గురుకులాలు.. ఉపాధికి మార్గాలు
- అందుబాటులో వృత్తివిద్యా కోర్సులు
- ఉద్యోగ, ఉన్నత విద్యావకాశాలు
- దరఖాస్తులకు 12 చివరితేదీ
నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు స్వల్పకాలంలోనే ఉపాధి అవకాశాలను కల్పించడంలో గురుకులాలు కీలకభూమికను పోషిస్తున్నాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా, విభిన్న, విద్యార్థుల సృజనాత్మకతకు పదునుపెట్టే వృత్తివిద్యా కోర్సులను అందిస్తున్నాయి. అందుకు మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలే నిదర్శనం.
గురుకులాల్లో ఇంటర్లో రెగ్యులర్ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఆ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు కాలేజీ నుంచే సరాసరి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల్లో
చేరుతుండటం విశేషం. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 12 చివరితేదీ. ఈ నేపథ్యంలో బీసీ గురుకులాల్లోని వృత్తి విద్యా కోర్సులపై ‘నిపుణ’ ప్రత్యేక కథనం..
ప్రీ సూల్ టీచర్ ట్రైనింగ్
ప్రీ-సూల్ టీచర్ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్లు ప్రైవేట్ పాఠశాలలు, డే కేర్ సెంటర్లు, ఇతర బాల్య విద్యా కార్యక్రమాల్లో ఉపాధి పొందవచ్చు. ఈ కోర్సులు అత్యంత లాభదాయకంగా ఉన్నాయి. ప్రైవేట్ విద్యారంగంలో టీచర్ ఉద్యోగాలకు పోటీ ఎకువగా ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వరంగంలో, ప్రీ-సూల్ టీచర్ ట్రైనింగ్ గ్రాడ్యుయేట్లుగా ప్రభుత్వ పాఠశాలలు, ప్రీ ప్రైమరీ, క్రెచ్, ప్రభుత్వం నిర్వహించే ఇతర విద్యా కార్యక్రమాల్లో ఉపాధి అవకాశాలు ఎకువగా ఉన్నాయి. కేవలం ఉపాధి మార్గంగానే కాకుండా టీచింగ్ రంగంలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ప్రీ-సూల్ టీచర్ కోర్సు ఉపయోగపడుతుంది.
ఈ కోర్సు అధునాతన కెరీర్ అవకాశాలను కొనసాగించే అవకాశం కూడా ఉన్నది. దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు బాల్య విద్య, బ్రిడ్జ్ కోర్సుతో కూడిన కమ్యూనిటీ సైన్స్, చైల్డ్ సైకాలజీ, సంబంధిత రంగాల్లో అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి. మాంటిస్సోరి ఎడ్యుకేషన్, వాల్డోర్ఫ్ ఎడ్యుకేషన్, రెగ్గియో ఎమిలియా ఎడ్యుకేషన్ వంటి ప్రత్యేక రంగాల్లో అనేక సర్టిఫికేషన్, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టీచర్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునేవారికి ప్రీ సూల్ టీచర్ ట్రైనింగ్‌ను మించిన కోర్సు లేదు.
కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (సీజీఏ)
కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ రంగం అత్యంత ఆశాజనకమైన, డైనమిక్ పరిశ్రమ. ఇది ఇటీవల మన దేశంలో అద్భుతమైన వృద్ధిని సాధిస్తున్నది. సీజీఏ కోర్సు అనేక రకాల ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నది. ఈ రంగంలో నిపుణుల కోసం రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. ఇది డిజిటల్ ఆర్ట్స్‌లో కెరీర్‌పై ఆసక్తి ఉన్న వారికి ఈ కోర్సు అత్యుత్తమమైనది. సీజీఏ పూర్తి చేస్తే యూఐ, యూఎక్స్ డిజైనర్లుగా, యానిమేటర్లు, గ్రాఫిక్, వెహికల్, ప్రొడక్ట్, ఇంటీరియర్ డిజైనర్లు, ఆర్ట్ డైరెక్టర్లుగా ఉద్యోగాలు పొందవచ్చు.
అడ్వర్టయిజ్మెంట్, చలనచిత్రం, టెలివిజన్, వీడియో గేమ్ డెవలప్మెంట్, వెబ్సైట్ డిజైన్‌తో సహా అనేక రకాల పరిశ్రమల్లో నిపుణులకు ఎకువగా అవకాశాలున్నాయి. అదేవిధంగా సీజీఏ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ), ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థలు, అనేక విశ్వవిద్యాలయాల్లో డిజైన్, యానిమేషన్, విజువల్ మీడియా, ప్రొడక్ట్ డిజైన్, ఇండస్ట్రియల్ డిజైన్, గ్రాఫిక్ డిజైన్, ఇలస్ట్రేషన్, ప్రోగ్రామ్ 3డీ మోడలింగ్, గేమ్ డిజైన్, వర్చువల్ రియాలిటీ తదితర వాటితోపాటు ప్రత్యేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ (ఏసీపీ)
వ్యవసాయ రంగంపై యువతలో పెరుగుతున్న ఆసక్తి మేరకు ఈ కోర్సును రూపొందించారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి బీఎస్సీ అగ్రికల్చర్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అనేక ఉద్యోగాల్లో చేరేందుకు అర్హత సాధిస్తారు.
కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ (సీజీటీ)
కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ కోర్సు పూర్తి చేసిన తర్వాత అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సొంతంగా బొటిక్ ఏర్పాటు చేసుకోవచ్చు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా టైలరింగ్ యూనిట్స్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ కెరీర్‌పై ఆసక్తి ఉన్నవారు ఉన్నత విద్యాకోర్సుల్లో బీఎఫ్టీ (ఫ్యాషన్ టెక్నాలజీ ), బీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ డిజైనింగ్), కమ్యూనిటీ సైన్స్ కోర్సులో చేరవచ్చు. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ పూర్తి చేసిన తర్వాత ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్లో కూడా పుష్కలమైన ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
వైద్యరంగంలో ఒకేషనల్ కోర్సులు
స్వల్పకాలంలోనే ఉపాధి అవకాశాలను పొందడానికి ఇది చక్కటి కోర్సు. ప్రభుత్వం రంగం కంటే కార్పొరేట్ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉంది. వైద్యరంగంలో ఉపాధి పొందే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తయిన తర్వాత ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చు. మెడికల్ స్ట్రీమ్ కోర్సులో ప్రవేశం సులభమవుతుంది. బీడీఎస్ వెటర్నరీ, ఫార్మసీ కోర్సు, బీఎస్సీ నర్సింగ్ కూడా చేయవచ్చు. దాంతో పాటు బీఎస్సీ కోర్సెస్ జనరల్ కోర్సెస్ కూడా చేసే అవకాశం ఉన్నది.
అదేవిధంగా మల్టీపర్పస్ హెల్త్ వరర్ కోర్సు కూడా గురుకులంలో అందుబాటులో ఉన్నది. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యా కోర్సు బీఎస్సీ (నర్సింగ్), జనరల్ నర్సింగ్ కోర్సుల్లో చేరవచ్చు. ప్రైవేట్, గవర్నమెంట్ సెక్టార్లో ఏఎన్ఎంగా చేరవచ్చు. వాటితో పాటు ఫిజియోథెరపీ (పీటీ), టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ తదితర కోర్సులు ఉపాధి, ఉన్నత విద్యా అవకాశాలను అందించేందుకు వీలుగా రూపొందించారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో అత్యధిక డిమాండ్ ఉన్న ఈ కోర్సులను బీసీ జూనియర్ గురుకుల కాలేజీల్లో అందిస్తున్నారు.
ప్రవేశాలకు అర్హతలు, ఎంపిక
- తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులై ఉండాలి.
- 2023-24లో పదోతరగతి పూర్తిచేసిన వారు. ఈ ఏడాది పరీక్షలు రాస్తున్నవారు మాత్రమే అర్హులు.
- పట్టణప్రాంత విద్యార్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు మించకూడదు.
- అర్హులైన విద్యార్థులు 12వ తేదీలోగా https://mjptbcwreis.telangana.gov.in
- వెబ్సైట్ ద్వారా రూ.200 ఫీజు చెల్లించి దరఖాస్తులను సమర్పించాలి.
- ఈ నెల 28న నిర్వహించే రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
- పూర్తి వివరాలకు 040- 23328266 నంబర్లో సంప్రదించవచ్చు.
ఇంటర్లో అందిస్తున్న వృత్తి విద్యాకోర్సులు
- ప్రీ సూల్ టీచర్ ట్రైనింగ్ (పీఎస్టీటీ)
- కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ (సీజీఏ)
- అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ (ఏసీపీ)
- కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ (సీజీటీ)
- మల్టీపర్పస్ హెల్త్వరర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ)
- మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (ఎంఎల్టీ)
- ఫిజియోథెరపీ (పీటీ)
- టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (టీహెచ్)
– మ్యాకం రవికుమార్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు