CABE నివేదిక.. యుద్ధానంతర ప్రణాళిక
జ్యోతిబా ఫులే
- 1850వ సంవత్సరాన్ని మహిళా విద్య పునర్జన్మ ఏర్పడిన/ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు-1850
- 1851లో నిమ్నజాతి బాలికల కోసం పాఠశాలలు స్థాపించారు. అంటరానితనం నిర్మూలన కోసం పోరాడారు. అందుకే ఈయనను మహాత్మా, భారతదేశ క్రాంతి కారుడు అని, మహారాష్ట్ర మార్టిన్ లూథర్ అని పేర్కొంటారు.
- వీరు రచించిన గ్రంథం ‘బ్రాహ్మణాచే కసబ్’
- జ్యోతిబాఫులే నా గురువు అని అంబేద్కర్ పేర్కొన్నారు.
- మొదటి మహిళా ఉపాధ్యాయురాలు- సావిత్రిబాయి ఫులే
విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్(1902)
- 1897 నుంచి 1902 వరకు కరువు, ప్లేగు వ్యాప్తి చెందడంతో విద్య లేని కారణంగా నిశ్శబ్ద కాలం అయ్యింది.
- 1899లో లార్డ్ కర్జన్ ప్రవేశం
- 1901లో భారతీయులు లేకుండా భారతీయ విద్యపై సిమ్లాలో మొదటి విద్యా సమావేశం (రహస్యంగా) నిర్వహించారు.
- ఈ సమావేశంలో 150 అంశాలను ప్రస్తావించగా ప్రధాన అంశం ప్రాథమిక విద్య
- అందువల్ల లార్డ్కర్జన్ 1904లో ఎలిమెంటరీ పాఠశాల నిర్వహణ కోసం ఉపాధ్యాయుల నియామకం కోసం నిధులు విడుదల చేశారు.
- థామస్ ర్యాలీ అధ్యక్షతన 1902లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- 1904లో భారతీయుల కోసం భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం తీసుకొచ్చారు.
- సమస్యల పరిష్కారానికి సెనెట్, సిబ్బంది నియామకం కోసం సిండికేట్ ఉండాలని సూచించారు
- ఈ కాలంలో నాణ్యమైన మాధ్యమిక విద్యపై విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం, విదేశాంగ శాఖలో ఉన్న విద్యాశాఖను ప్రత్యేక విద్యాశాఖగా మార్పు చేశారు
- లార్డ్కర్జన్ ప్రభుత్వ ఉద్యోగాలు రానివారికి ప్రైవేటు ఉద్యోగాలకు అనుమతి లేవని ప్రకటించారు.
- ఉన్నత విద్యా లక్ష్యం కేవలం ఉద్యోగాల కల్పన కోసం అంటూ గోపాలకృష్ణ గోఖలే దీన్ని వ్యతిరేకించారు.
గోపాలకృష్ణ గోఖలే (1910-1911)
- వీరు పుణె ఫెర్గూసన్ కళాశాలలో పని చేశారు.
- Servents of India Society స్థాపకర్త.
- Imperial legislative council లోని సభ్యుడు
- 6-10 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికి ప్రాథమిక విద్య ఉచితంగా అందించాలి
- ఈ ప్రస్థావన 1910లో ఒకసారి, 1911లో మరోసారి తీసుకొచ్చారు.
- అమాయకులు, నిరక్షరాస్యులు ఉన్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీపడలేదు.
- స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు 1:2 నిష్పత్తిలో ఖర్చులు భరించాలి. స్థానిక ప్రభుత్వాలు సెస్ (Tax) ద్వారా వనరులు సమకూర్చుకోవచ్చు.
- కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకే ఒక శాఖ, ప్రత్యేక కార్యదర్శిని నియమించారు.
- పాఠశాలకు పంపని తల్లిదండ్రులను శిక్షించాలి.
- గోపాలకృష్ణ గోఖలేకు ప్రేరణ గైక్వాడ్ మహారాజ్ . (1893-94)లో బరోడా సంస్థానంగా పిలవుబడే శాయాజీరావు నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రయోగాత్మకంగా అమలు చేస్తూ 1906 నాటికి బరోడా సంస్థానం మొత్తం అమలు చేయాలి.
- గోపాలకృష్ణ గోఖలే అనుసరించిన చట్టాలు బ్రిటిష్ యాక్ట్-1870, 1877, 1880
- పటేల్ యాక్ట్ అనే పేరుతో 1918 బొంబాయి మున్సిపాలిటీ అమలు చేసింది.
1913 బ్రిటిష్‌వారి నూతన విద్యా విధానం
- పూర్వ ప్రాథమిక పాఠశాలలను విస్తరించి అందరికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి.
- గ్రామీణ, పట్టణ ప్రాంత పాఠశాలలకు వేర్వేరు ప్రణాళికలు
- 1:30/1:40 ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి
- ఉపాధ్యాయులు స్థానిక భాషలో నిష్ణాతులై ఉండాలి
- మాధ్యమిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి, వేసవిలో శిక్షణా తరగతులు
- సెకండరీ విద్యను ప్రైవేటీకరణ చేయాలి, విశ్వవిద్యాలయాల విద్యా వ్యాప్తిలో భాగంగా 185 కళాశాలలను స్థాపించాలి.
శాడ్లర్ కమిషన్ (1917)
- 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఏర్పడిన సమస్య అధ్యయనం కోసం లీడ్స్ యూనివర్సిటీ వీసీ అయిన మైఖేల్ శాడ్లర్‌ను అధ్యక్షుడిగా, సర్ ఫిలిప్ హార్టాగ్ మొదలైనవారు సభ్యులుగా ఏర్పాటు చేశారు
- కలకత్తా సమస్యను పరిష్కరించడానికి ఢాకాలో కూడా విశ్వవిద్యాలయం ఉండాలి
- దీర్ఘకాలిక వీసీ (ఉపకులపతి) ఉండాలి
- వీరు ఇతర యూనివర్సిటీలకు కూడా సూచనలు చేశారు
- 10+2+3 విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్నారు.
- ఇంటర్మీడియట్‌ను వేరు చేస్తూ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఉండాలని సూచించారు
- డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆరోగ్య వ్యాయామ శాఖ) ఉండాలని సూచించారు
- యూనివర్సిటీలో సాంకేతిక విద్య కోర్సులు ఉండాలని సూచించారు
- సెనెట్‌ను కోర్టుగా పరిగణించాలి
- అదేవిధంగా సిండికేట్‌ను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌గా పరిగణించాలి
- మ్యాథ్స్, ఇంగ్లిష్ మినహా ఇతర సబ్జెక్టులను మాతృ భాషలో బోధించాలి.
హార్టాగ్ కమిటీ (1929)
- ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో ఉపాధ్యాయుల కోసం విద్య ఒక సబ్జెక్టుగా ఉండాలి
- 1919లో రౌలత్ చట్టాన్ని బ్రిటిష్‌వారు ఏర్పాటు చేశారు
- రౌలత్ చట్టం పనితీరును మెరుగుపరచడం, విద్యను కూడా ఒక అంశంగా చేరుస్తూ 1927లో సైమన్ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
- భారత జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమం
- ఈ కమిషన్‌లో ఢాకా యూనివర్సిటీలో పని చేసిన సభ్యుడు- సర్ ఫిలిప్ హార్టాగ్.
- వీరు ప్రాథమిక విద్య ముందుకు కొనసాగకపోవడానికి గల కారణాలు మారుమూల గ్రామీణ ప్రాంతాలు, రవాణా, సౌకర్యాలు లేకపోవడం, పేదరికం, నిరక్షరాస్యత, కులం, మతం, అనారోగ్యం ప్రధాన కారణం వీటితో పాటు వృథా/అపవ్యయం/వేస్టేజ్ అంటే మధ్యలో చదువు మానేయడం, దీన్ని నియంత్రించడానికి పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి. స్తబ్దత/నిలుపుదల/Stagnation- అంటే ఒకే తరగతిలో ఎక్కువ కాలం కొనసాగడం. అందువల్ల ఉపాధ్యాయులకు నాణ్యతతో కూడిన శిక్షణ, అర్హతలను పెంచడంతో పాటువేతనాలను పెంచాలి
- ఉన్నత పాఠశాల స్థాయిలో వాణిజ్య, పారిశ్రామిక కోర్సులను ప్రవేశపెట్టాలి.
- యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు పెంచి గ్రంథాలయాలు స్థాపించాలి.
- 1921లో ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యత భారత మంత్రులకు అప్పగించాలి. దీని కోసం 1921లో CABE (కేంద్రీయ విద్యా సలహా బోర్డు) ఏర్పాటు చేసి ఆర్థిక మాంద్యం కారణంగా రద్దు చేశారు.
- హార్టాగ్ సిఫారసులతో 1935లో CABE పని చేయటం ప్రారంభం, పర్యవేక్షకుల సంఖ్యను పెంచడం, శాస్త్రీయ దృక్పథంతో కూడిన పాఠ్య ప్రణాళికలు ఏర్పాటయ్యాయి. విద్యా విస్తరణను నిలుపుచేసి విద్యా ప్రమాణాలను పెంపొందించాలని పేర్కొనడంతో 1930 నుంచి 1937 మధ్యలో అనేక పాఠశాలలను మూసివేశారు.
అబాట్ ఉడ్ నివేదిక (1937)
- భారతదేశంలోని విద్య ఉద్యమ దశలుగా మూడు దశలను పేర్కొంటారు. అవి..
- 1వ దశ (1905-1910)
- బెంగాల్ విభజనతో ప్రారంభమైంది
- 1905, జూలై 4న బెంగాల్ విభజన ప్రకటన వెలువడి 1905, అక్టోబర్ 16 నుంచి బెంగాల్ విభజన అమలు జరిగింది. అందువల్ల దీన్ని బెంగాల్ ప్రజలు ‘శోకదినంగా’ పేర్కొంటారు.
- ఈ విద్య మాకు వద్దు అనే నినాదంతో ఉద్యమం కొనసాగింది.
- ఈ మొదటి దశ ఉద్యమానికి సాయకులు రవీంద్రనాథ్ ఠాగూర్, సర్ గురుదాస్ చటర్జీ, అరవింద్ ఘోష్.
రెండో దశ (1911-1922)
- నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాలేజ్‌ను ఏర్పాటు చేసి అరవింద్ ఘోష్‌ను ప్రథమ ప్రిన్సిపల్‌గా నియమించారు.
- వీటిలో చెప్పుకోదగిన ఉద్యమాలు 1917 చంపారన్ సత్యాగ్రహం.
మూడో దశ (1930-38)
- 1920 సహాయ నిరాకరణోద్యమం
- వీటికి గాంధీజీ నాయకత్వం వహించాడు
- 1923-29 నిశ్శబద్ద కాలం
- శాసనోల్లంఘన ఉద్యమంతో ప్రారంభమైంది
- 1937లో మహాత్మాగాంధీ వార్ధా ప్రాంతంలో ఆల్ ఇండియా నేషనల్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్‌ను నిర్వహిస్తూ జాకీర్ హుస్సేన్ అధ్యక్షుడిగా సమావేశం నిర్వహించారు
- గాంధీ హరిజన్ పత్రికలో కూడా బేసిక్ విద్య కోసం ప్రస్తావించారు.
- బేసిక్ అనే పదం బేస్ అనే పదం నుంచి తీసుకున్నారు. అంటే అంతిమంగా లేదా మొత్తం అంశాలపై ఆధారపడి లేదా తయారు చేసిన విషయానికి సంబంధించిన పునాది అని అర్థం.
ముఖ్యాంశాలు…
1. మాతృభాష,
2. శిశు కేంద్రీకృత విద్యా విధానం,
3 కృత్యాలు
- ఈ విద్యపై ప్రజలు ఆసక్తి చూపించకుండా ఉండటం కోసం అబాట్ ఉడ్స్‌ను నియమించారు.
- విద్య సాంకేతిక పరంగా నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఉండాలి.
- ప్రాథమిక విద్య చిన్న పిల్లల స్వాభావిక అభిరుచులను అనుసరించి కృత్యాల ద్వారా, ఆట పాటల ద్వారా కొనసాగాలి.
సార్జంట్ నివేదిక (1944)
- పాఠ్య పుస్తకాలపై తక్కువ ఆధారపడాలి
- ఉపాధ్యయులకు రెండు సం.ల శిక్షణ, మహిళా టీచర్లను నియమించాలి.
- 1939 నుంచి 1944 కాలాన్ని విద్యపై కమిషన్లు లేకపోవడంతో చీకటి కాలం అంటారు.
- బ్రిటిష్ వారికి విద్యలో సలహాదారుడిగా ఉన్న జాన్ సార్జంట్‌ను CABE (సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్) విస్తృతమైన విద్యా పథకాన్ని భారతదేశ విద్య కోసం రూపొందించమని కోరింది. అందువల్ల దీన్ని CABE నివేదిక లేదా యుద్ధకాల అనంతర ప్రణాళిక అని అంటారు.
- 3-6 సం.లు ఉచిత పూర్వ ప్రాథమిక విద్య
- 6-14 సం.లు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య. ఇది ఇండియాలో 1984కి సాధించారు. (40 సం.లు)
- ఉన్నత పాఠశాల విద్యలో విద్యా సంబంధ, సాంకేతిక, వాణిజ్య విద్యలు ఉండాలి.
- ఇంటర్ మొదటి సం. ఉన్నత పాఠశాలలకు, రెండో సం. డిగ్రీ కళాశాలకు అనుసంధానించాలి.
- దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలు
- 10 నుంచి 40 సం.లు వయస్సు కలిగిన పాఠశాలకు రాని వారికి అక్షరాస్యత, వయోజన విద్యా కార్యక్రమాలు, గ్రంథాలయాలు ఉండాలి.
- ఉపాధ్యాయులకు శిక్షణ, సలహా సంఘం
- పాఠశాలలో సాంఘిక వినోద కార్యక్రమాలు
ప్రాక్టీస్ బిట్స్
1. సార్జంట్ నివేదిక అమలుకు కోరిన గడువు (సంవత్సరాలు)?
1. 40 2. 20 3. 30 4. 10
2. నిలుపుదల, స్తబ్దతను అరికట్టడానికి సూచించిన కమిషన్?
1. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్
2. మొదలియార్ కమిషన్
3. యశ్పాల్ కమిటీ
4. కొఠారీ విద్యా కమిషన్
3. గోఖలే తీర్మానంలో ముఖ్యాంశం?
1. ఉచిత విద్య
2. ఉపాధ్యాయ నిష్పత్తి
3. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య
4. తరగతి గది పునర్నిర్మాణం
4. 10+2+3 నమూనాను సూచించేది?
1. కొఠారీ విద్యా కమిషన్
2. ఈశ్వరీబాయి పటేల్ కమిషన్
3. యశ్పాల్ కమిటీ
4. ఆచార్య రామ్మూర్తి కమిటీ
- యూజీసీ (విశ్వవిద్యాలయాల విరాళాల సంఘం)
- ఉపాధి అవకాశాల కోసం ఎంప్లాయిమెంట్ బ్యూరోస్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు