సైన్స్ పరిశోధకులకు గేట్‌వే!
సీఎస్ఐఆర్ యూజీసీ-నెట్ 2022
ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనలు చేయాలని ఉందా? ఐఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో పీహెచ్డీ చేయాలనుకుంటున్నారా? డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులో జాయిన్ కావాలనుకుంటున్నారా? అయితే కింది సమాచారం మీ కోసమే. సైన్స్ సబ్జెక్టుల్లో జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఐఎస్ఆర్) – యూజీసీ నెట్-2022 ప్రకటనను ఎన్టీఏ విడుదల చేసింది. ఆ వివరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం….
సీఎస్ఐఆర్-యూజీసీ ఫెలోషిప్
సీఎస్ఐఆర్, యూజీసీలు పరిశోధనలను ప్రోత్సహించడంలో భాగంగా రిసెర్చ్ ఫెలోషిప్స్‌ను అందిస్తున్నాయి. దీని కోసం ఏటా నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ను నిర్వహిస్తాయి. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) చేపడుతుంది. నెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు, ఐఐటీలు, ప్రభుత్వ పరిశోధనాలయాలు, ల్యాబొరేటరీల్లో రిసెర్చ్ ఫెలోగా పని చేయవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో స్టయిఫండ్‌ను కూడా సీఎస్ఐఆర్-యూజీసీ అందిస్తాయి. జేఆర్ఎఫ్ సాధించిన వారికి మొదటి రెండేండ్లు నెలకు రూ.31 వేలు ఇస్తారు. దీనికి అదనంగా గ్రాంట్ కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తారు.
# పరీక్ష పేరు: సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ (జూన్ -2022)
పరీక్ష నిర్వహించే సబ్జెక్టులు
# కెమికల్ సైన్సెస్
# ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
# లైఫ్ సైన్సెస్
# మ్యాథమెటికల్ సైన్సెస్
# ఫిజికల్ సైన్సెస్
ఎవరు రాయవచ్చు?
# ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సు. ఇంటిగ్రేటెడ్ బీఎస్-ఎంఎస్, బీఈ/బీటెక్ లేదా బీఫార్మ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులు అయితే కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
నోట్: ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. నెట్ ఫలితాలు విడుదలైన రెండేండ్లలోపు పై అర్హతలు సాధించాలి.
వయస్సు: జేఆర్‌ఎఫ్‌నకు 2021, జూలై 1 నాటికి 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, థర్డ్ జెండర్ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ (ఎన్సీఎల్) అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లెక్చరర్‌షిప్/ అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎటువంటి గరిష్ఠ వయో పరిమితి లేదు.
పరీక్ష విధానం
# కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు
# పరీక్ష కాలవ్యవధి 180 నిమిషాలు
# పరీక్షలో మూడు భాగాలు ఉంటాయి.
# ప్రశ్నలు ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ విధానంలో ఇస్తారు.
నోట్: ఆయా సబ్జెక్టులను బట్టి నెగెటివ్ మార్కింగ్ విధానం, ప్రశ్నలు ఇవ్వడంలో తేడాలు ఉంటాయి. వివరాలు వెబ్సైట్లో చూడవచ్చు.
రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 10
వెబ్సైట్: https://csirnet. nta.nic.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు