పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించినవారు ఎవరు?
భారత ఎన్నికల వ్యవస్థ
1. కింది వాక్యాల్లో సరైన వాటిని పరిశీలించి సమాధానమివ్వండి.
1) భారతదేశంలో రాజకీయ పార్టీలకు జాతీయ స్వభావం లేదు. ఎందుకంటే దేశ వ్యాప్తంగా ఎక్కువగా వ్యాపించలేదు
2) దేశంలో బహుళ పార్టీ వ్యవస్థలాగా, పలు రాజకీయ పార్టీల విధానాలు, పథకాల మధ్య సమీప పోలికలను మనం చూడొచ్చు
3) కొంతకాలంగా భారత రాజకీయాల్లో జాతీయ పార్టీల కంటే స్థానిక రాజకీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి
4) జాతీయ స్ఫూర్తి అభివృద్ధి వల్ల దేశంలోని రాజకీయ పార్టీలు సొంత ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయి
1) 1, 2, 3 2) 2, 3, 4
3) 1, 2, 4 4) 1, 3
2. కింది వాటిలో ఏది ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది?
1. ప్రధాన మంత్రి ఎన్నికలు
2. రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం
3. రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడం
4. రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించడం
1) 1, 2, 3, 4 2) 2, 3, 4
3) 3, 4 4) 3
3. ఏ తరగతి వ్యక్తులు తమ ఓటును తపాల బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు?
1. విదేశీ సేవలో విదేశాల్లో ఉన్న సభ్యులు
2. సైనిక దళాల సభ్యులు
3. ఎన్నికల విధులపై ఉన్న పౌర సేవకులు
4. విదేశాల్లో స్థిరపడిన భారతీయులు
1) 2, 3 2) 1, 2, 3
3) 1, 2, 3, 4 4) 1, 3
4. జాతీయ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందడానికి కింది దానిలో ఏది అవసరం?
1) 10 శాతం ఓట్లు పొందడం
2) నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాల్లో 4 శాతం ఓట్లు పొందడం
3) రెండు రాష్ర్టాల్లో 15 శాతం ఓట్లు పొందడం
4) ఒక రాష్ట్రంలో 25 శాతం ఓట్లు రావడం
5. భారతదేశంలోని పార్టీల సంస్థల గురించి తప్పుగా జత చేసిన అంశాన్ని గుర్తించండి.
1) భారత్‌లోని రాజకీయ పార్టీ సంస్థలు సరిగా క్రమబద్ధీకరించలేదు
2) అధిక రాజకీయ పార్టీ సంస్థలు నిర్దిష్ట నాయకుల చుట్టూ నిర్వహిస్తున్నాయి
3) దేశంలోని రాజకీయ పార్టీ సంస్థలు సంస్థాగత ఎన్నికలను తగిన కాలవిరామంతో నిర్వహిస్తాయి
4) దేశంలోని రాజకీయ పార్టీ సంస్థలు సంస్థాగత ఎన్నికలను తగిన కాలవిరామంతో నిర్వహించవు
6. 52వ రాజ్యాంగ సవరణ (1985) ద్వారా, రాజ్యాంగంలో కొత్తగా చేర్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ రాష్ర్టానికి వర్తించదు?
1) తెలంగాణ 2) మణిపూర్
3) జమ్ము కశ్మీర్ 4) నాగాలాండ్
7. ఒక రాష్ట్ర శాసనసభ న్నికల్లో అభ్యర్థి తన డిపాజిట్‌ను కోల్పోయినట్లు ప్రకటిస్తే దాని అర్థం ఏంటి?
1) పోలింగ్ చాలా తక్కువగా ఉదని
2) ఎన్నిక బహుళ సభ్యుల నియోజకవర్గంలో జరిగిందని
3) గెలుపొందిన అభ్యర్థి తన సమీప ప్రత్యర్థిపై తక్కువ మెజారిటీతో గెలిచారని
4) ఆ ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు పోటీ చేశారని
8. 1979లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏ రాష్ట్రం రూపొందించింది?
1) జమ్ముకశ్మీర్ 2) కేరళ
3) పశ్చిమ బెంగాల్
4) తమిళనాడు
9. పార్టీ ఫిరాయింపులకు పర్యాయ పదంగా మారిన ‘ఆయారావ్ గయారామ్’ అనే పదం ఏ రాష్ట్ర శాసన సభ్యులకు సరిపోతుంది?
1) ఉత్తరప్రదేశ్
2) హర్యానా
3) పంజాబ్
4) మధ్యప్రదేశ్
10. కింది అంశాల్లో ఏది భారతదేశంలో ప్రాంతీయ పార్టీల అభివృద్ధికి దోహదపడుతుంది.
1. తరచుగా ఎన్నికలు
2. సమాజంలో వివిధ వర్గాల డిమాండ్లను నిర్వహించకపోవడం
3. మల్టీనేషనల్ కంపెనీల వల్ల
4. కొత్త రాష్ర్టాల ఏర్పాటు
1) 1, 2
2) 2, 3
3) 3, 4
4) 1, 4
11. దేశంలో ఎన్నికల చట్టాలకు సంబంధించి ఒక నియోజకవర్గంలో ఎన్నికల కేసులను కనీసం ఎప్పుడు నమోదు చేయాలి?
1) పోలింగ్ ప్రారంభానికి 12 గంటల ముందు
2) పోలింగ్ ప్రారంభానికి 24 గంటల ముందు
3) పోలింగ్ ప్రారంభానికి 36 గంటల ముందు
4) పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు
12. ఎన్నికల సంఘం గురించి కింది వాటిలో ఏ వాక్యాలు సరైనవి?
1. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. ప్రధాన ఎన్నికల అధికారితో ఎన్నికల సంఘం సభ్యులు సమానమైన అధికారాలు కలిగి ఉంటారు
2. ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల అధికారికి ఇతర సభ్యుల నిర్ణయాలను రద్దు చేసే అధికారం ఉంది
3. ఎన్నికల సంఘం సభ్యులు పార్లమెంటులో నియమించబడతారు
4. కేవలం హైకోర్టు న్యాయమూర్తిగా నియామకానికి అర్హులైన వ్యక్తులనే ఎన్నికల సంఘం సభ్యులుగా లేదా ప్రధాన ఎన్నికల అధికారిగా నియమిస్తారు
1) 1, 3, 4 2) 2, 3, 4
3) 1 4) 1, 4
13. భారతదేశంలో రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ ఏ నిబంధనలు, నిర్ణయాల ప్రకారం జరుగుతాయి?
1) రాజ్యాంగ ఆర్టికల్ 324
2) ప్రజాప్రాతినిథ్య చట్టం 1951
3) కేవలం ఎన్నికల సంఘం
4) రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీతో సంప్రదించి ఎన్నికల సంఘం
14. పోలింగ్ బూత్ ఆక్రమణకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి.
1. ఓటర్లు ఓట్లు వేసిన తర్వాత పెట్టెలను తీసివేయడం
2. ఓటర్లను ఓటు వేయకుండా నిరోధించడం
3. ప్రతిపక్ష అభ్యర్థిపై దాడి చేయడం
4. బూత్‌లను ఆక్రమించుకునే వారిని అరెస్టు చేసి రెండు సంవత్సరాలు నిర్భందించవచ్చు
1) 1, 2, 3 2) 1, 2, 3, 4
3) 2, 3 4) 1, 2, 4
15. (A) నిశ్చిత వాక్యం: ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలకు వచ్చిన ఓట్లకు తగిన దామాషాలో ఆ పార్టీలన్నిటికి లిస్ట్ విధానం వాస్తవ ప్రాతినిథ్యం కల్పిస్తుంది
(V) హేతువు: వివిధ పార్టీలకు పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను లెక్కించి ఓట్ల దామాషాలో ఈ పార్టీలకు శాసనసభల్లో స్థానాలను కేటాయించడం
సంకేతాలు:
1) (A), (R) లు రెండూ విడివిడిగా వాస్తవాలే. (A) కి (R) సరైన వివరణ
2) (A), (R) లు రెండూ విడివిడిగా వాస్తవాలే. (A)కి (R) సరైన వివరణ కాదు
3) (A) వాస్తవం, (R) అవాస్తవం
4) (A) అవాస్తవం, (R) వాస్తవం
16. శాసనసభలో ఒక రాజకీయ పార్టీ సాధించిన సీట్ల సంఖ్య ఆ పార్టీకి పోలైన ఓట్లకు దాదాపుగా సమానంగా ఉండాలనే భావన ఏ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది?
1) కులం (లేదా) మత ప్రాతినిథ్యం
2) విద్యుక్త ప్రాతినిథ్యం
3) దామాషా ప్రాతినిథ్యం
4) ప్రాదేశిక ప్రాతినిథ్యం
17. కింది నాయకవర్గాల్లో స్వరాజ్ పార్టీతో సంబంధం ఉన్న వర్గం ఏది?
1) మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సి.ఆర్.దాస్
2) రాఘవేంద్రరావు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్
3) మోతీలాల్ నెహ్రూ, విఠల్‌భాయ్ పటేల్, సి.ఆర్.దాస్
4) విఠల్‌భాయ్ పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ
18. జాబితా ప్రాతినిథ్య విధానంలో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాలను ఎవరు రూపొందిస్తారు?
1) రాజకీయ పార్టీల పరస్పర అధికారంతో
2) ఒక్కో రాజకీయ పార్టీ
3) ఓటర్లు 4) ఎన్నికల సంఘం
పాలిటీ
19. కింది వాటిలో రాజకీయ పార్టీల ఏర్పాటు కాలక్రమాన్ని గుర్తించండి?
1. భారత కమ్యూనిస్ట్ పార్టీ
2. భారతీయ జనసంఘ్
3. భారత స్వతంత్ర పార్టీ
4. భారత జాతీయ కాంగ్రెస్
1) 1, 2, 3, 4 2) 2, 3, 1, 4
3) 4, 2, 3, 1 4) 4, 1, 2, 3
20. దేశంలో ప్రాంతీయ రాజకీయ పార్టీల గురించి కింది అంశాల్లో సరైంది.
1. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రాంతీయ సంస్కృతితో మిళితమై ఉంటాయి
2. ప్రాంతీయ రాజకీయ పార్టీలు ప్రాంతీయ భాషను రాజకీయాలకు ఉపయోగిస్తాయి
3. ప్రాంతీయ రాజకీయ పార్టీలు జాతీయ పార్టీలు కలిసి పని చేస్తాయి
4. ప్రాంతీయ రాజకీయ పార్టీలు అనేవి స్వతంత్ర రాజకీయ పరిణామాలు
1) 1, 2 2) 1, 2, 3
3) 1, 3, 4 4) 2
21. కింది వాటిలో భారతదేశం కలిగి ఉన్నది ఏది?
1) ఏకపార్టీ వ్యవస్థ
2) ద్వంద్వ పార్టీ విధానం
3) అనేక పార్టీల విధానం
4) ఏదీ కాదు
22. దేశంలో పార్టీ వ్యవస్థకు సంబంధించి ముఖ్యమైనది ఏది?
1) దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు కులం, భాషా, మతం మొదలగు అంశాలతో ప్రత్యేకంగా ఏర్పడతాయి
2) భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి
3) వివిధ రాజకీయ పార్టీల సిద్ధాంతాలు దగ్గరి పోలికలు కలిగి ఉండడం
4) పైవన్నీ
23. పార్టీలు, గుర్తులకు సంబంధించి కింది వాటిలో సరికాని జత ఏది?
1) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – గడియారం
2) కమ్యూనిస్టు పార్టీ – కంకి, కొడవలి
3) కమ్యూనిస్టు పార్టీ (మార్సిస్ట్) – సుత్తి, కొడవలి
4) బహుజన సమాజ్‌వాది పార్టీ – నాగలి
24. ప్రజాస్వామ్యానికి మూల స్థంభాల వంటివి ఏవి?
1) రాజకీయ నాయకులు
2) రాజకీయ పార్టీలు
3) పార్టీ కార్యకర్తలు
4) ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు
25. కింది వాటిలో పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని కాంక్షించినవారు ఎవరు?
1) ఎంఎన్ రాయ్
2) జయప్రకాశ్ నారాయణ్
3) ఆచార్య నరేంద్రదేవ్
4) రామ్మనోహర్ లోహియ
26. కింది సంస్థల ఏర్పాటుకు సంబంధించిన సరైన కాలక్రమాన్ని సూచించండి?
1. స్వతంత్ర పార్టీ
2. హిందూ మహాసభ
3. భారత కమ్యూనిస్టు పార్టీ
4. భారతీయ జనసంఘ్
1) 1, 2, 3, 4 2) 1, 4, 2, 3
) 2, 4, 3, 1 4) 2, 3, 4, 1
27. ఎలాంటి వ్యవస్థ అమల్లో ఉన్న దేశాల్లో నైష్పత్తిక ప్రాతినిథ్య పద్ధతి అవసరం ఉండదు?
1) రిజర్వ్ నియోజకవర్గాలు లేని దేశాలు
2) రెండు పార్టీల వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాల్లో
3) బహుళ పార్టీ వ్యవస్థ
4) పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా వ్యవస్థల మేలికలయిక
28. కింది ఏ దేశాల్లో ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది?
1) అమెరికా, కెనడా
2) బ్రిటన్, స్విట్జర్లాండ్
3) ఫ్రాన్స్, ఇటలీ
4) జర్మనీ, ఆస్ట్రేలియా
29. ఓటర్ల నమోదు బాధ్యత ఎవరిది?
1) వ్యక్తిగత ఓటర్లది 2) ప్రభుత్వం
3) ఎన్నికల సంఘం
4) పురపాలక సంస్థలు
30. భారత్‌లో ప్రజాస్వామ్యం ఉంది. ప్రజల భాగస్వామ్యం సహకారం లేకుంటే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది? దీని అర్థం ఏమిటి?
1) దీనిలో ప్రజలు భాగస్వాములయ్యేట్లు, సహకరించేటట్లు ప్రభుత్వం బలవంతం చేయాలి
2) ప్రజలు ప్రభుత్వాన్ని రూపొందించాలి
3) ఆ ప్రభుత్వంతో ప్రజలు భాగస్వాములవుతూ సహకరించాలి
4) భారతదేశం అధ్యక్ష తరహా వ్యవస్థను అనుసరించాలి
31. ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికల తర్వాత పార్టీ ఫిరాయింపులు ఎక్కువయ్యాయి?
1) 1962 2) 1967
3) 1971 4) 1977
32. కింది వాటిలో సరికానిది?
1. అధికరణ 326 వయోజన ఓటు హక్కు
2. ఓటింగ్ వయోపరిమితిని 61వ సవరణ ద్వారా తగ్గించారు
3. మొదటి మధ్యంతర ఎన్నికలు 1977లో నిర్వహించారు
4. ఇప్పటివరకు అన్ని సాధారణ ఎన్నికల్లో 14వ లోక్‌సభ ఎన్నికల్లోనే అధిక శాతం పోలింగ్ నమోదైంది
1) 4 2) 3, 4
3) 3 4) 1, 3, 4
33. ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచార సమయంలో ఏ కార్యక్రమాలను అవలంబిస్తాడు.
1. ఓటు వేసేట్లు ఓటర్లను ప్రేరేపించడానికి వారికి బహుమతులు ఇవ్వడం
2. కులం లేదా మత ప్రాతిపదికన ఓట్లు కోరడం
3. తప్పుడు వ్యక్తిత్వంలో ఇతర అభ్యర్థులను చంపించడం
4. సతీసహగమనాన్ని ప్రచారం చేయడం, దాని వైభవాన్ని వర్ణించడం
1) 1, 2, 4 2) 1, 2, 3, 4
3) 1, 2, 3 4) 1, 3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు