అభ్యసన నిర్వహణ విధానాలు ఎలా ఉంటాయి?
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పలు వ్యూహాలను అనుసరించాలని విద్యావేత్తలు సూచించారు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థ పలు మార్పులకు లోనవుతూ ఉంది. ఉపాధ్యాయ కేంద్రిత బోధన నుంచి శిశుకేంద్రిత విద్యా విధానం వైపునకి మన దృష్టి మళ్లింది. ఉపాధ్యాయుడు విద్యార్థికి అభ్యసనా సహాయకుడిగా రూపాంతరం చెందాడు. ఉపాధ్యాయ కేంద్రంగా ఉండే పరీక్ష విధానం విద్యార్థి కేంద్రంగా మారింది.
విద్యార్థి కేంద్రీకృత అభ్యసన విధానం
ఆధునిక విద్యావిధానం ముఖ్యలక్షణం విద్యార్థి కేంద్రీకృత అభ్యసన విధానం, విద్యార్థి అవసరాలకు ఆసక్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. సాంప్రదాయక విద్యావిధానం విద్యార్థి ఆలోచనలతో పనిలేకుండా ‘బట్టీ’ విధానాన్ని బలపరుస్తుంది. ఆ విధానానికి వ్యతిరేకంగా వచ్చిందే ‘విద్యార్థి కేంద్రీకృత విద్య’.
విద్యార్థి కేంద్రీకృత విద్యకు దోహదం చేసే అంశాలు
- గ్రీకు తాత్వికుడు సోక్రటీస్ విద్య వ్యక్తి తనను తాను తెలుసుకునేలా (Know the self) ఉపకరించాలని పేర్కొన్నాడు.
- విద్యార్థి అనుభవాల ద్వారా విద్యను అందించాలని (Experence-based education) మొదటగా చెప్పినది జాన్లాక్ రచించిన గ్రంథం ‘An essay concening Human understanding’లో శిశువు మనసును ఖాళీ పలకతో పోలుస్తూ వివిధ అనుభవాలను విద్యార్థికి కల్పించి, దాని ద్వారా వచ్చే అనుభూతులతో అతని మనసును నింపాలని చెప్పాడు.
- రూసో తన విద్యార్థులు ‘ఎమైల్’ (Emile), ‘సోఫియా’ (sophia) లకు బోధించిన అనుభవాలతో Emile పుస్తకాన్ని రచించాడు. ఇందులో ఇప్పటి వరకు ఆచరణలో లేని విద్యా విధానాన్ని తెలియజేశాడు. ఇది సహజ సిద్ధ్దంగా విద్యార్థి కేంద్రీకృత, అనుభవపూర్వకమైన జ్ఞానం (experience based) అనే లక్షణాలను కలిగి ఉంది.
- పెస్టాలజీ రూసో భావాలతో ప్రభావితుడై విద్యార్థి కేంద్రీకృత బోధనను జరిపే ఒక పాఠశాలను రూపొందించాడు. మొదటగా చైల్డ్ సెంటర్డ్ విద్యా ప్రణాళికతో పాఠశాలను ప్రారంభించినది పెస్టాలజీ.
- ప్రోబెల్ మొదటి ‘కిండర్ గార్డెన్’ పాఠశాలను స్థాపించాడు. ఇతడు ‘Play-Way’ భావనను ప్రవేశపెట్టాడు.
జాన్ డ్యూయీ మొదటి సారిగా పాఠశాలను సమాజంతో ముడిపెట్టాడు. పాఠశాల ఒక చిన్నపాటి సమాజంగా పేర్కొన్నాడు. విద్య అంటే జీవించడానికి కావాల్సిన నైపుణ్యాలను నేర్పించడం కాదు. - ‘జీవితమే విద్య’ అని పేర్కొన్నాడు. జాన్ డ్యూయీ తర్వాత Learner centered విద్యకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించినది 1919లో అమెరికాలో స్థాపించిన ‘ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అసోసియేషన్’.
మానవాత్మక ఉపగమం (Humanistic Approach)
- ఈ విధానం వల్ల ఆత్మభావన అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తుంది.
- ఈ ఆత్మభావన అభివృద్ధికి విద్య పిల్లలు అభ్యసన ప్రక్రియ అంతర్గతంగా ప్రేరణ పొందినప్పుడే అందులో పూర్తిస్థాయిలో తమ సంవేదనలు (Feelings), బుద్ధిని (Intellect) ఉపయోగిస్తారు.
- మానవాత్మక ఉపగమాన్ని ప్రతిపాదించిన వారిలో ముఖ్యుడు ‘కార్ల్ రోజర్స్’ ఇతను తన ‘ఫ్రీడమ్ టు లెర్న్’ అనే గ్రంథంలో అనుభవాత్మక అభ్యసనా సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
- వీరు అభ్యసన ప్రక్రియకు మూలం విద్యార్థి ఆత్మ భావన (సెల్ఫ్ రెస్పెక్ట్), ఆత్మగౌరవం (సెల్ఫ్ ఎస్టీమ్) అంటారు.
నిర్మాణాత్మక ఉపగమం (Constructive Approach)
- ఈ విధానం వ్యక్తి తన సొంత జ్ఞానాన్ని తానే సృష్టించుకోవాలని చెబుతుంది.
- ఈ జ్ఞానం సృష్టించుకోవడానికి వివిధ కొత్త పరిస్థితులను ఎదుర్కొని పరిశీలన, శాస్త్రీయ అధ్యయనం సహాయంతో వ్యక్తి జ్జానాన్ని నిర్మించుకుంటాడని పేర్కొంటుంది.
- దీని ప్రకారం విద్యార్థి తన స్వీయ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవాలి. విజ్ఞానాన్ని అందించడంలో ఉపాధ్యాయుడు క్రియాశీలకునిగా ఉంటాడు.
- కాబట్టి పునరుత్పన్నానికి బదులు విద్యార్థికి వివిధ కృత్యాలు లేదా సమస్యా పరిష్కారానికి అన్వేషణ పద్ధతి, ప్రయోగ పద్ధతికి ప్రాధాన్యత ఇస్తారు.
- బోధనాభ్యసన ప్రక్రియలో (Mentoring, Reciprocal Tea ching, Problem based Instruction collabarative learning) అనే నూతన భావనలను ప్రవేశపెట్టారు.
- ఈ ఉపగమనం ప్రతిపాదించిన వారిలో ముఖ్యలు పియాజే, వైగాట్స్కీ.
ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య
- ఉపాధ్యాయునికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
- ఉపాధ్యాయుడు మాట్లాడుతాడు. విద్యార్థి వింటాడు. (మాట్లాడే పద్ధతి)
- విషయాల ఎంపిక, వివరణ ఉపాధ్యాయుడే నిర్వహిస్తాడు.
- భాషణ రూపాలకు ప్రాముఖ్యత ఇస్తారు.
- ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థి పలుకును, మానిటర్ చేసి సరిచేస్తాడు. మూల్యాంకనం నిర్వహిస్తాడు.
- విద్యార్థి నిష్క్రియాత్మకంగా ఉంటాడు.
- తరగతి గతి నిశ్శబ్దంగా ఉంటుంది.
విషయ కేంద్రీకృత విద్య
- ఈ విధానంలో బోధించాల్సిన విషయం ప్రాధాన్యతాంశం. విషయ ప్రణాళికను వివిధ సబ్జెక్టులుగా విభజించడం జరుగుతుంది. వాటిని నిర్ణీత కాల వ్యవధిలో బోధించడం ఉపాధ్యాయుడి విధి. దీనినే Curiculum centered teaching
- ఇందులో విద్యార్థి అభిరుచి, ఆసక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగదు. నిపుణులైన కొంత మంది బృందం కలిసి తయారు చేసిన విషయ ప్రణాళిక తరగతిలో బోధించబడుతుంది.
- విద్యార్థి అవసరాలకు, ఆసక్తులకు లేదా ఉపాధ్యాయుని నిర్ణయాలకు అనుగుణంగా బోధించాల్సిన విషయాన్ని మార్చడానికి వీలుకాదు.
- ఇంకో విధంగా చెప్పాలంటే ప్రస్తుత MBA, MCA అన్ని కూడా ఈ తరహాకు చెందినవే. ఏం బోధించాలి? ఎలా బోధించాలి? ఎప్పుడు బోధించాలి? అన్న విషయాలు విద్యార్థితో సంబంధం లేకుండానే నిర్ణయించబడతాయి.
- ఒక విధంగా టీచర్కు కూడా సంబంధం ఉండదు. విషయ ప్రధానంగా జరగడం వల్ల అభ్యాసకునిలో అవగాహన, వినియోగం, నైపుణ్యాలు అభివృద్ధి చెందవు. ఇది విద్యార్థుల వైఖరులను, నైపుణ్యాలను పెంపొందించలేని పద్ధతి.
- ఈ విధానంలో అభ్యాసకుని కంటే విషయానికే ప్రాముఖ్యత ఇస్తారు.
- ఇది జ్ఞానానికి సంబంధించిన పద్ధతి.
- ఉదాహరణ: చరిత్ర Knowledge dumping జరుగుతుంది.
- పోటీ పరీక్షలు విషయ కేంద్రీకృతంగా ఉంటాయి.
- ఉదా: డీఎస్సీ, టెట్
- జ్ఞాపకశక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.
- విషయ ప్రధానంగా జరగడం వల్ల అభ్యాసకునిలో అవగాహన, వినియోగం, నైపుణ్యాలు అభివృద్ధి చెందవు.
- ఇది విద్యార్థుల్లో వైఖరులు, నైపుణ్యాలు సరిగా పెంపొందించలేని పద్ధతి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు