ఎన్ఎండీసీలో 224 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
హైదరాబాద్: కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో పనిచేసే నవరత్న హోదా కలిగిన ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వచ్చే నెల 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీచేస్తున్నది. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, ఇతర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా, నాన్ఎగ్జిక్యూటివ్, ఇతర పోస్టులను రాతపరీక్ష ద్వారా ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 224
ఇందులో ఎగ్జిక్యూటివ్ పోసులు 97, సూపర్వైజర్ కమ్ చార్జ్మ్యాన్ 71, సీనియర్ టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ 27, టెక్నీషియన్ కమ్ ఆపరేటర్ 15 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ, బీటెక్లో ఏదో ఒకటి చేసి ఉండాలి. సూపర్వైజర్ పోస్టులకు ఇంజినీరింగ్లో డిప్లొమా, సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి. అదేవిధంగా సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులకు.. ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు రాతపరీక్ష, స్కిల్టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ప్రాంతంలో ఇంటర్వ్యూ లేదా రాతపరీక్షకు హాజరవుతామనే విషయాన్ని స్పష్టం చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్లకు చివరితేదీ: ఏప్రిల్ 15
వెబ్సైట్: www.nmdc.co.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
బీహెచ్ఈఎల్లో సూపర్వైజర్ ట్రైనీలు
‘కొవాగ్జిన్’కు బ్రెజిల్ నో..
చిన్నారులకు టీకా ఇచ్చేందుకు అధ్యయనం : రణదీప్ గులేరియా
ఖర్చు 400 కోట్లు.. ఆమ్దాని 4 లక్షల కోట్లు!
భారత్లో శాంసంగ్ టీవీ ప్లస్ లాంచ్.. 100% ఉచితం
అదనపు ధ్రువీకరణ తప్పనిసరికి ఆర్నెల్ల గడువు పొడిగించిన ఆర్బీఐ
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు