అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో భారత్ విధానం
లిమిటెడ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ (ఎల్టీబీటీ)
– 1963 ఆగస్టు 5న అమెరికా, సోవియట్ యూనియన్, బ్రిటన్లు కలిసి మాస్కోలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
– ఈ ఒప్పందాన్నే Limited Test Ban Treaty (LTBT) అని కూడా అంటారు.
– 1963 అక్టోబర్ 10 నుంచి అమల్లోకి వచ్చింది.
– ఈ ఒప్పందం ప్రకారం గగనతలంలో గాని అంతరజలాల్లో గాని అణుపరీక్షలు నిర్వహించరాదు. భూఅంతర్భాగంలో మాత్రమే అణుపరీక్షలు నిర్వహించుకోవచ్చు.
– 1963లోనే భారత్ సంతకం చేసి, ధ్రువీకరించుకున్నది.
న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటి
– ఎన్పీటీ ఒప్పందాన్ని 1968 జూలై 1న ఆమోదం కోసం ప్రతిపాదించారు.
– 1970 మార్చి 5 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఎన్పీటీ ఒప్పందంపై ఫిన్లాండ్ మొదట సంతకం చేసింది. మొత్తం 190 దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
– ఎన్పీటీ ఒప్పందం ప్రకారం ఫ్రాన్స్, చైనా, సోవియట్ యూనియన్(రష్యా), బ్రిటన్, అమెరికా మాత్రమే అణ్వాయుధాలను కలిగి ఉండాలి. మిగిలిన దేశాలు అణ్వాయుధాల ప్రయోగాలను నిర్వహించరాదు.
– వివక్షతో కూడుకున్న ఈ ఒప్పందంపై ఎప్పటికీ సంతకం చేయబోమని భారత్ తెలిపింది.
– ఇప్పటికీ ఎన్పీటీని ఆమోదించని దేశాలు: భారత్, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్.
– ఉత్తరకొరియా 2003లో ఒప్పందం నుంచి వైదొలిగింది.
ఎన్పీటీ ఒప్పందంలోని ముఖ్యాంశాలు
– ఈ ఒప్పందంలో పేర్కొన్న ఐదు అణుశక్తి కలిగిన దేశాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అణ్వాయుధాలను, అణ్వాయుధ సామగ్రిని, అణుశక్తి కాని మిగిలిన దేశాలకు సరఫరా చేయరాదు.
– అణ్వాయుధాలను తయారు చేయడం కోసం అణుశక్తి కాని దేశాలను అణుశక్తి దేశాలు ప్రోత్సహించరాదు.
– అణుశక్తి కాని దేశాలు అణ్వాయుధాలను గాని, అణ్వస్త్ర ఆయుధ సామగ్రిని గాని ఎప్పటికీ దిగుమతి చేసుకోరాదు.
– అణుశక్తి కాని దేశాలు ఎప్పటికీ అణ్వాయుధాలను ప్రయోగించరాదు, కలిగి ఉండరాదు.
– ప్రతి ఐదేండ్లకు ఒకసారి ఎన్పీటీ ఒప్పందాన్ని పునః సమీక్షిస్తారు. 25 ఏండ్ల తర్వాత ఈ ఒప్పందం మరికొన్ని ఏండ్లు కొనసాగించాలా లేదా అనేది నిర్ణయిస్తారు.
సమగ్ర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం(సీటీబీటీ)
– సంతకాల కోసం ఒప్పందం వెలువడిన సంవత్సరం- 1996
– ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు- 183
– సీటీబీటీని న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్య
సమితి సాధారణ సభలో 1996, సెప్టెంబర్ 10న ఆమోదం కోసం ప్రతిపాదించారు. ఆ సమయానికి 71 దేశాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి.
– 2015 మార్చి నాటికి 183 దేశాలు సంతకాలు చేశాయి. కానీ, 164 దేశాలు ర్యాటిఫై చేసుకున్నాయి. 19 దేశాలు సంతకాలు చేశాయి. కానీ, ఆయా దేశాల పార్లమెంట్లలో ఆమోదించలేదు.
– అగ్రరాజ్యాలు బ్రిటన్, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌లు కూడా సంతకాలు చేశాయి.
– సీటీబీటీలో 17 ప్రకరణలు, ఒక ప్రొటోకాల్ ఉన్నాయి.
– ఈ ఒప్పందం అన్ని అణుశక్తి ప్రయోగాలను వ్యతిరేకిస్తుంది.
– సీటీబీటీ ఒప్పందం రెట్టింపు వివక్షతతో కూడుకున్నదిగా పేర్కొంటూ భారత్ సంతకం చేయలేదు.
– సీటీబీటీపై సంతకాలు చేయని దేశాలు: ఇండియా, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్
సీటీబీటీలోని ప్రధానాంశాలు
– ప్రతి దేశం అణ్వాయుధాల ప్రయోగం, తయారీ, అణు విధ్వంసాలను పూర్తిగా నిలిపివేయాలి.
– ఏ దేశం, ఇతర దేశాల అణ్వాయుధాలను, అణు సామగ్రిని కలిగి ఉండడాన్ని ప్రోత్సహించరాదు.
– అణ్వాయుధాల తయారీ కోసం ఐదు అగ్రరాజ్యాలు ఇతర దేశాలకు అణ్వాయుధ సామగ్రిని కానీ, అణ్వాయుధాలను కానీ ఎగుమతి చేయరాదు.
సీటీబీటీ – భారత్ దృక్పథం
– భారతదేశం సీటీబీటీ ఒప్పందాన్ని రెట్టింపు వివక్షతో కూడుకున్నదిగా పేర్కొన్నది. అగ్రరాజ్యాలు మాత్రమే అణ్వాయుధాలను కలిగి ఉండాలి. మిగితా దేశాలు అణ్వాయుధాల ప్రయోగాలను సైతం నిషేధించారు కాబట్టి భారత్ ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు.
– భారత్ మొదట వినియోగించరాదు అనే నియమాన్ని ఎప్పుడో నిర్ణయించుకున్నది. ఇతర దేశాలు ప్రయోగించకుండా భారత్ అణ్వాయుధాలను ప్రయోగించదు.
– అణ్వాయుధాలను, అణ్వాయుధ సామగ్రిని ఎగుమతి చేసే విధానం భారత్ కలిగి లేదు.
– భారత్ ఒక్కటే రెండు అణుశక్తి గల దేశాల మధ్య ఉన్నది. భారతదేశానికి పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్ రెండూ అణ్వాయుధ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలు కూడా గతంలో భారత్‌పై దాడికి దిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ అణుశక్తిని కలిగి ఉండటం అత్యావశ్యకం.
ఉగ్రవాద ఆర్థిక మూలాలను అణచివేయడానికి అంతర్జాతీయ ఒప్పందం
– ఒప్పందం అంగీకరించిన సంవత్సరం- 1999 డిసెంబర్ 9.
– అమల్లోకి వచ్చింది- 2002, ఏప్రిల్ 10.
ప్రదేశం- న్యూయార్క్
– సంతకం చేసిన దేశాలు- 132
– పార్టీలు- 187
– అధికార భాషలు- అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్.
– ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని నివారించడం కోసం ఈ ఒప్పందం జరిగింది. దీని కోసం న్యాయ, పోలీసు శాఖల పరస్పర సహకారం కూడా అవసరమని పేర్కొన్నది. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించడం నేరమని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రకారం దేశ ద్రోహ చర్యలకు పాల్పడే వారికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని, ధన రూపంలో గాని, పరిజ్ఞాన సేవల రూపంలో గాని అందించే సాయం నేరంగా నిర్ధారించారు.
ఐక్యరాజ్యసమితి మహిళలపై హింస నిర్మూలన ప్రకటన(1993)
– ఐక్యరాజ్యసమితి సాధారణ సభ మహిళలపై హింసకు వ్యతిరేకంగా 1993 డిసెంబర్లో ఈ డిక్లరేషన్‌ను ఆమోదించింది. మహిళా సమస్యలు, హక్కుల గురించి మొదటగా పేర్కొన్న డిక్లరేషన్ ఇదే. ఈ డిక్లరేషన్ రెండో ప్రకరణలో లింగపరమైన నేరాలను గురించి పేర్కొన్నది. భౌతికంగా గాని, మానసికంగా గాని, లైంగికపరంగా గాని ఏదైనా ఒక సంఘటన ద్వారా బాధపడినట్లయితే వాటిని నేరాలుగా పరిగణిస్తారు. నవంబర్ 25ను ఐక్యరాజ్యసమితి మహిళలపై హింస నిర్మూలన దినోత్సవంగా ప్రకటించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు