ఫ్రోబెల్
6. సంరచనాత్మక వాదానికి సంబంధించి సరికానిది ?
1) దీనిని ఊంట్ ప్రారంభించాడు
2) ఇది చేతనానుభవాలను వివరిస్తుంది
3) దీనికి కంటెంట్ సైకాలజీ అని పేరు
4) దీని ప్రకారం మనస్సులోని మూలపదార్థాలు అనంతం
7. ‘Behaviour An Introduction to Phsycology’ రచయిత ఎవరు?
1) జె.బి. వాట్సన్
2) విలియం జేమ్స్
3) గాల్టన్ 4) ఊంట్
8. సంజ్ఞానాత్మక సిద్ధాంత రూపకర్త ఎవరు?
1) స్కిన్నర్ 2) పియాజే
3) ఫ్రాయిడ్ 4) విలియం జేమ్స్
9. అవసరాల సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు?
1) స్కిన్నర్ 2) ఊంట్
3) అబ్రహం మాస్లోన్
4) విలియం జేమ్స్
10. రకాల మానసిక రుగ్మతలను అధ్యయనం చేసే మనోవిజ్ఞానశాస్త్రం ఏది?
1) అపసామాన్య మనోవిజ్ఞానశాస్త్రం
2) సామాన్య మనోవిజ్ఞానశాస్త్రం
3) వికాసాత్మక మనోవిజ్ఞానశాస్త్రం
4) అనుప్రయుక్త మనోవిజ్ఞానశాస్త్రం
11. ప్రయోగాత్మక మనోవిజ్ఞానశాస్త్ర ఆద్యుడు ఎవరు?
1) టిష్నర్ 2) కోహ్లెర్
3) ఊంట్ 4) ఫ్రాయిడ్
12. ‘ఒక వ్యక్తి ఆజన్మాంతం పొందే అభ్యసనాను భవాలను వర్ణించి, విశదపరిచేదే విద్యా మనోవిజ్ఞానశాస్త్రం’ అన్నది ఎవరు?
1) స్కిన్నర్ 2) పీల్
3) క్రో అండ్ క్రో 4) గారెట్
13. అతి పురాతన శాస్త్రీయ మనోవిజ్ఞానశాస్త్ర పద్ధతి ఏది?
1) సంఘటన రచన పద్ధతి
2) ఊహా పద్ధతి
3) అంతః పరిశీలన పద్ధతి
4) మనోవిశ్లేషణ పద్ధతి
14. ఒక సంఘటన అధారంగా ప్రవర్తనను అంచనావేసే పద్ధతి ?
1) పరిశీలన పద్ధతి
2) ప్రయోగ పద్ధతి
3) సంఘటన రచన పద్ధతి
4) ఊహా పద్ధతి
15. అంతఃపరిశీలన పద్ధతికి సంబంధించి సరికానిది?
1) ఇది ఎక్కువ వస్తు నిష్ఠమైనది
2) ఇది సంరచనాత్మకవాదుల పద్ధతి
3) చేతనానుభవాల అధ్యయనం చేయవచ్చు
4) భాష రాని వారిపై, పసిపిల్లలపై ప్రయో గించలేం
16. క్రీడా స్థలంలో విద్యార్థుల ప్రవర్తనలను పరిశీలించడం
1) సహజ పరిశీలన
2) నియంత్రిత పరిశీలన
3) సంచరిత పరిశీలన
4) అసంచరిత పరిశీలన
17. పిల్లల్లో ఒకడుగా ఉంటూ పిల్లల ప్రవర్తనను పరిశీలించడం ఏ రకమైన పరిశీలన?
1) సహజ 2) నియంత్రిత
3) సంచరిత 4) అసంచరిత
18. Domeను రూపొందించింది ?
1) పావ్లోవ్ 2) స్కిన్నర్
3) గెసెల్ 4) ఊంట్
19. ఒక వ్యక్తిలోని వివిధ ముఖ్యాంశాలను నిశితంగా, లోతుగా పరిశీలించి, నమోదు చేసి, విశ్లేషించి, వ్యాఖ్యానించడాన్ని ఏమంటారు?
1) ప్రయోగ పద్ధతి
2) క్రమాభివృద్ధి పద్ధతి
3) వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి
4) ప్రయోగ పద్ధతి
జవాబులు
1) 4 2) 1 3) 1 4) 3 5) 3 6) 4 7) 1 8) 2 9) 3 10) 1 11) 3 12) 3 13) 3 14) 3 15) 1 16) 1 17) 3 18) 3 19) 3
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు