క్యాట్ -2021
మేనేజ్మెంట్ కోర్సులకు పేరుగాంచిన ఐఐఎంల్లో ప్రవేశానికి జాతీయస్థాయిలో నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)-2021 నోటిఫికేషన్
విడుదలైంది.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-అహ్మదాబాద్, అమృతసర్,
బెంగళూరు, బోధ్‌గయ, కోల్‌కతా,
ఇండోర్, జమ్ము, కాశీపూర్, కోజికోడ్,
లక్నో, నాగ్‌పూర్, రాయ్‌పూర్, రాంచీ,
రోహతక్, సంబల్పూర్, షిల్లాంగ్,
సిర్మార్, తిరుచిరాపల్లి, ఉదయ్‌పూర్, విశాఖపట్నం.
నోట్: క్యాట్ స్కోర్ ఆధారంగా దేశంలోని ఐఐఎంలే కాకుండా పలు ప్రతిష్ఠాత్మక బీ స్కూల్స్, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తున్నాయి.
ప్రోగ్రామ్స్: పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ (పీజీపీ), పీజీపీ-ఎఫ్ఏబీఎం, ఎంబీఏ, ఈఎంబీఏ, ఎంబీఏ-హెచ్ఆర్ఎం, పీజీపీఈఎంతోపాటు ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ (డాక్టోరల్) తదితరాలు.
అర్హతలు
కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశాల సమయానికి సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది.
సీఏ/సీఎస్, ఐసీడబ్ల్యూఏ లేదా తత్సమాన కోర్సుల్లో ఉత్తీర్ణులైనవారు అర్హులు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 158 పరీక్ష కేంద్రాల్లో క్యాట్‌ను నిర్వహించనున్నారు.
స్కోర్ వ్యాలిడిటీ: క్యాట్-2021 స్కోర్ వ్యాలిడిటీ 2022, డిసెంబర్ 31 వరకు ఉంటుంది.
నోట్: మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం క్యాట్ స్కోర్, ఇంటర్వ్యూ, జీడీ తదితర వేర్వేరు పద్ధతుల్లో ఆయా ఐఐఎంలు ప్రవేశాలను కల్పిస్తాయి.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, వరంగల్
- Tags
- IIMB
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు