వ్యాకరణ కార్యం ప్రకారం జరిగే సంధిని ఏమంటారు?
ద్రుతప్రాకృత సంధి (సరళాదేశ సంధి)
సూత్రం 1
ద్రుతప్రాకృతం మీది పరుషాలకు సరళాలగును
ద్రుతం = న కారం పొల్లు
ఏ పదం చివర ‘న’ కారం వచ్చి చేరుతుందో దాన్ని ద్రుతప్రాకృతం అంటారు.
ఉదా. 1. పూచెన్ + కలువలు = పూచెఁగలువలు, పూచెన్గలువలు
2. తోచెన్ + చుక్కలు = తోచెఁజుక్కలు, తోచెన్జుక్కలు
సూత్రం 2
ఆదేశ సరళానికి బిందు సంశ్లేష విభాష
ఉదా. 1. పూచెన్ + గలువలు = పూచెంగలువలు, పూచెన్గలువలు
2. తోచెన్+జుక్కలు = తోచెంజుక్కలు, తోచెన్జుక్కలు
3. చేసెన్+డక్కులు = చేసెండక్కులు, చేసెన్డక్కులు
కోడ్- ద్రుతప్రాకృతం మీది పరుషం మొదటి
సూత్రం [ఁ,న్ రూపాలు]
ద్రుతప్రాకృతం మీది సరళాలు రెండవ
సూత్రం [ం, ఒత్తు రూపాలు]
విశేషణం – గుణం
విశేష్యం – పేరు
విశేషం – విలువ
టు-గాగమ సంధి
కర్మధారయం యందు ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి టుగాగమ.
ఉదా. 1. చిగురు+ఆకు = చిగురుటాకు
2. ఎండు+ఆకు = ఎండుటాకు
3. నిగ్గు+అద్దము = నిగ్గుటద్దము
ప్రాతాది సంధి
ప్రాతాదుల తొలి అచ్చు మీది వర్ణములకెల్ల లోపంబు బహుళము.
ఉదా. 1. లేగ+దూడ = లేదూడ
2. పూవు+రెమ్మ= పూరెమ్మ
ప్రాతాదులు – ప్రాత, కెంపు, లేత, చెన్ను,పూవు, క్రిందు, మీదు, క్రొత్త మొదలైనవి.
అత్త్వసంధి- అత్తునకు సంధి బహుళము
అత్తు అంటే హ్రస్వము – ‘అ’
బహుళములు నాలుగు విధాలు
1. నిత్యము
2. నిషేధము
3. వైకల్పికం
4. అన్యవిధము
1. నిత్యము (ప్రవృత్తి)
వ్యాకరణ కార్యము ప్రకారంగా సంధి జరిగితే అది నిత్యము.
ఉదా. ఎ) రామ+అయ్య= రామయ్య
బి) సీత+అమ్మ = సీతమ్మ
2. నిషేధము (అప్రవృత్తి)
వ్యాకరణానికి విరుద్ధంగా జరిగితే అది నిషేధం
ఉదా – ఎ) అమ్మ+ఇచ్చెను = అమ్మయిచ్చెను
3. వైకల్పికం (ద్విభావ)
రెండు విధాలుగా జరుగుతుంది.
(నిత్యం, నిషేధం)
ఉదా- ఎ) మేన+అల్లుడు = మేనల్లుడు, మేనయల్లుడు
బి) మేన+అత్త = మేనత్త, మేనయత్త
4. అన్యవిధము (అన్యదేవ)
అనుకున్న రూపం కాకుండా మరోరూపంగా సంధి జరిగితే అది అన్యవిధము.
ఉదా. ఎ) ఒక+ఒక = ఒకానొక
గమనిక – ఒక + ఒక వాస్తవరూపం ఒక్కొక్క (ఆమ్రేడితం)
ఇత్త్వసంధి
ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికము
ఏమ్యాదులు అంటే హ్రస్వమైన ‘ఇ’తో అంతమయ్యే పదాలు.
ఇత్తు అంటే హ్రస్వమైన ‘ఇ’
ఉదా. ఎ) ఏమి+అయ్యె = ఏమయ్యె, ఏమియయ్యె
బి) అది+ఏమి = అదియేమి, అదేమి
సి) అవి+ఎక్కడ = అవెక్కడ, అవియెక్కడ
డి) మరి+ఏమిటి = మరేమిటి, మరేయేమిటి
ఉదాహరణ ప్రశ్నలు
1) రామ+అయ్య= రామయ్య అనే అత్త్వ సంధి రూపం
ఎ) అన్యదేవ బి) అప్రవృత్తి సి) ప్రవృత్తి డి) ద్విభాష
2) ఏమి + అయ్యె = ఏమయ్యే అనే సంధి కార్యం
1) నిత్యం 2) నిషేధం
3) వైకల్పికం 4) బహుళం
ఉత్త్వసంధి
ఉత్తునకు సంధి నిత్యము
ఉత్తు అంటే హ్రస్వమైన ‘ఉ’ అని అర్థం
ఉదా. 1) రాముడు + అతడు = రాముడతడు
2) మనము + ఉంటిమి = మనముంటిమి
3) సెలవు + ఇచ్చి = సెలవిచ్చి
4) విశ్వము + ఎల్ల = విశ్వమెల్ల
5) ప్రజలు + ఎంత = ప్రజలెంత
ద్విరుక్తటకార సంధి (ట్ట-ట్టా-ట్టి-ట్టీ..)
చిఱు, కుఱు, కడు, నడు, నిడు శబ్దాల ‘ఱ/డ’ లకు అచ్చు పరమైతే ద్విరుక్తటాకర సంధి
ఉదా- 1) చిఱు+ఎలుక = చిట్టెలుక
2) నడు+ఇల్లు = నట్టిల్లు
3) నిడు+ఊర్పు = నిట్టూర్పు
కోడ్- సంధిలో పేర్కొన్న ఐదు పదాలు పూర్వపదంతో ఉంటాయి.
2) సంస్కృత సంధులు
సంస్కృత సంధులు మూడు రకాలు
ఎ) అచ్ సంధులు
బి) హల్ సంధులు
సి) విసర్గ సంధులు
అచ్ సంధులు
– సవర్ణదీర్ఘ సంధులు
– గుణసంధి
– వృద్ధి సంధి
– యణాదేశ సంధి
హల్ సంధులు – అనుసాసనిక సంధి
– శ్ఛుత్వ సంధి
– జస్త సంధి
– విసర్గ సంధి
సవర్ణదీర్ఘ సంధి
సవర్ణములు ఏర్పడే సంధి
‘అ-ఇ-ఉ-ఋ’లకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశమగును
దీర్ఘంతో ఉన్న ఆ, ఈ, ఊ, ౠ లను అచ్చులు అని అంటారు. (ఆ,ఈ,ఊ,ౠ- అక్కులు)
ఉదా. 1) కల్పాంతము = కల్ప+అంతము
2) ఘూర్ణితాచలము = ఘూర్ణిత+అచలము
3) వదూర్మిక = వదు + ఊర్మిక
4) మునీశ్వరుడు = ముని + ఈశ్వరుడు
5) మాతౄణము = మాతృ+ఋణము
6) కవీంద్రుడు = కవి + ఇంద్రుడు
7) భానూదయం = భాను + ఉదయం
గుణ సంధి
అకారానికి ఇ, ఉ, ఋలు పరమైతే క్రమంగా ఏ, ఓ, ఆర్ లు వస్తాయి.
ఇ, ఉ, ఋ ను ‘ఇక్కులు’ అంటారు.
ఏ, ఓ, ఆర్ లను గుణములు అంటారు.
ఉదా. 1) రాజేంద్రుడు = రాజ+ఇంద్రుడు
2) స్వాతంత్రోద్యమం = స్వాతంత్ర+ఉద్యమం
3) దేవర్షి = దేవ+ఋషి
కోడ్- అ+ఇ= ఏ, అ+ఉ= ఓ, అ+ఋ = ఆర్
వృద్ధి సంధి
అకారానికి ఏ, ఐ,లు పరమైతే ఐ కారం
ఓ,ఔ లు పరమైతే ఔకారం ఋ,ౠ లు పరమైతే ఆర్లు వస్తాయి.
ఐ,ఔ,ఆర్ లను వృద్ధులని అంటారు.
ఉదా. 1) అఖిలైశ్వర్యము = అఖిల + ఐశ్వర్యము
2) భువనైక = భువన + ఏక
3) పరమౌషధం = పరమ+ఔషధం
4) దివ్యౌషధం = దివ్య+ఔషధం
5) ఋణార్ణం = ఋణ+ఋణం
యణాదేశ సంధి
ఇ, ఉ, ఋ లకు అసవర్ణములైన అచ్చులు
పరమైతే క్రమంగా య, వ, ర లు వస్తాయి.
య, వ, ర లను యణ్ణులు అంటారు.
ఉదా. 1) అత్యాగ్రహం = అతి+ఆగ్రహం
2) అణ్వాయుధం = అణు+ఆయుధం
3) మాత్రాశ = మాతృ+ఆశ
4) అభ్యూదయం = అభి+ఉదయం
5) ప్రత్యుత్తరం = ప్రతి+ఉత్తరం
అనునాసిక సంధి
నాసికం = ముక్కు
క-చ-ట-త-ప లు స/మ లు పరమైతే ‘ఆవర్గ అనునాసికాలు’ వస్తాయి.
వివరణ
క-చ-ట-త-పలు న/మలు ఙ-ఞ-ణ-న-మ
ఉదా. 1) వాక్+మయం=వాఙ్మయం
2) రాట్+మహేంద్రవరం= రాణ్మహేంద్రవరం
3) తత్+మయం= తన్మయం
కోడ్- అనునాసికాలకు న ఒత్తు, మ ఒత్తు వచ్చే సంధి
శ్ఛుత్వ సంధి
స-కార, త-వర్గాక్షరాలకు, శ-కార,
చ-వర్గాక్షరాలు పరమైనప్పుడు, శ-కార, చ-వర్గాక్షరాలు వస్తాయి.
ఉదా. 1) మనస్+శాంతి = మనశ్శాంతి
2) జగత్+చరిత్ర= జగచ్చరిత్ర
3) జగత్+జనని= జగజ్జనని
త వర్గాక్షరాలు – త థ ద ధ న
చ వర్గాక్షరాలు – చ ఛ జ ఝ ఞ
స(కరం), త(వర్గ) + శ(కరం), చ(వర్గ) =శ(కార), చ(వర్గ)
కోడ్- శ-కార, చ- వర్గాక్షరాలకు అవే ఒత్తులు వచ్చే సంధి.
జస్త్వ సంధి
వర్గ ప్రథమాక్షరాలకు వర్గతృతీయ, వర్గచతుర్థ, అచ్చులు, హయవరలు పరమైనప్పుడు వర్గతృతీయాక్షరాలు వస్తాయి.
వివరణ
+ వర్గతృతీయ, వర్గచతుర్థ, అచ్చులు, హయవర = వర్గతృతీయాక్షరాలు
వర్గ ప్రథమాక్షరాలు + వర్గతృతీయ = వర్గతృతీయ
ఉదా. తత్+దినం = తద్దినం
వర్గ ప్రథమాక్షరాలు+వర్గచతుర్థ= వర్గతృతీయ
ఉదా- తత్+ధర్మం= తద్ధర్మం
వర్గప్రథమాక్షరాలు+ అచ్చులు = వర్గతృతీయ
ఉదా. వాక్ + ఈశ = వాగీశ
వర్గప్రథమాక్షరాలు + హ,య,వ,ర = వర్గతృతీయ
వాక్+యుద్ధం= వాగ్యుద్ధం
శరత్+రాత్రి= శరద్రాత్రి
విసర్గ సంధులు
సూత్రం 1
విసర్గకు ‘క ఖ ప ఫ’ లు పరమైతే విసర్గ విసర్గగానే వస్తుంది.
ఉదా. మనః+కమలము = మనఃకమలము
తపః+ఫలం = తపఃఫలం
సూత్రం 2
‘అ’కార పూర్వక విసర్గకు ‘క ఖ ప ఫ’ లు కాకుండా మిగిలిన అచ్చులు, మిగిలిన హల్లు పరమైతే ‘ఓ’ ఆదేశమగును.
ఉదా. తపః+వనం= తపోవనం
శిరః+జము = శిరోజము
సూత్రం 3 –
ఇస్, ఉస్ + క ఖ ప ఫ = ష
ఉదా. నిస్+కారణం = నిష్కారణం
ధనుస్+ఖండం= ధనుష్కండం
సూత్రం 4
విసర్గ + శ, ష = శష
ఉదా. మనః+శాంతి = మనశ్శాంతి
చతుః + షష్ఠి = చతుష్షషి
ఉదాహరణ ప్రశ్నలు
1) రాకుండిన = రాక + ఉండిన (అత్త్వ సంధి)
2) దూతయితడు = దూత + ఇతడు (అత్తసంధి)
3) చూడక+ ఉండెను = చూడకుండెను (అత్త్వవ సంధి)
4) ఏమంటివి = ఏమి+ అంటివి (ఇత్త సంధి)
5) కీలకమైన = కీలకము +ఐన (ఉత్త సంధి)
6) మొదలయింది = మొదలు+అయింది (ఉత్త సంధి)
7) ఊరువల్లెలు = ఊరు + పల్లెలు (గసడదవవేశ సంధి)
8) ఎక్కాలము = ఏ+కాలము (త్రిక సంధి)
9) అతనిన్జూచి = అతన్+జూచి (ద్రుతప్రాకృతిక సంధి)
10. అమ్మయం = అ+మయం(త్రిక)/అస్+మయం (అనునాసిక)
11. స్వాగతం= సు+ఆగతం (యణాదేశ సంధి)
12. స్వైరిణి = స్వ+ఈరిణి (గుణ సంధి)
13. సూక్తి = సు+ఉక్తి (సవర్ణదీర్ఘసంధి)
14. అత్యద్భుతం = అతి+అద్భుతం (యణాదేశసంధి)
15. సూర్యాస్తమయం = సూర్య+అస్తమయం (సవర్ణదీర్ఘసంధి)
16. పయోనిధి = పయః + నిధి (విసర్గ సంధి)
17. నిష్పక్షపాతం = నిస్+పక్షపాతం (విసర్గ సంధి)
18. ఉన్నతాసనుండు = ఉన్నత+ఆసనుండు (అత్త సంధి)
19. సంపన్నవంతురాలు = సంపన్నవంతు+ ఆలు (రుగాగమ సంధి)
20. తేనెటీగ = తేనె+ఈగ (టుగాగమ సంధి)
21. అయ్యశ్వము=ఆ+యశ్వము (త్రిక సంధి)
22. లేనవ్వు = లేత+నవ్వు (ప్రాతాది సంధి)
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు