ఏ చట్టం ద్వారా 1854 లో లార్డ్ మెకాలే కమిటీ ఏర్పాటైంది?
భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం
- రాజ్యాంగం అనే భావన రాజనీతి శాస్త్రం నుంచి ఉద్భవించింది.
- అరిస్టాటిల్‌ను రాజనీతి శాస్త్ర పితామహుడిగా పేర్కొంటారు.
- భారత రాజ్యాంగ వికాసానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
- ప్రస్తుతం అమలవుతున్న రాజ్యాంగం ఈ రూపం సంతరించుకోవడానికి అనేక చట్టాలు, ఉద్యమాలు సంస్కరణలు దోహదం చేశాయి.
- భారతదేశంలో వ్యాపార, వ్యవహారాలను నిర్వహించుకోడానికి క్రీ.శ.1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ స్థాపన జరిగింది.
- భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం, ఇతర వ్యవహారాలను నిర్వహించింది. వీటిని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ కొన్ని చట్టాలను రూపొందించింది. వీటినే చార్టర్ చట్టాలు అంటారు.
రెగ్యులేటింగ్ చట్టం-1773
- భారత రాజ్యాంగం గురించి తెలుసుకోవడానికి ముందు రెగ్యులేటింగ్ చట్టం 1773 గురించి తెలుసుకోవాలి.
- రెగ్యులేటింగ్ చట్టానికి రాజ్యాంగ వికాసపరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి వ్యాపార రీత్యా వచ్చిన ఈస్టిండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన తొలి చట్టం ఇదే.
- ఇందువల్ల దీన్ని భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టం (First Written Charter)గా పేర్కొంటారు. అంతకుముందు వరకు వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ స్టిండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలన, అధికారాలు సంక్రమించాయి.
- దీంతో భారతదేశంలో కేంద్రీకృత పాలనకు బీజం పడింది.
చట్టంలోని ముఖ్యాంశాలు
- ఈ చట్టాన్ని 1773 మే 18న నాటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నార్త్ ఆ దేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
కంపెనీ వ్యవహారాలను నియంత్రించే ఉద్దేశంతో రూపొందించడం వల్ల దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. - బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు.
- ఇతడికి సలహాలు ఇవ్వడానికి నలుగురు సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
- వారన్ హేస్టింగ్స్‌ను మొదటి గవర్నర్ జనరల్‌గా నియమించారు.
- బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీల గవర్నర్లను బెంగాల్ గవర్నర్ జనరల్‌కు ఆధీనులుగా చేశారు.
- 1774లో ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
- సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ‘ఎలిజా ఇంఫే’.
- సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అంతిమం కాదు. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుపై లండన్‌లోని ప్రీవీ కౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
- ఈస్టిండియా కంపెనీపై బ్రిటిష్ ఆధిపత్యాన్ని మరింతగా పెంచడానికి తమ రెవెన్యూ, పౌర, సైనిక వ్యవహారాల్లో కంపెనీ కోర్ ఆఫ్ డైరెక్టర్స్ నేరుగా ప్రభుత్వానికి బాధ్యత వహించేలా మార్పులు చేశారు.
కంపెనీ అధికారుల వ్యాపార లావాదేవీలను నిషేధించారు. వారు ప్రజల నుంచి లంచాలు బహుమతులు స్వీకరించకుండా కట్టడి చేశారు. - ఇరవై ఏళ్ల వరకు ఈస్టిండియా కంపెనీకి వ్యాపార అనుమతి ఇచ్చారు.
- రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీని ఆశించినంతగా నియ్రంతించలేకపోయారు.
- కేంద్రీకృత పాలనను నిరోధించడం, అధికార సమతౌల్యం లాంటి ప్రయోజనాలు నెరవేరలేదు.
- అదేవిధంగా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక పరిధిపై స్పష్టత ఏర్పడలేదు.
పిట్స్-ఇండియా చట్టం-1784
- రెగ్యులేటింగ్ చట్టం-1773 లోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంట్ పిట్స్ ఇండియా చట్టాన్ని 1784లో ఆమోదించింది.
- బ్రిటన్ ప్రధాని ‘విలియం పిట్స్’ ఈ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. అందువల్ల దీన్ని పిట్స్ ఇండియా చట్టంగా వ్యవహరిస్తారు.
- మొదటిసారిగా ఈ చట్టంలో కంపెనీ ప్రాంతాలను భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా పేర్కొన్నారు.
- ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను రెండు రకాలు(వాణిజ్య, రాజకీయ)గా విభజించారు.
- ‘బోర్డ్ ఆఫ్ కంట్రోల్’ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ వ్యవహారాలను దీనికి అప్పగించారు.
- అప్పటికే ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను వాణిజ్య వ్యవహారాలకే పరిమితం చేశారు.
- గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్నిచ్చారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలోనూ కొన్ని మార్పులు చేశారు.
- కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గించారు.
- ఈ చట్టం వల్ల కంపెనీ పాలనపై ఒక విధమైన అదుపు ఏర్పడింది.
- కోర్ట్ ఆఫ్ డైరెక్షన్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే రెండు స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల పిట్స్ ఇండియా చట్టాన్ని ద్వంద్వ పాలనకు నాంది పలికిన చట్టంగా చెప్పవచ్చు.
- పార్లమెంటేతర నియంత్రణకు తొలి అడుగుగా ఈ చట్టాన్ని ప్రస్తావిస్తారు.
చార్టర్ చట్టం-1793
- మద్రాస్, బొంబాయి గవర్నర్లు, గవర్నర్ జనరల్‌కి ఆధీనులుగా ఉండేవారు.
భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి చేసిన చట్టంగా దీన్ని మార్క్స్, ఏంగెల్స్ అభివర్ణించారు. - కంపెనీ పాలనా కాలంలో రూపొందించిన చట్టాలను చార్టర్ చట్టాలుగా పేర్కొనవచ్చు.
- ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారాలను విస్తృతం చేశారు.
- ఈ చట్టం ద్వారా కంపెనీ వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరో 20 ఏళ్లకు పొడిగించారు.
- ఈ చట్టం మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది.
- బోర్డు కార్యదర్శిని పార్లమెంటులో కూర్చోవడానికి అనుమతించింది
చార్టర్ చట్టం-1813
- ఈ చట్టం ఈస్టిండియా కంపెనీ ఏకస్వామ్యాన్ని రద్దుపరిచింది. తేయాకు తప్ప బ్రిటిష్ వారందరికీ భారత దేశంలో వ్యాపారం నిర్వహించుకోవడానికి అవకాశం ఇచ్చింది.
- ప్రతి సంవత్సరం భారతదేశంలో ప్రాథమిక విద్యాభివృద్ధికి రూ.1,00,000 ఖర్చు చేయడానికి ప్రతిపాదించింది.
- క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో మత ప్రచారం నిర్వహించడానికి మత కార్యకలాపాలు అభివృద్ధి చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది
చార్టర్ చట్టం 1833
- ప్రైవేట్ వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కును కల్పించింది.
- స్థానిక స్వపరిపాలన సంస్థల్లో పన్నులు విధించే అవకాశం, అధికారం ఈ చట్టం ద్వారా కల్పించారు.
బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఈ చట్టం ద్వారా ఇండియన్ గవర్నర్ జనరల్‌గా మార్చారు. - ఈ హోదాలో మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్.
- ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లకు పొడిగించారు.
- రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలు రద్దయ్యాయి.
- కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలు లభించాయి.
- కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి పరిపాలనా సంస్థగా మార్చారు.
చార్టర్ చట్టం 1853
- సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనీన పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
- భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ ‘లా’ కమిషన్‌ను నియమించారు. దీనికి తొలి అధ్యక్షుడు లార్డ్ మెకాలే.
- ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా అభివర్ణిస్తారు.
- ఈ చట్టం ఈస్టిండియా కంపెనీ చార్టర్ చట్టాల్లో చివరిది.
- అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఇదే.
- ప్రతి 20 ఏళ్లకోసారి చార్టర్ చట్టాలను పొడిగించడం అనే ఆనవాయితీ ప్రకారం దీన్ని రూపొందించారు. కానీ దీని ద్వారా కంపెనీ పాలనను పొడిగించలేదు.
- దీంతో కంపెనీ పాలన త్వరలోనే అంతమవుతుందని సూచించినట్లయింది.
- గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన, కార్యనిర్వాహక విధులను విభజించారు. శా
- సనాలు రూపొందించే ప్రక్రియ కోసం ‘ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
- ఇది బ్రిటిష్ పార్లమెంటులో విధులు నిర్వర్తిస్తుంది. అందువల్ల దీన్ని మినీ పార్లమెంట్‌గా పేర్కొంటారు.
- కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించారు. మొత్తం ఆరుగురు శాసనసభ్యుల్లో మద్రాసు, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నలుగురిని తీసుకున్నారు.
- సివిల్ సర్వీసు నియామకాల్లో సార్వజనీన పోటీ విధానం ప్రవేశపెట్టారు. దీని కోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
బ్రిటిష్ రాణి/రాజు పాలన (1858-1947)
- వివిధ ‘లా కమిషన్ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్‌కోడ్ (1860) క్రిమినల్ కోడ్ (1861)ను రూపొందించారు.
- కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధి పేర్కొనకపోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి చార్టర్ చట్టం మార్గం సుగమం చేసిందని భావిస్తారు. భారతీయులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించకపోవడం వల్ల తర్వాత జరిగిన పరిణామాలు సిపాయిల తిరుగుబాటుకు దారితీశాయి.
- 1858 నుంచి రాజు లేదా రాణి నేరుగా అధికారాన్ని చేపట్టడం వల్ల ఆ తర్వాత చేసిన చట్టాలను/ సవరణలను భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలు అంటారు.
భారత రాజ్యాంగ చట్టం -1858
- 1857 సిపాయిల తిరుగుబాటుతో భారతదేశంలో కంపెనీ పాలన అంతమై చక్రవర్తి బ్రిటిష్‌రాజు/రాణి పరిపాలన వచ్చింది. అది భారత రాజ్యాంగ చరిత్రలో ఒక నూతన అధ్యాయం.
- బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న భారత పరిపాలనా అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేసింది.
- గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్
- దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి వైస్రాయ్. ఇతడు బ్రిటిష్ రాణిపేరుపై దేశపాలన నిర్వహిస్తాడు.
- 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయింది.
- భారతదేశంలో అత్యున్నత స్థానాన్ని కలిగిన వైస్రాయ్‌ని రాజ ప్రతినిధిగా 5 ఏళ్ల కాలానికి నియమించారు. ఇతడికి సహాయంగా ఒక కార్యనిర్వాహక మండలి ఉండేది.
- భారత రాజ్య కార్యదర్శి’ అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడు బ్రిటిష్ మంత్రి వర్గానికి చెందిన వ్యక్తి అన్ని విషయాల్లో ఇతడిదే తుది నిర్ణయం.
- ఇతడికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి చార్లెస్ వుడ్.
- వైస్రాయ్, గవర్నర్ జనరల్ అనే రెండు హోదాలు ఒకరికే ఉంటాయి. బ్రిటిష్ రాజు రాణి ప్రతినిధిగా వైస్రాయ్, భారతదేశ పాలనా పరంగా గవర్నర్ జనరల్‌గా వ్యవహరిస్తారు.
- దేశంలో పాలనా పరమైన అంశాలను ముఖ్యంగా ప్రభుత్వాన్ని నియంత్రించడానికి 1858 చట్టాన్ని చేశారని, వీటికి సంబంధించిన మార్పులను ఇంగ్లండ్‌లో చేశారేగానీ , భారత్‌లోని పాలనా వ్యవస్థలకు ఎలాంటి మార్పులు చేయలేదని విమర్శకుల అభిప్రాయం.
- బ్రిటిషర్లు భారత్‌లో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాల్లో అతి పెద్దది ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం నమూనాగా వర్ణిస్తారు. రాజ్యాంగంలోని సుమారు 60 శాతం అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించారు.
- ఈ చట్టం ప్రధానంగా స్వయం పాలనకు ఉద్దేశించింది. దీనిద్వారా మొదటిసారిగా కేంద్రంలో సమాఖ్య వ్యవస్థ, రాష్ర్టాల్లో ద్విసభా విధానాన్ని ప్రతిపాదించారు.
భారత కౌన్సిల్ చట్టం-1861
- గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్సులను జారీచేయు అధికారం కల్పించారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారు 1. పాటియాల మహారాజు, 2. బెనారస్ మహారాజు, 3. సర్ దినకర్రావు.
- మొదటిసారిగా భారతదేశంలో కలకత్తాలోని పోర్టు విలయంలో 1862వ సంవత్సరంలో హైకోర్టును ఏర్పాటు చేశారు.
- పోర్టుఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారు.
- భారత కౌన్సిల్ చట్టం -1909 (మింటోమార్లే సంస్కరణలు)
- మార్లే- భారత ప్రభుత్వ కార్యదర్శి
- మింటో – వైస్రాయ్ ఆఫ్ ఇండియా
- లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ చట్టం ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది.
- మింటోను మత నియోజకవర్గాల పితామహుడని పిలుస్తారు.
- మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు.
- కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఇంపీరియల్ లెజిస్లేచర్‌గా పేర్కొన్నారు.
- మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు బ్రిటిష్ వారికి సహకరించినందుకు యుద్ధానంతరం డొమినియన్ స్టేటస్‌తో కూడిన పాక్షిక స్వాతంత్య్రాన్ని ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
- ఇది భారతదేశాన్ని విభజించడానికి జరిగిన మొదటి ప్రయత్నం
(టాపర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మేడిపల్లి, హైదరాబాద్ సౌజన్యంతో)
Previous article
బౌద్ధవిద్య ప్రాథమిక విద్యా కాలం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు