ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ భృతి
ఆల్ ఇం డియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నట్లు ఆ సంస్థ రీజినల్ డైరెక్టర్ జి.చలపతి రాజ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ పాసైన నిరుద్యోగ యువత కోసం ‘డిప్లమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్’ ఒక సంవత్సరం కోర్సులో శిక్షణ ఇస్తామన్నారు. కోర్సులో అత్యుత్తమ నైపుణ్యం ప్రదర్శించిన వారికి స్టెపెండ్ సైతం అందించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్లేస్మెంట్ కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీ లోగా వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని గూడూ రు మల్లారెడ్డి కాంప్లెక్స్‌లోని తమ సంస్థలో దరఖాస్తులను సమర్పించాలన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్లు 80742 58010, 76740 34247లలో సంప్రదించాలన్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు