CNG | సీఎన్జీ ఆప్షన్ తో మహీంద్రా థార్..
హైదరాబాద్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియా మార్కెట్ లో మహీంద్రా థార్ ఎస్ యు వీని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది. ఇది మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్ యువీలలో ఒకటిగా నిలిచింది. దీని కోసం పెద్దసంఖ్యలో బుకింగ్స్ కూడా వచ్చాయి. ఇప్పటికే బుక్ చేసుకున్న కస్టమర్లు డెలివరీ కోసం దాదాపు ఓ సంవత్సరం వేచి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇటీవల మహీంద్రా థార్ ఎస్ యు వీ కి సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చేసింది. అదే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్(సీఎన్ జీ) సౌకర్యం.
థార్ ఎస్ యువీలో సీఎన్ జీ కిట్ ను ప్రత్యేకంగా అమర్చవచ్చు. ఈ కిట్ ను టర్బో పెట్రోల్ వెర్షన్‌కు అమర్చారు. మహీంద్రా థార్ ఇంజన్ డైరెక్ట్ ఇంజెక్షన్ ఇంజన్. ఈ ఇంజిన్ కి సీఎన్ జీ ఫిట్టింగ్లో స్పెషల్ కిట్ చాలా అవసరం. ఈ కారు ఇంటీరియర్ లోని సెంటర్ కన్సోల్‌లో సీఎన్ జీ లెవెల్ సూచించే స్విచ్ ఇన్స్టాల్ చేశారు.పెట్రోల్ నుంచి సీఎన్ జీ కి మారడం సౌకర్యంగా ఉంటుంది. ఇందులోని ఇంజిన్ వేగంగా అని పించడమే కాకుండా పెట్రోల్ వెర్షన్‌తో సమానంగా పనితీరు కనబరుస్తుంది.
ఈ మహీంద్రా థార్ హుడ్ లోపల ఇంజెక్టర్లు, రీడ్యూసర్స్ ,ప్రత్యేక ఈసీయు లు ఇన్స్టాల్ చేశారు. 14 కిలోల గ్యాస్ సిలిండర్‌ను వెనుకభాగంలో ఏర్పాటుచేసుకోవచ్చు. ఇందులో ఎల్ ఈడీ, ఆర్ ఎల్ లు, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఐసోఫిక్స్ మౌంట్లతో ఫార్వర్డ్-ఫేసింగ్ రియర్ సీట్లు ఉన్నాయి. ఆపిల్ కార్ ప్లే , ఆండ్రాయిడ్ ఆటోతో టచ్‌స్క్రీన్ డిస్ప్లే వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు