గేట్-2022
ఐఐటీ, ఎన్ఐటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2021 నోటిఫికేషన్ విడుదలైంది.
గేట్.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక పరీక్ష ఇది. దీనిలో వచ్చిన స్కోర్ ఆధారంగా ఉన్నత విద్య లేదా ఉద్యోగం ఏది కావాలంటే దానిలోకి వెళ్లే అవకాశం. ఐఐటీలు, నిట్ వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన విద్యాసంస్థల్లో పీజీ లేదా పీహెచ్డీ చేసుకోవడానికి గేట్ స్కోర్ తప్పనిసరి. అంతేకాదు డిగ్రీ తర్వాత పీఎస్‌యూ, మహారత్న, మినీరత్న వంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో నేరుగా ఉద్యోగాలను పొందడానికి ఆయా సంస్థలకు గేట్ స్కోరే ఆధారం. గేట్-2022 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సంక్షిప్తంగా గేట్ వివరాలు…
గేట్ పేపర్లు
ఏరో స్పేస్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ (న్యూ ప్యాట్రన్), బయోమెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఈసీఈ, ఈఈ, ఎకాలజీ అండ్ ఎవాల్యూషన్, జియోమాటిక్స్ ఇంజినీరింగ్ (కొత్తగా ప్రవేశపెట్టారు), జియాలజీ అండ్ జియో ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మ్యాథ్స్, మెకానికల్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్ (కొత్తగా ప్రవేశపెట్టారు), పెట్రోలియం ఇంజినీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్టైల్ ఇంజినీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఇంజినీరింగ్ సైన్సెస్, హ్యుమానిటీస్&సోషల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2021
- జాతీయస్థాయిలో నిర్వహించే ఈ పరీక్షను బెంగళూరులోని ఐఐఎస్సీతోపాటు ఏడు ఐఐటీలు (బాంబే, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ) కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాయి.
- గేట్ పరీక్షలో స్కోర్ ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలోని విద్యాసంస్థలు/ఏజెన్సీల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా నేరుగా డాక్టోరల్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇంజినీరింగ్/టెక్నాలజీ /ఆర్కిటెక్చర్. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టుల్లో డాక్టోరల్ ప్రోగ్రామ్స్ చదవచ్చు. దీంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎంఓఈ) స్కాలర్షిప్/అసిస్టెంట్‌షిప్ లభిస్తుంది. గేట్‌స్కోర్, అకడమిక్ రికార్డు/ ఇంటర్వ్యూల ఆధారంగా స్కాలర్షిప్లను ఎంఓఈ అందిస్తుంది.
- గేట్ స్కోర్ ఆధారంగా పలు పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ (పీఎస్‌యూ)లు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. అటువంటి సంస్థలు.. బీహెచ్ఈఎల్, గెయిల్, హాల్, ఐఓసీఎల్, ఎన్పీసీఐఎల్, ఓఎన్జీసీ, పీజీసీఎల్ తదితరాలు.
- కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్-ఎ స్థాయి పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు.
- అర్హతలు: డిగ్రీ (ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్) ఉత్తీర్ణత. ప్రస్తుతం డిగ్రీ మూడో సంవత్సరం లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: గరిష్ఠ వయోపరిమితి లేదు
- కొత్తగా ప్రవేశపెట్టిన పేపర్లు: జియోమాటిక్స్, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజినీరింగ్
- గేట్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్: ఈ ఏడాది గేట్‌ను ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహిస్తుంది.
- ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో వచ్చిన స్కోర్ ఆధారంగా
- మొత్తం పేపర్లు: 29
- పరీక్ష విధానం: ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు, మల్టిపుల్ సెలెక్ట్ ప్రశ్నలు, న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు ఇస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో ఆగస్టు 30 నుంచి
చివరితేదీ: సెప్టెంబర్ 24
పరీక్ష తేదీలు: 2022, ఫిబ్రవరి 5, 6, 12, 13
ఫలితాల వెల్లడి: 2022, మార్చి 17
వెబ్సైట్: https://gate.iitkgp.ac.in.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు