మన విద్యార్థులకు ఐఎస్బీ కోర్సులు

ప్రతిష్ఠాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ) ఆధారంగా తెలంగాణ విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఐఎస్బీ అధికారులతో తొలిదఫా చర్చలు జరిపారు. ఇందులో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్‌రాథోడ్ పాల్గొన్నారు. ఐఎస్బీలో గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ఇన్ ఆపరేషన్స్ అండ్ సప్లయ్ చైన్ వంటి నాలుగు ఆన్లైన్ కోర్సులను నిర్వహిస్తున్నారు. జాబ్ ఓరియంటెడ్ కోర్సుల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులను చేర్పించేందుకు ఐఎస్బీతో త్వరలోనే ఎంవోయూను కుదు ర్చుకోనున్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వీసీలతో సమావేశం నిర్వహించి దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Latest Updates
నవంబర్ 1 నుంచి బీటెక్ ఫస్టియర్ క్లాసులు
నేవీలో 112 ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టులు
భారతదేశంలో అంధీస్ పవనాలు వీచే రాష్ట్రం ?
అంతర్గత విలువ, బహిర్గత విలువ సమానం
బేసిల్లో కాంట్రాక్ట్ పోస్టులు
డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
దేశంలో నౌక నిర్మాణ కేంద్రాలన్నింటిలో పెద్దది?
ఇండియన్ సిసిరోగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరు?
తెలంగాణ చారిత్రక చిహ్నాలు.. ఈ కోటలు
వైటీడీఏలో టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సులు