ఎవరి రాజమందిరం గురజాత్ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది?
రాజ కట్టడాలు
క్రీ.శ. 8-18 శతాబ్దం మధ్యలో నిర్మించిన కట్టడాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు.
1. కోటలు, రాజభవంతులు, సమాధులు- రక్షణ కోసం, సురక్షితం కోసం, సేద తీరడానికి
2. ప్రజలకు ఉపయోగపడే కట్టడాలు- దేవాలయాలు, మసీదులు, చెరువులు, బావులు, వాహనశాలలు, బజారులు
ట్రాబీట్
- రెండు నిలువు స్తంభాలపై అడ్డంగా దూలాలను ఉంచి పై కప్పు ద్వారాలు, కిటికీలు అమర్చే విధానం.
- క్రీ.శ. 8-13 శతాబ్దం మధ్య దేవాలయాలు, మసీదులు, సమాధులు, భవంతులు, దిగుడు బావుల నిర్మాణానికి ఈ స్థితినే ఉపయోగించారు.
12వ శతాబ్ద నిర్మాణ శైలులు
రెండు రకాలు 1) ఆర్కుయేట్ 2) కట్టుబడి సున్నం
ఆర్కుయేట్ విధానం
- తలుపులు కిటికీలపై ఉంచిన మొత్తం నిర్మాణ బరువును కమానుల మీద మోపడం.
- సొరంగాలపై కప్పులకు, గుమ్మటం పైకప్పులకు ఈ విధానాన్ని అనుసరించాలి.
- క్రీ.శ. 1190 తర్వాత భవనాల నిర్మాణంలో ఎక్కువగా కట్టుబడి సున్నం, గులకరాళ్ల మిశ్రమాన్ని ఉపయోగించారు.
- ఎంతపెద్ద కట్టడమైనా దీంతో సులభంగా కట్టవచ్చు. కమానులకు గోళాకార పై కప్పులకు దీనినే ఉపయోగించారు.
శబరీయ మహాదేవాలయం- చందేలులు
- నిర్మాత గంగదేవుడు (చందేలులు- ఎ.డి.999)
- వెలుపల నుంచి లోపలకు నిర్మాణ వరుసక్రమం
- తోరణ ప్రవేశ ద్వారం
- విశాల మహామండపం/ నాట్యమండపం
- గర్భగృహం/ దేవుని విగ్రహం
- గర్భగృహంలో పూజలు- రాజకుటుంబం + పూజారులు
- ఖజురహో దేవాలయంలో రాజులకు మాత్రమే ప్రవేశం కలదు. సామాన్యులకు ప్రవేశం లేదు.
విజయనగర రాజుల వైఖరి
- యావత్ దక్షిణ భారత ప్రధాన రాజధాని- విజయనగరం.
- వీరు తమ దేవాలయ నిర్మాణాల్లో చోళ-పాండ్య(తమిళనాడు) చక్రవర్తుల విధానాలను అనుసరించారు.
- గోపురాల విషయంలో శ్రీకృష్ణ దేవరాయలు ప్రత్యేక శ్రద్ధను చూపించేవారు.
- వీరు మొదటి అంతస్థును- గ్రానైట్ రాయితో మిగిలిన అంతస్థులను ఇటుక సున్నంతో నిర్మించారు.
- రాజగోపురాలను ఎత్తుగా, గర్భాలయాలపై ఉన్న గోపురాలు చిన్నవిగా నిర్మించారు. దీనికి గల కారణం దూరం నుంచి చూసినా ఇక్కడ గుడి ఉందని తెలియడానికి.
విరూపాక్ష దేవాలయం
- 9-10 శతాబ్దం మధ్య విగ్రహ స్థాపన జరిగింది.
- విజయనగర రాజ్య స్థాపన తర్వాత దేవాలయాన్ని విశాలం చేశారు.
- మూల విరాట్‌కు ఎదురుగా ఉన్న విశాల గదిని శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించిన సందర్భంగా నిర్మించారు.
- తూర్పు గోపుర నిర్మాణం వారి కళాపోషణను తెలియజేస్తుంది.
- దేవాలయాల్లో గదులను అనేక కార్యక్రమాలకు ఉపయోగించేవారు.
- ఉదా: ఉత్సవ విగ్రహాలను ఉంచడానికి, సంగీత, నృత్యనాటికలు.
రాజమందిరాలు
- విజయనగర రాజులు లౌకిక కార్యక్రమాల కోసం వీటిని నిర్మించారు.
- వీటి నిర్మాణంలో ‘సుల్తానుల’ సాంకేతిక పరిజ్ఞానాన్ని పాటించారు.
- ఉదా: ఎ) పద్మమహల్- బ్రిటిష్‌వాళ్లు, సందర్శకులు దీనిని ఇలా పిలిచేవారు.
- బి) రాజుల స్నానఘట్టం
- సి) గజశాల
- భవంతుల నిర్మాణాల్లో కమాన్లు, గుండ్రని పై కప్పులు ఉన్నాయి. ఇవన్నీ పుష్పాలు, పక్షుల ఆకారంలో అలంకరించి ఉంటాయి.
మహానవమి దిబ్బ
- 11 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 55 అడుగుల ఎత్తులో నిర్మించిన వేదిక (5 అంతస్థుల భవంతి కంటే పొడవైనది)
- 200 సంవత్సరంలో కనీసం 3 సార్లయినా ఎత్తును పెంచారు.
- వేదిక అంచుల్లో శిల్పాలు, వేదిక మీద చెక్క స్తంభాలతో పందిరి కలదు. వేదికపై భవంతులు లేవు.
- దీనిపై నవరాత్రిపూజ+ దసరా దర్బారు నిర్వహించేవారు. ఐరోపా రాయబారులు ఇతర సుల్తానులు ఈ ఉత్సవాలకు వచ్చేవారు.
మొఘలుల నిర్మాణ శైలి
- నిర్మాణాలు: 1) ఉద్యానవనాలు/ చార్‌బాగ్‌లు 2) సమాధులు 3) కోటలు
- బాబర్ తన స్వీయ చరిత్రలో (బాబర్నామా) తోటల మీద తనకున్న మక్కువను వివరించాడు.
- ఉద్యాన వనాలను దీర్ఘచతురస్రాకారంలో కృత్రిమ కాలువల ద్వారా 4 భాగాలుగా (చార్బాగ్) విభజించి వాటికి ప్రాకారపు గోడలు ఉండాలని బాబర్ వర్ణించాడు.
- ఉద్యానవనాల నిర్మాణాన్ని ప్రారంభించింది- అక్బర్
- కశ్మీర్, ఢిల్లీ, ఆగ్రాల్లో ఉద్యనవనాలను జహంగీర్, షాజహాన్ నిర్మించారు.
- క్రీ.శ.1562-71 మధ్య హుమాయూన్ సమాధి, 1620-34 మధ్య కశ్మీర్లో చార్బాగ్, 1637లో తాజ్‌మహల్‌లో చార్బాగ్ల నిర్మాణం జరిగింది.
- అక్బర్ నిర్మించిన సమాధులు మధ్య ఆసియాకు చెందిన తైమూర్ కట్టడాలను పోలి ఉన్నాయి.
- మొఘలుల నిర్మాణ లక్షణాలు- గోపురాల మీద గోళాకార పై కప్పులు- ఎత్తయిన పొడవైన ముఖద్వారాలు
వంశాలు-కట్టడాలు
- విజయనగర రాజులు
- 1. విరూపాక్ష దేవాలయం
- 2. రాణుల స్నాన ఘట్టం
- 3. గజశాల
- 4. పద్మమహల్
- 5. విఠలాలయాలు
- 6. మహానవమి దిట్ట
- 7. గోపురాలు
- 8. విమానాలు
- 9. రామచంద్రాలయం
- 10. బాలశ్రీకృష్ణ
మొఘలులు
- 1. తాజ్‌మహల్
- 2. ఎర్రకోట
- 3. జోధా బాయి మందిరం
- 4. జామీ మసీద్
- 5. దివాన్-ఇ-ఖాస్
- 6. దివాన్-ఇ-ఆమ్
- 7. హుమాయున్ సమాధి (అష్ట్బిహిస్ట్)
- 8. చార్బాగ్
ఢిల్లీ సుల్తానులు
- 1. కుతుబ్ మినార్
- 2. కున్వత్ ఉల్ ఇస్లామియా
- 3. అలై దర్వాజా
చందేలులు
- 1. కందిరీయ
- 2. మహాదేవ శివాలయం
నిర్మాణ నైపుణ్యాలు
- 1. టూ ఆర్చ్
- 2. ట్రాబీట్/కార్బెల్ట్
ట్రూ ఆర్చ్
- మసీదు మధ్యభాగంలో అర్ధ చంద్రాకారంలో ఉండే కీలకమైన రాయి
- ఈ కట్టడ మొత్తం బరువు ఆర్చ్ ఆధార పీఠానికి అమర్చబడి ఉంటుంది.
- ఉదా: ఎ) అలై దర్వాజ
- బి) కువ్వత్ ఉల్ ఇస్లామియా
హుమాయూన్ సమాధి అష్ట్బిహిస్ట్ (8స్వర్గాలు)
- 1562-71 మధ్య ఈ సమాధిని నిర్మించారు.
- సమాధి మధ్యలో పెద్ద గది ఉండి చుట్టూ 8 గదులుంటాయి.
- దీనిని ఎర్రరాతితో కట్టి అంచులకు పాలరాతిని తాపడం చేశారు.
- షాజహాన్ కాలంలో – శిల్ప, వాస్తురీతులతో మిళితం చేసిన ఎత్తయిన భవనాలను నిర్మించారు.
- దివాన్-ఇ-ఖాస్ నిర్మాత షాజహాన్
- ఇతరపేర్లు- దివాన్-ఇ-ఆమే/ చిహిల్ సుతున్/ 40 స్తంభాల గది మసీదును పోలి ఉంటుంది.
కిబ్లా
- రాజసింహాసనం కింద ఉన్న స్తంభాన్ని పవిత్ర ‘కిబ్లా’గా భావిస్తారు. ఎందుకంటే ముస్లింలు ప్రార్థన చేసే సమయంలో చూసే దిక్కు మక్కా వైపు ఉంటుంది.
- యమునా నదికి ఎడమవైపు తాజమహల్ ఉంది.
- షాజహాన్ నిర్మించిన న్యాయస్థానం (ఢిల్లీ) రాజన్యాయానికి, సామ్రాజ్య ఆస్థానానికిమధ్య ఉన్న సంబంధాలను తెలియజేస్తుంది.
- రాజసింహాసనం వెనుకవైపు దైవసంబంధిత ‘పీడ్రాడురా చిత్రాలు, గ్రీకు దేవుడు ఆర్పియస్ (సంగీతం, క్రూర జంతువులు విభేదాలు మాని కలిసి ఉండేలా చేస్తుంది) గిటారు వాయిద్యాన్ని వాయిస్తున్నట్లుగా ఉంది.
యమునా నది
- షాజహాన్ కాలంలో రాజధాని ఆగ్రాలో ప్రముఖులు వారి గృహాలను యమునా నదీ తీరంలో నిర్మించారు.
- ఈ గృహాలు చార్బాగ్ మధ్యలో నిర్మితమైనవి. ఈ చార్బాగ్ను చరిత్రకారులు నదీముఖ ఉద్యానవనంగా వర్ణించారు.
- ఢిల్లీలో కొత్తగా కట్టిన షాజహానాబాద్ నగరంలో కూడా నిర్మించిన రాజభవనం నదికి అభిముఖంగా ఉంది.
- జోధాబాయి రాజమందిరం గుజరాత్ నిర్మాణ సంస్కృతిని తెలియజేస్తుంది.
- ఆగ్రా కోటలో వాటర్‌గేట్ నిర్మాణం అక్బర్నామా (1590-95)
- షాజహాన్ తన నూతన రాజధాని షాజహానాబాద్లో 1650-56 జామి మసీదును నిర్మించాడు.ఢిల్లీ సుల్తానులు – నిర్మాణశైలి (1206-1520)
- కుతుబ్ మినార్
- ఢిల్లీలోని 5 అంతస్థుల కట్టడం. మొదటి అంతస్థు కుతుబుద్దీన్ ఐబక్ (1199)
- పూర్తి చేసింది ఇల్ టుట్ మిష్ (1229)
- మొదటి అంతస్థు వసారా కింద
- ఎ) క్షేత్ర గణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులు
- బి) రెండు వరుసల్లో అరబ్బీ భాషలో శాసనాలు కలవు. వసారా పైభాగం కోణాకారంలో వంగి ఉంటుంది.
- ఇది పిడుగులు, భూకంపాల తాకిడికి గురికాగా, ఫిరోజ్‌షా తుగ్లక్ మరమ్మతులు చేయించాడు.
తంజావూరులో బృహదీశ్వరాలయం
- ఆ కాలంలోని దేవాలయాన్నింటిలోనూ ఎత్తయిన శిఖరం కలిగినది.
- 90 టన్నులు రాతిని శిఖరంపై చేర్చడానికి వీలుగా ఉన్న మార్గాన్ని నిర్మించి రెండు చక్రాల బండిని చేసి దానికి ఈ రాతిని పెట్టి దొర్లించుకుంటూ శిఖరం పై భాగానికి చేర్చారు.
- ఈ మార్గం దేవాలయ శిఖరానికి 4 కి.మీ దూరం నుంచి మొదలైంది. దేవాలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ మార్గాన్ని తొలగించారు.
దేవాలయాలు – ధ్వంసం
- క్రీ.శ 9వ శతాబ్దం ప్రారంభంలో పాండ్య రాజైన ‘శ్రీమార శ్రీవల్లభుడు’ శ్రీలంక పై దాడిచేసి సేన-1ను ఓడించాడు.
- దీని కోసం ‘ధమ్మకిత్తి’ (బౌద్ధ సన్యాసి, చరిత్రకారుడు) ఇలా తెలియజేశాడు.. ‘రత్నభవనంలోని బంగారంతో చేసిన బుద్ధ విగ్రహాన్ని ఆరామాల్లో ఉన్న బంగారు ప్రతిమలను దోచుకొని వెళ్లాడు.
- 2వ సేనుడు తన సేనానికి మధురై మీదకు దండెత్తి బుద్ధుని బంగారు విగ్రహాన్ని తిరిగి తెమ్మని పంపాడని బౌద్ధ బిక్షువు రచించాడు.
- 11వ శతాబ్దం ప్రారంభంలో చోళరాజైన మొదటి రాజేంద్రుడు ఒక శివాలయాన్ని నిర్మించి, కొంతమంది రాజులను ఓడించి విగ్రహాలతో నింపాడు.
- 1. చాళుక్యులు- నిలబడిన సూర్యుని శిల్పం
- 2. తూర్పు చాళుక్యులు- గణేష్, దుర్గాదేవి, నంది విగ్రహం
- 3. కళింగరాజులు- భైరవ విగ్రహం (శివుడు)
- 4. పాలవంశం- కాళీమాత
దేవాలయాలు, మసీదుల నిర్మాణాలు
- ఇవి శక్తి భక్తి సంపదకు గుర్తు
- రాజరాజ దేవుడనే రాజు రాజేశ్వరునికి గుడి కట్టించి కొలవడానికి కారణం. దేవుని ప్రతిరూపంలో రాజు కనపడాలని కోరుకోవడం
- కాకతీయుల కాలంలో స్వయంభు శివాలయం కోట మధ్యలో నిర్మించారు. తాము స్వతంత్రులమని, తమ అధికారాన్ని గొప్పతనాన్ని చాటుటకు దీన్ని నిర్మించారు.
- దేవాలయాలను రాజులు కట్టించగా, చిన్న చిన్న విగ్రహాలను రాజపరివారం, సామంతులు నిర్మించారు.
- క్రీ.శ. 12వ శతాబ్దం నాటికి దేవాలయాలు, పెద్ద వ్యవస్థలుగా ఆవిర్భవించి నర్తకులు, సంగీత విద్వాంసులు, పూజారులు, సేవకులు మొదలైన వారికి ఉపాధిని కల్పించాయి.
- దేవాలయాలు, గ్రామాల్లో పన్నులు వసూలు చేసి వ్యాపారులకు ధనాన్ని అప్పుగా ఇచ్చేవారు.
- జాతరలను, సంతలను, ఉత్సవాలను జరిపేవారు.
- పర్షియన్లు సుల్తానును భగవంతుని నీడ అని వర్ణించారు.
- ఢిల్లీ మసీదులో శాసనం- భగవంతుడే అల్లావుద్దీన్‌ను రాజుగా నియమించాడని, గతంలో న్యాయరూపకర్తలు అయిన ‘మోసెస్ & సాల్మన్లకు ఉన్న గుణాలన్నీ ఇతనికి ఉన్నాయని పేర్కొన్నది.
- ఇల్ టుట్ మిష్ -హౌస్-ఇ-సుల్తాని లేదా రాజుగారి జలాశయంను నిర్మించాడు (దేహ్లీ-ఇ-కుహనా వెలుపల).
- అమృతసర్‌లో హర్మిందర్ సాహిబ్ (స్వర్ణదేవాలయం) చుట్టూ పవిత్ర సరస్సు ఉంటుంది.
Previous article
ఏ చట్టం ద్వారా 1854 లో లార్డ్ మెకాలే కమిటీ ఏర్పాటైంది?
Next article
PHYSICS IMPORTANT QUESTIONS
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు