విశ్వభారతి యూనివర్సిటీని ఎవరు స్థాపించారు?
- భారతదేశ సంస్కృతి, కళలు
(జూలై 21 తరువాయి)
129. అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడుగా పేరొందిన వారు ?
1) తాన్సేన్ 2) మాలిక్ కపూర్
3) అమీర్ ఖుస్రూ 4) రూపవతి
130. దేశంలో ఇత్తడి వస్తువుల (ఆభరణాలు, బొమ్మలు, చదరంగపు పెట్టెలు)తయారీకి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం?
1) గుజరాత్ 2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్ 4) హర్యానా
131. అసోంలో వైష్ణవ మత స్థాపకుడైన శంకర దేవుడు సృష్టించిన నాటకం ఏది?
1) ఆంకియానట్ 2) మహారస
3) మఛా 4) నౌటంకీ
132 జతపరచండి.
ఎ. హిందోళం 1. సంతోషం
బి. మేఘరాగం 2. మధురం
సి. శ్రీరాగం 3. ధైర్యం
డి. భైరవి రాగం 4. శాంతి
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-2, బి-3, సి-1, డి-4
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-4, సి-3, డి-2
133. బీహార్‌లోని కోల్లు, మయూర్ఖాంజ్లోని భూమియాలు ఆచరించే గిరిజన నృత్యం ఏది?
1) మఘ 2) కర్మ
3) సైతా 4) డాగ్‌లా
134. భారతదేశంలో ఆధునిక నాటక రచనలో ప్రముఖుడిగా పరిగణించే వారు ఎవరు?
1) గిరీష్ చంద్ర ఘోష్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) బాదల్ సర్కార్
4) డీఎల్ రామ్
135. ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ’ ఎక్కడ ఉంది?
1) కోల్‌కతా 2) పుణె
3) బెంగళూరు 4) న్యూఢిల్లీ
136. ఏ రీతుల సంగమ శైలిగా ‘వేసర’ రీతి దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి?
1) నాగర 2) ద్రావిడ
3) పైరెండూ 4) ఇండో-పర్షియన్
137. 12 అంచెలుగా గల వీణ కిన్నెరను మోగించటంలో నైపుణ్యం ఉన్న కళాకారుడు ఎవరు?
1) డీ మొగులయ్య 2) డీ ఇమాన్
3) ఏఆర్ రెహమాన్ 4) రహమత్ సిద్దిఖీ
138. కూచిపూడి భాగవతుల నిలయమైన కూచిపూడి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది?
1) కృష్ణా 2) ప్రకాశం
3) నెల్లూరు 4) తూర్పుగోదావరి
139. టిప్పనీ నృత్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?
1) రాజస్థాన్ 2) గుజరాత్
3) పైరెండూ 4) ఉత్తరప్రదేశ్
140. యునెస్కో గుర్తింపు పొందిన ‘కల్బేలియా’ జానపద నృత్యం ఏ రాష్ర్టానికి చెందింది?
1) రాజస్థాన్ 2) ఒడిశా
3) పశ్చిమబెంగాల్ 4) కేరళ
141. నౌరోజ్ అనే పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు?
1) బాల్బన్ 2) అక్బర్
3) షేర్షా 4) జహంగీర్
142. రాధారెడ్డి, రాజారెడ్డి ఏ నృత్యంలో ప్రసిద్ధ కళాకారులు?
1) భరతనాట్యం 2) కూచిపూడి
3) కథక్ 4) యక్షగానం
143. కింది వాటిలో కర్ణాటక సంగీతం రూపొందించినది ఎవరు?
1) పురంధర దాసు 2) త్యాగయ్య
3) ముత్తుస్వామి 4) శ్యామశాస్త్రి
144. జాతీయ వారసత్వ జంతువుగా ఏనుగును ఏ సంవత్సరం నుంచి గుర్తించడం జరిగింది?
1) 2008 2) 2010
3) 2012 4) 2014
145. చత్, సర్పూల్, కరమ్ అనే పండుగలను జరుపుకొనే రాష్ట్రం ఏది?
1) పశ్చిమబెంగాల్ 2) బీహార్
3) ఉత్తరప్రదేశ్ 4) కర్ణాటక
146. 2019లో యునెస్కో గుర్తించిన భారతదేశంలోని ప్రపంచ సాంస్కృతిక స్థలం ఏది?
1) జైపూర్ సిటీ
2) అహ్మదాబాద్ వారసత్వ నగరం
3) చండీగఢ్‌లోని రాజధాని ప్రాంతం
4) ఖజురహో కట్టడాలు
147. ఒడిశా రాష్ట్రంలో నివసించే గిరిజన జాతి?
1) చెంచులు, ఖోండులు 2) సంతాలులు
3) ఒరాన్లు 4) పైవారందరూ
148. అంజద్, అలీఖాన్, శారదా రాణి, అలీ అక్బర్ఖాన్లు ఏ వాయిద్యాన్ని మోగించడంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు?
1) సంతూర్ 2) వీణ
3) సారంగి 4) సరోద్
149. ఆధునిక నాటక రంగంలో సర్వనాటక ప్రయోక్తగా కీర్తిపొందిన వారు?
1) బాదల్ సర్కార్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) గిరీష్ చంద్ర ఘోష్
4) గిరీశ్ కర్నాడ్
150. పాక్షిక సంచార జాతులైన లంబాడీలకు సంబంధించిన జానపద నృత్యం ఏది?
1) గుస్సాడి నృత్యం 2) సుగాలీ నృత్యం
3) థింసా నృత్యం 4) పేరిణి నృత్యం
151. యక్షగానాన్ని వెలుగులోకి తీసుకొచ్చినది ఎవరు?
1) మొరిశెట్టి అంతయ్య
2) నటరాజ రామకృష్ణ
3) తల్లావజ్జుల సీతారామయ్య
4) శివరామ కారత్
152. ప్రాచీనకాలంలో ఏ నాట్యాన్ని ‘సదిర్’ నాట్యంగా దక్షిణ భారతంలోని దేవాలయాల్లో ‘దేవదాసీలు’ ప్రదర్శించేవారు?
1) కూచిపూడి 2) భరతనాట్యం
3) కథకళి 4) మోహినీ అట్టం
153. జాతీయ వృక్షంగా ప్రసిద్ధి చెందింది ఏది?
1) మామిడి 2) వేప
3) మర్రిచెట్టు 4) రావిచెట్టు
154. ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ ఏ సంగీత పరికరం ప్రయోగించడంలో నేర్పరి?
1) సితార 2) రుద్రవీణ
3) షెహనాయి 4) సరోద్
155. దేవతలకు, దేవుళ్లకు మానవ రూపాన్ని ఆపాదించిన చిత్రకళ కింది వాటిలో ఏది?
1) చిటా 2) మధుబని
3) తంత్ర 4) గోమతి
156. జతపరచండి.
ఎ. ద్రావిడ శైలి 1. మహాబలిపురం
దేవాలయాలు
బి. వేసర శైలి 2. ఎల్లోరాలోని కైలా
సనాథ దేవాలయం
సి. కళింగ శైలి 3. పూరీ జగన్నాథ్
దేవాలయం
డి. గుజరాత్ శైలి 4. నీలికంఠాలయం
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-2, సి-1, డి-4
4) ఎ-2, బి-1, సి-3, డి-4
157. గుజరాత్‌లోని హరప్పాను యునెస్కో ఏ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది?
1) 2020 2) 2019
3) 2015 4) 2017
158. బౌద్ధమత జన్మస్థానం?
1) సాంచీ 2) సారనాథ్
3) అజంతా 4) ఎల్లోరా
159. ఆచార్య దిగ్నాజుడు ఏ శాస్త్రంలో పితామహుడు?
1) తత్వశాస్త్రం 2) తర్కశాస్త్రం
3) ఆయుర్వేదం 4) ఏవీకావు
160. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు ఏ మతానికి చెందినవి?
1) బౌద్ధ 2) జైన
3) హిందూ 4) ఏవీకావు
161. జైన మత స్థాపకుడు?
1) పార్శ్వనాథుడు 2) రుషభనాథుడు
3) మహావీరుడు 4) ఏవీకావు
162. శరీరాన్ని కృశింపజేసి మరణించే విధానాన్ని ఏమంటారు?
1) సల్లేఖనం 2) మోక్షం
3) వ్రతం 4) ఏవీకావు
163. స్థూలబాహు నాయకత్వంలో ఉన్న జైనులను ఏమంటారు?
1) శ్వేతాంబరులు 2) దిగంబరులు
3) అనేకవాదులు 4) ఏవీకావు
164. బౌద్ధ గ్రంథాలు ఏ భాషలో లిఖించారు?
1) సంస్కృతం 2) పాళీ
3) ప్రాకృతం 4) ఏవీకావు
165. అద్వైతాన్ని ప్రచారం చేసిందెవరు?
1) మధ్వాచార్యుడు 2) శంకరాచార్యుడు
3) నింబార్కుడు 4) ఏవీకావు
166. ద్వైతవాద వాదాన్ని ప్రచారం చేసింది?
1) మధ్వాచార్యుడు
2) శంకరాచార్యుడు
3) రుషభనాథుడు
4) ఎవరూకాదు
167. జైనుల పవిత్ర గ్రంథాలను ఏమంటారు?
1) ఉపనిషత్తులు 2) అంగాలు
3) వేదాలు 4) ఏవీకావు
168. అల్బెరూని ఎవరి కాలంలో భారతదేశానికి వచ్చారు?
1) గజిని 2) అలెగ్జాండర్
3) బాబర్ 4) తైమూర్
169. కింది వాటిలో ప్రపంచ వారసత్వంలో ఉన్నది?
1) ఖజురహో 2) నలంద
3) హంపి 4) పైవన్నీ
170. ఖజురహో దేవాలయాన్ని ఎవరు నిర్మించారు?
1) హోల్కర్లు 2) సింథియాలు
3) చందేలా రాజపుత్రులు
4) ఎవరూ కాదు
171. కబీర్ జన్మస్థానం?
1) ఢిల్లీ 2) మధుర
3) వారణాసి 4) వరంగల్
172. మొఘలుల నాటి న్యాయస్థానాల్లో
వాడుకలో ఉన్న భాష?
1) ఫ్రెంచ్ 2) పర్షియన్
3) పోర్చుగీస్ 4) అరబిక్
173. అజ్మీర్‌లో ఉన్న దర్గా పేరు?
1) బాబా ఫరీద్
2) కుతుబుద్దీన్ భక్త్తియార్
3) మొయినుద్దీన్ చిస్తీ
4) ఏవీకావు
174. తాజ్‌మహల్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు?
1) మహ్మద్ హుస్సేన్
2) ఉస్తాద్ అహ్మద్ లహోరీ
3) షా-ఇసా 4) ఎవరూ కాదు
175. రణథంభోర్ అనేది?
1) రాజపుత్రుల కోట
2) మొఘల్ ప్యాలెస్
3) ఖిల్జీల రాజధాని 4) ఏవీకావు
176. మొఘలుల కాలంలో భారతదేశాన్ని సందర్శించి నెమలి సింహాసనం గురించి తెలియచేసింది?
1) మార్కోపోలో
2) అల్బెరూని
3) అబ్దుల్ హమిద్
4) ఫ్రాంకోయిస్ బెర్నియర్
177. గర్బా జానపద నృత్యం ఏ రాష్ర్టానికి చెందినది?
1) ఒడిశా 2) మధ్యప్రదేశ్
3) ఆంధ్రప్రదేశ్ 4) గుజరాత్
178. కతి బిహు పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకొంటారు?
1) ఒడిశా 2) అస్సాం
3) బెంగాల్ 4) కర్ణాటక
179. కేంద్ర సాంస్కృతిక మంత్రి లండన్ నుంచి తెప్పించిన కాంస్య విగ్రహాలను ఏ రాష్ర్టానికి అందించారు?
1) కర్ణాటక 2) తమిళనాడు
3) కేరళ 4) ఆంధ్రప్రదేశ్
180. ‘సర్ణ’ మతాన్ని ప్రత్యేక మతంగా గుర్తించాలని ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది?
1) బీహార్ 2) జార్ఖండ్
3) అస్సాం 4) బెంగాల్
181. తుంగభద్ర పుష్కరాలు ఏ రాష్ట్రంలోనివి?
1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్
3) తమిళనాడు 4) కర్ణాటక
182. నవంబర్‌లో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ అంతటా జరుపుకొనే పండుగ పేరేమిటి?
1) చాత్ 2) దసరా
3) కార్తీక దీప్ 4) కర్వా
183. ఇండియా ఇంటర్నేషనల్ చెర్రీ బ్లొసమ్ పండుగ ఏ రాష్ట్రంలో జరుపుకొంటారు?
1) అరుణాచల్‌ప్రదేశ్ 2) సిక్కిం
3) మేఘాలయ 4) హిమాచల్‌ప్రదేశ్
184. ఏ సిక్కు గురువు మరణించిన రోజును షహీద్ దివస్‌గా జరుపుకొంటారు?
1) గురువ తేజ్ బహదూర్
2) గురు గోవింద్ సింగ్
3) గురు రామ్‌దాస్
4) ఎవరూ కాదు
185. ‘గురుపురబ్’ ఏ సిక్కు గురువు జన్మదిన వేడుక?
1) గురు నానక్
2) గురు గోవింద్ సింగ్
3) గురు తేజ్ బహదూర్
4) ఎవరూకాదు
186. దేవ్ దీపావళి పండుగ ఏ నగరంలో జరుపుకొంటారు?
1) వారణాసి 2) హరిద్వార్
3) రుషికేష్ 4) గంగోత్రి
187. ఆది మహోత్సవ్ వర్చువల్ ఎడిషన్‌ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
1) ఉత్తరప్రదేశ్ 2) మధ్యప్రదేశ్
3) మహారాష్ట్ర 4) అసోం
188. విశ్వభారతి యూనివర్సిటీని ఎవరు స్థాపించారు?
1) రాజా రామ్మోహన్ రాయ్
2) రవీంద్రనాథ్ ఠాగూర్
3) అరబిందో ఘోష్
4) అనీబిసెంట్
189. 52వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలింఫెస్టివల్ ఎప్పుడు జరిగింది?
1) 2018 2) 2019
3) 2020 4) 2021
190. ‘థంగ్ తా’ అనే యుద్ధ కళారూపం
ఏ రాష్ర్టానికి చెందింది?
1) మిజోరం 2) నాగాలాండ్
3) మణిపూర్ 4) త్రిపుర
191. వంగాల నృత్యం ఏ రాష్ర్టానికి చెందింది?
1) మేఘాలయ 2) మిజోరం
3) మణిపూర్ 4) ఏవీకావు
192. వెదురు నృత్యం ఏ రాష్ర్టానికి చెందింది?
1) మిజోరం 2) మణిపూర్
3) త్రిపుర 4) మేఘాలయ
193. హోజగిరి నృత్యం ఏ రాష్ర్టానికి చెందింది?
1) త్రిపుర 2) మణిపూర్
3) మిజోరం 4) మేఘాలయ
194. రుక్మిణీదేవి అరుండల్ దేనికి ప్రసిద్ధి?
1) భరతనాట్యం 2) కూచిపూడి
3) కథక్ 4) కథాకళి
-విజేత కాంపిటీషన్స్ బతుకమ్మకుంట, హైదరాబాద్
జవాబులు
129.1 130.3 131.1 132.2
133.2 134.1 135.4 136.3
137.1 138.1 139.3 140.1
141.1 142.2 143.1 144.2
145.2 146.1 147.4 148.4
149.1 150.2 151.4 152.2
153.3 154.3 155.2 156.1
157.1 158.2 159.2 160.1
161.2 162.1 163.1 164.2
165.2 166.1 167.2 168.1
169.4 170.3 171.3 172.2
173.3 174.2 175.1 176.4
177.4 178.2 179.2 180.2
181.2 182.1 183.3 184.1
185.1 186.1 187.2 188.2
189.4 190.3 191.1 192.1
193.1 194.1 195.4
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు