దేశంలో జాతీయం చేసిన మొదటి బ్యాంక్ ఏది?
- ఎకానమీ
1. మార్కెట్ ఆర్థిక వ్యవస్థను సమర్థించిన ఆర్థికవేత్తలెవరు?
ఎ) ఆడమ్‌స్మిత్, రికార్డో, గాల్ బ్రెత్
బి) ఆడమ్‌స్మిత్, రికార్డో, హిక్స్
సి) ఆడమ్‌స్మిత్, ఫ్రీడ్మన్, కీన్స్
డి) కీన్స్,రికార్డో, ఫ్రిడ్మన్
2. కిందివాటిని జతపరచండి?
ఎ) తిరోగమనం 1 తక్కువ స్థాయి
బి) సౌభాగ్యం 2) ధనాత్మకం
సి) పునర్జ్జీవనం 3) గరిష్టస్థాయి
డి) ఆర్థిక మాధ్యం 4) రుణాత్మకం
ఎ) 3, 4, 1, 2 బి) 1, 3, 2, 4
సి) 4, 3, 2, 1 డి) 1, 2, 3, 4
3. మూడో ప్రపంచ దేశాలు అనే పదాన్ని మొదట పరిచయం చేసింది?
ఎ) రాగ్నర్ నర్క్సే బి) మిర్ధాల్
సి) ప్రాంట్చ్ ఫానోస్ డి) అమర్త్య సేన్
4. కిందివాటిలో ఉరుగ్వే రౌండ్ సమావేశంతో లసంబంధం లేని అంశం?
1) టీఆర్ఐపీస్ 2) టీఆర్ఐఎంఎస్
3) సుంకాలు 4) సేవలు
5) వలసలు
ఎ) 1, 2 బి) 2, 4
సి) 4, 5 డి) 5
5. ఫిలిప్స్ వక్రరేఖ ఏ రెండింటి మధ్య సంబంధాన్ని వివరిస్తుంది?
ఎ) ద్రవ్య సప్లయ్, ద్రవ్య డిమాండ్
బి) పన్నులు, ద్రవ్యోల్బణం
సి) వస్తువు ఉత్పత్తి వ్యయం, వస్తువుల ధరలు
డి) ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత
6. ఉత్పత్తి కారకాల ధర సమానత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు?
ఎ) హెక్సర్ ఓహ్లెన్ బి) హరడ్-డోమర్
సి) ఆచార్య మార్షల్
డి) శామ్యూల్ సన్
7. వెంచర్ క్యాపిటల్ అంటే?
ఎ) నూతన పారిశ్రామిక వేత్తలకు అందజేసే దీర్ఘకాలిక ప్రారంభ మూలధనం
బి) నూతన పారిశ్రామిక వేత్తలకు అందజేసే స్వల్పకాలిక ప్రారంభ మూలధనం
సి) నష్టాల్లో ఉన్న పరిశ్రమ దారులకు అందించే నిధులు
డి) పరిశ్రమల ఆధునీకరణకు అందించే నిధులు
8. కిందివాటిని జతపరచండి?
1) ఐబీఆర్డీ 1) 1960
2) ఐడీఏ 2) 1945
3) ఐఎఫ్‌సీ 3) 1995
4) డబ్యూటీవో 4) 1956
ఎ) 1, 2 ,3, 4 బి) 2, 1, 4, 3
సి) 2, 1, 3, 4 డి) 4, 3, 2, 1
9. హరడ్-డోమర్ వృద్ధి నమూనాను అభివృద్ధి చేసింది ఎవరు?
ఎ) సోలో బి) హలే
సి) రాబిన్సన్ డి) లక్డావాలా
10. కిందివాటిలో సరైంది కానిది ఏది?
ఎ) పురోగామి పన్నులు- ఆదాయం పెరిగే కొద్దీ పన్నురేట్లు పెరగడం
బి) తిరోగామి పన్నులు ఆదాయం పెరిగే కొద్దీ పన్నురేట్లు తగ్గడం.
సి) అనుపాత పన్నులు-ఆదాయంతో సంబంధం లేకుండా ఒకే రకమైన పన్ను విధించడం.
డి) మూల్యానుగత పన్నులు వస్తువు
పరిమాణం బరువును బట్టి పన్ను
విధించడం.
11. కిందివాటిలో ప్రణాళిక విరామం కానిది ఏది?
ఎ) 1990-92 బి) 1978-80
సి) 1966-69 డి) 2012-13
12. వరి పంటను అమలు చేసిన జిల్లాలు?
ఎ) పశ్చిమ గోదావరి (ఆంధ్రప్రదేశ్)
బి) షాహాబాద్ (బీహార్)
సి) రాయపూర్ (మధ్యప్రదేశ్)
డి) పైవన్నీ
13. అధిక శక్తిమంతమైన ద్రవ్యాన్ని ఎలా పరిగణిస్తారు?
ఎ) ఆధారిత ద్రవ్యం
బి) విశాల ద్రవ్యం
సి) సంకుచిత ద్రవ్యం
డి) ప్లాస్టిక్ ద్రవ్యం
14. కిందివాటిలో బ్రెట్టన్ వుడ్స్ కవలలు అని వేటిని పేర్కొంటారు?
ఎ) గాట్, డబ్ల్యూటీవో
బి) ఐఎంఎఫ్, ఐబీఆర్డీ
సి) ఐఎఫ్ఎఫ్, ఐడీఏ
డి) ప్రపంచబ్యాంక్, ఐడీఏ
15. రికార్డో బాటక సిద్ధాంతం ఏయే సూత్రాలపై ఆధారపడుతుంది?
ఎ) తేడా సూత్రం
బి) ఉపాంత సిద్ధాంతం
సి) కొరత సిద్ధాంతం
డి) ఎ, బి
16. కిందివాటిని జతపరచండి.
1) ఆదాయపు పన్ను ఎ) 1957
2) కార్పొరేషన్ పన్ను బి) 1994 -95
3) సేవాపన్ను సి) 1954
4) వడ్డీపన్ను డి) 1986
ఎ) 4, 2, 1, 3 బి) 4, 3, 2, 1
సి) 1, 2 ,3 ,4 డి) 3, 4, 1, 2
17. గోధుమ పంటను అమలు చేసిన జిల్లాలు?
ఎ) తంజావూరు (తమిళనాడు)
బి) లూథియానా (పంజాబ్)
సి) అలీఘర్ (ఉత్తరప్రదేశ్)
డి) పైవన్నీ
18. కిందివాటిలో హరిత విప్లవంతో సంబంధం లేనిది ఎవరు?
ఎ) నార్మన్ బోర్లాగ్
బి) స్వామినాథన్
సి) విలియం ఎస్. గాండ్
డి) ఆల్బర్ట్ హోవర్డ్
19. ద్విపక్ష ఏకస్వామ్యమనగా నేమి?
ఎ) ఒకే ఒక అమ్మకందారుడు ఉండటం
బి) ఒకే ఒక కొనుగోలుదారుడు ఉండటం
సి) ఒకే అమ్మకం దారుడు,
ఒకే కొనుగోలుదారుడు ఉండటం
డి) పైవేవీకావు
20. మూలధన కల్పన గ్రంథ రచయిత ఎవరు?
ఎ) మార్షల్ బి) కాల్థార్
సి) కారల్ మార్క్స్ డి) రాబిన్సన్
21. 20 సూత్రాల కార్యక్రమం ఎవరు ప్రారంభించారు?
ఎ) ఇందిరాగాంధీ బి) రాహుల్ గాంధీ
సి) నెహ్రూ డి) పై అందరూ
22. సహసంబంధ గుణకం విలువ ఏ రెండు విలువల మధ్య ఉంటుంది?
ఎ) 0-1 మధ్య ఉంటుంది
బి) -1 – +1 మధ్య ఉంటుంది
సి) 1-10 మధ్య ఉంటుంది
డి) పైవన్నీ సరైనవే
23. కింది ప్రణాళికలు వరుస క్రమంలో సూచించండి?
1) ప్రజా ప్రణాళిక
2) సర్వోదయ ప్రణాళిక
3) గాంధేయప్రణాళిక
4) బాంబే ప్రణాళిక
ఎ) 4, 1, 3, 2 బి) 4, 3, 2, 1
సి) 1, 2 ,3, 4 డి) 4, 2, 3, 1
24. MADAT ను సిఫారసు చేసిన కమిటీ ఏది?
ఎ) చెల్లయ్య కమిటీ
బి) ఎల్.కె. ఝా కమిటీ
సి) కె.ఎన్. రాజ్ కమిటీ
డి) అలెగ్జాండర్ కమిటీ
25. కింది వాటిని జతపరచండి.
ఎ) కేంద్రీకృత ప్రణాళిక 1) ఫ్రాన్స్
బి) మార్కెట్ ప్రణాళిక 2) రష్యా
సి) అంతర్జాతీయ 3) టెన్నిస్వాలీ
ప్రణాళిక అథారిటీ
డి) ప్రాంతీయ ప్రణాళిక 4) కొలంబో ప్లాన్
ఎ) 2, 1, 4, 3 బి) 2, 4, 1, 3
సి) 2, 4, 3, 1 డి) 2, 3, 1, 4
26. ప్రపంచీకరణ యుగంలో ప్రభుత్వం పాత్ర?
ఎ) సున్నా బి) కనిష్ఠం
సి) గరిష్ఠం డి) తటస్థం
27. మిత ధరలు (Shadow Price) అనే భావనను మొదట నిర్వచించినది ఎవరు?
ఎ) లెబన్ స్టీన్
బి) గున్నార్ మిర్దాల్
సి) వి.కె.ఆర్.వి. రావు
డి) టిన్ బర్జర్
28. సంఘష్టీ నిరుద్యోగితకు మరొక పేరు?
ఎ) ప్రచ్ఛన్న నిరుద్యోగిత
బి) చక్రీయ నిరుద్యోగిత
సి) టర్నోవర్ నిరుద్యోగిత
డి) వ్యవస్థాపూర్వక నిరుద్యోగిత
29. కిందివాటిలో సరైనది కానిది ఏది?
ఎ) సాధారణ సిద్ధాంతం కీన్స్
బి) దేశాల సంపద ఆడంస్మిత్
సి) ఆసియా డ్రామా రాగ్నర్ నర్క్స్
డి) దాస్ క్యాపిటల్ కారల్ మార్క్స్
30. “మనమంతా ద్రవ్యవాదులం” అని ఎవరు చెప్పారు?
ఎ) మిల్టన్ ఫ్రీడ్మన్
బి) ఫ్రాంకోమెడిగిలియాని
సి) డ్యూసెన్బరి డి) ఫిషర్
31. పేదరిక విషవలయం అనే భావనను ప్రతిపాదించినది ఎవరు?
ఎ) మార్షల్ బి) ఆడంస్మిత్ సి) రాగ్నర్ నర్క్స్ డి) హర్షమన్
32. పన్ను లక్షణం?
ఎ) ప్రభుత్వం విధిస్తుంది
బి) చెల్లింపు తప్పనిసరి
సి) పన్ను చెల్లింపుదారుడిని గుర్తించడం
డి) పైవన్నీ
33. రాష్ట్ర ప్రణాళిక సంఘం/బోర్డు అధ్యక్షులు ఎవరు?
ఎ) గవర్నర్ బి) ముఖ్యమంత్రి
సి) ఆర్థిక మంత్రి
డి) ప్రణాళికా మంత్రి
34. కింది వాటిని జతపరచండి?
ఎ) లీడ్‌బ్యాంక్ పథం 1) 1969
బి) సేవా ప్రాంత విధానం 2) 1987
సి) ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ 3) 1975
డి) నాబార్డ్ 4) 1982
ఎ) 1, 2 ,3 ,4 బి) 4, 3, 2, 1
సి) 4, 3, 1, 2 డి) 2, 1, 3, 4
35. జొన్న పంటను అమలు చేసిన జిల్లా?
ఎ) తూర్పుగోదావరి (ఆంధ్రప్రదేశ్)
బి) పాలి (రాజస్థాన్)
సి) రాయపూర్ (మధ్యప్రదేశ్)
డి) ఆలీఘర్ (ఉత్తరప్రదేశ్)
36. కిసాన్ క్రెడిట్ కార్డును ఎప్పడు ప్రవేశపెట్టారు?
ఎ) 1995 బి) 1998
సి) 1982 డి) 1999
37. ఈ కిందివాటిలో ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఉదాహరణ?
ఎ) బీహెచ్ఈఎల్ బి) బెల్
సి) బీఎస్ఎన్ఎల్ డి) పైవన్నీ
38. భారతదేశంలో జాతీయం చేసిన మొదటి బ్యాంక్ ఏది?
ఎ) ఇంపీరియల్ బ్యాంక్
బి) లీడ్ బ్యాంక్
సి) ఆర్బీఐ డి) ఐసీఐసీఐ
39. జీవితేతర బీమాకు మరొక పేరు?
ఎ) సాధారణ బీమా
బి) అనుబంధ బీమా
సి) వ్యక్తిగత బీమా సి) పైవన్నీ
40. ప్రపంచబ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) జెనీవా బి) స్విట్జర్లాండ్
సి) వాషింగ్టన్ డి) బీజింగ్
41. హిందూ వృద్ధి రేటును ప్రతిపాదించినది?
ఎ) ప్రొఫెసర్ రాజ్ కృష్ణ
బి) బి. ఎస్. మిన్హాస్
సి) గాడ్గిల్ డి) అశోక్ రుద్ర
42. పారిశ్రామిక రంగంలో మంచి ఫలితాలు సాధించిన ప్రణాళికలు ఏవి?
ఎ) 1, 8 బి) 10, 11
సి) 10, 3 డి) 1, 6
43. కిందివాటిలో పారిశ్రామిక తీర్మానం కానిది?
ఎ) పారిశ్రామిక తీర్మానం -1956
బి) పారిశ్రామిక తీర్మానం -1977
సి) పారిశ్రామిక తీర్మానం -1979
డి) పారిశ్రామిక తీర్మానం 1990
44. ప్రస్తుతం జనాభా లెక్కల రిజిస్ట్రార్ ఎవరు ఉన్నారు?
ఎ) చంద్రమౌళి బి) వివేక్ జోషి
సి) మోడి డి) అమిత్‌షా
45. మతాలవారీగా జనాభా వరుసక్రమం(భారతదేశంలో)?
ఎ) హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు
బి) హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు
సి) హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు
డి) క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, సిక్కులు
46. రిజర్వుబ్యాంకు అకౌంటింగ్ సంవత్సరం?
ఎ) జనవరి నుంచి డిసెంబర్
బి) ఏప్రిల్ నుంచి మార్చి
సి) మార్చి నుంచి ఏప్రిల్
డి) జూలై నుంచి జూన్
47. సెబి అంటే?
ఎ) స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
బి) సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
సి) స్మాల్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా
డి) స్మాల్ ఎక్స్పోర్ట్ బోర్డ్ ఆఫ్ ఇండియా
48. ప్రస్తుత ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు?
ఎ) వై.వి. రెడ్డి బి) ఎ.ఎన్.సింగ్
సి) ఎల్. కేల్కర్ డి) సి. రంగరాజన్
49. 2021 మార్చినాటికి భారతీయ విదేశీ రుణం ఎన్ని బిలియన్ డాలర్లు?
ఎ) 550 బి) 560
సి) 570 డి) 580
50. జనాభా పరిణామ సిద్ధాంతంలో రెండో దశ దేన్ని తెలుపుతుంది?
ఎ) జననాలు ఎక్కువ మరణాలు తక్కువ
బి) జననాలు తక్కువ- మరణాలు ఎక్కువ
సి) జననాలు, మరణాలు ఎక్కువ
డి) జననాలు, మరణాలు తక్కువ
51. తలసరి ఆదాయం అంటే?
ఎ) జాతీయాదాయాన్ని జనాభాతో భాగించడం
బి) జనాభాను జాతీయాదాయంతో భాగించడం
సి) జాతీయాదాయం జనాభాను కలపడం
డి) జాతీయాదాయాన్ని తలసరి ఆదాయంతో కలపడం
52. కింది వారిలో ఆధునిక ఆర్థికవేత్త ఎవరు?
ఎ) ఆడంస్మిత్ బి) రికార్డో
సి) మార్షల్ డి) కీన్స్
53. సమతౌల్యం అంటే?
ఎ) నిశ్చలస్థితి
బి) మార్పులేని స్థితి
సి) విరామ స్థితి డి) పైవన్నీ
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు