రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరికానిది?
107. కింది వాటిలో సరికానిది?
1) మొదటి లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ ఓటర్లు 17.32 కోట్లు
2) 16వ లోక్‌సభ ఎన్నికల నాటికి దేశ ఓటర్లు- 83 కోట్లు
3) రాజ్యాధినేత నిర్ణీత పదవీకాలానికి ఎన్నికయితే ‘గణతంత్ర’గా పేర్కొంటారు
4) భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య- 22
108. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) 1215 సంవత్సరంలో ఇంగ్లండ్ రాజు జాన్ ఎడ్వర్డ్-1 తన దేశ ప్రజలకు కొన్ని హక్కులను ప్రకటించారు. దీనిని ‘మాగ్నాకార్టా’ అంటారు
2) అమెరికా రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ‘బిల్ ఆఫ్ రైట్స్’గా పేర్కొన్నారు
3) 1925, డిసెంబర్ 10న నానాజాతి సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను వెలువరించింది
4) 1948, డిసెంబర్ 10న యూఎన్వో విశ్వ మానవ హక్కుల ప్రకటన వెలువరించింది
109. కింది వాటిలో సరికానిది?
1) ‘స్వరాజ్’ అనే బిల్లు ద్వారా బాలగంగాధర్ తిలక్ భారతీయులకు తొలిసారిగా ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు
2) కామన్ వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లు ద్వారా గాంధీజీ ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు
3) ప్రాథమిక హక్కుల సలహా సంఘానికి అధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్
4) ప్రాథమిక హక్కుల సంఘానికి అధ్యక్షుడు జేబీ కృపలాని
110. ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) 1950, జనవరి 26న గల ప్రాథమిక హక్కుల సంఖ్య- 7
2) ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య- 6
3) ఆస్తిహక్కును తొలగించిన ప్రధాని- ఇందిరాగాంధీ
4) ప్రాథమిక హక్కుల రక్షణ కోసం న్యాయస్థానాలు రిట్లు జారీచేస్తాయి
111. కేంద్ర కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి సరికానిది?
1) దేశాధినేతగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు
2) ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు
3) దేశ పాలన రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహిస్తారు
4) దేశ పాలన ప్రధాన మంత్రి పేరు మీదుగా నిర్వహిస్తారు
112. రాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పదవిని ఎన్నిసార్లయినా చేపట్టవచ్చు
2) రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయం ఉంది
3) రాష్ట్రపతి పదవికి ఎన్నికలను పార్లమెంట్ నిర్వహిస్తుంది
4) రాష్ట్రపతి ఎన్నిక విధానం పరోక్ష పద్ధతిలో జరుగుతుంది
113. రాష్ట్రపతికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం ఐర్లాండ్ నుంచి గ్రహించారు
2) రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానాన్ని అమెరికా నుంచి గ్రహించారు
3) రాష్ట్రపతిని ఎన్నుకునే వ్యవస్థ ఎలక్టోరల్ కాలేజీ
4) మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ సభ్యులు ఓటర్లుగా ఉంటారు
114. కింది వాటిలో సరికానిది?
1) రాష్ట్రపతి ద్వారా లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు నామినేట్ అవుతారు
2) రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు 12 మంది విశిష్ట వ్యక్తులు నామినేట్ అవుతారు
3) రాష్ట్రపతి ఎన్నికల్లో అత్యధిక ఓటు విలువ కలిగిన శాసనసభ్యులు మధ్యప్రదేశ్‌కు చెందినవారు
4) రాష్ట్రపతి ఎన్నికలను 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్వహిస్తున్నారు
115. కింది వాటిలో రాష్ట్రపతి నివాసం లేని ప్రాంతాన్ని గుర్తించండి?
1) న్యూఢిల్లీ 2) కోల్‌కతా
3) సిమ్లా 4) బొల్లారం
116. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కానివారు?
1) రాజ్యసభకు ఎన్నికయిన సభ్యులు
2) లోక్‌సభకు ఎన్నికయిన సభ్యులు
3) రాష్ర్టాల విధాన సభకు ఎన్నికయిన సభ్యులు
4) రాష్ట్ర విధాన పరిషత్‌కు ఎన్నికయిన సభ్యులు
117. రాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు 35 సంవత్సరాలు
2) రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించాలి
3) రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేస్తారు
4) రాష్ట్రపతి తన రాజీనామాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించాలి
118. కింది వాటిలో సరికానిది?
1) మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలోనయినా 14 రోజుల ముందస్తు నోటీసుతో ప్రవేశపెట్టవచ్చు
2) పార్లమెంట్ 2/3 మెజారిటీతో రాష్ట్రపతిని తొలగించే వీలున్నది
3) మహాభియోగ తీర్మానాన్ని 1/4వ వంతు సభ్యుల సంతకాలతో ఆయా సభల్లో ప్రవేశపెట్టవచ్చు4) రాష్ట్రపతి ఎన్నికల ఫిర్యాదులను పార్లమెంట్ విచారిస్తుంది
119. రాష్ట్రపతి నియమించే వివిధ పదవులకు సంబంధించి సరికానిది?
1) ప్రధాన మంత్రి ఆర్టికల్- 75
2) అటార్నీ జనరల్ ఆర్టికల్- 76
3) అడ్వకేట్ జనరల్ ఆర్టికల్- 165
4) కాగ్ ఆర్టికల్- 148
120. రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరికానిది?
1) పార్లమెంట్ సమావేశాలను ప్రారంభించడాన్ని ‘సమన్స్’ అంటారు
2) పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలం పాటు వాయిదా వేయడాన్ని ‘ప్రోరోగ్’ అంటారు
3) పార్లమెంటును రద్దు చేయడాన్ని ‘డిజాల్వ్’ అంటారు
4) లోక్‌సభను రద్దు చేయడాన్ని ‘డిజాల్వ్’ అంటారు
121. పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు దేశ ప్రజల శ్రేయస్సు కోసం కేంద్ర క్యాబినెట్ సిఫారసుల మేరకు ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్స్ గరిష్ట జీవిత కాలాన్ని గుర్తించండి?
1) 6 నెలల 6 వారాలు
2) ఏడున్నర నెలలు
3) పార్లమెంట్ సమావేశమయిన 6 వారాలు
4) పైవన్నీ సరైనవే
122. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త
సమావేశాలకు సంబంధించి సరికానిది?
1) సాధారణ బిల్లుల విషయంలో రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు
2) ఆర్టికల్ 108 ప్రకారం ఏర్పాటు చేస్తారు
3) ఈ సమావేశాలకు రాష్ట్రపతి, అధ్యక్షత
వహిస్తారు
4) ఈ సమావేశాలకు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు
123. పార్లమెంట్ ఉభయ సభల తొలి సంయుక్త సమావేశానికి సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) 1961లో వరకట్న నిషేధ బిల్లు విషయమై జరిగింది
2) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్
3) ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన లోక్‌సభ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్
4) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్
124. 1978లో జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించి సరికానిదానిని గుర్తించండి?
1) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి- ఫకృద్దీన్ అలీ అహ్మద్
2) ఈ సమావేశం బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు/రద్దు విషయమై జరిగింది
3) ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన లోక్‌సభ స్పీకర్ కేఎస్ హెగ్డే
4) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి- నీలం సంజీవరెడ్డి
125. 2002లో జరిగిన పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశానికి సంబంధించి సరికానిది?
1) ఈ సమావేశాన్ని ‘POTO’ బిల్లు విషయమై నిర్వహించారు
2) ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి
3) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి కేఆర్ నారాయణన్
4) ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది- పీఎం సయీద్
126. రాష్ట్రపతి శాసనాధికారాలకు సంబంధించి సరికానిది?
1) పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి సంతకం ద్వారా చట్టంగా మారుతుంది
2) రాష్ర్టాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రపతి అనుమతి ద్వారానే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి
3) ఆర్థిక బిల్లులను అనుమతితో రాజ్యసభలో ప్రవేశపెట్టవచ్చు
4) పార్లమెంట్ ఆమోదించి పంపిన ఆర్థిక బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి
127. అత్యవసర పరిస్థితి అధికారులకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) వీటిని 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి గ్రహించారు
2) వీటిని రాష్ట్రపతి ప్రయోగించినప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే విధానాన్ని జర్మనీ నుంచి గ్రహించారు
3) వీటిని ప్రయోగించినప్పటికీ ఆర్టికల్ 21 రద్దు కాదు
4) వీటిని ప్రయోగించినప్పటికీ ఆర్టికల్ 19 రద్దు కాదు
128. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి అధికారాలు-ఆర్టికల్స్‌కు సంబంధించి సరికానిది?
1) ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్- 369
2) రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఆర్టికల్- 356
3) జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్- 352
4) అత్యవసర పరిస్థితి ఆర్టికల్- 360
129. వివిధ అత్యవసర పరిస్థితులకు విధింపు నకు సంబంధించి గరిష్ట కాల పరిమితుల్లో సరికానిది?
1) జాతీయ అత్యవసర పరిస్థితి-
ఎంతకాలమయినా
2) ఆర్థిక అత్యవసర పరిస్థితి-
ఎంతకాలమయినా
3) రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన-
ఎంతకాలమయినా
4) రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన-
3 సంవత్సరాలు
130. జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన రాష్ట్రపతుల జాబితాలో లేనివారిని
గుర్తించండి?
1) సర్వేపల్లి రాధాకృష్ణన్
2) బాబు రాజేంద్రప్రసాద్
3) ఫకృద్దీన్ అలీ అహ్మద్ 4) వీవీ గిరి
131. దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితుల విధింపు వాటికి గల కారణాలకు సంబంధించి సరికానిది?
1) 1962- చైనా భారత్‌పై దురాక్రమణ
2) 1971- భారతదేశం పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటన
3) 1975- ఆంతరంగిక అల్లకల్లోలాలు
4) 1977- పాకిస్థాన్ భారత్‌పై యుద్ధం
ప్రకటన
132. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ ప్రధాని కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించడానికి సంబంధించిన ఆంతరంగిక అల్లకల్లోలాలు అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో ‘సాయుధ దళాల తిరుగుబాటు’ అనే పదాన్ని చేర్చారు?
1) మొరార్జీ దేశాయ్ 2) ఇందిరాగాంధీ
3) రాజీవ్ గాంధీ 4) చరణ్‌సింగ్
133. దేశంలో తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?
1) పతంజలి శాస్త్రి 2) హిదయతుల్లా
3) రంజిత్ సర్కారియా
4) ఎంఎన్ వెంకటాచలయ్య
134. వివిధ రాష్ట్రపతులకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) తొలి దళిత రాష్ట్రపతి- కేఆర్ నారాయణన్
2) రెండో దళిత రాష్ట్రపతి- రాంనాథ్ కోవింద్
3) పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నది- కేఆర్ నారాయణన్
4) ఏకగ్రీవంగా ఎన్నికయిన రాష్ట్రపతి- వీవీ గిరి
135. రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు సంబంధించి సరికానిది?
1) టెంపుల్టన్ అవార్డు పొందిన తొలి భారతీయుడు
2) తన ఎన్నికల విషయమై స్వయంగా సుప్రీంకోర్టుకు హాజరయ్యాడు
3) యునెస్కో చైర్మన్‌గా వ్యవహరించిన తొలి భారతీయుడు
4) రాష్ట్రపతి భవన్లో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు
136. వివిధ రాష్ట్రపతులకు సంబంధించి సరికానిది?
1) పదవిలో ఉండగా మరణించిన తొలి రాష్ట్రపతి- జాకీర్ హుస్సేన్
2) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రపతిగా ఎన్నికయినది- వీవీ గిరి
3) ప్రజల రాష్ట్రపతిగా పేరొందినవారు- ఏపీజే అబ్దుల్ కలాం
4) ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయినది- కే కృష్ణకాంత్
137. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి
సరికానిది?
1) ఈ పదవిని అమెరికా నుంచి గ్రహించారు
2) ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే ఉండాల్సిన కనీస వయస్సు- 35 సంవత్సరాలు
3) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంటుకు ఎన్నికయిన సభ్యులు ఓటర్లుగా ఉంటారు
4) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయసభల మొత్తం సభ్యులు ఓటర్లుగా ఉంటారు
Answers
107-4, 108-3, 109-2, 110-3, 111-4, 112-3, 113-4, 114-3, 115-2, 116-4, 117-4, 118-4, 119-3, 120-3, 121-4, 122-3, 123-4, 124-1, 125-4, 126-3, 127-4, 128-1, 129-3, 130-2, 131-4, 132-1, 133-2, 134-4, 135-2, 136-4, 137-3.
-దేవేందర్ ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్ వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు