ఆపిల్ కొత్త అప్డేట్: ఎయిర్‌ట్యాగ్స్ దుర్వినియోగంపై దృష్టి పెట్టిన టెక్ సంస్థ..
హైదరాబాద్ : అవసరం లేని ట్రాకింగ్‌ను నివారించేందుకు ఆపిల్ సంస్థ సిద్ధమైంది. అందుకోసం ఎయిర్‌ట్యాగ్స్ భద్రతా హెచ్చరికలను తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు ఆపిల్ ప్రకటించింది. ఎయిర్‌ట్యాగ్స్ ద్వారా అపరిచిత వ్యక్తులు, వారి అనుమతి లేకుండా కార్లు ఇతర వస్తువుల వివరాలు తెలుసుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అందుకే దీనికి భద్రత కల్పించడానికి ఆపిల్ శ్రీకారం చుట్టింది. ఎయిర్‌ట్యాగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టి వినియోగదారులకు భద్రత కల్పించనున్నట్లు ఆపిల్ ప్రకటించింది.
ఎయిర్‌ట్యాగ్స్ ఎలా పనితీరును మార్చడానికి భద్రతా నిపుణులతోపాటు న్యాయవాదులతో కలిసి చర్చిస్తోంది. అన్ వాంటెడ్ ట్రాకింగ్ గురించి వినియోగదారులను హెచ్చరించడానికి Apple AirTags ఇప్పుడు వినియోగదారులకు వారి ఐఫోన్లతో జత చేయని, అపరిచిత ట్రాకర్ వారిని వెంటాడుతున్నప్పుడు తెలియజేస్తుంది. కొత్త ప్రెసిషన్ ఫైండింగ్ కూడా పరిచయం చేసింది. ఇది ఎయిర్‌ట్యాగ్ ట్రాకింగ్ ను ఖచ్చితంగా గుర్తించేలా చేస్తుంది. iPhone 11, iPhone 12 , iPhone 13 వినియోగదారులు తమకు పరిచయంలేని ఎయిర్‌ట్యాగ్స్ దూరాన్ని,దిశను తెలుసుకోవడానికి ఆపిల్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు