మారిన సిలబస్.. సీఏ ఈజీ!
మారిన సిలబస్ తో సీఏ కోర్సు మరింత ఈజీగా చదవవచ్చు. సీఏలో ఏం మార్పులు వచ్చాయో తెలుసుకుందాం.
అనుకూల అంశాలు
# గతంలో మనకు టోటల్ సీఏ కోర్సు అన్ని దశలు ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయితే ఇంటర్ తరువాత 48 నెలలు పట్టేది. అంటే నాలుగేండ్లు. ఇప్పుడు స్టడీ పీరియడ్ ఒక 6 నెలలు తగ్గించారు. అంటే ఇంటర్ తరువాత సుమారు మూడున్నరేండ్లు.
# సీఏ ఫైనల్లో గతంలో 8 పేపర్లు ఉండేవి. ఇప్పుడు 6 పేపర్లు చేశారు. సీఏ ఇంటర్లో గతంలో 8 పేపర్లు ఉండేవి. ఇప్పుడు అవి కూడా 6 పేపర్లు చేశారు. దీనివల్ల విద్యార్థులకు కొంచెం బర్డెన్ తగ్గినట్టే.
# సీఏ ఫౌండేషన్‌లోని బీసీఆర్, బీసీకే లాంటి పేపర్ల వల్ల గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారని వాటిని తీసేశారు. సీఏ బిగినర్స్‌కు ఇది కలిసి వచ్చే అంశమని చెప్పవచ్చు.
#ఒకప్పుడు సీఏ చేయాలంటే డిగ్రీ అర్హత ఉండేది. తరువాత ఇంటర్ పూర్తయితే అవకాశం ఉండేది. ఇప్పుడు పది పాసైతే చాలు సీఏ చదవడానికి అర్హులు. పది పూర్తయ్యాక ఎంఈసీ, సీఈసీ చేస్తూ సీఏ చెయ్యడం ఒక విధానం లేదా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీలతో ఇంటర్ పూర్తయ్యాక సీఏ చదవడం మరో విధానం. అలాగే ప్రస్తుతం సీఏ ఫౌండేషన్ పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు. అయితే సీఏ పరీక్షలు ఏడాదికి మూడు సార్లు లేదా నాలుగు సార్లు నిర్వహించాలని సీఏ ఇన్స్టిట్యూట్ వారు ఆలోచిస్తున్నారని సమాచారం.
# సీఏ ఇంటర్లో కూడా ఎక్కువ మంది ఫెయిలయ్యే ఈఐఎస్ సబ్జెక్టును తీసేశారు. ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్‌ను కూడా విద్యార్థులు అయిష్టంగా, బోర్‌గా ఫీలవుతుంటారు. ఎక్కువగా ఫీలయ్యే ఆ సబ్జెక్టను కూడా తీసేశారు. అలాగే సీఏ ఇంటర్లో అకౌంటెన్సీ పరీక్షను 200 మార్కులకు నిర్వహించేవారు. అది గతంలో రెండు పేపర్లుగా ఉండగా… దానిని ఇప్పుడు ఒక్క పేపర్‌కు తగ్గించారు. గతంలో కొన్ని సెలెక్టివ్ పేపర్లలోనే 30 శాతం ఆబ్జెక్టివ్ ఉండేవి. ఇప్పుడు ప్రతి పేపర్లో 30 శాతం ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ఇస్తున్నారు. సీరియస్‌గా చదివే విద్యార్థిని ఏదో విధంగా పాస్ చేయడానికి ఇన్స్టిట్యూట్ చేయూతనందిస్తుంది.
# సీఏ ఇంటర్లో ఇప్పటివరకు ఏడాదికి రెండు సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వీటిని మూడుసార్లు నిర్వహించాలని సీఏ ఇన్స్టిట్యూట్ ఆలోచిస్తుంది. అంటే విద్యార్థి ఫెయిలైన తరువాత దాదాపు 3 నుంచి 4 నెలల్లో మళ్లీ పరీక్షలు రాసి పాస్ కావచ్చు. ఇంటర్, ఎంసెట్ ఫెయిలైనా లేదా మంచి ర్యాంక్ రాకపోయినా మళ్లీ ఒక ఏడాది వెయిట్ చేయాలి. కానీ సీఏ ఇంటర్లో అలా కాకుండా పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నుంచి మూడు సార్లుగా మార్చబోతున్నారు. దీంతో మళ్లీ ఎగ్జామ్ రాయడానికి మూడు లేదా నాలుగు నెలల కన్నా ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండాపోతుంది.
#ఇంకో మంచి మార్పు ఏంటంటే సీఏ పాసైన వాళ్లు పరిశ్రమల్లోకి వెళ్లిపోతున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి వారుకూడా మూడేండ్లు తప్పనిసరిగా ఆర్టికల్‌షిప్ చేయాలి. కొత్త సిలబస్ ప్రకారం రెండేండ్లు ఆర్టికల్‌షిప్ చేస్తే సరిపోతుంది. ప్రాక్టీస్‌కు వెళ్లాలనుకుంటే మాత్రం పాసైన తరువాత అదనంగా ఇంకో ఏడాది ఆర్టికల్‌షిప్ చేయాలి. దీనివల్ల ఉద్యోగం చేయాలనుకునే వారికి కోర్సును త్వరగా పూర్తిచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఎర్నింగ్ వైల్ లెర్నింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. దాని పేరే స్టెఫండ్. ఆ స్టెఫండ్ను కూడా 100 శాతం పెంచారు.
# పాత విధానం ప్రకారం సీఏ ఫైనల్లో మూడేం డ్ల ఆర్టికల్‌షిప్ చేయాల్సి వచ్చేది. మూడేండ్ల ఆర్టికల్‌షిప్‌లో ఎక్కువ సమయం సీఏ ఫైనల్ చదవడానికి కేటాయించేవారు. ఆర్టికల్‌షిప్‌ను సీరియస్‌గా తీసుకునేవాళ్లు కాదు. ఇప్పుడు ఆర్టికల్‌షిప్‌ను రెండేండ్లు చేశారు. కాబట్టి రెండేండ్లలో ఆర్టికల్‌షిప్ పూర్తిచేయవచ్చు. ఆర్టికల్‌షిప్ పూర్తయిన తరువాత 6 నెలల సమయం ఉంటుంది. కాబట్టి ఈ 6 నెలల సమయంలో పూర్తిగా సీఏ ఫైనల్ మీద ఫోకస్ పెట్టవచ్చు.
#అలాగే సీఏ ఫైనల్లో ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్ పద్ధతి ఇదివరకు ఒక్క పేపర్‌కు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఎక్కువ పేపర్లకు ఈ పద్ధతిని తీసుకురానున్నారు. అంటే కచ్చితంగా కొన్ని పుస్తకాలను పరీక్ష సెంటర్‌కు తీసుకెళ్లి పరీక్ష రాయవచ్చు.
#సీఏ ఫైనల్లో కూడా ప్రతి పేపర్లో 30 శాతం ఆబ్జెక్టివ్ పద్ధతి తీసుకు రానున్నారు. సీఏ ఫైనల్ పరీక్షలు ఇదివరకు రెండుసార్లు నిర్వహించేవారు. ఇక నుంచి మూడు సార్లు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు.
# మారిన ఈ పద్ధతి 2023, మేలో గాని, 2023, నవంబర్‌లో గాని ఉండవచ్చు. పాత సిలబస్ చదివిన వారికి రెండు లేదా మూడు సార్లు పాత పద్ధతిలో పరీక్షలు రాయడానికి అవకాశం ఇస్తారు. విద్యార్థులు కొత్త సిలబస్‌కు మారవచ్చు లేదా పాత సిలబస్ ప్రకారం పరీక్షలు రాయవచ్చు.
#మారిన సిలబస్ ఇప్పుడున్నదానితో పోలిస్తే ఈజీ. కానీ బీకాం, బీటెక్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకవేళ మరీ ఈజీ అయితే పాసైనవాళ్లందరికీ ఉద్యోగాలు లభించడం కష్టమవుతుంది.
# సీఏ ఫైనల్లో కార్పొరేట్ అండ్ ఎకనామిక్ లాస్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ తీసేశారు. సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్ చేర్చారు. దీనివల్ల విద్యార్థులకు కొంత శ్రమ తగ్గుతుంది. ఈ విధానంలో చదివి పబ్లిక్ పరీక్షలతో సంబంధం లేకుండా ప్రిపేర్ అయి ఆన్లైన్ పరీక్షలు ఉంటే రాసి క్లియర్ చేసుకోవచ్చు. ఫైనల్ పరీక్షలో 8 పేపర్లు కాకుండా 6 పేపర్లకు తగ్గించారు.
#సీఏ ఇంటర్ పాసై, ఫైనల్ పాస్ కాలేనివారికి కొన్ని కండీషన్లతో బిజినెస్ అకౌంటింగ్ అసోసియేషన్ (బీఏఏ) సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. ఇదొక విప్లవాత్మకమైన మార్పు.
ప్రతికూల అంశాలు
# గతంలో సీఏ ఫౌండేషన్‌లో ప్రతి పేపర్లో 40 శాతం మార్కులు రావడంతోపాటు 50 శాతం అగ్రిగేట్ ఉండాలి. కానీ ఇప్పుడు అన్ని పేపర్లలో 50 శాతం మార్కులు రావాలి.
#ఇదివరకు సీఏ ఇంటర్లో ఏ ఒక్క గ్రూప్ పాసైనా కూడా ప్రాక్టికల్ ట్రైనింగ్ లేదా ఆర్టికల్‌షిప్‌నకు వెళ్లొచ్చు. కానీ ఇప్పుడు రెండు గ్రూపులు పాసైతేనే ఆర్టికల్‌షిప్ ఉంటుంది.
మట్టుపల్లి ప్రకాశ్
అకడమిక్ అడ్వైజర్
మాస్టర్‌మైండ్స్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు