ఇవీ వైయక్తిక భేదాలు..!(TET Special)
1. 8వ తరగతికి చెందిన ప్రవీణ్ అనే విద్యార్థి బొమ్మలు వేయడం, పాటలు పాడటం వంటి కళాత్మక రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచి విద్యా సంబంధ విషయాల్లో అంత ప్రతిభ కనబరచడం లేదు. ఈ ఉదాహరణ ఏ వైయక్తిక భేదాన్ని తెలుపుతుంది?
1) అంతర వ్యక్తిగత భేదాలు
2) వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు
3) చరశీల వైయక్తిక భేదాలు
4) నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు
2. రవి, రాము అనే ఇద్దరు సోదరులు ఒకరు తెల్లగా, మరొకరు చామన ఛాయలో ఉండటం.. కింది వాటిలో ఏ రకానికి చెందిన వైయక్తిక భేదం?
1) వ్యక్త్యంతర భేదాలు
2) వ్యక్త్యంతర్గత భేదాలు
3) నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు
4) చరశీల వైయక్తిక భేదాలు
3. ‘6వ తరగతికి చెందిన విద్యార్థికి బాగా మాట్లాడే నైపుణ్యం ఉంది, కాని చేతిరాత బాగాలేదు’. ఇది ఈ కింది వాటిలో ఒక భావనను వివరించడానికి సరైనది
1) వ్యక్త్యంతర తరగతి భేదాలు
2) వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు
3) వ్యక్త్యంతర – వ్యక్తిగత భేదాలు
4) వ్యక్త్యంతర – వైయక్తిక భేదాలు
4. ‘ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలని’ సూచించింది ఎవరు?
1) ప్లేటో
2) ఎఫ్.హెచ్. వెబర్
3) సర్ ఫ్రాన్సిస్ గాల్టన్
4) చార్లెస్ డార్విన్
5. ‘శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి, కాని ఆంగ్ల భాషా సామర్థ్యం అంతగా లేనివాడు’. ఇది కింది వాటిలో ఒక భావాన్ని వివరించడానికి సరైనది
1) వ్యక్త్యంతర భేదాలు
2) వ్యక్త్యంతర్గత భేదాలు
3) చరశీల వైయక్తిక భేదాలు
4) నిర్మాణాత్మక వైయక్తిక భేదాలు
6. ‘ఒక విషయం లేదా ఒక కృతం, ఒక వ్యక్తికి అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతిని అభిరుచి’ అని నిర్వచించింది ఎవరు?
1) జె.పి. చాప్లిన్ 2) ఫ్రీమన్
3) బినే 4) స్టెర్న్
7. మాస్లో ప్రకారం విలువలు అంటే
1) లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ఒక ప్రేరణ
2) ఒక మానసిక అవసరం
3) విజయం సాధించాలనే మానసికమైన కోరిక
4) మానసిక అనుభూతి
8. ‘అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ’ అని నిర్వచించింది ఎవరు?
1) ఎల్. ఎమ్. టెర్మన్
2) జీన్ పియాజే
3) సి. స్పియర్మన్
4) డి. డబ్ల్యూ. వెష్లర్
9. ‘వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ’ అని నిర్వచించింది ఎవరు?
1) విలియం జేమ్స్ 2) వెష్లర్
3) జీన్ పియాజే 4) స్పియర్మన్
10. కింది వాటిలో థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞ ఏది?
1) మూర్త ప్రజ్ఞ 2) అమూర్త ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ 4) బహుళ ప్రజ్ఞ
11. అక్షరాలను, పదాలను, సంఖ్యలను ఉపయోగించే నేర్పు, సంకేతాలను సందర్భోచితంగా వినియోగించే నేర్పు అనేవి థార్న్డైక్ ప్రకారం ఏ ప్రజ్ఞకు సంబంధించినవి?
1) యాంత్రిక ప్రజ్ఞ 2) అమూర్త ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ
4) ఉద్వేగాత్మక ప్రజ్ఞ
12. థార్న్డైక్ అభిప్రాయం ప్రకారం ‘భౌతికంగా కనిపించే వస్తువులను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని’ ఏ ప్రజ్ఞ అంటారు?
1) మూర్త ప్రజ్ఞ 2) అమూర్త ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ 4) వ్యక్త్యంతర ప్రజ్ఞ
13. 7వ తరగతికి చెందిన విద్యార్థి తెలుగు భాషలోని ఛందస్సును అర్థం చేసుకొని పద్యాన్ని గణవిభజన చేయటం థార్న్డైక్ ప్రకారం ఏ ప్రజ్ఞకు చెందుతుంది?
1) అమూర్త ప్రజ్ఞ 2) యాంత్రిక ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ 4) బహుళ ప్రజ్ఞ
14. థార్న్డైక్ ప్రకారం శాస్త్రవేత్తలు, రచయతలు, కవులు, విద్యావేత్తలలో అమితంగా కనిపించే ప్రజ్ఞ
1) యాంత్రిక ప్రజ్ఞ 2) అమూర్త ప్రజ్ఞ
3) సాంఘిక ప్రజ్ఞ 4) తార్కిక ప్రజ్ఞ
15. ‘బహుళ ప్రజ్ఞ’ను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
1) డానియల్ గోల్మన్
2) హోవార్డ్ గార్డెనర్
3) థార్న్డైక్ 4) గిల్ఫర్డ్
16. Good Work Project ను ప్రారంభించింది ఎవరు?
1) హోవార్డ్ గార్డెనర్
2) డానియల్ గోల్మన్
3) స్పియర్మన్
4) నెల్సన్ గుడ్మన్
17. హోవార్డ్ గార్డెనర్ ఎన్ని రకాల ప్రజ్ఞా సిద్ధాంతాలను ప్రతిపాదించారు?
1) 3 2) 5 3) 7 4) 8
18. సాంఘిక-సాంస్కృతిక సంబంధాలను అర్థం చేసుకోవడంలో, జాతీయాలను ఉపయోగించడంలో, సందర్భోచిత పదాలను ఉపయోగించడంలో, భాషా సంబంధ హాస్యాన్ని పలికించడంలో గార్డెనర్ ప్రకారం ఏ ప్రజ్ఞ ప్రధాన పాత్ర పోషిస్తుంది?
1) శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ
2) గణిత తార్కిక ప్రజ్ఞ
3) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
4) శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ
19. హోవార్డ్ గార్డెనర్ ప్రకారం పదనేర్పులు, పుస్తక నేర్పులు కలిగి ఉండే ప్రజ్ఞ?
1) ప్రకృతి సంబంధ ప్రజ్ఞ
2) వ్యక్త్యంతర ప్రజ్ఞ
3) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
4) శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ
20. ఏ రకమైన ప్రజ్ఞ ఉన్నవారిని ‘సంఖ్యా నేర్పులు, తార్కిక నేర్పులు’ అంటారు?
1) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
2) వ్యక్త్యంతర ప్రజ్ఞ
3) గణిత తార్కిక ప్రజ్ఞ
4) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
21. గార్డెనర్ ప్రకారం ‘దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ’ ఉన్న వారిని ఏమంటారు?
1) సంగీత నేర్పులు 2) స్వీయ నేర్పులు
3) సాంఘిక నేర్పులు 4) కళల్లో నేర్పులు
22. గార్డెనర్ ప్రకారం ‘చిత్ర నేర్పులు’ ఏ రకానికి చెందిన ప్రజ్ఞ కలవారు?
1) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
2) సంగీత లయ సంబంధ ప్రజ్ఞ
3) గణిత తార్కిక ప్రజ్ఞ
4) ప్రకృతి సంబంధ ప్రజ్ఞ
23. గార్డెనర్ ప్రకారం సాంఘిక నేర్పులు ఏ రకమైన ప్రజ్ఞావంతులు?
1) ప్రకృతి సంబంధ ప్రజ్ఞ
2) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
3) వ్యక్త్యంతర ప్రజ్ఞ
4) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
24. గార్డెనర్ ప్రకారం సహజ ప్రజ్ఞ కలిగిన వారిని ఏమంటారు?
1) స్వీయ నేర్పులు
2) సాంఘిక నేర్పులు
3) ప్రకృతి నేర్పులు
4) చిత్ర నేర్పులు
25. భేదాలు, పోలికల ఆధారంగా వర్గీకరించడం, వ్యక్తీకరించడం, తమ చుట్టూ ఉన్న ప్రకృతి ప్రపంచాన్ని ఆస్వాదించడంలోని నేర్పరుల్లో ఉండే ప్రజ్ఞ
1) సహజ ప్రజ్ఞ
2) దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ
3) వ్యక్త్యంతర ప్రజ్ఞ
4) వ్యక్త్యంతర్గత ప్రజ్ఞ
సమాధానాలు
1) 2 2) 1 3) 2 4) 1 5) 2 6) 1 7) 2 8) 1 9) 1 10) 4 11) 2 12) 2 13)1 14) 2 15) 2 16) 4 17)4 18) 1 19) 4 20) 3 21)4 22) 1 23) 3 24) 3 25)1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు