ఐఐటీ బాంబేలో పీహెచ్‌పీ, MySQL ఫ్రీ ఆన్లైన్ కోర్సు
ముంబై: దేశంలో అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ బాంబే ఉచితంగా పీహెచ్‌పీ, MySQL ఆన్లైన్ కోర్సును అందిస్తున్నది. ఈ కోర్సును చేయాలనుకునేవారు స్వయం (SWAYAM) ప్లాట్ఫామ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది. ముందే రికార్డు చేసి ఉండే ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ)ను ఏఐసీటీఈ ఆమోదించింది. ఈ కోర్సు 15 వారాల్లో పూర్తవుతుంది. దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ వీడియో, ఆడియో ఫార్మాట్లలో అందుబాటులో ఉన్నది. కోర్సులో భాగంగా పీహెచ్‌పీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌ను నేర్చుకునేందుకు అవసరమైన 57 ఆడియో, వీడియో రూపంలో పాఠ్యాంశాలు ఉన్నాయి. దీనిద్వారా వెబ్సైట్లను, ఈకామర్స్ సైట్లను రూపొందించవచ్చు.
ఎవరు చేయవచ్చు..
సాఫ్ట్వేర్ యూజర్లు, డెవలపర్లు, ట్రైనర్లు, రిసెర్చ్ స్కాలర్లు, ఐటీ రంగంలో పనిచేస్తున్నవారు, యూజీ, పీజీ విద్యార్థులు ఈ కోర్సు చేయవచ్చు.
రిజిస్ట్రేషన్ ఎలా?
ఆసక్తి కలిగిన అభ్యర్థులు స్వయం అధికారిక వెబ్సైట్ https://onlinecourses.swayam2.ac.in/లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
భార్యను అదుపులో పెట్టడం ఎలా?
కరోనాతో ప్రముఖ చిత్రకారుడు చంద్ర కన్నుమూత
దేశంలో 30 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
#ResignModi.. పొరపాటున బ్లాక్ చేశాం.. ప్రభుత్వం చెప్పలేదన్న ఫేస్బుక్
IPL 2021: కరోనా ఎఫెక్ట్.. ఇద్దరు స్టార్ అంపైర్లు ఔట్
అపోలో-11 మిషన్ ఆస్ట్రోనాట్ మైఖేల్ కన్నుమూత
భారత్ నుంచి వీలైనంత తొందరగా వచ్చేయండి..
- Tags
- iit bombay
- MySQL
- Online course
- PHP
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు