పఠన వేగాన్ని ఎలా పెంచుకోవాలి ?
ఇది ఒక క్రమపద్ధతిలో సాగాల్సిన చర్య. ముందుగా మీ ఏకాగ్రతను మరింతగా పెంచుకోవాలి. మీ మనసులో ఏర్పడే అవరోధ భావాలను తొలగించుకోవాలి. ఒక పదాన్ని లేదా వాక్యాన్ని పట్టుకొని వేళ్లాడకూడదు. మీరు చదువుతున్న అంశంలో మొత్తం వివరాలన్నింటినీ వివరణాత్మకంగా అర్థం చేసుకోవాలని ప్రయత్నించకండి. ఆ అంశంలో ముఖ్యమైన ఐడియాను గుర్తించి, ఆకళింపు చేసుకోండి. మీకు వివరించబోయే స్పీడ్ రీడింగ్ టెక్నిక్లను అనుసరించండి. మీ కనుల కదలికలను అదుపు చేసుకోండి.
వేగాన్ని తగ్గించే అంశాలు
చాలామంది స్వభావరీత్యా చాలా తక్కువ వేగంతో చదివే అలవాటును కలిగి ఉంటారు. పైన చెప్పిన అంశాల్లో శ్రద్ధ వహించినట్లయితే వారి పఠనవేగాన్ని చాలామటుకు మెరుగుపర్చవచ్చు. కొంతమందిలో పఠనశైలిని బట్టి కూడా వారి పఠనవేగం ప్రభావితమవుతుంది. కొంతమంది విద్యార్థులు చాలా గట్టిగా చదివే అలవాటును కలిగి ఉంటారు. అలా చదివితేనేగానీ తమకు విషయం అర్థం కాదని అంటూ ఉంటారు.
చదివే విషయాన్ని గట్టిగా ఉచ్ఛరించటం ఒక రకంగా మంచి అలవాటే. ఎందుకంటే గట్టిగా చదవడం వల్ల విజ్యువల్, ఆడిటరీ ఇంద్రియానుభూతులు ఏకకాలంలో కలిగి చదువుతున్న విషయానికి సంబంధించిన న్యూరోపాత్ మరింత పటిష్టంగా ఏర్పడే అవకాశాలు మెరగవుతాయి. ఇలా గట్టిగా చదవటం అనే అలవాటు కొన్ని పాఠ్యాంశాలను కూలంకషంగా నేర్చుకోవడానికి, లేదా పరీక్షల సమయంలో రివిజన్కి అట్టే టైం లేనప్పుడు కొన్ని ప్రశ్నలను బట్టీ పట్టడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇదే అలవాటును పాఠ్యాంశాలను చదివేటప్పుడు సైతం కొనసాగించినట్లయితే అది పఠనవేగాన్ని గణనీయంగా తగ్గించివేస్తుంది.
కాగా మరికొంతమంది తమ పాఠ్యాంశాలను సైతం చాలా యాంత్రికంగా చదువుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా చదవటం కొనసాగించినందు వల్ల కొద్దోగొప్పో మనసుకు పట్టకపోతుందా? అని వారి అభిప్రాయం. వాస్తవానికి ఈ అలవాటువల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు. కాలం వృథా కావటం తప్పించి, చదువుతున్న విషయాలేవీ మైండ్లో రికార్డు కావు. పరీక్షల్లో రాద్దామంటే గుర్తుకు రావు.
ఈ అలవాటువల్ల రీడింగ్ స్పీడ్ తగ్గిపోతుంది. కొంతమంది విద్యార్థులు తాము చదువుతున్న టాపిక్కు సంబంధం లేని విషయాలను చదువుతూ పఠనావేగాన్ని తగ్గించివేస్తుంటారు. చివరగా విద్యార్థుల్లో పదాల పరిచయం, ఉచ్ఛారణలో సామర్థ్యం కొరవడటం కారణం చేత తమ పఠనవేగాన్ని మందగింపచేసుకుంటారు. మీ పఠనశైలిలో ఉన్న లోపాలు, ప్లస్ పాయింట్లను మీరు గుర్తించి వివరించుకోగలిగితే మీ రీడింగ్ స్పీడును ఒక క్రమపద్ధతిలో పెంచుకోవడాన్ని ప్రాక్టీస్ చేయవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు