పిల్లల్లో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
జంతుశాస్త్రం – జీర్ణ వ్యవస్థ
1. పిండి పదార్థాలలో C, H, O నిష్పత్తి?
1) 1:2:1 2) 3:1:1
3) 1:1:1 4) 6:4:6
2. ఒక గ్రాము పిండిపదార్థాల నుంచి లభించే శక్తి?
1) 9 కిలో క్యాలరీలు
2) 8 కిలో క్యాలరీలు
3) 6 కిలో క్యాలరీలు
4) 4 కిలో క్యాలరీలు
3. అమైనో ఆమ్లాల పాలిమర్లు?
1) పిండి పదార్థాలు
2) మాంసకృత్తులు
3) కొవ్వులు 4) లిపిడ్లు
4. ఆహారంలో మాంసకృత్తుల లోపం వల్ల కలిగే దుష్పరిణామం?
1) బెరిబెరి 2) స్కర్వీ
3) పెల్లాగ్రా 4) క్వాషియార్కర్
5. ఒక గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి?
1) 9 కిలో క్యాలరీలు
2) 6 కిలో క్యాలరీలు
3) 4 కిలో క్యాలరీలు
4) 18 కిలో క్యాలరీలు
6. కొలెస్టిరాల్ అనేది ఒక రకమైన..?
1) పిండిపదార్థం 2) మాంసకృత్తులు
3) లిపిడ్ 4) విటమిన్
7. కొవ్వులలో కరిగే విటమిన్లు?
1) B-C 2) A-D
3) B-D 4) A-C
8. నీటిలో కరిగే విటమిన్లు?
1) B-C 2) A-D
3) B-D 4) A-C
9. పిల్లల్లో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది?
1) సన్షైన్ విటమిన్
2) యాంటీగ్జిరాఫ్తాల్మిక్ విటమిన్
3) టోకోఫెరాల్
4) నాఫ్తోక్వినోన్
10. ఏ విటమిన్ లోపం వల్ల రక్త స్కందనం ఆలస్యమవుతుంది?
1) ఎ 2) బి 3) సి 4) కె
11. ఆరోగ్యవంతమైన కళ్లకు అవసరమైన విటమిన్?
1) రెటినాల్ 2) కాల్సిఫెరాల్
3) టోకోఫెరాల్ 4) నాఫ్తోక్వినోన్
12. విటమిన్ బి లోపం వల్ల కలిగే వ్యాధి?
1) స్కర్వీ 2) కెరటోమలేషియా
3) బెరిబెరి 4) రికెట్స్
13. స్కర్వీకి కారణం ఏ విటమిన్ లోపం ?
1) ఎ 2) బి 3) సి 4) డి
14. ఇనుము లోపం వల్ల కలిగే దుష్పరిణామం?
1) వంధ్యత్వం
2) కండరాలు వంకరవడం
3) రక్తహీనత 4) వాంతులు
15. ఆరోగ్యవంతమైన దంతాలు, ఎముకలకు ఏ ఖనిజ లవణాలు అవసరం?
1) Ca-P 2) Na-K
3) Mg-Cl 4) Mn-Co
16. మానవుడి దంత సూచిక?
1) కు 2/1 ర 0/1 అచ 2/2 చ 3/3
2) కు 2/2 ర 1/1 అచ 2/2 చ 3/3
3) కు 2/2 ర 0/0 అచ 2/2 చ 3/3
4) కు 1/1 ర 2/2 అచ 3/3 చ 2/2
17. మానవుడి ఆహారనాళానికి అనుబంధంగా ఉన్న అవశేషావయవం?
1) నిమేషక పటలం 2) ఉండూకం
3) పురీషనాళం 4) హాస్ర్టా
18. లాలాజంలోని ఎంజైమ్?
1) ట్రిప్సిన్ 2) పెప్సిన్
3) లైపేజ్ 4) టయలిన్
19. కింది వేటిలో ఎంజైమ్లు ఉండవు?
1) జఠరరసం 2) లాలాజలం
3) క్లోమరసం 4) పైత్యరసం
20. జీర్ణక్రియానంతరం మాంసకృత్తులు ఏ విధంగా జల విశ్లేషణ చెందుతాయి?
1) గ్లూకోజ్ 2) అమైనో ఆమ్లాలు
3) కొవ్వు ఆమ్లాలు 4) గ్లిజరాల్
21. ఏ అవయవం సరిగా పనిచేయకపోవడం వల్ల కామెర్ల వ్యాధి కలుగుతుంది?
1) క్లోమం 2) ఊపిరితిత్తులు
3) కాలేయం 4) మూత్రపిండాలు
22. జతపరచండి.
1. కాల్సిఫెరాల్ ఎ. యాంటీ హమరేజిక్ విటమిన్
2. నాఫ్తోక్వినోన్ బి. యాంటీ స్టెరిలిటీ విటమిన్
3. రెటినాల్ సి. యాంటీగ్జిరాఫ్తా ల్మిక్ విటమిన్
4. టోకోఫెరాల్ డి. యాంటీ రికెట్స్ విటమిన్ ఇ. యాంటీ బెరిబెరి విటమిన్
1) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
3) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
4) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
23. జతపరచండి.
1. మాంసకృత్తులు ఎ. మాల్టోజ్
2. పిండి పదార్థాలు బి. ట్రిప్సిన్
3. కొవ్వులు సి. ఎమైలేజ్
4. డైశాకరైడ్లు డి. లైపేజ్
1) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి
2) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
3) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
24. పిండి పదార్థాలు?
1) మొక్కల్లో సంశ్లేషితం కావు
2) జీవులకు అవసరం లేదు
3) జీవులకు ప్రాథమిక శక్తి వనరు
4) హార్మోన్
25. మాంసకృత్తుల ఉపయోగం?
1) కణజాలాల నిర్మాణం
2) బలాన్ని ఇవ్వడం
3) రక్తాన్ని ఉత్పత్తి చేయడం
4) గ్లూకోజ్ ఉత్పత్తి
26. విటమిన్ ‘సి’ అధికంగా లభించే వనరు?
1) కూరగాయలు 2) పాలు
3) మాంసం 4) ఉసిరి
27. కాలేయం విధి?
1) రక్తం నుంచి మూత్రాన్ని వేరు చేయడం
2) అదనంగా ఉన్న గ్లూకోజ్ నిల్వ చేయడం
3) రక్తాన్ని శుద్ధి చేయడం
4) హార్మోన్లను స్రవించడం
28. ఏ విటమిన్ లోపంవల్ల రేచీకటి కలుగుతుంది?
1) విటమిన్-ఎ 2) విటమిన్-సి
3) విటమిన్-కె 4) విటమిన్-డి
29. జీర్ణక్రియలో సుక్రేజ్ అనే ఎంజైమ్ సుక్రోజ్ను ఎలా జీర్ణం చేస్తుంది?
1) గ్లూకోజ్, ఫ్రక్టోజ్
2) గ్లూకోజ్, మాల్టోజ్
3) గ్లూకోజ్, గాలక్టోజ్
4) గాలక్టోజ్, మాల్టోజ్
30. పైత్యరసాన్ని స్రవించేది?
1) చిన్నపేగు 2) క్లోమం
3) కాలేయం 4) లాలాజల గ్రంథులు
31. ట్రిప్సిన్ను స్రవించేది?
1) కాలేయం 2) క్లోమం
3) జఠర గ్రంథులు 4) బ్రన్నర్ గ్రంథులు
32. పాలలోని చక్కెర నుంచి ఏర్పడే మోనో శాకరైడ్లు?
1) లాక్టోజ్, గ్లూకోజ్ 2) గ్లూకోజ్, గాలక్టోజ్
3) ఫ్రక్టోజ్, గ్లూకోజ్ 4) ఫ్రక్టోజ్, గాలక్టోజ్
33. విటమిన్-డి లోపం వల్ల పెద్దల్లో కలిగే దుష్పరిణామం?
1) రికెట్స్ 2) స్కర్వీ
3) బెరిబెరి 4) ఆస్టియా మలేషియా
34. జతపరచండి.
1. విటమిన్-ఎ ఎ. నిమ్మ
2. విటమిన్-కె బి. ఆకుకూరలు
3. విటమిన్-సి సి. క్యారట్
4. విటమిన్-డి డి. సూర్యరశ్మి
1) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
2) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి, 4-డి
4) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
35. వేడివల్ల విచ్ఛిన్నమయ్యే విటమిన్?
1) ఇ 2) బి 3) సి 4) ఎ
36. దేని లోపంవల్ల గ్జిరాఫ్తాల్మియా కలుగుతుంది?
1) మాంసకృత్తులు 2) విటమిన్-ఎ
3) రైబోఫ్లావిన్ 4) విటమిన్-డి
37. క్యాషియార్కర్ దేని లోపం వల్ల కలుగుతుంది?
1) విటమిన్లు 2) మాంసకృత్తులు
3) ప్లీహం 4) పీయూషగ్రంథి
38. కింది వాటిలో మిశ్రమ గ్రంథి?
1) క్లోమం 2) కాలేయం
3) ప్లీహం 4) పీయూషగ్రంథి
39. బైలురూబిన్, బైలువర్డిన్లు?
1) ఎంజైమ్లు 2) హోర్మోన్లు
3) పైత్యరస వర్ణకాలు 4) విటమిన్లు
40. మాంసకృత్తులను జీర్ణం చేసే ఎంజైమ్?
1) ఎమైలేజ్ 2) లైపేజ్
3) మాల్టేజ్ 4) పెప్సిన్
41. ఇనుము, ఇతర లవణాలు అధికంగా ఉండే పదార్థాలు?
1) పప్పులు 2) దుంపలు
3) మాంసం, గుడ్డు 4) ఆకు కూరలు
42. దేని లోపం వల్ల తీవ్రమైన రక్తహీనత కలుగుతుంది?
1) విటమిన్-సి 2) విటమిన్-బి1
3) విటమిన్-బి6 4) విటమిన్-బి12
43. మానవుడిలోని లాలాజల గ్రంథుల సంఖ్య?
1) రెండు జతలు 2) నాలుగు జతలు
3) మూడు జతలు 4) ఐదు జతలు
44. 14 సంవత్సరాల వరకు పెరుగుదల కోసం పిల్లలకు ఎక్కువ అవసరమయ్యేవి?
1) విటమిన్లు 2) కొవ్వులు
3) పాలు 4) మాంసకృత్తులు
45. కోబాల్ట్తో కూడిన విటమిన్?
1) బి1 2) బి2 3) బి6 4) బి12
46. థయమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి?
1) బెరిబెరి 2) స్కర్వీ
3) కాటరాక్ట్ 4) ఎనిమియా
47. విటమిన్-బి12ను కింది ఏ ప్రాణులు తయారుచేసుకోగలవు?
1) చేపలు 2) సూక్ష్మజీవులు
3) మొక్కలు 4) పశువులు
48. విటమిన్-బి12 ఏ వ్యాధి నిర్మూలన, చికిత్సకు ఉపయోగపడుతుంది?
1) పెర్నీషియన్ ఎనిమియా
2) స్కర్వీ
3) కాటరాక్ట్ 4) బెరిబెరి
49. మానవుడిలో రెటినాల్ లోపం వల్ల మొదట కనపడే వ్యాధి లక్షణం?
1) రేచీకటి 2) కెరాటినైజేషన్
3) జిరాఫ్తాల్మియా 4) అంధత్వం
50. మన ఆహారంలో ఏ విటమిన్ లోపం వల్ల బెరిబెరి వ్యాధి కలుగుతుంది?
1) విటమిన్-బి1 2) విటమిన్-బి2
3) విటమిన్-బి6 4) విటమిన్-బి12
51. విటమిన్ నియాసిన్ కింది అణువులోని భాగం?
1) పెరిడాక్సిన్ 2) పైరిడాక్సిల్ పాస్ఫేట్
3) పైరోపాస్ఫేట్ 4) NAD+
52. రైబోఫ్లావిన్ విటమిన్ కింది ఏ అణువులోని భాగం?
1) పెరిడాక్సిన్ 2) FAD
3) పైరిడాక్సాల్ పాస్ఫేట్
4) పైరోపాస్ఫేట్
53. ఆల్ఫా- కెరోటిన్, గామా-కెరోటిన్, క్రిప్టోగ్జాన్తిన్తో కలిసి బీటా-కెరోటిన్ కింది వేటి నుంచి తయారవుతుంది?
1) మొక్కలు 2) జంతువులు
3) మొక్కలు, జంతువులు రెండింటి నుంచి
4) సూక్ష్మజీవులు
54. విటమిన్-కె లోపం వల్ల కింది ఏ పదార్థం స్థాయి తగ్గుతుంది?
1) ప్రోత్రాంబిన్ 2) త్రాంబిన్
3) ఫైబ్రిన్ 4) ఫైబ్రినోజెన్
55. కింది ఏ సమ్మేళనాలు విటమిన్-బి6 వర్గానికి చెందినవి?
1) పైరిడాక్సిల్ పాస్ఫేట్
2) పైరిడాక్సిన్
3) పైరిడాక్సమైన్ 4) పైవన్నీ
56. ఏ లోహ అయాన్ విటమిన్-బి12 ద్వారా ప్రత్యేకంగా బంధించబడి ఉంటుంది?
1) కోబాల్ట్ 2) రాగి
3) జింక్ 4) ఇనుము
57. నియాసిన్ లోపం ఏ వ్యాధికి కారణం అవుతుంది?
1) పెల్లాగ్రా 2) స్కర్వీ
3) కాటరాక్ట్ 4) ఎనిమియా
58. సూర్యరశ్మి ప్రభావం వల్ల మన చర్మంలో ఏ విటమిన్ దేనివల్ల తయారవుతుంది?
1) విటమిన్-సి, గ్లూకోజ్
2) విటమిన్-ఇ, పిండిపదార్థం
3) విటమిన్-డి, కొలెస్టిరాల్
4) విటమిన్-బి1, ప్రొటీన్
59. గట్టి ఎముకల కోసం కాల్షియాన్ని శోషించుకోవడానికి కింది ఏ విటమిన్ అవసరం కూడా ఉంటుంది?
1) విటమిన్-డి 2) విటమిన్-కె
3) బీటా కెరోటిన్ 4) విటమిన్-ఇ
60. చక్కెరలు, కొవ్వులు, ప్రొటీన్లు వంటి శక్తి పోషకాల నుంచి శక్తి విడుదల చేయడానికి విటమిన్లు వేటిగా పనిచేస్తాయి?
1) మూలపదార్థాలుగా
2) యాంటీ ఆక్సిడెంట్లుగా
3) కో ఎంజైములుగా
4) మార్పు చేసే పదార్థాలుగా
61. ఎక్కువ మోతాదులో యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల పేగులో ఏ విటమిన్ తయారుచేసే బాక్టీరియా నశిస్తాయి?
1) కె 2) బి12
3) బయోటిన్ 4) సి
62. శరీరంలోని కణాలు అతికి ఉండటానికి కొల్లాజన్ సిమెంట్ పదార్థం వలె పనిచేస్తుంది? ఈ కొల్లాజన్ తయారీకి కింది విటమిన్ అవసరం?
1) విటమిన్-ఎ 2) విటమిన్-డి
3) విటమిన్-సి 4) విటమిన్-కె
63. మొక్కజొన్న ప్రధాన ఆహారంగా తీసుకునే వారిలో పెల్ల్లాగ్రా వ్యాధి సర్వసాధారణం. మొక్కజొన్నలో కింది వాటిలో లోపించింది ఏది?
1) టిప్ట్రోఫాన్ 2) నియాసిన్
3) విటమిన్ – బి12 4) ఎ, బి
64. ఆస్కార్బిక్ ఆమ్లం ప్రధాన వనరు?
1) మాంసం 2) చిక్కుడు గింజలు
3) సిట్రస్ ఫలాలు 4) లెట్యుస్
65. ఆహారంలో ఈ మూల పదార్థం పుష్కలంగా ఉంటే నియాసిన్ లోపం ఉండదు?
1) కెరోటిన్ 2) థైమిన్
3) టిప్ట్రోఫాన్ 4) ఫోలిక్ ఆమ్లం
66. ఇప్పటి వరకు కనుగొన్న విటమిన్-బి ఎన్ని రకాలు?
1) 5 2) 7 3) 9 4) 12
67. విటమిన్-ఇ సమృద్ధిగా లభించే వనరు?
1) కాలేయం 2) గుడ్లు
3) వెజిటబుల్ ఆయిల్
4) ఆకుకూరలు
- Tags
- Biology
- nipuna
- Study material
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు