ఎస్సీ యువతకు పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ

– దరఖాస్తుకు 20న తుది గడువు
ఎస్సీ యువతకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నది. పదోతరగతి చదివిన అభ్యర్థులకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులో మూడు నెలలు శిక్షణ ఇస్తామని వెల్లడించింది. మహిళలకు బ్యుటీషియన్, టైలరింగ్ రంగాల్లో శిక్షణ ఉంటున్నదని తెలిపింది. సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తిచేసిన అభ్యర్థులకు అడ్వాన్స్ సర్టిఫికెట్ ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సులో 12 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తామని వివరించింది. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను కల్పిస్తామని తెలిపింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. వివరాలకు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల అభ్యర్థులు 98485 81100, హైదరాబాద్ జిల్లా ఎస్సీ యువత 79817 89044ను సంప్రదించవచ్చని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేర్కొన్నది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు