అశోక చక్రవర్తి శాసనాలను తొలిసారిగా చదివినవారు?
- ప్రాచీన భారతదేశ చరిత్ర
1. ప్రాచీన భారతదేశంలో శాస్త్రీయ ప్రగతికి సంబంధించి, కింది స్టేట్మెంట్లో సరైనది ?
ఎ. 1వ శతాబ్దం నాటికి వివిధ రకాల శస్త్ర చికిత్స పరికరాలు వాడుకలో ఉండేవి
బి. 3వ శతాబ్దం ప్రారంభం నాటికే మానవ శరీరంలో అవయవాల మార్పిడి ప్రారంభమైంది
సి. 5వ శతాబ్దంలో కోణం సైన్ భావన ప్రసిద్ధమైంది
డి. 7వ శతాబ్దంలోనే సైక్లిక్ క్వాడ్రిలేటరమ్ భావన ప్రచారంలోకి వచ్చింది
1) ఎ, బి 2) సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
2. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి, కింది వాటిలో బౌద్ధ, జైన మతాలకు సాధారణమైన అంశాలు ఏవి?
ఎ. తపస్సుకు, ఆనందానికి సంబంధించిన తీవ్రమైన అంశాల నివారణ
బి. వేదాల సాధికారత పట్ల ఉదాసీనత
సి. మత సంస్కారాలను విస్మరించడం
1) ఎ 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
3. బుద్ధ భగవానుడి ప్రతిమను కొన్ని సందర్భాల్లో ‘భూమి స్పర్శముద్ర’ అనే హస్త భంగిమతో చూపుతారు. ఈ ముద్ర దేన్ని సూచిస్తుంది?
1) బుద్ధుడు ‘మార’ను పర్యవేక్షించమని భూమికి పిలుపునివ్వడం తన ధ్యానానికి భంగం కలగకుండా మారను నివారించడం
2) ‘మార’ మనోభావాలున్నప్పటికీ స్వచ్ఛత, పవిత్రతలకు సాక్షీభూతంగా ఉండమని బుద్ధుడు, భూమిని కోరడం
3) అందరూ మట్టిలో నుంచే పుట్టారనీ
చివరికి మట్టిలోనే కలిసిపోతారని తన
అనుయాయులకు బుద్ధుడు జ్ఞాపకం
చేస్తున్నాడు
4. ఈ సందర్భంలో (1), (2) సరైనవే
4. తొలి వేద యుగంలో ఆర్యుల మతం ప్రధానంగా దేనికి సంబంధించినది?
1) భక్తి
2) విగ్రహారాధన, యజ్ఞాలు
3) ప్రకృతి ఆరాధన, యజ్ఞాలు
4) ప్రకృతి ఆరాధన, భక్తి
5. జైన తత్వం ప్రకారం, ప్రపంచాన్ని సృష్టించి, పోషించేది?
1) సార్వత్రిక శాసనం
2) సార్వత్రిక సత్యం
3) సార్వత్రిక విశ్వాసం
4) సార్వత్రిక ఆత్మ
6. సింధూ నాగరికతకు సంబంధించి సరైనది గుర్తించండి.
ఎ. ఇది ప్రధానంగా లౌకిక నాగరికత
మతపరమైన అంశం ఉన్నప్పటికీ అది ప్రాబల్యం వహించలేదు
బి. ఈ కాలంలో భారతదేశంలో నూలు వస్ర్తాల తయారీ కోసం పత్తిని ఉపయోగించడం జరిగింది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) ఎ, బి సరైనవి కావు
7. కింది వాటిలో ఏ వ్యక్తిని ఉద్దేశించి ‘మహా మస్తకాభిషేకం’ అనే గొప్ప మతపరమైన ఉత్సవాన్ని నిర్వహిస్తారు?
1) బాహుబలి 2) గౌతమబుద్ధుడు
3) మహావీరుడు 4) నటరాజ
8. ప్రాచీన తక్షశిల పట్టణం ఏ రెండు నదుల మధ్య ఉంది?
1) సింధూ – జీలం 2) జీలం – చీనాబ్
3) చీనాబ్ – రావి 4) రావి – బియాస్
9. ప్రాచీన భారతదేశంపై దాడులు చేసినవారికి సంబంధించి సరైన చారిత్రక క్రమం ఏది?
1) గ్రీకులు-శకులు-కుషాణులు
2) గ్రీకులు-కుషాణులు-శకులు
3) శకులు-గ్రీకులు-కుషాణులు
4) శకులు-కుషాణులు-గ్రీకులు
10. కింది వాటిలో మిగిలిన ముగ్గురికి సమకాలికుడు కానివారెవరు?
1) బింబిసారుడు 2) గౌతమ బుద్ధుడు
3) మిళిందుడు 4) ప్రసేనజిత్తు
11. ప్రాచీన జైనమతానికి సంబంధించి, కింది స్టేట్మెంట్లలో సరైనది?
1) స్థూలబాహు నాయకత్వంలో జైనమతం, దక్షిణ భారతదేశంలో వ్యాప్తి చెందింది
2) పాటలీపుత్రంలో జరిగిన పరిషత్తు
తరువాత, భద్రబాహు నాయకత్వంలో
మిగిలిన జైనులను శ్వేతాంబరులన్నారు
3) క్రీ.పూ. ప్రథమ శతాబ్దంలో జైన మతం కళింగరాజు ఖారవేలుడు ఆదరణ పొందింది
4) జైనమతం ప్రాథమిక దశలో బౌద్ధుల మాదిరికాకుండా జైనులు విగ్రహాలను
ఆరాధించారు
12. నాలుగు వేదాల్లో మంత్ర తంత్రాలున్న వేదం ఏది?
1) రుగ్వేదం 2) యజుర్వేదం
3) అధర్వణవేదం 4) సామవేదం
13. శూద్రకుడు రచించిన భారత ప్రాచీన పుస్తకమైన మృచ్ఛకటికం దేని గురించి ప్రస్తావిస్తుంది?
1) ధనిక వ్యాపారికి, వేశ్య కుమార్తెకు మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం గురించి
2) పశ్చిమ భారతదేశంలోని శక క్షాత్రవులపై చంద్రగుప్త-2 సాధించిన విజయాన్ని
3) సముద్రగుప్తుని సైనిక దాడులు,
విజయాల గురించి
4) గుప్తరాజుకు కామరూప రాణికి మధ్య
జరిగిన ప్రేమ వ్యవహారం గురించి
14. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
ఎ. లిచ్ఛవి రాజైన చేతక కుమార్తె మహావీరుని తల్లి
బి. కోసల రాజ్యరాణి గౌతమ బుద్ధుని తల్లి
సి. బెనారస్కు చెందిన పార్శనాథుడు
23వ తీర్థంకరుడు
1) ఎ 2) బి
3) బి, సి 4) ఎ, బి, సి
15. జతపరచండి.
నగరం బయటపడిన అంశం
ఎ. లోథాల్ 1. దున్నిన ప్రదేశం
బి. కాలీబంగన్ 2. నౌకాశ్రయం
సి. ధోలవీర 3. మట్టితో చేసిన
నాగలిని పోలిన
వస్తువు
డి. బన్వాలీ 4. పది పెద్ద గుర్తులతో
కూడిన హరప్పా రాత
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-1, బి-2, సి-4, డి-3
4) ఎ-2, బి-1, సి-3, డి-4
16. ప్రాచీన బౌద్ధ సంఘాల్లో ‘పవరానా’ అనే ఉత్సవం జరిగేది. అది దేనికి సంబంధించింది?
1) సంఘపరి నాయకుడిని ఎన్నుకోవడానికి, ధర్మ, వినయపై మాట్లాడే ఇద్దరు వ్యక్తులను ఎన్నుకోవటం
2) వర్ష రుతువులతొ విహారాల్లో బౌద్ధసన్యాసులు తాము చేసిన తప్పులను ఒప్పుకునే ఉత్సవం
3) కొత్త వ్యక్తిని బౌద్ధ సంఘాలలో
చేర్చుకొనేటప్పుడు చేసే ఉత్సవం
4) ఆషాఢ మాసంలో పౌర్ణమి తరువాత బౌద్ధ సన్యాసులు వర్ష రుతువులో తాము చేసే కార్యకలాపాలను నిర్ణయించుకోవటం
17. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) శ్రావణబెళ గోళలోని గోమఠేశ్వర విగ్రహం జైనులలోని చివరి తీర్థంకరునిది
2) ఇండియాలోని అతి పెద్దదైన-బౌద్ధ ఆరామం అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నది
3) చందేల రాజుల కాలంలో ఖజురహో దేవాలయాలను నిర్మించారు
4) హోయసలేశ్వర దేవాలయం శివునికి అంకితమిచ్చారు
18. విశాఖదత్తుని ముద్రరాక్షసంలోని కథాంశం?
1) హిందూ దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధం
2) ఆర్యరాజుకు, గిరిజన యువతి మధ్య
జరిగిన ప్రేమగాథ
3) రెండు ఆర్య తెగల మధ్య అధికారం కోసం జరిగిన పోరు
4) చంద్రగుప్త మౌర్యుని కాలంలో కోర్టు
రికార్డులు
19. హర్షుడు బౌద్ధమతవ్యాప్తికి ఎక్కడ సమావేశం నిర్వహించాడు?
1) ప్రయాగ 2) తక్షశిల
3) పాటలీపుత్రం 4) పురుషపురం
20. కింది వాటిలో ఏ జంతువు హరప్పా కాలం నాటి ముద్రలు, టెర్రాకోట బొమ్మల్లో లేదు?
1) ఆవు 2) ఏనుగు
3) ఖడ్గమృగం 4) పులి
21. ఆనంద్ తప్పనిసరిగా శాకాహారి ఎందుకంటే అతను బౌద్ధుడు కాబట్టి ఈ వాక్యం బట్టి
ఏ అంచనాలకు రావచ్చు?
1) ఎక్కువ మంది బౌద్ధులు శాకాహారులు
2) బౌద్ధులందరూ శాకాహారులే
3) బౌద్ధులు మాత్రమే శాకాహారులు
4) ఎక్కువ మంది శాకాహారులు బౌద్ధులే
22. బౌద్ధ మతానికి సంబంధించిన శిలలను తొలిచి చేసిన కొన్ని గుహలను చైత్యాలు అంటారు. మరికొన్నింటిని విహారాలు అంటారు. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
1) విహారం అనేది ప్రార్థన స్థలం కాగా చైత్యం అనేది బౌద్ధ సన్యాసుల నివాసస్థలం
2) చైత్యం అనేది ప్రార్థన స్థలం కాగా విహారం అనేది బౌద్ధ సన్యాసుల నివాస స్థలం
3) చైత్యం అనేది గుహ చివర దూరంగా ఉన్న స్థూపం కాగా విహారం అనేది దానికి
అక్షేమంగా ఉన్న మందిరం
4) ఈ రెండింటి మధ్య చెప్పుకోదగ్గ
తేడా అంటూ ఏమీ లేదు
23. కింది వాటిలో, బౌద్ధమతంలో నిర్వాణ భావనను ఉత్తమ రీతిలో నిర్వచించేది ఏది?
1) కోరిక అనే జ్వాలను ఆర్పివేయడం
2) స్వార్థాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం
3) పరమానంద, ప్రశాంత స్థితి
4) గ్రహణ శక్తికి దూరంగా ఉండే మానసిక స్థితి
24. భారతదేశంలో తాత్విక చింతన చరిత్ర విషయంలో, సాంఖ్య సంప్రదాయానికి సంబంధించిన కింది ప్రవచనాల్లో సరైనవి పరిశీలించండి.
1. సాంఖ్య సంప్రదాయం, పునర్జన్మ లేదా ఆత్మ మరో శరీరాన్ని ఆశ్రయించడానికి సంబంధించిన సిద్ధాంతాన్ని అంగీకరించదు
2. ముక్తికి మార్గం ఆత్మజ్ఞానమే కానీ మరే ఇతర బాహ్య ప్రభావం కాదని సాంఖ్యం అభిప్రాయపడుతుంది
1) ఎ 2) బి
3) ఎ, బి 4) వీటిలో ఏదీకాదు
25. ఎవరి పరిపాలనా కాలంలో మెగస్తనీస్ ఇండియాను సందర్శించాడు?
1) హర్ష 2) కణ్వ
3) అశోక 4) చంద్రగుప్త మౌర్య
26. కింది ప్రవచనాన్ని ఎవరు ప్రతిపాదించారు?
‘భగవపి ఖత్రియో అహంపి ఖత్రియో’
(భగవంతుడు(బుద్ధుడు) క్షత్రియుడైతే నేను కూడా క్షత్రియుడనే)
1) బింబిసారుడు 2) అజాతశత్రువు
3) ప్రసేనజిత్తు 4) శిశునాగ
27. శ్రీహర్షుడు రచించిన నాటకం?
1) కుందమాల 2) ప్రియదర్శిక
3) కర్పూరమంజరి 4) మాలతి మాధవ
28. ‘పిండాకార’ అనేది మౌర్యుల పాలనలో విధించిన ఏవిధమైన పన్ను?
1) కార్మిక 2) నీటిపారుదల
3) వ్యవసాయేతర
4) గ్రామస్థులందరి నుంచి సమష్టిగా సేకరణ
29. మహావీరుని మరణానంతరం, జైనమతానికి ఆధ్యాత్మిక గురువు అయిన వారెవరు?
1) గౌతమ ఇంద్రభూతి
2) గోసాల
3) సుధర్మన్ 4) జంబుస్వామి
30. భారత సాంస్కృతిక చరిత్రననుసరించి ‘పంచాయతన్’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
1) గ్రామ పెద్దల సమావేశం
2) ఒక మత వర్గం
3) దేవాలయ నిర్మాణ శైలి
4) పాలనాపరమైన అధికారి
31. కింది జతల్లో భారతీయ తత్వశాస్ర్తానికి చెందిన ఆరు వ్యవస్థలతో సంబంధం లేనివి ఏవి?
1) మీమాంస, వేదాంత
2) న్యాయ, వైశేషిక
3) లోకాయత, కాపాలిక
4) సాంఖ్య, యోగ
32. భారత జాతీయ చిహ్నం కింద చెక్కబడి ఉన్న మన జాతీయ నినాదం ‘సత్యమేవ జయతే’ను ఎక్కడ నుంచి స్వీకరించారు?
1) కఠోపనిషత్ 2) చాందగ్యోపనిషత్
3) ఐతరేయ బ్రాహ్మణం
4) ముండకోపనిషత్
33. కింది వాక్యాల్లో సరైనది?
1) ఆచార్య నాగార్జునుడు మహాయాన
బౌద్ధ మతంలో సిద్ధాంత సంప్రదాయాన్ని స్థాపించాడు
2) మైత్రేయ నాథుడు మహాయాన
బౌద్ధమతంలో యోగాచార సిద్ధాంత
సంప్రదాయాన్ని స్థాపించెను
3) ఆర్య దేవుడు, బుద్ధ పాలితుడు
మహాయాన బౌద్ధంలోని మాధ్యమిక సిద్ధాంత సంప్రదాయాన్ని అవలంబించారు
4) శాంతి దేవుడు, చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సంప్రదాయాన్ని అవలంబించారు
34. జతపరచండి.
ఎ. బగోర్ 1. రాజస్థాన్
బి. లాంఘనాజ్ 2. గుజరాత్
సి. భీమ్బెట్కా 3. మధ్యప్రదేశ్
డి. సరాయి 4. ఉత్తర్ప్రదేశ్
నహర్రాయ్
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-1, బి-4, సి-3, డి-2
3) ఎ-3, బి-1, సి-4, డి-2
4) ఎ-4, బి-3, సి-2, డి-1
35. కింది వాటిలో శుంగవంశ స్థాపకుని కుమారుడి ప్రణయగాథను తెలియజేసే పుస్తకం?
1) స్వప్ననాసవదత్త
2) మాళవికాగ్నిమిత్ర
3) మేఘదూత 4) రత్నావళి
36. అశోక చక్రవర్తి శాసనాలను కింది వారిలో తొలిసారిగా చదివినవారు ఎవరు?
1) జార్జ్ బుహ్లర్ 2) జేమ్స్ ప్రిన్సెస్
3) మాక్స్ ముల్లర్ 4) విలియం జోన్స్
37. భారత సాంస్కృతిక చరిత్రకు సంబంధించి కాలక్రమంలో విషయాల నమోదు,
రాజవంశ చరిత్రలు, పౌరాణిక కథలు రాసే బాధ్యత ఎవరిది?
1) శ్రమన 2) పరివ్రాజకుడు
3) అగ్రహారికుడు 4) మాగధ
38. అమరావతి స్థూపానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) పూర్తిగా నిర్మాణం జరిగింది క్రీ.శ. 200లో
2) అది సాంచీ స్థూపం కంటే పొడవైనది
3) అది సాంచీ స్థూపం కంటే చిన్నది
4) బుద్ధుని జీవిత కథను తెలిపే చిత్ర ఫలకాల్లో అది అలంకరించబడింది
39. చంద్రగుప్త విక్రమాదిత్యుడు స్థాపించినట్లు చెప్పే విక్రమశకం ఏ సంవత్సరంలో
ప్రారంభమైనది ?
1) క్రీ.పూ. 42లో 2) క్రీ.పూ. 58లో
3) క్రీ.పూ. 376లో 4) క్రీ.పూ. 415లో

Ert,l;e
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






