భాషా నైపుణ్యాలు-సాధించాల్సిన సామర్థ్యాలు
లెవల్-1
- భావగ్రహణ, భావ వ్యక్తీకరణకు తోడ్పడేవి?
1) బోధన పద్ధతులు
2) లక్ష్యాలు – స్పష్టీకరణలు
3) భాషానైపుణ్యాలు 4) విద్యాప్రమాణాలు - భాషానైపుణ్య సాధనలో సరైన వరుసక్రమం? (పీజీటీ 2018)
1) భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం
2) శ్రవణం, భాషణం, లేఖనం, పఠనం
3) పఠనం, శ్రవణం, భాషణం, లేఖనం
4) శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం - ‘భాష ఆలోచనలకు ఆకృతి (Language is the dress of tought)’ అన్న పండితుడు?
1) స్టర్ట్వర్ట్ 2) జాన్సన్
3) హాకెట్ 4) రామచంద్రవర్మ - భాషానైపుణ్యాలు? (ఎల్పీ 2018)
1) పరస్పరాశ్రితాలు 2) పరస్పర భిన్నాలు
3) ఏకాశ్రితాలు 4) బహురూపాశ్రితాలు - భాషా కౌశలాల్లో ‘గ్రహణశీలాలు’?
(ఎస్ఏ 2018)
1) శ్రవణం, భాషణం 2) పఠనం, లేఖనం
3) శ్రవణం, పఠనం 4) భాషణం, లేఖనం - భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యాలు? (టీజీటీ 2018)
1) శ్రవణం, పఠనం 2) భాషణం, లేఖనం
3) శ్రవణం, లేఖనం 4) పఠనం, భాషణం - శ్రవణ లక్షణానికి సంబంధించి భిన్నమైన వ్యాఖ్యను గుర్తించండి?
1) రణగొణ ధ్వనుల మధ్య కూడా అవసరమైన ధ్వనులనే వినగలగడం
2) వాగ్విశేషాలైన హ్రస్వ, దీర్ఘ భేదాలను, ఊనిక, కాకువులను గుర్తించడం
3) స్థాన, కరణ, ప్రయత్న భేదాలను గ్రహిం చకపోవడం
4) భావ వ్యక్తీకరణ తీవ్రత, వక్తవ్యాంశంపై మనస్సు కేంద్రీకరణ - మౌఖిక మాధ్యమానికి (ధ్వనిసహితం) చెందిన భాషాకౌశలాలు?
1) శ్రవణం, పఠనం 2) భాషణం, లేఖనం
3) పఠనం, లేఖనం 4) శ్రవణం, భాషణం - లిఖిత మాధ్యమానికి (లిపిసహితం) చెందిన భాషాకౌశలాలు? (ఎస్జీటీ 2018)
1) శ్రవణం, భాషణం 2) పఠనం, లేఖనం
3) శ్రవణం, పఠనం 4) భాషణం, లేఖనం - భాషా నైపుణ్యాల్లో క్రియాశీలాలనే ఇలా కూడా అంటారు? (టీజీటీ 2019)
1) ఉత్పాదక శీలాలు 2) గ్రహణ శీలాలు
3) బాహ్యశీలాలు 4) అంతర్గత శీలాలు - చెవితో ధ్వనులను అవధానంతో, జాగరూకతతో, అవగాహనతో, శ్రద్ధగా, ఏకాగ్రతతో వినడం ఏ నైపుణ్యం?
1) భాషణం 2) పఠనం
3) శ్రవణం 4) లేఖనం - ఏ భాషా విషయంలోనైనా మొట్టమొదటగా జరిగే భాషాకార్యక్రమం? (టీజీటీ 2017)
1) పఠనం 2) శ్రవణం
3) లేఖనం 4) భాషణం - శ్రవణ ఉద్దేశం ఏది? (టీజీటీ 2017)
1) ఊనిక, స్వరభేదం పాటిస్తూ ధారాళంగా పఠించేటట్లు చేయడం
2) అవధానంతో విని విషయాన్ని గ్రహించేట్లు చేయడం
3) వ్యక్తిని మంచి వక్తగా తీర్చిదిద్దడం
4) నిర్దిష్టమైన ఉచ్ఛారణను కలిగించడం - ఉపాధ్యాయుడు కథ చెప్తున్నప్పుడు విద్యార్థి తల ఊపడం కాని, ఊ…. కొట్టడం కాని చేయకపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? (పీజీటీ 2018)
అ. పిల్లవాడికి కథ ఆసక్తికరంగా లేకపోవడం
ఆ. కథ చెప్పేటప్పుడు అభినయాన్ని జోడించడం
ఇ. ప్రత్యక్ష వాక్యాల్లో సరళంగా, హృద్యంగా కథ చెప్పడం
ఈ. పిల్లవానిలో ఏకాగ్రత, వినికిడి లోపం ఉండటం
కింది సమాధానాల్లో సరైనవాటిని గుర్తించండి.
1) ఇ, ఈ 2) అ, ఈ 3) ఆ, ఇ 4) ఆ, అ - ‘ఇవి విద్యార్థులు-ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలను’ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి భాషాసామర్థ్యాల అభివృద్ధికి తోడ్పడుతాయి? (టీజీటీ 2017)
1) గృహం, పరిసరాలు
2) పిల్లలు, ఉపాధ్యాయుడు
3) పాఠశాల, గృహం
4) సుహృద్భావపూరిత తరగతి గది,
బోధనాభ్యసన కృత్యాలు - కార్ల్ రోజర్స్ ప్రకారం ‘భావ ప్రసరణలో వ్యక్తి విఫలం కావడానికి ప్రధాన కారణం? (ఎస్జీటీ 2018)
1) చేతనాలోపం 2) శ్వాసలోపం
3) శ్రవణశక్తి లోపం 4) విభాషణ లోపం - ప్రాథమిక దశలో శ్రవణ నైపుణ్యాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగా మొదటి వరుసలోని కథలకు, రెండో వరుసలోని అంశాలతో జతపరచండి?
అ. పంచతంత్ర కథలు య. అద్భుత కథ
ఆ. బలి చక్రవర్తి-వామనుడు ర. నీతికథ
ఇ. అల్లాఉద్దీన్ అద్భుత దీపం ల. బైబిల్ కథ
ఈ. సమరేయుడు (గుడ్ సమరిటన్)
వ. పురాణ కథ
అ, ఆ, ఇ, ఈలకు వరుసగా సరిపోయే రెండో వరుసలోని అంశాలు
1) ర, వ, య, ల 2) ర, య, వ, ల
3) ల, య, వ, ర 4) య, ల, వ, ర - భక్తి, వాత్సల్య, కరుణ, అద్భుత రస పద్యాలు వాచకాల్లో ఏ స్థాయిలో ఉండాలి? (ఎస్జీటీ 2018)
1) ప్రాథమిక దశ 2) ప్రాథమికోన్నత దశ
3) ఉన్నత దశ 4) శైశవ దశ - శ్రవణ లోపం కానిది?
1) శ్రవణేంద్రియ లోపం, అశ్రద్ధ, ఏకాగ్రతలేమి
2) పాఠశాల వాతావరణం, విషయాసక్తి లేమి
3) స్థాయికి మించిన విషయాలు చెప్పడం
4) గురువులమీద గౌరవం కలిగి ఉండటం
లెవల్-2 - భాషానైపుణ్యాలకు ఉన్న ఇతర నామాంతరాల్లో సరికానిది?
1) భాషాసామర్థ్యాలు, భాషాపరికర్మలు, భాషాకౌశలాలు
2) భాషానైపుణ్య చతుష్కయం, భాషాప్రాతిపదిక లక్ష్యాలు, భాషావ్యాపారాలు
3) చతుర్విధ భాషా నైపుణ్యాలు, భాషాబోధన పద్ధతులు, భాషామూల్యాంకన సాధనాలు
4) భావ వినిమయ సాధనాలు, భాషాభ్యసన సోపానాలు, భాషావ్యాసంగాలు - ఉపాధ్యాయుడు విద్యార్థులకు తగిన సూచనలను మౌఖికంగా ఇచ్చి, తరగతి తెలుగు వాచకం కొన్ని పరిచిత పదాలను నెమ్మదిగా చదువగా, వాటిని శ్రద్ధగా విని, తప్పులు లేకుండా రాయమనడంలో ఇమిడి ఉన్న భాషానైపుణ్యాల క్రమం? (పీజీటీ 2017)
1) ఉపాధ్యాయుని పఠనం, భాషణం, విద్యార్థుల పఠనం, లేఖనం
2) విద్యార్థుల శ్రవణం, పఠనం, ఉపాధ్యాయుని లేఖనం, భాషణం
3) ఉపాధ్యాయుని భాషణం, పఠనం, విద్యార్థుల శ్రవణం, లేఖనం
4) విద్యార్థుల శ్రవణం, లేఖనం, ఉపాధ్యాయుని పఠనం, భాషణం
శ్రవణం-రకాలు
(LP/SA/PGT/TGT Only)
- ఒక వక్తను వినేటప్పుడు ఏయే అంశాలను గ్రహించాలి, వేటిని గ్రహించకూడదన్న శక్తిగల శ్రవణ భేదం?
1) సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం
2) విస్తార శ్రవణం
3) విమర్శనాత్మక శ్రవణం
4) ప్రశంసాత్మక శ్రవణం - ఇద్దరు సంభాషణలను వినేటప్పుడు ఆ వ్యక్తుల అభిప్రాయాన్ని గ్రహించగలడమే? (టీజీటీ 2018)
1) విమర్శనాత్మక శ్రవణం
2) చికిత్సాత్మక శ్రవణం
3) ప్రశంసాశ్రవణం
4) సూక్ష్మభేద గ్రాహక శ్రవణం - ఒక పాఠ్యాంశం (పాట, పద్యం) విన్నప్పుడు వాటిలోని లయ, రాగం, తాళం మొదలైన అంశాలను మెచ్చుకునే శ్రవణ భేదం?
(ఎల్పీ 2019)
1) చికిత్సాశ్రవణం 2) ప్రశంసా శ్రవణం
3) విస్తార శ్రవణం 4) విశ్లేషణా శ్రవణం - ఒక ముఖ్యమైన ఉపన్యాసాన్ని విన్నప్పుడు దానిలోని ముఖ్యోద్దేశాన్ని గ్రహించగలిగే శ్రవణాన్ని ఏమంటారు?
1) విమర్శనాత్మక శ్రవణం
2) ప్రశంసా శ్రవణం
3) చికిత్సా శ్రవణం 4) విస్తార శ్రవణం - ‘ఒక విషయాన్ని వినేటప్పుడు ప్రతి చిన్న అంశంపైనా దృష్టి ఉండాలి’ అని తెలిపే శ్రవణం?
1) విమర్శనాత్మక శ్రవణం
2) ప్రశంసా శ్రవణం
3) సూక్ష్మభేద గ్రాహక శ్రవణం
4) చికిత్సాత్మక శ్రవణం - ఆరోగ్యం కోసం, ఆనందం కోసం జరిపే శ్రవణాన్ని ఏమని పిలుస్తారు?
1) మూల్యాంకనం కోసం శ్రవణం
2) సాధారణ శ్రవణం 3) ప్రశంసా శ్రవణం
4) విమర్శనాత్మక శ్రవణం - ఏదో ఒక పని చేసుకుంటూ పాటలు వినడం ఏ రకమైన శ్రవణం?
1) చికిత్సాత్మక శ్రవణం
2) ప్రశంసాశ్రవణం
3) సమాచారం కోసం శ్రవణం
4) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం - కింది వాటిని పరిశీలించండి.
అ. సూక్ష్మభేద గ్రాహక శ్రవణం య. విన్న విషయం గురించి మెచ్చుకుంటూ మాట్లాడగలిగేలా వినడం
ఆ. విస్తార శ్రవణం ర. విన్న విషయాల గురించి విమర్శించగలిగేలా వినడం
ఇ. విమర్శనాత్మక శ్రవణం ల. వినేటప్పుడు విషయంలోని ముఖ్య సారాంశాన్ని గ్రహించగలిగేటట్లు వినడం
ఈ. ప్రశంసా శ్రవణం వ. వినేటప్పుడు దేనిని గ్రహించాలో దేనిని గ్రహించకూడదో గుర్తించగలిగేటట్లు వినడం
అ, ఆ, ఇ, ఈ లకు సరిపోయే రెండో వరసులోని అంశాలు
1) ర, వ, య, ల 2) ల, య, ర, వ
3) వ, ల, ర, య 4) ర, య, ల, వ - చెప్పే విషయం సరిగా అవగాహన కావడం కోసం కొన్నిసార్లు చెప్పిన విషయాన్నే ఒకటికి రెండుసార్లు చెప్పడం జరుగుతుంది. ఇది ఏ రకమైన శ్రవణం కిందకు వస్తుంది?
1) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం
2) సమాచారం కోసం శ్రవణం
3) ఆనందం కోసం శ్రవణం
4) చికిత్సాశ్రవణం - డాక్టర్ తన వద్దకు వచ్చే రోగికి, ఒక క్రీడల ఉపాధ్యాయుడు ఆటగాళ్లకు నెమ్మదిగా సూచనలివ్వడం ఏ రకమైన శ్రవణం?
1) సమాచారం కోసం శ్రవణం
2) ఆనందం కోసం శ్రవణం
3) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం
4) మూల్యాంకనం కోసం శ్రవణం - రైల్వేస్టేషన్లో, విమానాశ్రయంలో ప్రకటనదారుడు చెప్పే ప్రకటనలు, ఇచ్చే సమాచారాన్ని మన అవసరం కోసం జాగ్రత్తగా, మిక్కిలి శ్రద్ధగా మనసుపెట్టి వినడం?
1) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం
2) సమాచారం కోసం శ్రవణం
3) సమస్యల పరిష్కారం కోసం శ్రవణం
4) మూల్యాంకనం కోసం శ్రవణం - రేడియోలో, టెలివిజన్లో చెప్పే వార్తలు ఏ రకమైన శ్రవణం కిందకు వస్తాయి?
1) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం
2) మూల్యాంకనం కోసం శ్రవణం
3) ఆనందం కోసం శ్రవణం
4) సమాచారం కోసం శ్రవణం - మనకు ఇష్టమైన కథలు, నాటకాలు రేడియోలో గాని, పెద్దలు చెప్పగా గాని వింటాం. అయితే జ్ఞానానికి సంబంధించిన అంశాలు ఈ శ్రవణంలో ఉండవు. ఇది?
1) ఆనందం కోసం శ్రవణం
2) మూల్యాంకనం కోసం శ్రవణం
3) ధ్వనుల్లోని వ్యత్యాసాన్ని గ్రహించడానికి శ్రవణం
4) చికిత్సాశ్రవణం - వినే విషయం సరైనదా, కాదా తెలుసుకోవడానికి వినడాన్ని ఏమంటారు?
1) సమాచారాన్ని ఇవ్వడం కోసం శ్రవణం
2) సమస్యల పరిష్కారం కోసం శ్రవణం
3) మూల్యాంకనం కోసం శ్రవణం
4) ప్రశంసా శ్రవణం - ఒక అమ్మకం దారుడు తన వస్తువులను అమ్మడానికి వాటిని గురించి పలు విషయాలు చెబుతున్నప్పుడు కొనుగోలుదారుడు అతను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా విని, చెబుతున్న విషయాలు సరైనవా, కావా అని బేరీజు వేసుకునే శ్రవణం?
1) ఆనందం కోసం శ్రవణం
2) ప్రశంసాశ్రవణం
3) సమాచారం ఇవ్వడం కోసం శ్రవణం
4) మూల్యాంకనం కోసం శ్రవణం - తరగతిలో ఉపాధ్యాయుడు భాషా పాఠాన్ని బోధిస్తున్నప్పుడు అతడు ఉచ్ఛరించే ధ్వనుల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడానికి విద్యార్థులు జాగ్రత్తగా వింటారు. ఇది ఏ రకమైన శ్రవణ భేదం?
1) సమస్యల పరిష్కారం కోసం శ్రవణం
2) ధ్వనుల్లోని వ్యత్యాసాన్ని గ్రహించడానికి శ్రవణం
3) మూల్యాంకనం కోసం శ్రవణం
4) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం - ఏ రకమైన శ్రవణానికి విశ్లేషణ అవసరం?
1) సమస్యల పరిష్కారం కోసం శ్రవణం
2) ఆజ్ఞలు, సూచనల కోసం శ్రవణం
3) ధ్వనుల్లోని వ్యత్యాసాన్ని గ్రహించడానికి శ్రవణం
4) సమాచారాన్ని ఇవ్వడం కోసం శ్రవణం - వినేటప్పుడు చెప్పే విషయాలు జాగ్రత్తగా విని, అందులో దాగి ఉన్న అంశాలను (ఉదా: ప్రహేళికలు (క్విజ్), పొడుపు కథలు) అర్థం చేసుకునే శ్రవణం?
1) ఆనందం కోసం శ్రవణం
2) మూల్యాంకనం కోసం శ్రవణం
3) చికిత్సా శ్రవణం
4) సమస్యల పరిష్కారం కోసం శ్రవణం
- Tags
- Education News
Previous article
ఔషధాల పనితీరును అధ్యయనం చేసే శాస్త్రం?
Next article
బరువును కోల్పోయే పరిశ్రమలను ఏమంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు