15 నుంచి తొలిమెట్టు
23,179 సర్కారీ బడుల్లో నిర్వహణ
తరగతుల వారీగా విద్యాప్రమాణాల రూపకల్పన
నేటితో ఉపాధ్యాయులకు ముగియనున్న శిక్షణ
పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రాథమికస్థాయి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను సాధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన తొలిమెట్టు ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని 23,179 సర్కారీ బడుల్లో ప్రారంభంకానున్నది. ఈ నేపథ్యంలో తరగతుల వారీగా సాధించాల్సిన విద్యాప్రమాణాలను ఎస్సీఈఆర్టీ అధికారులు రూపొందించారు. 1, 2వ తరగతులకు నాలుగు విద్యాప్రమాణాలు, 3,4, 5వ తరగతులకు ఆరు విద్యాప్రమాణాలను లక్ష్యంగా విధించారు. వీటిని పిల్లలు సాధించేలా ఏడాదిపాటు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. 140 రోజులపాటు తొలిమెట్టు అమలు చేయనున్నారు.
టీచర్లకు శిక్షణ పూర్తి
తొలిమెట్టు కార్యక్రమంలో టీచర్ల పాత్ర ముఖ్యమైనది. అందుకే టీచర్లకు మూడు విడతల్లో శిక్షణ ఇచ్చారు. జూలై 30 నుంచి ఆగస్టు 2 వరకు మొదటి విడత, ఆగస్టు 3 నుంచి 6 వరకు రెండో విడత, ఆగస్టు 8 నుంచి 11 వరకు మూడో విడత శిక్షణను పూర్తి చేశారు.
1,2 తరగతుల విద్యా ప్రమాణాలు
# వినడం, మాట్లాడటం
# చదవడం, రాయడం
# సృజనాత్మకత
3, 4, 5 తరగతుల విద్యా ప్రమాణాలు
# వినడం, ఆలోచించి మాట్లాడటం
#ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం
#ఆలోచించి సొంత మాటల్లో రాయడం (స్వీయ రచన)
# పదజాలం, సృజనాత్మకత/ ప్రశంస
# భాషను గుర్తించి తెలుసుకోవడం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు