బరువును కోల్పోయే పరిశ్రమలను ఏమంటారు?
- రాష్ట్రంలో ఏ జిల్లాలో గోండులు అధికంగా ఉన్నారు?
1) ఖమ్మం 2) నాగర్‌కర్నూల్
3) ఆదిలాబాద్
4) భద్రాద్రి కొత్తగూడెం - కృష్ణానదిపై తెలంగాణలో మొదటి ప్రాజెక్టు?
1) నాగార్జునసాగర్
2) రాజోలిబండ డైవర్షన్ స్కీం
3) రాజీవ్ భీమా ఎత్తిపోతల
4) ప్రియదర్శిని జూరాల - అలంపూర్‌ను ఏమని పిలుస్తారు?
1) ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్
2) తెలంగాణ ప్రాచీన విద్యాకేంద్రం
3) బ్రహ్మాలయం
4) పైవన్నీ - సర్ఫ్-ఇ-ఖాస్ అంటే ఏమిటి?
1) ప్రభుత్వ రాబడిని పెంచడం
2) నిజాం నవాబుల ఖర్చుల కోసం వినియోగించేది
3) దాన ధర్మాలు అందజేయడం కోసం
4) ఏదీకాదు - జనగామ జిల్లాలోని ప్రముఖ కోటలు ఏవి?
1) జాఫర్‌గఢ్ కోట 2) తాటికొండ కోట
3) 1, 2 4) ఏదీకాదు - భీమా నదికి ఉపనది ఏది?
1) మూసీ 2) కాగ్నా
3) ఈసీ 4) డిండి - కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. మిద్దె రాములు- ఒగ్గు కథా కళాకారుడు
బి. జి. రామిరెడ్డి- దేశంలో ‘ఫోన్ లెర్నింగ్’ విధానానికి పితామహుడు
సి. పైడి జయరాజ్- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత
డి. శివారెడ్డి- ప్రముఖ సినీ హాస్యనటుడు
1) ఎ, బి, సి 2) ఎ, సి, డి
3) బి, సి, డి 4) ఎ, బి, సి, డి - చరిత్ర పూర్వయుగం నాటి పెయింటింగ్‌లు ఎక్కడ బయటపడ్డాయి?
1) సత్తుపల్లి తాలూకాలోని లంకపల్లి గ్రామం
2) పినపాక తాలూకాలోని జానంపేట
3) గుండాల తాలూకాలోని కిష్టాపురం
4) పైవన్నీ - భక్తరామదాసు నివాసం ఎక్కడ ఉంది?
1) ముదికొండ 2) నేలకొండపల్లి
3) ఖమ్మం
4) భద్రాద్రి కొత్తగూడెం - బైరాన్‌పల్లి బురుజు ఏ జిల్లాలో ఉంది?
1) సిద్దిపేట 2) జనగామ
3) యాదాద్రి 4) ఖమ్మం - స్క్రోల్ పెయింటింగ్ కళకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది?
1) కరీంనగర్ 2) పెంబర్తి
3) చండూరు 4) చేర్యాల - మంజీరా నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్ట్‌కు మరొక పేరు?
1) మొగిలిగుండ్ల బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టు
2) మంజీరా ప్రాజెక్టు
3) కడెం నారాయణరెడ్డి సింగూరు ప్రాజెక్టు
4) ఏదీకాదు - తెలంగాణలో రెండవ అతిపెద్ద జాతర?
1) కొమరవెళ్లి మల్లన్న జాతర
2) కురుమూర్తి జాతర
3) పెద్దగట్టు జాతర
4) చెర్వుగట్టు జాతర - సైఫన్ సిస్టమ్‌తో నిర్మించిన ప్రాజెక్టు ఏది?
1) కోయిల్‌సాగర్ 2) సరళాసాగర్ 3) జూరాల 4) డిండి - కింది వాటిలో సరైనవి?
ఎ. శ్రీలక్ష్మీనరసింహ ఆలయం- మఠంపల్లి
బి. రంగనాయకస్వామి ఆలయం- పెబ్బేరు
సి. భద్రేశ్వర ఆలయం- భవిగి
డి. లింగమంతుల స్వామి ఆలయం- దురాజ్‌పల్లి
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) సి, డి 4) ఎ, బి, సి, డి - భువనగిరి కోటను ఎవరు నిర్మించారు?
1) కాకతీయ ప్రతాపరుద్రుడు
2) చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య
3) అసఫ్‌జాహీ నిజాం అలీఖాన్
4) రెడ్డిరాజులు - ఖనిజాలను అతిగా వెలికితీయడం వల్ల పర్యావరణంపై ఏ కాలుష్యం ప్రభావం చూపుతుంది?
1) వాయుకాలుష్యం
2) ఉపరితల జలకాలుష్యం
3) భూగర్భ జలకాలుష్యం
4) పైవన్నీ - పరిశ్రమల స్థానాన్ని ప్రభావితం చేసే భౌగోళిక కారకాలు ఏవి?
1) ముడిపదార్థాల లభ్యత, విద్యుచ్ఛక్తి
2) శ్రామికులు, రవాణా
3) నీరు, స్థలం, వాతావరణం
4) పైవన్నీ - వస్తు నిర్మాణ ప్రక్రియలో బరువును కోల్పోయే పరిశ్రమలను ఏమంటారు?
1) ఖనిజ ఆధారిత పరిశ్రమలు
2) Foot Loose పరిశ్రమలు
3) రేయాన్ పరిశ్రమలు
4) రాతినార పరిశ్రమలు - పర్యావరణ అభివృద్ధికి తోడ్పడే ఉద్యోగులకు ‘ఎకోసమ్మాన్’ అవార్డు ఇవ్వడం
ప్రవేశపెట్టిన సంస్థ ఏది?
1) సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్
(SCCL)
2) భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్
(BHEL)
3) కోల్ ఇండియా లిమిటెడ్
4) రాష్ట్ర ప్రభుత్వం - కింది వాటిలో సరైనది?
1) నిర్మల్ ఫర్నిచర్‌కు భౌగోళిక గుర్తింపు
– (జీఐ) 2009
2) పోచంపల్లి చీరలపై గల ఇక్కత్ ైస్టెల్కు భౌగోళిక గుర్తింపు-2005
3) సిల్వర్ జరీ కుట్టుపనిపై భౌగోళిక గుర్తింపు పొందిన సంవత్సరం-2007
4) పైవన్నీ సరైనవే - జల విద్యుచ్ఛక్తిని కృత్రిమంగా సాధించడానికి ఏ పద్ధతులను ఉపయోగిస్తారు?
1) నదీ ప్రవాహాలకు అడ్డుకట్టలు నిర్మించడం
2) డ్యామ్‌లను నిర్మించడం
3) 1, 2
4) నదులపై వంతెనలు నిర్మించడం - బయోగ్యాస్ ఏ వాయువుల మిశ్రమం?
1) మీథేన్, కార్బన్డయాక్సైడ్
2) హైడ్రోజన్ సల్ఫైడ్ 3) నీటిఆవిరి
4) పైవన్నీ - రాష్ట్రంలో ‘నిరుపేదల ఊటీ’గా దేనిని అభివర్ణిస్తారు?
1) అక్కమహాదేవి గుహలు
2) మన్ననూరు
3) ఉమామహేశ్వర దేవాలయం
4) ఫర్హాబాద్ - పాకాల సరస్సును నిర్మించినది?
1) గణపతిదేవుడు
2) రుద్రమదేవి
3) ప్రతాపరుద్రుడు
4) రుద్రదేవుడు - యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన దేవాలయం ఏది?
1) వేయిస్తంభాల గుడి
2) భద్రాచలం
3) రామప్ప దేవాలయం
4) బాసర - పేదల తిరుపతిగా పేరుపొందిన తెలంగాణ దేవాలయం?
1) చిలుకూరు బాలాజీ- రంగారెడ్డి
2) మన్నెంకొండ- మహబూబ్‌నగర్
3) కురుమూర్తి- మహబూబ్‌నగర్
4) రంగనాయక స్వామి ఆలయం- వనపర్తి - రాష్ట్రంలో విగ్రహారాధన లేదా వైదిక బ్రాహ్మణుల ప్రమేయం లేకుండా జరిగే జాతర ఏది?
1) నాగోబా జాతర
2) సమ్మక్క-సారలమ్మ జాతర
3) పెద్దగట్టు జాతర
4) కొండగట్టు జాతర - మన్ననూరు ఎకో-టూరిజం దేనిలో భాగం?
1) అమ్రాబాద్ టైగర్ రిజర్వ్
2) తాడ్వాయి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
3) కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం
4) కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం - తెలంగాణలోని ఏ ప్రాంతాల్లోని భూభాగంలో అపారమైన బొగ్గు నిక్షేపాలతో పాటు సహజ వనరులు ఉన్నాయి?
1) గోదావరి పరీవాహక ప్రాంతం
2) ప్రాణహిత పరీవాహక ప్రాంతం
3) గోండ్వానా
4) పైవన్నీ ప్రధాన ఖనిజాలు
ఇనుము
ఇనుమును ఖనిజ నాణ్యత ఆధారంగా 4 రకాలుగా విభజించవచ్చు
మాగ్నటైట్, హెమటైట్, లియెనైట్, సిడరైట్
రాష్ట్రంలో అధిక మొత్తంలో హెమటైట్ ఉంది
తక్కువ మొత్తంలో మాగ్నటైట్ రూపంలో ఇనుము లభిస్తుంది
మాగ్నటైట్ నిల్వలు విస్తరించిన ప్రాంతాలు బిత్వాల్, తల్లాడ, రస్తూరాబాద్, రోబాన్పల్లి, లక్సెట్టిపేట్, టిట్పూర్
రాష్ట్రంలో ఇనుము విస్తరించిన జిల్లాలు- వరంగల్ రూరల్, మహబూబాబాద్, ఖమ్మం (చెరువుపురం, బయ్యారం, నావపాడు, భద్రాద్రి కొత్తగూడెం)
దేశంలో తొలి ఇనుప గని- సింగ్భమ్ (జార్ఖండ్-1904)
క్రోమైట్
ఖమ్మం, భద్రాద్రిలో ఉపరితల ఖనిజంగా లభిస్తుంది
విస్తరించిన ప్రాంతాలు: గౌరారం, జన్నవరం, ఇమాన్నగర్, ఇంకూరు (ఖమ్మం)
అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా- ఖమ్మం
దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం- ఒడిశా
బైరటీస్ (ముగ్గురాయి)
విస్తరించిన ప్రాంతాలు: రుద్రంకోట, వెంకటాయపాలెం, గోపాలపూర్, బాలాపేట్, చెరువుపురం (ఖమ్మం) బొల్లారం, వీరభద్ర దుర్గం (మహబూబ్‌నగర్)
దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం-ఆంధ్రప్రదేశ్
మాంగనీస్
అధికంగా నిల్వ ఉన్న ప్రాంతాలు: తాంసి, మంచిర్యాల్, బెల్లంపల్లి
దేశంలో అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం: మధ్యప్రదేశ్
సున్నపురాయి
రాష్ట్రంలో బొగ్గునిల్వల తర్వాత అధిక విస్తీర్ణంలో విస్తరించిన ఖనిజం
సున్నపురాయిని అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా నల్లగొండ, సూర్యాపేట
సున్నపురాయి సిమెంట్ పరిశ్రమలకు ముడిఖనిజంగా పనిచేస్తుంది
బంకమట్టి
బంకమట్టి అధికంగా ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం
తక్కువ నాణ్యత గల కుండల తయారీకి ఉపయోగించే మట్టి తెల్లబంక మట్టి
పింగాణి పాత్రల తయారీకి ఉపయోగించే మట్టి విస్తరించిన ప్రాంతాలు- గోల్కొండకు పశ్చిమ ప్రాంతం
డోలమైట్
డోలమైట్ విస్తరించిన ప్రాంతాలు: రఘునాథపాలెం, మాదారం, మేములనరవా (ఖమ్మం)
అధికంగా నిల్వలు, ఉత్పత్తి చేస్తున్న జిల్లా: ఖమ్మం
దీని ఆధారిత పరిశ్రమలు: ఇనుము, ఉక్కు, ఫెర్రో అల్లాయ్, ఎరువులు, గాజు, పౌండ్రీ, కాస్మొటిక్స్
రాగి
లభించే ప్రాంతాలు: మైలారం ప్రాంతం (భద్రాద్రి కొత్తగూడెం)
దేశంలో రాగి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గల రాష్ట్రం- కర్నాటక
స్టియటైట్
విస్తరించిన ప్రాంతాలు: పోతారం, ఇస్రాజ్‌పల్లి, కొండాపురం (సంగారెడ్డి) లక్ష్మీదేవిపల్లి (సిద్దిపేట)
సోమశిల, కొల్లాపూర్ (నాగర్‌కర్నూల్) అమర్ఘా (మహబూబ్‌నగర్)
స్టియటైట్ ఆధారిత పరిశ్రమలు: పేపర్, రబ్బర్, సిరామిక్స్, సబ్బులు, డిటర్జెంట్స్, ఎరువులు
బొగ్గు
250 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగి ప్రకృతి ఉత్పాతాల వల్ల ఏర్పడిన బొగ్గు గోండ్వాన బొగ్గు
జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలో గోండ్వానా బొగ్గు లభిస్తుంది
విస్తరించిన జిల్లాలు: ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రం భీం, ఆదిలాబాద్, నిర్మల్
రాష్ట్రంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా: ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం
దేశంలో బొగ్గును అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం- జార్ఖండ్
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు