ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 3479 పోస్టులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3479 పోస్టులను భర్తీచేయనుంది. ఇందులో ప్రిన్సిపల్, టీజీటీ, పీజీటీ వంటి పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ 17 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు. మొత్తం పోస్టుల్లో తెలంగాణలో 262, ఆంధ్రప్రదేశ్‌లో 117 పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 3479
ఇందులో ప్రిన్సిపల్ 175, వైస్ ప్రిన్సిపల్ 116, పీజీటీ 1244, టీజీటీ 1944 చొప్పున పోస్టులు ఉన్నాయి.
తెలంగాణలో 262 (ప్రిన్సిపల్ 11, వైస్ ప్రిన్సిపల్ 6, పీజీటీ 77, టీజీటీ 168), ఆంధ్రప్రదేశ్‌లో 117 (ప్రిన్సిపల్ 14, వైస్ ప్రిన్సిపల్ 6, టీజీటీ 97) పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ప్రిన్సిపల్ పోస్టులకు పీజీ చేసి ఇంగ్లిష్ మిడియం స్కూళ్లలో పదేండ్లపాటు పనిచేసి ఉండాలి, పీజీటీ, టీజీటీలకు సంబంధింత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ చేసి బీఈడీ పూర్తి చేయాలి. సీటెట్ లేదా టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా (టీజీటీ పోస్టులకు ఇంటర్వ్యూ లేదు)
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 1
అప్లికేషన్లకు చివరితేదీ: ఏప్రిల్ 30
రాతపరీక్ష: జూన్ మొదటివారంలో
వెబ్సైట్: https://tribal.nic.in
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రజనీకాంత్‌కు 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
అధికార పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
ఎన్ఎండీసీలో 224 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
ఏపీలో లాక్డౌన్.. ఎక్కడంటే..?
బీహెచ్ఈఎల్లో సూపర్వైజర్ ట్రైనీలు
‘కొవాగ్జిన్’కు బ్రెజిల్ నో..
చిన్నారులకు టీకా ఇచ్చేందుకు అధ్యయనం : రణదీప్ గులేరియా
ఖర్చు 400 కోట్లు.. ఆమ్దాని 4 లక్షల కోట్లు!
భారత్‌లో శాంసంగ్ టీవీ ప్లస్ లాంచ్.. 100% ఉచితం
అదనపు ధ్రువీకరణ తప్పనిసరికి ఆర్నెల్ల గడువు పొడిగించిన ఆర్బీఐ
పాన్, ఆధార్ లింక్ తుది గడువు జూన్ 30కు పొడిగింపు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు